Friday, 26 April 2013

పచ్చకామెర్లు , Jaundice,Hepatitis

పచ్చకామెర్లు , Jaundice,Hepatitis


  • image : courtesy with Andhraprabha News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పచ్చకామెర్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి.

కామెర్లకు ముఖ్య కారణాలు 3.
ఒకటి రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తిగావడం. దీన్ని 'హీమోలిటిక్‌ జాండిస్‌' అంటారు.
రెండోది- ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్‌ లివర్‌ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని 'హెపాటిక్‌ జాండిస్‌' అని వ్యవహరిస్తారు.
మూడోది - లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్‌) ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం . దీన్ని 'అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌' అంటారు.

లివర్‌ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే 'హెపటైటిస్‌' అని వ్యవహరిస్తారు. హెపటైటిస్‌ కేసుల్లో 'హెపాటిక్‌ జాండిస్‌' చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు - ఒకటి ఇన్ఫెక్షన్‌, రెండవది ఆల్కహాల్‌, మూడు పౌష్టికాహార లోపము (Nutritional jaundice)

ఇన్ఫెక్షన్‌ పరంగా 5 రకాల వైరస్‌లను -గుర్తించారు. ఇవి హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ.

హెపటైటిస్‌ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..

కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు.

నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే. లివర్‌ వ్యాధి బాగా ముదిరినా కూడా కొందరిలో ఇటువంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశమూ ఉంటుంది,

చికిత్సా విధానము :
పచ్చకామెర్ల వ్యాధికి అల్లోపతిలో సరైన ఔషధం లేదు. ఈ వ్యాధి నీటిద్వారా సోకుతుందని వైద్యులు అంటారు. ఈ వ్యాధి ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదన్న నియమంలేదు. అంతేకాదు ఇది శరీరంలో అత్యంత ప్రధానమైన 'లివర్‌'పై ప్రభావం చూపుతుంది. అందువల్ల విధిగా ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి.

* ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడపోసి, చల్చార్చి వాడడం మంచిది. లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
* పచ్చకామెర్ల వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణంకానివి ఏవీ వాడకూడదు. రెండు నెలలేకాదు కనీసం సంవత్సరం వరకు కూడా

ఆహారంలో నియమాలు తప్పక పాటించాలి.
* మజ్జిగ బాగా వాడాలి,
* అడపాదడపా కొబ్బరి బోండాలు తాగాలి,
* అరటిపళ్ళు బాగా తినాలి.
* మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి.
* గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి.
* ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లుకాదని భావించేవారు కొన్నాళ్ళు వాటికి గుడ్‌బై చెప్పాలి.
* కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
* డాక్టర్‌ సలహాలనుబట్టి లివ్‌-52 మాత్రలు మరికొన్నాళ్ళు వాడవచ్చు. అవి 'లివర్‌' పనితీరును మెరుగుపరుస్తాయి.
పచ్చకామెర్ల వ్యాధి పూర్తిగా ఆహారంపై నియంత్రణ ఉంటేనే తగ్గుతుందన్న విషయాన్ని ఏనాడూ మరిచిపోకూడదు . పదేళ్ళయిన తర్వాత కూడా కొన్ని

ఆహారపదార్ధాలను తీసుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలి .

గ్రుర్తించుకోవలసిన విషయాలు :
నాటు వైద్యులు ఆశ్రయించి కొంతమంది వెళ్లి పచ్చకామెర్ల వ్యాధికి పసరుమందు తాగడంతో పాటు మెడలో పేరు వేసుకుని నాటువైద్యాన్ని నమ్ముకోవడంతో

పచ్చకామెర్లు ముదిరి ప్రాణాలను హరించివేస్తున్నాయి. కల్తీ నూనెలతో పాటు ఇతర పదార్థాల ద్వారా ఈవ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పచ్చకామెర్ల

వ్యాధి నయం కావడానికి నూనెలను తక్కువగా కల్తీలేనివి వాడాలి .

* పచ్చకామర్లు తెలియని వారు ఉండరు. * పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది ఒక వ్యాధి లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలో

'కాలేయం' అనే అవయవం సూక్ష్మజీవుల బారినపడడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల మన

శరీరంలో ప్రవేశిస్తాయి.

* చాలా సందర్భాలలో దానంతట అదే తగ్గిపోతుంది.

* దీనికి ఆధునిక వైద్యంలో మందులు లేవంటారు చాలా మంది. అయితే పచ్చకామెర్లకు ఏ వైద్యంలో కూడా మందులు లేవు.

* పచ్చకామెర్లు ఎక్కువగా ఉంటే విశ్రాంతి ఎంతో ముఖ్యం.

* పచ్చకామెర్లు తక్కువగా ఉంటే సాధారణ పనులు చేసుకుంటే జీవించొచ్చు.

* మనం తీసుకునే చాలా మందులు కాలేయం ద్వారా పోతాయి. మనం అశాస్త్రీయంగా మందులు వాడితే ఆ మందులు కాలేయాన్ని మరింత పాడుచేస్తాయి.

* పచ్చకామెర్లు ముదరితే అన్ని వసతులున్న ఆసుపత్రిలో చేరాలి.

* కాలేయానికి మంచిది అని ప్రచారం చేసే మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

* పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల పచ్చకామెర్లను బాగా నిరోధించొచ్చు.

* 'పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుంది' అనేది నిజం కాదు.


Viral hepatic Jaundice:

శీతాకాలంలో అధికంగా నీటిప్రభావానికిలోనై వచ్చే వ్యాధులలో పచ్చ కామెర్లవ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుని సత్వరనివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలో అత్యంత ప్రధానభాగమైన కాలేయా న్ని పనిచేయ కుండా చేసి పరిస్ధితి అగమ్మగోచరంగా మార్చే ఆస్కారం ఉంటుంది. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్‌ ఎ,బి,సి,డి,ఇ, రకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి. వీటి గురించి ఓసారి తెలుసుకుందాం...

హెపటైటిస్‌-ఏ :

ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్‌ రూట్‌' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్‌-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.

హెపటైటిస్‌-బి

ఇదిహెపటైటిస్‌-ఏకన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వైరొకరికి ఎక్కించినపడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి.

ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఇక వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా ఈవ్యాధి వస్తుంది..

ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.

ఎయిడ్స తదితరాలులా ఇది కూడా ఎలాంటి చికిత్స లేని వ్యాధికావటం ఆందోళన కలిగించే విషయం, దీనికి నివారణాచర్యలు ముఖ్యమైనవి. కలుషిత సూదులు గుచ్చుకున్నా, వ్యాధికారకులతో లైంగిక సంపర్కం జరిపినా 14 రోజుల్లోగా వ్యాక్సిన్‌ని వేయించు కోవటం ద్వారా వ్యాధి కారకాలను నిలువరించవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో పాటు వైద్యుల సూచనల మేరకు ఇమ్యూనోగ్లోబిలిన్‌ని కూడా ఇవ్వాల్సి ఉం టుంది. ఈ వ్యాధి కార కాల గర్భిణీకి జన్మించిన బిడ్డకు పుట్టగానే వ్యాక్సిన్‌ ఇప్పించడం ద్వారా చాలామేరకు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెపటైటిస్‌-సి :

ఇది హెపటైటిస్‌-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్‌-బి కనీసం వ్యాక్సిన్‌ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్తలని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్‌-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్‌ సిరోసిస్‌గా, లివర్‌ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు.

లక్షణాలు :

ఈ వైరస్‌ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వికారంగా ఉండటం, విరేచనాలు కావ టం, ఆకలి లేకపోవటంతో పాటు మూత్రం పసుపు వర్ణంలో పోయటం, కళ్లు, నాలుక పచ్చగా మారిపోతుంది. చేతులు, కాళ్ల గోర్లు కూడా పచ్చగా మారుతుంటాయి. కాలేయ భాగం విపరీతమైన నొప్పిగా మారుతుంది. కాలయం కొద్దిగా కొద్దిగా పెరుగుతుంటుంది. దీని తో పాటు ప్లీహం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తాయి. నడి చేందుకు కూడా వెసులు బాటు ఇవ్వని కీళ్ల నొప్పులు, మలం ద్వారా తెల్లని పదార్ధం శరీరం నుండి బైటకు రావటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ--పరీక్షలివి...

ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కాలేయ పరిస్ధితిని నిర్ధారించుకోవచ్చు. మూత్ర పరీక్షలు చేస్తే అందులో బైల్‌ పింగ్మెంట్స్‌ కనిపిస్తాయి. అలాగే రక్త పరీక్షలలో సీరం ఎంజైమ్స్‌, సీరం బలురూబిన్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక లివర్‌ ఫంక్షన్‌ టెస్టుల్లోనూ మన కాలేయంలో జరిగిన పరిణా మాలను నిర్ధారించుకోవటమే కాకుండా లివర్‌ మార్కర్స్‌ ద్వారా వైరస్‌ కారకాలను ఇట్టే గుర్తించి నిపుణులైన వైద్యుల సలహా సూచనల మేరకు తగిన వైద్యాన్ని చేయించుకుంటే హెప టైటిస్‌-ఏ ని 4 వారాలలోనే తగ్గించుకోవచ్చు.

జాగ్రత్తలిలా...
హెపటైటిస్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్‌ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గానూ గ్లూకోజ్‌తో పాటు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అడపా దడపా తాగించాలి.

అవసరమైతే.. నరాల ద్వారా కూడా సిలెన్‌ రూపంలో గ్లూకోజ్‌ ఎక్కిం చాల్సి ఉంటుంది. అలాగే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పళ్లను గానీ, టాబ్లెట్లని ఇవ్వాలి. అలాగే అవసరం మేరకు విటమిన్‌ సి ఇంజక్షన్‌ ఇవ్వాల్పి ఉంటుంది.

ఇక హెపటైటిస్‌ సోకిన వ్యాధి గ్రస్తులలో విటమిన్‌ బి తక్కువగా ఉండటం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీనిని నుండి కాపాడుకునేందుకు విటమిన్‌ బి టాబ్లెట్లని ఎక్కువ వెూతాదులో ఇవ్వాలి.

శరీరంపై దద్దుర్లు, దురదల వస్తే 'కొలిస్టరిమిన్‌'ని ఇవ్వాల్సి ఉంటుంది. వీలైనంత వరకు విటమిన్‌- కెని కూడా ఇవ్వటమే కాకుండా మల్టీవిటమిన్‌ టాబ్లిట్లు మింగించాలి. ఇన్‌ఫిక్షన్లు సోకితే నియోమైసిన్‌, ప్రెడ్సిసలోన్‌, మెట్రోనిడజాల్‌ మాత్రలు ఇవ్వాలి. కొన్ని రకాల మందులు కూడా శరీర తత్వాన్ని బట్టి ప్రభావం చూపి ఇన్‌ఫిక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం మరింతగా దెబ్బతింటుంది. అందుకే మందులు వాడేటప్పుడు నిపుణులైన వైద్యుల సలహా సూచలను ఖచ్చితంగా తీసుకో వాల్సిందే..

ఆహారం...

ఈ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి దూరంగా ఉంచాలి. ఆకలిగా ఉన్నపడు అధిక ఆహారం ఇవ్వాలి. పళ్ల రసాలు, మజ్జిగ తదితరాలు ఎక్కు వగా ఇవ్వటమే కాకుండా కూరగాయలు, పప్పుదినులు బాగా ఉడక పెట్టి ఇవ్వటంతో పాటు పౌష్టికాహరం ఇవ్వటం ద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకుంటారు.





పచ్చకామెర్లు ... అవగాహన

రక్ష డెస్క్   Mon, 2 Jul 2012, IST  
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... నాలుగు వారాల కన్నా తక్కువ నిడివి కలిగిన పచ్చకామెర్లు పబ్లిక్‌ హెల్త్‌ దృష్ట్యా నివారించవచ్చు. నాలుగు వారాల కన్నా ఎక్కువ నిడివి కలిగిన పచ్చకామెర్లు అరుదైన కారణాల వల్ల వచ్చే అవకాశముంది. వీటి నివారణ మనచేతుల్లో ఉండదు. వెయ్యి జనాభా కలిగిన ప్రాంతంలో రెండు వేర్వేరు ఇళ్లలో వారంలోపు రెండు కేసులు నమోదైనా లేదా, నాలుగు వారాల కన్నా తక్కువ నిడివి కలిగిన కామెర్ల వారు ఒక్కరు చనిపోయినా దానిని నోటిఫై చేయవలసిన అవసరమున్నది. అక్కడున్న మెడికల్‌ ఆఫీసరును అప్రమత్తం చేయాలి.
రక్తంలో బిలురుబిన్‌ పరిమాణం పెరగడం వల్ల కన్నులోని తెల్లటి భాగం, చర్మం, ఇతర మ్యూకస్‌ పొరలు పసుపుపచ్చదనాన్ని సంతరించుకుంటాయి. రక్తంలో ఈ బిలురుబిన్‌ 1.8 మిల్లీ గ్రాము/డెసీ లీటర్‌ కన్నా ఎక్కువ ఉంటే పచ్చకామెర్లు వస్తాయి. ప్రతి రోజూ కొన్ని ఎర్రరక్త కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్తవి చేరుతుంటాయి. అప్పుడు బిలురుబిన్‌ అనే పదార్థం ఏర్పడుతుంది. దాన్ని కాలేయం అనేక విభజనలకు గురిచేసి చివరికి మలం ద్వారా బయటకు పంపిస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో బిలురుబిన్‌ చేరితే పచ్చకామెర్లు వస్తాయి. పచ్చకామెర్లు మూడు విధాలు... 1.ఎక్కువ ఎర్రరక్త కణాలు చనిపోవడంతో ఎక్కువ బిలురుబిన్‌ ఉత్పత్తి అవుతుంది. 2. కాలేయం పాడైపోయి ఉన్నా, జబ్బుపడి ఉన్నా బిలురుబిన్‌ను విభజించలేదు. 3. బిలురుబిన్‌ లివర్‌ నుండి జీర్ణకోసం ద్వారా బయటకు పోలేకపోవడం వల్ల పచ్చకామెర్లు వస్తాయి.
కారణాలు
మలేరియా, లెప్టోస్పైరోసిస్‌, జన్యుపరమైన జబ్బులు (థాలసీమియా, స్పీరోసైటోసిస్‌, జి6పిడిలోపం, సికిల్‌సెల్‌ అనీమియా), మందులు, విషపదార్థాలు, ఆల్కాహాల్‌, ఇతర మత్తు పదార్థాలు, ఆటో ఇమ్యూన్‌ జబ్బులు, లివరు, పిత్తాశయం, జీర్ణరసగ్రంధి ఇన్‌పెక్షన్లు, రాళ్లు, క్యాన్సర్లు, ప్యారసైట్లు, పుట్టుకతోనే కొన్ని లోపాలు, గర్భాదారణ మొదలైన వాటి వల్ల వస్తాయి.
లక్షణాలు
తెల్లని కనుగుడ్డు, చర్మం పసుపుపచ్చగా మారడం. మూత్రం పచ్చగా, ఎర్రగా వస్తుంటాయి. మలం తెల్లగా పాలిపోయినట్లు రావడం. ఆకలి లేకపోవడం, నీరసం, వాంతికొచ్చినట్లు ఉండటం, వాంతులు కావడం, పొట్ట కుడిభాగాన కొంచెం నొప్పిగా ఉండటం, శరీరం దురదగా ఉండటం, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులుగా ఉండటం, బక్కచిక్కినట్లుగా కన్పించడం మొదలైనవి.
నిర్ధారణ పరీక్షలు
కారణాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తారు.
రక్తంలో : బిలురుబిన్‌ పరిమాణం, హెపటైటిస్‌ వైరస్‌లు, లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌, లవణాలు, ప్రోత్రాంబిన్‌టైమ్‌, మూత్ర పరీక్షలు.
స్కానింగ్‌ : లివర్‌, పైత్యరసం సంచి, జీర్ణరసగ్రంధి వాటి మధ్య ఉండే గొట్టాలు.
ఇతర పరీక్షలు: ఇఆర్‌సిపి, పిటిసిఎ, సిటిస్కాన్‌, లివర్‌ బయాప్సీ.

వైద్యం
కామెర్లు వచ్చినప్పుడు కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. డీ హైడ్రేషన్‌ రాకుండా బాగా నీళ్లు పండ్ల రసాలు, టెంకాయనీళ్లు తీసుకుంటుండాలి.
* డాక్టర్‌ సలహా మేరకు అవసరమొస్తే సెలైన్లు, మందులు (యాంటీవైరల్‌, యాంటీబయాటిక్స్‌, వాంతికి, నొప్పికి, దురదకు, జ్వరానికి) అవసరం మేరకు వాడాల్సి ఉంటుంది.
* చిన్నపిల్లల్లో ఫొటో థెరపీ.
* సర్జికల్‌ ఆపరేషన్లు. (రాళ్లకు, క్యాన్సర్లకు అవసరమొస్తే చివరికి లివర్‌ మార్పిడి.)
* మలేరియా, లెప్టోస్పైరా ఉంటే వాటికి తగ్గవైద్యం.

* ఆల్కహాలు తీసుకోకూడదు.
*మూఢనమ్మకాలతో నాటు మందులు, పసర్లు వాడకూడదు. మణికట్టుపై రక్ష వేయించుకోవడం హానికరం.
*ఎక్కువగా మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని, తక్కువగా ప్రొటీన్లను తీసుకోవాలి.
తినకూడని పదార్థాలు

కొవ్వు పదార్థాలు, గడ్డ పెరుగు, వెన్న, ఆయిల్స్‌, మటన్‌, వేపుళ్లు, తియ్యటి స్వీట్లు, టీ, కాఫీ, కారం, మసాలా, పచ్చళ్లు.
నివారణ
హెపటైటిస్‌- ఎ వైరస్‌ మనం తినే ఆహారం, తాగే నీరు, ఈ క్రిములు కలిగిన మలం వల్ల కలుషితమైతే ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మురికివాడల్ల్లో, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లేని ప్రాంతాల్లో వస్తుంది. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదు. ఒకవేళ చేసినా మట్టి, సున్నం దానిపై కప్పి ఉంచాలి. లేదా 5శాతం సోడియం హైపోక్లోరైడ్‌తో డిసిన్పెక్ట్‌ చేయాలి. తప్పనిసరిగా సెప్టిక్‌ లెట్రిన్లనే వాడాలి. ఎక్కువ మంది తమ తమ బాత్‌రూములు, లెట్రిన్ల నుండి వచ్చే మలమూత్ర విసర్జనల పైపులను డ్రెయినేజీ కాలువల్లోకి వదులుతున్నారు. వాటిని పారిశుధ్య పద్ధతుల్లో డిస్పోజ్‌ చేయకపోతే ఈ కామెర్లు విస్తృతంగా వచ్చే అవకాశముంది. కొంత మంది ఆకుకూరలను, కూరగాయలను ఈ అపరిశుభ్ర డ్రెయినేజీ నీళ్లతో పండిస్తుంటారు. వాటిని శుభ్రంగా కడిగి, బాగా ఉడకబెట్టి తినకపోతే ఇంటిళ్లపాది కామెర్ల బారినపడే అవకాశముంది. మల విసర్జన తరువాత, మట్టిలో ఆడుకున్న తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అన్నం తినే ముందు, నీళ్లు తాగే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈగలు వాలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. రోడ్డుమీద విక్రయించే తినుబండారాలను, రోడ్డు పక్కన కట్‌ చేసి అమ్మే పండ్లను (పుచ్చకాయ, మామిడి, పనస, పైనాపిల్‌ తదితరాలు.) తినకూడదు. వేడిగా ఉండే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. ఈ కామెర్లు కలిగిన వారి గుడ్డలను బ్లీచింగ్‌ ద్రావకంలో అరగంట నానబెట్టిన తరువాత తాగునీటి వనరులకు దూరంగా ఉతకాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. రక్షిత మంచినీటిని తీసుకోవాలి. క్లోరినేటెడ్‌ వాటర్‌నే తీసుకోవాలి. క్లోరినేషన్‌ చేసేటప్పుడు కమ్యూనిటీ వాటర్‌లో 1 మిల్లీ గ్రాం/ లీటర్‌ ఫ్రీ రెసిడ్యువల్‌ క్లోరిన్‌ కనీసం 30 నిమిషాలు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. తాగునీటిని శుద్ధి చేయడంలో, సరఫరా చేయడంలో కచ్చితమైన ప్రామాణికాలను, సిస్టమ్‌ను పాటించాలి. ఎపిడమిక్‌ ఉన్నప్పుడు కాచి చల్లార్చిన నీళ్లు(15 నిమిషాల పాటు నీళ్లను మరగనివ్వాలి) తప్పనిసరి. హెపటైటిస్‌-ఎ ఒకసారి వస్తే ఇమ్యూనిటీ లైఫ్‌లాంగ్‌ ఉంటుంది కాబట్టి సాధారణంగా మళ్లీ రాదు. అయితే 5 శాతం మందికి రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్‌ ఎ వల్ల కేవలం 0.1 శాతం మాత్రమే ప్రమాదానికి(తీవ్రంగా కాలేయం పాడైపోవడం వల్ల) గురయ్యే అవకాశం ఉంది. 99.9 శాతం మంది సాధారణంగా కోలుకుంటారు. అయితే ఎక్కువ పని దినాలు నష్టపోవాల్సి ఉంటుంది. హెపటైటిస్‌ ఎ వ్యాక్సిన్‌ రెండు డోసులు, ఆరు నుంచి 18 మాసాల నిడివిలో వేసుకోవచ్చు.
హెపటైటిస్‌ ఎ వ్యాక్సిన్‌ ఎవరికి?
ఈ వ్యాక్సిన్‌ను తరచుగా విదేశీ ప్రయాణాలు చేసేవారు, ఆహార పదార్థాలు వండేవారు, వడ్డించేవారు, సరఫరా చేసేవారు, దీర్ఘకాలిక లివర్‌ వ్యాధితో బాధపడేవారు, మత్తు పదార్థాలు సేవించేవారు, స్వలింగ సంపర్కులు, ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేసేవారు, హెల్త్‌కేర్‌ వర్కర్లు తీసుకోవాలి.
హెపటైటిస్‌ -బి
ఈ క్రిమి రక్తంలో, లాలాజలంలో, యోనిరసాల్లో, వీర్యంలో ఉంటుంది. కాబట్టి రక్తమార్పిడి ద్వారా, సెక్సువల్‌ కాంటాక్టు ద్వారా, సూదులను పంచుకోవడం ద్వారా, రక్త పరీక్షా కేంద్రాల్లో పనిచేసే వారికి, హెల్త్‌ వర్కర్లకు, డాక్టర్లకు(పంటి డాక్టర్లు, ఆపరేషన్‌ చేసే డాక్టర్లకు) వ్యభిచారం చేసే వారికి, డయాలసిస్‌ చేసుకునే వారికి, పచ్చలు పొడిపించుకునే వారికి, ముక్కు, చెవి కుట్టేటప్పుడు, సాంప్రదాయ పద్ధతుల్లో సుంతి చేసుకునే వారికి, సూదుల ద్వారా టీకాలు వేసుకునే వారికి, సేవింగ్‌ బ్లేడ్లు, రేజర్లు, టూత్‌బ్రష్‌లు పంచుకునే వారికి, ఆకుపంచర్‌ వైద్యం చేసుకునేవారికి సరైన రక్షణ పద్ధతులు పాటించకపోతే సోకే అవకాశముంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశముంటుంది. దీని ద్వారా ఒకటి నుంచి పది శాతం దీర్ఘకాలపు వ్యాధికి గురయ్యేదానికి ఆస్కారముంది. కేవలం 0.5 శాతం మాత్రమే ప్రమాదం. బానపొట్ట(సిర్రోసిస్‌), లివర్‌ క్యాన్సర్‌ బారినపడే అవకాశముంది.
హెపటైటిస్‌ - బి వ్యాక్సిన్‌
నెల తేడాతో మూడు డోసులు (1ఎంఎల్‌) వేసుకోవాలి. ఐదు సంవత్సరాల తరువాత బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలకు 0.5 ఎంఎల్‌ సరిపోతుంది. పుట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. ఒకవేళ అలా వేసుకోనివారు హెచ్‌బిఎస్‌ఎజి అనే రక్త పరీక్ష చేయించుకొని అది లేకపోతే ఈ వ్యాక్సిన్‌ని వేసుకోవాలి. ఒకవేళ అది ఉంటే వేసుకోవాల్సిన అవసరంలేదు. హెచ్‌బిఎస్‌ఎజి పాజిటివ్‌ అయితే భాగస్వామికి రక్త పరీక్ష చేసి, భాగస్వామికి నెగెటివ్‌ అయితే 6 నెలలపాటు సురక్షిత సెక్సు పద్ధతులను పాటిస్తూ హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ను ఆ భాగస్వామికి వేయించాలి. హెచ్‌బిఎస్‌ఎజి పాజిటివ్‌ వారు డాక్టరును సంప్రదించాలి.
పోస్ట్‌ ఎక్స్‌పోజర్‌ నివారణ
అనుకోని పరిస్థితుల్లో హెచ్‌బిఎస్‌ఎజి పాజిటివ్‌ వ్యక్తి రక్తం మన శరీరంలోకి పోతే వెంటనే 0.05 నుండి 0.07ఎంజి./కెజి ప్రకారం ఆరుగంటల లోపు హెపటైటిస్‌-బి ఇమ్యూనోగ్లాబులిన్‌ను వేసుకోవాలి. నెల తరువాత ఇంకొక డోసు వేసుకోవాలి. దీనితో పాటు రొటీన్‌ హెపటైటిస్‌-బి వ్యాక్సినేషన్‌ వేరొక చేతికి వేసుకోవాలి.
పాపాయికి
పుట్టిన పాపాయికి కామెర్లు రెండో రోజు లేదా మూడో రోజు వస్తే అది తాత్కాలికం. ప్రమాదకరం కాదు. దీర్ఘకాలం కొనసాగినా, ఎక్కువ మోతాదులో ఉన్నా ప్రమాదకరంగా మారే అవకాశముంది. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. తల్లి తీసుకున్న కొన్ని పదార్థాల వల్ల, పాల ద్వారా బిడ్డకు కామెర్లు వచ్చే అవకాశముంది. బిడ్డ ఎక్కువగా తల్లిపాలు తీసుకోకపోతే డీ హైడ్రేషన్‌ వచ్చి పేగుల కదలిక తగ్గిపోయి బిలురుబిన్‌ బయటకు పోకుండా పచ్చకామెర్లు వచ్చే అవకాశముంది. కాబట్టి తల్లిపాలు క్రమపద్ధతిలో బిడ్డకు ఇస్తూ ఉండాలి.
ఆర్‌హెచ్‌ ఇన్‌కంపాటబులిటి
తల్లి రక్తం ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అయి, బిడ్డ రక్తం ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ అయితే బిడ్డ పుట్టిన 72 గంటల్లో ఆర్‌హెచ్‌ ఇంజక్షన్‌ను తల్లికి ఇవ్వాలి. దీనివల్ల తరువాత పుట్టబోయే బిడ్డ ప్రమాదానికి గురికాకుండా ఉంటుంది. ముందే అనుమానిస్తే గర్భందాల్చిన 28వ వారంలో ఈ ఇంజెక్షన్‌ తల్లికి ఇవ్వాల్సి ఉంటుంది.
మనం పచ్చకామెర్ల గురించే తెలుసుకున్నాం. కానీ ఊదుకామెర్లు (ఒళ్లంతా వాచిపోవడం), తెల్లకామెర్లు (పాలిపోయిన శరీరం) వేరు. వాటి కారణాలు వేరు.
డాక్టర్‌ హెచ్‌. దత్తాత్రేయులు
డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు
ఫోన్‌ : 94903 00447



హెపటైటిస్-బి కి మందులేమిటి?
నాకు ఐదేళ్ల నుంచి ‘హెపటైటిస్-బి’ ఉంది. నాలుగేళ్లు హోమియో మందులు వాడాను. ఏడాది నుంచి ఆ మందులు ఆపేశాను. కొంత ఉపశమనం ఉంది. ప్రస్తుతం ‘మైగ్రేన్ తలనొప్పి’ కూడా వస్తోంది. నా కాళ్లు, చేతులు, సన్నగా అవుతున్నాయి. పొట్ట కూడ లావుగా ఉంది. నాకు పెళ్లి అయింది. కాబట్టి హైపటైటిస్-బికి తీసుకోవలసిన జాగ్రత్తలు, మందులు తెలియజేయండి. నా భార్యకు వ్యాక్సిన్ ఇప్పించాను. తనకు టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. ఈ వ్యాధిని గురించి వివరించండి.
- బి.ఎమ్.కె, కర్నూలు


మీ వయసెంతో రాయలేదు. మీకు హెపటైటిస్-బి సోకిందని రాశారు. కాని దానివల్ల మీకు కలిగిన లక్షణాలేవీ రాయలేదు. ఏ వ్యాధికైనా చికిత్స చేయాలంటే ‘‘లక్షణాలు, ఇతర బాధలు’’ ప్రధానంగా తెలియాలి. ఇన్వెస్టిగేషన్ రిపోర్టులతో వ్యాధి నిర్ధారణకు పరిపూర్ణత వస్తుంది. 70శాతం సందర్భాలలో ఇతర పరీక్షలు చేసినా, చెయ్యకపోయినా చికిత్సా విధానంలోనూ, ఔషధాలలోనూ తేడా ఉండదు. లివర్ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించి ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాల వైరస్‌లు ఉంటాయి. వీటన్నిటిలోనూ ప్రారంభ లక్షణాలు ఇంచుమించు సమానంగానే ఉంటాయి. ఇవి తలనొప్పి, వణుకు, నిస్ర్తాణలతో ప్రారంభమవుతాయి. జీర్ణకోశ ప్రక్రియలలో తేడా కనిపిస్తుంది. అరుచి, ఆకలి తగ్గడం, వాంతి భ్రాంతి, వాంతి, విరేచనాలు, స్వల్పంగా కడుపునొప్పి ఉంటాయి. అనంతరం ‘కామల’ (పచ్చకామెర్లు/జాండిస్) లక్షణాలైన పసుపు పచ్చని కళ్లు, మూత్రం కనబడతాయి. హెపటైటిస్ -బిలో ప్రత్యేకంగా కీళ్లనొప్పులు, చర్మంపై దద్దుర్లు కూడా కనబడవచ్చు. మొత్తం మీద లివరు (యకృత్/ కాలేయం) యొక్క ప్రాకృత క్రియలు దెబ్బతింటాయి. వీటిని సరిజేసి కాలేయం ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమే దీని చికిత్సలోని అంతరార్థం. ఇది తరుణావస్థ (ఎక్యూట్) నుండి పురాణావస్థకు (క్రానిక్) మారినప్పుడు రోగి లక్షణాలలో కొన్ని తగ్గుముఖం పట్టి, కొంత అస్పష్టత కలిగి, కొన్ని ఇబ్బందులు కొనసాగుతుంటాయి.

మీరు వైద్య నిపుణుని సంప్రదించి పొట్టని చెక్ చేయించుకోండి. లివరు, స్ల్పీను పెరిగాయో- లేదో, జలోదరం (పొట్టలో నీరు చేరడం) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. దీనికి సంబంధించిగాని, మరిదేనికైనా సంబంధించి గాని ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవడం వల్ల మీకు మైగ్రేను కూడా వచ్చి ఉండవచ్చు.

వ్యాధికి కారణాలు: కలుషిత ఆహారం, కలుషితమైన నెత్తురు ఎక్కించడం ముఖ్య కారణాలు.

జాగ్రత్తలు: పచ్చకామెర్లు వస్తే నాటువైద్యుల దగ్గరకెళ్లి పసరు వైద్యం చేయించుకోవడం వల్లే ప్రయోజనం ఉంటుందని ఒక అపోహ. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం. క్వాలిఫైడ్ డాక్టర్లకు మాత్రమే వ్యాధిపైన, చికిత్సపైన సరైన అవగాహన ఉంటుంది.

ప్రస్తుతం మీరు ఈక్రింద సూచించిన సలహాలు పాటించండి.
మందులు: ఆరోగ్యవర్ధని (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1

భూమ్యామలకి (నేల ఉసిరిక): ఆకుల రసాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, తేనెతో సేవించాలి. ఇదే మొక్కతో తయారు చేయబడ్డ ‘‘నిరోసిల్’’ మాత్రలు ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తాయి. (ఉదయం 1, రాత్రి 1)

భృంగరాజాసవ: ఒక చెంచా, కుమార్యాసవ 1 చెంచా ఒక గ్లాసులో కలుపుకుని సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి.

చిత్రకాదివటి (మాత్రలు): రోజుకి 5 వరకు చప్పరిస్తే, అరుచిని, ఆజీర్ణాన్ని పోగొట్టి, ఆకలి పెంచుతుంది.

ఆహారం: శాకాహారం, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు, తాజా ఫలాలు, పచ్చిసలాడ్లు మంచిది. మరిగించి చల్లార్చిన నీరు, బార్లీ జావ, చెరుకురసం (రోడ్లపైన బండ్ల దగ్గర తాగొద్దు. ఎందుకంటే అక్కడి పాత్రలు, గ్లాసులు, ఐస్‌ముక్కలు కలుషితంగానే ఉంటాయి), ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు ఎక్కువగా తాగడం మంచిది. నూనె పదార్థాలు, ఉప్పు, కారం బాగా తగ్గించాలి. జండ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోవద్దు. ఇడ్లీలు, మజ్జిగ చాలా మంచివి. కరివేపాకు, అల్లం రోజూ వాడండి. మద్యసేవన, ఇతర మత్తు పదార్థాలు చాలా హానికరం.

విహారం:: తగురీతిలో వ్యాయామం, ప్రాణాయామం చాలా మంచిది.

సూచన: రోజూ ఒక ఉసిరికాయ (ఆమలకి)ని, జీవిత పర్యంతం తినడం ఎవరికైనా మంచిదే. వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి, లివరు వ్యాధుల నివారణకు, ఆయువృద్ధికి ఇది ఉపకరిస్తుంది.



డా॥వి.ఎల్.ఎన్. శాస్ర్తి,
అడిషనల్ డెరైక్టర్, (ఆయుర్వేద) ఆయుష్, హైదరాబాద్




పచ్చకామెర్లు ప్రాణాంతకం కాదు

apr  -   Tue, 26 Mar 2013, IST
ప చ్చ కామెర్లను వైద్య పరిభాషలో జాండిస్‌ అని, హెపటైటిస్‌ అని వ్యవహరిస్తారు. వీటిని సాధారణ వాడుక భాషలో పసరికలు అని కూడా పిలుస్తుంటారు.
రక్తంలో బిలిరుబిన్‌ శాతం ఎక్కువైనందు వల్ల కళ్లు, శరీరం పసుపుపచ్చగా మారడాన్ని కామెర్లని అంటారు. పచ్చ కామెర్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి - హెపాటిక్‌ జాండిస్‌, అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌, హీమోలైటిక్‌ జాండిస్‌. పచ్చ కామెర్లలో అత్యధిక శాతం హెపాటిక్‌ జాండిస్‌కు సంబంధించినవే. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధుల వల్ల వస్తుంది. వీటిలో ప్రధానమైనది వైరల్‌ హెపటైటిస్‌. ఈ వైరల్‌ హెపటైటిస్‌లో కూడా మళ్లిd రెండు రకాలున్నాయి. అవి ఇన్‌ఫెక్టివ్‌ హెపటైటిస్‌. 95 శాతం కేసులు దీనికి సంబంధించనవే ఉంటాయి. రెండవది - సీరమ్‌ హెపటైటిస్‌. 5 శాతం కేసులు దీనికి సంబంధించి ఉంటాయి.
ఇన్‌ఫెక్టివ్‌ హెపటైటిస్‌
ఇన్‌ఫెక్టివ్‌ హెపటైటిస్‌ను టైప్‌ ఎ హెపటైటిస్‌ అంటారు. ఇది హెపటైటిస్‌ ఎ వైరస్‌ వల్ల వస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు తీసుకున్నప్పుడు ఈ వాధి సోకుతుంది.
సీరమ్‌ హెపటైటిస్‌
దీనిని టైప్‌ బి హెపటైటిస్‌ అంటారు. ఇది హెపటైటిస్‌ బి వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వాధి సరిగాగ శుభ్రం చేయని సిరంజులు, సూదులు వాడినప్పుడు, రక్త మార్పిడి వల్ల, తల్లినుంచి బిడ్డకు, పచ్చబొట్లు పొడిపించుకున్నప్పుడు, గడ్డం గీసుకునే బ్లేడులు, కత్తులు ఒకరివి మరొకరు వాడినప్పుడు, అరక్షిత విశృంఖల శృంగార జీవనం గడిపే వాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఆసుపత్రులలో పని చేసే సిబ్బందికి రోగుల ద్వారా ఈ వాధి సోకే అవకాశాలున్నాయి.
లక్షణాలు
వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు కనబడటానికి కొంత సమయం పడుతుంది. దీనిని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ ఇన్‌ఫెక్టివ్‌ హెపటైటిస్‌కు 14నుంచి 45 రోజులు, సీరమ్‌ హెపటైటిస్‌కు 30 నుంచి 180 రోజులు ఉంటుంది. వ్యాధి లక్షణాలను మనం మూడు దశలలో చెప్పుకోవచ్చు.
మొదటి దశలో రోగికి విపరీతమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఉంటాయి. వీటిని వాధి కనబడే ముందు లక్షణాలని అంటారు. ఈ దశ వారం రోజులపాటు సాగుతుంది.
రెండవ దశలో మూత్రం పచ్చగా వెలువడుతుంది. మలం తెల్గా ఉంటుంది. వాంతులవుతాయి. ఆకలి ఉండదు. కళ్లు, శరీరం పసుపు రంగుకు మారుతాయి. శరీరంపై దురద ఉంటుంది. ఈ దశలో వ్యాధి తీవ్రస్థాయికి చేరుతుంది. ఈ దశ రెండు మూడు వారాలపాటు కొనసాగుతుంది. ఈ దశలో రక్తంలో సీరమ్‌ బిలిరూబిన్‌ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
మూడవ దశలో వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మొదటి, రెండవ దశలలో చెప్పుకున్న లక్షణాలు క్రమేణా తగ్గుతాయి. రోగికి ఆకలి బాగా ఉంటుంది. మూత్రం, మలం రంగు యథాస్థితికి వస్తుంది. కళ్లలో పసుపు రంగు నిదానంగా తగ్గి తెల్లగా మారుతుంది.
రోగ నిర్ధారణ పరీక్షలు
కామెర్ల వ్యాధి నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవి -
మూత్ర పరీక్ష, మల పరీక్ష, రక్త పరీక్షలు, స్కానింగ్‌ మొదలైనవి. ఈ పరీక్షల ఆధారంగా కామెర్లు ఏ రకానికి చెందినవనే విషయాన్ని నిర్ధారించి తగిన చికిత్స చేయడానికి ఆస్కారం ఉంటుంది.
కామెర్లు ముందు పెరిగి తరువాత తగ్గుతాయి. కామెర్లను నయం చేయడానికి ఎలాంటి మందులు లేవు. కామెర్లు వాటంతట అవే తగ్గుతాయి. వీటి తీరు అందరిలోనూ ఒకే తీరుగా ఉండదు. అది వారి వారి రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి కొద్దిస్థాయిలో వచ్చి వెంటనే తగ్గుతుంది. కొంతమంది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఒక నెలనుంచి మూడు నాలుగు నెలలు, అంతకన్న ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కొంతమందికి మరణం సంభవించవచ్చు. అయితే వీరి శాతం చాలా తక్కువ. చాలామంది కామెర్లనుంచి పూర్తిగా కోలుకుంటారు. కామెర్లు వచ్చిన వారు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదు. తగిన వైద్య సలహా తీసుకోవడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు.
వ్యాధి ముదిరితే...
కొంతమంది రోగులు కామెర్లను అశ్రద్ధ చేస్తారు. వారిలో వ్యాధి బాగా ముదిరిపోతుంది. అప్పుడు వారిని ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది.
కొంతమంది ఈ వ్యాధి కారణంగా అపస్మారక స్థితిలోకి వెళుతుంటారు. దీనిని హెపాటిక్‌ కోమా అంటారు. దీనివలన మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొంతమందిలో లివర్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదముంటుంది. ఇవి హెపటైటిస్‌ బి రోగులలో కనిపించే ప్రమాదాలు.
నివారణ
ఒక వ్యాధి సోకిన తరువాత దానిని నయం చేసుకోవడానికి చికిత్స తీసుకోవడం కంటే, వ్యాధి సోకకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అంటే తాగే నీరు, తినే ఆహారం శుభ్రంగా ఉండాలి. నీటిని మరగ కాచి చల్లార్చి తాగడం మంచిది.
ఆసుపత్రులలో వాడే సిరంజులు, సూదులను బాగా స్టెరిలైజ్‌ చేయాలి. వీటి బదులు డిస్పోజబుల్‌ సిరెంజులు వాడటం ఉత్తమం.

రక్త దాతలకు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధులు లేవని తెలిసిన తరువాతే వారి రక్తాన్ని మరొకరికి ఎక్కించడానికి సేకరించాలి.
అరక్షిత విశృంఖల శృంగార జీవితం మంచిది కాదు. దీని వల్ల కామెర్లే కాకుండా ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకే ప్రమాదముంది.
టూత్‌ బ్రష్‌లు, బ్లేడులు ఒకరివొకరు వాడకూడదు.

ఈ వ్యాధి సోకే అవకాశమున్న వ్యక్తులు హై రిస్క్‌ గ్రూప్‌లోకి వస్తారు. వీరు వ్యాధి సోకకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చికిత్స
కామెర్ల వ్యాధికి చికిత్స మూడు రూపాలలో ఉంటుంది. మొదటిది విశ్రాంతి, రెండవది ఆహార నియమాలు పాటించడం, మూడవది మందులు వేసుకోవడం.

విశ్రాంతి
కామెర్లు వచ్చిన రోగి పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. లేనిపక్షంలో వ్యాధి తీవ్రమయ్యే అవకాలుంటాయి.
పథ్యం
మజ్జిగ బాగా తాగాలి. మజ్జిగ అన్నం తినాలి. పాలు తాగాలి.
ఉప్పు, కారం, నూనె తగ్గించిన ఆహారం తీసుకోవాలి.

గ్లూకోజ్‌ కలిపిన నీరు ఎక్కువగా తాగాలి.
చెరకు రసం తాగాలి
కొబ్బరి నీళ్లు తాగవచ్చు
నిమ్మ జాతి ఫలాలు తినాలి. వీటిలో విటమిన్‌ సి ఉంటుంది. దీనికి వైరస్‌ను నాశనం చేసే శక్తి ఉంది.



శరీరం మీది చర్మం, మ్యూకస్‌ మెం బ్రేన్స్‌, కలుషితమైన నీటితోగాని, తడిసిన లేదా చెమ్మగిల్లిన నేలతోగాని, చెరకులాంటి మొక్కలు లేదా చెట్లు (వెజిటేషన్‌) తోగాని, నిలవవున్న మూత్రం (రోడెంట్‌ యూరిన్‌) కలిసిన బురదతోగాని తాకిడి ఏర్పడినప్పుడు, లెఎ్టోస్పోరోసిస్‌ సంక్రమిస్తుంది. విపరీతంగా కురిసిన వర్షాలవల్ల, వచ్చే వరద నీటిలోలెఎ్టో స్పైర్స్‌ని అధికంగా విడుదలచేసే రోడెంట్స్‌తో కూడిన మూత్రం కలిసినప్పుడు, ఈ ఆర్గానిజమ్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది.
ఇలా నీటిద్వారా వ్యాపించే బాక్టీరియా వల్ల సోకే 'లెఎ్టోస్పైరోసిస్‌'ని, 'కానికోలా ఫీవర్‌' అనీ, 'హెమరేజిక్‌ జాండిస్‌' అనీ, 'ఇన్‌ఫెక్షస్‌ జాండిస్‌' అనీ, 'మడ్‌ ఫీవర్‌'అనీ, 'స్పైరోకేటస్‌ జాండిస్‌' అనీ, స్వాంప్‌ ఫీవర్‌ అనీ, 'స్వైన్‌ హెర్డ్స్‌ డిసీజ్‌' అనీ, 'కేనర్స్‌ ఫ్లూ' అనీ, లేదా 'సీవెర్‌మెన్‌ ఫ్లూ' అనీ, రకరకాల పేర్లతో పిలుస్తారు.
రోగ లక్షణాలు :
అలా 4 నుంచి 10 రోజులపాటు, వరద నీటిలోనానే సమంలో ఈ అంటురోగం (ఇన్‌ఫెక్షన్‌) లక్షణాలు అగుపిస్తాయి. సాధారణంగా, జ్వరంతో, చర్మం వాచినట్టుండడం, ఎర్రగా దద్దుర్లు ఎక్కిన శరీరంతో, 'ఇన్‌ఫ్లూయెంజా' లాంటి లక్షణాలతో ఈ 'లెఎ్టోస్పైరోసిస్‌' అనే వ్యాధి మొదలౌతుంది. తలనొప్పీ, వెలుతురు భరించలేకపోవడం,ముక్కులోంచి రక్తం కారడం, కళ్లుపోట్లూ, గాస్ట్రో ఇంటస్టైనల్‌ డిస్‌కంఫర్ట్‌ లాం టివి. కండరాలూ, కీళ్లసందులూ బిగిసినట్టుండడం, వాం తులూ, అలసటా, ఈ రోగ ముఖ్యలక్షణాలు. చాలామంది, కొద్దిరోజులపాటు కొంచెం నలతగా ఉన్నట్టు అనిపించినా,నెమ్మదిగా తేరుకుంటారు. కాని, కొంతమందిలో 5-7 రోజుల తరువాత ఈ వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంది.
కొద్దిమందిలో మాత్రం, కాలేయం (లివర్‌) దెబ్బతిని, పచ్చకామెర్లు (జాండిస్‌) కూడా రావచ్చు. పచ్చకామెర్లలో మొదట్లోకళ్లూ క్రమంగా వ్యాధి ముదిరితే ఒళ్ళంతా పసుపుపచ్చ రంగులోకి వచ్చేస్తాయి.






NewsListandDetails కాలేయ వ్యాధుల్లో ప్రధానమైనదైన పచ్చకామెర్లు లేదా జాండిస్‌ ఈ కింది కారణాల వలన సోకుతుంది. వైరస్‌, మద్యపానం, మందుల విషప్రభావం (టాక్సిసిటీ), ప్రకృతిలోని విషపదార్థాలు, విల్‌సన్‌ వ్యాధి, ఆటోఇమ్యూన్‌ వాధులు, అక్యూట్‌ ఫాట్టీ లివర్‌ (గర్భిణీ స్త్రీలలో), లెప్టోస్పైరోసిస్‌, బడ్‌చారి సిండ్రోం, షాక్‌ (గుండె వైఫల్యం చెందడం) మొదలైన వాటి వలన సోకుతాయి.
వైరల్‌ హెపటైటిస్‌
సుమారు 20 సంవత్సరాల క్రితం వరకూ వైరల్‌ హెపటైటిస్‌ అనే వ్యాధి హెపటైటిస్‌ ఎ, బి వైరస్‌ల వలన మాత్రమే వస్తుందని అనుకునేవారు. కాని ప్రస్తుతం హెపటైటిస్‌ సి, డి, ఇ, జి అనే వైరస్‌ల వలన కూడా వస్తుందని గుర్తించారు. హెపటైటిస్‌ వైరస్‌లే కాకుండా, ఇతర వైరస్‌లైన సైటో మెగాలోవైరస్‌, ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌, ఎల్లో ఫీవర్‌ వైరస్‌, రుబెల్లా వైరస్‌ వలన కూడా పచ్చ కామెర్లు రావచ్చు.  వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగుల్లో హెర్పిస్‌ సింప్లెక్స్‌, వారిసెల్ల, అడినోవైరస్‌ల వలన కూడా పచ్చకామెర్లు తీవ్రస్థాయిలో వస్తుంది.
ఇంక్యుబేషన్‌ పీరియడ్‌
వ్యాధికారక క్రిమి శరీరంలో చేరిన తరువాత వ్యాధి లక్షణాలు బైట పడటానికి మధ్య కాలాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. హెపటైటిస్‌ ఎ -15 నుంచి 45 రోజులు, హెపటైటిస్‌ బి -30 నుంచి 180 రోజులు, హెపటైటిస్‌ డి -30 నుంచి 180 రోజులు, హెపటైటిస్‌ సి -15 నుంచి 160 రోజులు, హెపటైటిస్‌ ఇ -14 నుంచి 60 రోజులు.
జాండిస్‌ బైటపడక ముందు ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి.
ఆకలి లేకపోవడం, అలసట, నీరసం, వికారంగా ఉండటం, వాంతులు, కండరాల, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరము, వాసనలు సహించలేకపోవడం, భోజనం రుచించకపోవడం, మలం బూడిద రంగులో రావడం మొదలైనవి. జాండిస్‌ బైటపడిన తరువాత పైన పేర్కొన్న లక్షణాలు తగ్గుతాయి, బరువు కోల్పోవడం (రెండున్నరనుంచి ఐదు కిలోల బరువు కోల్పోతారు), కాలేయం వాపు ఎక్కి పెద్దదై, నొప్పిగా ఉండటం, ప్లీహం పెద్దది కావడం, శరీరంపై దురద రావడం (కొంతమందిలో), కళ్లు, చర్మం, ఆమత్వచపు పొరలు పచ్చబడటం
తగ్గుముఖం పట్టే దశ
జాండిస్‌ బైటపడటానికి ముందు ఉన్న లక్షణాలు తగ్గిపోతాయి. కాలేయం నార్మల్‌ సైజుకు వస్తుంది. లేదా కొంచెం పెద్దగా ఉంటుంది. ఎల్‌ఎ ఫ్‌టి నార్మల్‌గా ఉంటుంది. కొందరిలో కొంచెం అబ్‌నార్మల్‌గాఉండవచ్చు. కొందరిలో జాండిస్‌ బైట పడకుండా, వ్యాధితో బాధపడటం జరుగవచ్చు.
హెపటైటిస్‌ ఎ వైరస్‌ వ్యాధి
ఇది ఎంటిరోవైరస్‌ అనే పికోర్నవిరిడే  కుటుంబానికి చెందిన వైరస్‌. ఈ వైరస్‌ వలన వచ్చే పర్చ కామెర్లను ఇన్‌ఫెక్షువస్‌ హెపటైటిస్‌ లేదా ఎపిడ మిక్‌ జాండిస్‌ అంటారు. ఈ వైరస్‌ వలన వచ్చే వ్యాధికి రిజర్వాయర్‌ వ్యాధిగ్రస్తుడే. వ్యాధిగ్రస్తుడు వ్యాధి లక్షణాలతో కనిపించకపోవచ్చు. లేదా వ్యాధి లక్షణాలు లేకుండా ఇతరులకు వ్యాధి సోకడానికి కారణం కావచ్చు. కామెర్లు బైటికి కనపడక ఉన్న రెండు వారాల ముందు, కామెర్లు బైటికి కనిపించిన తరువాత ఒక వారం వరకూ వ్యాధిగ్రస్తుడు వేరే వారికి ఈ వ్యాధిని సంక్రమింపజేస్తాడు. వ్యాధిగ్రస్తుడు మలం ద్వారా ఈ వైరస్‌ను విసర్జిస్తాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతియేటా సుమారు లక్షకు పదినుంచి 50 మంది ఈ వైరస్‌ వలన వచ్చే పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వ్యాధి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నది.
కారణాలు
పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఒకే ఇంట్లో చాలా మంది నివసించడం, కలుషిత నీరు, పాలు, ఆహార పదార్థాల సేవనం తదితర కారణాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఒక్కొక్కసారి కలుషిత ఇంజక్షన్‌ సూదుల ద్వారా కూడా రావచ్చు. లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించవచ్చు. హోమో సెక్సువల్స్‌లో ఎక్కువగా వస్తుంది.
లక్షణాలు
హెపటైటిస్‌ ఎ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన సమయంనుండి వ్యాధి లక్షణాలు బైటపడటానికి 15 నుంచి 45 రోజులు పడుతుంది. ఈ వ్యాధి అందరికి వస్తుంది. కాని చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంది. పెద్దవారిలో కొంచెం తీవ్రస్థాయిలో వస్తుంది.  ఒకసారి వ్యాధి వస్తే జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుంది. కాని 5 శాతం మందికి మరొకసారి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఎ వైరస్‌తో జాండిస్‌కు గురైన వ్యక్తికి ఎ వైరస్‌తో జాండ్‌ రాదు. కాని ఇతర వైరస్‌లతో జాండిస్‌ వచ్చే అవకాశాలున్నాయి. అయితే 5 శాతం మందిలో మాత్రం మళ్లీ ఎ వైరస్‌తోనే జాండిస్‌ రావచ్చు.  ఆకలిలేకపోవడం, వాంతి అయ్యేట్లు ఉండటం, వాంతులు చేసుకోవడం, అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తల నొప్పి, వెలుతురు చూడలేకపోవడం, గొంతు నొప్పి, ముక్కులోనుండి నీరు కారడంలాంటి లక్షణాలతో మొదలవుతుంది.  భోజనం రుచించకపోవడం, వాసనలు సహించ లేకపోవడం, సిగరెట్లు తాగే వారికి సిగరెట్‌ పొగ వాసన కూడా సహించక లేకపోవడం జరుగుతుంది. వ్యాధిగ్రస్తుడిలో జ్వరం 100 నుంచి 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ ఉండవచ్చు. కొంతమంది వ్యాదిగ్రస్తుల్లో జ్వరం అసలు కనిపించకపోవచ్చు. మూత్రం పచ్చగా రావడం, కళ్లు, తరువాత ఒళ్లు పచ్చబడటం జరుగుతుంది. మలం మట్టి రంగులో ఉంటుంది. కొంతమందిలో విరేచనాలు అవుతాయి. కాలేయం పెద్దదిగా అవడం వలన కడుపులో నొప్పి వస్తుంది.
పరీక్షలు
కాలేయం పని తీరు (లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ - ఎల్‌ఎఫ్‌టి), మూత్ర పరీక్ష (బైల్‌ సాల్ట్స్‌, బైల్‌ పిగ్మెంట్స్‌), హెపటైటిస్‌ ఎ వైరస్‌ Iణ లీ, Iణ బి, యాంటి బాడీల పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అవసరమైనప్పుడు చేయాల్సి ఉంటుంది.


ఒకే జ్యూస్... రెండు వ్యాధుల నివారణ

హెల్తీ జ్యూస్
గుండెజబ్బులు, రక్తపోటు నివారణకు రుచికరమైన మార్గమిది. ప్రతిరోజూ 60 ఎం.ఎల్. తాజా దానిమ్మగింజల జ్యూస్ తాగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మామూలు వ్యక్తులతో పోలిస్తే దానిమ్మగింజల జ్యూస్ తాగేవారిలో సిస్టోలిక్ బల్డ్ ప్రెషర్ 21శాతం తక్కువగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒకే జ్యూస్‌తో రెండు జబ్బుల (రక్తపోటు, గుండెజబ్బులు) నివారణకు ఈ పసందైన మార్గాన్ని ఎంచుకోడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది!
0

Add a comment

బిడ్డ పుట్టగానే కనిపించే ఆరోగ్య సమస్యల్లో పుట్టుకామెర్లు ఫస్ట్ కావచ్చుమో గాని... మరీ అంత దుష్టమైనవీ, నష్టదాయకమైనవీ కావు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక బిడ్డ చేసే మొదటి పోరాటం ఈ జాండిస్‌తోనే. దీన్ని ఓ వ్యాధిగా అనుకోవడం కంటే, లోకంలో ఎదురయ్యే అనేక ఛాంలెజ్‌లలో విజేతగా మారడానికి ప్రకృతి ఇచ్చే ఫస్ట్ అవకాశంగా భావించవచ్చు. తల్లికి పథ్యం మొదలుకొని, బిడ్డకు సూర్యకాంతిని చూపడం వరకు వీటిపై అనేక అపోహలు ఉన్నాయి. ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.

బిడ్డ పుట్టిందనగానే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబసభ్యులందరూ ఆనందంతో తీపిని పంచుకుంటారు. ముద్దు పేర్లతో పాపాయి చుట్టూ చేరిపోతారు. కళ్లలో ఒత్తులు వేసుకొని బిడ్డను చూస్తూ, ప్రతి కదలికను ఆనందిస్తుంటారు. తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. మిలమిలల్లాడే చిన్నారి కళ్లు, కుంకుమ అద్దినట్టుగా ఉండే వేళ్లు, గోళ్లు, గులాబీ పువ్వుకన్నా సుకుమారమైన ఒళ్లు కొన్ని గంటల తర్వాత మెల్ల మెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంటే చెప్పలేనంత ఆందోళన. ఏమైందో అన్న కంగారు. భయంతో తల్లిమనసు తల్లడిల్లిపోతుంది.

వైద్యులు పరీక్షించి ‘కామెర్లు’ అని చెప్పగానే పెద్దల గుండెల్లో గుబులు మొదులవుతుంది. ఎలా చూసుకోవాలో, ఏ మందులు వాడాలో, ఎందుకు ఈ వ్యాధి తమ బిడ్డకే వచ్చిందో అని గాబరా పడిపోతుంటారు. కాని ఈ ‘పుట్టు కామెర్లు’ బిడ్డను గట్టిగా నిలబెట్టడానికే అని తెలిస్తే ... ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోవచ్చు.

పుట్టిన శిశువుల్లో 60 శాతం మందికి పచ్చకామెర్లు వస్తుంటాయి. ఇది అత్యంత సాధారణం. పెద్దలకు వచ్చే కామెర్లలాంటివే అనుకొని ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తొమ్మిది నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పెరుగుతుంటుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి.

వీటన్నింటినీ తట్టుకొని నిలబడటానికి శక్తిని పుంజుకోవాలి. ఈ శక్తిని ఇంకా ఎదిగీ ఎదగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. శరీరంలో బిలిరుబిన్ ఎక్కువవుతుంది. ఫలితంగా కళ్లు, గోళ్లు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారుతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి, నెలలు నిండకముందే పుట్టిన వారికైతే ఈ సమస్య కాస్త ఎక్కువ.

పూర్తి నెలల్లో పుట్టిన పిల్లల్లో రెండో రోజు నుంచి మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉండి 5వ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14 రోజుల వరకు కామెర్లు కనపడతాయి. కాలేయం పనితీరు మెరుగు పడి బిలిరుబిన్ స్థాయి (2 ఎంజీ) రావడానికి నెల రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత ఈ సమస్య ఉండదు. నవజాత శిశువుల్లో కనిపించే కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరుబినిమియా, ఫిజియలాజిక్ జాండీస్ అని కూడా వ్యవహరిస్తారు.

లక్షణాలు:
చర్మం, గోళ్లు పసుపు రంగులోకి మారడం
కంటిలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం
సాధారణమైన దాని కంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం

పుట్టిన మొదటి రోజే కనిపిస్తే...
పుట్టిన మొదటి రోజే బిడ్డలో కామెర్లు కనిపించడం అంత సాధారణ విషయం కాదు. ఈ కామెర్లు రెండు వారాల కంటే ఎక్కువ అంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. శిశువు వయసు, బిలిరుబిన్ ఎంత మొత్తంలో ఉంది? కామెర్లకు కారణమేమిటి? అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

చికిత్స:
కామెర్ల తీవ్రతను తగ్గించడానికి ఈ కింది సూచనలు పాటించాలి.
తల్లిపాలు తరచుగా ఇస్తూ ఉండాలి.
ఫొటో థెరపీ ఇవ్వాలి.
తీవ్ర పరిస్థితిలో రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు.
ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి, పసుపు వర్ణం తగ్గేలా చేయవచ్చు.
కామెర్లు రెండు వారాల కన్నా ఎక్కువ కొనసాగితే, అప్పుడే పుట్టిన బిడ్డల రసాయనిక చర్య గైలాక్టోసిమియా, కంజెనిటల్ హైపోథైరాయిడ్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ దశలో శిశువు కుటుంబంలో ఉన్నవారి ఆరోగ్యచరిత్ర, శిశువు బరువు పరిశీలించవలసి ఉంటుంది. శిశువు విసర్జించిన మలం కూడా పరిశీలించవలసి ఉంటుంది.

కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
తీవ్రమైన సూర్యకాంతికి బిడ్డను కొన్ని గంటల పాటు చూపడం వల్ల చర్మంపై మచ్చలు రావచ్చునని ఇటీవలి కాలంలో తేల్చారు. కనుక తీవ్రమైన సూర్యకాంతి బిడ్డలకు తగలనీయకూడదు.
కొన్ని సంవత్సరాల క్రితం జాన్స్ హోప్‌కిన్స్ విశ్వవిద్యాలయం బిడ్డల చర్మాన్ని పసుపుగా మార్చే బిలిరుబిన్ అనే పదార్ధం శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ అని నిరూపించారు. ఇది బిడ్డ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంటే కణనాశనం కాకుండా కామెర్లు ఒక అడ్డుగోడలా పనిచేస్తాయన్నమాట. అయినప్పటికీ కామెర్లకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
పుట్టిన మొదటి రోజులలో బిడ్డకు నీరు తాగించడం వల్ల కామెర్ల తీవ్రత పెరుగుతుంది. కాబట్టి నీళ్లు పట్టించడం కన్నా తల్లిపాలనే ఇవ్వాలి.

ఫొటోథెరపీ...
శిశువుని ఎండలో ఉంచడం, అతినీలలోహిత కిరణాల తాకిడికి గురి చేయడం, ఎక్కువ వేడిలో ఉంచడం వంటివి మంచిది కాదు. 12 మి.గ్రా కన్నా బిలిరుబిన్ ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్ద డానికి కాంతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లూలైట్స్‌తో ఫొటోథెరపీ చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 3-5 రోజులు ఈ థెరపీ ద్వారా బిలిరుబిన్‌ను సాధారణ స్థాయికి తీసుకువస్తారు.

బిలిరుబిన్ స్థాయి పెరగకుండా వైద్యులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ పెరిగిన బిలిరుబిన్ తగ్గకపోతే అది రక్తం ద్వారా మెదడుకు చేరి సెరిబ్రల్‌పాల్సీకి దారి తీసే ప్రమాదాలు ఉంటాయి. ఈ స్థితి 25 మి.గ్రా కన్నా బిలిరుబిన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు జరగవచ్చు. ఈ ప్రమాదం తలెత్తకుండా రక్తమార్పిడి, ఇంజక్షన్లు, ఫొటోథెరపీ వంటి పద్ధతుల ద్వారా వైద్యులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు.


అపోహలు - వాస్తవాలు
తప్పు- బిడ్డకు కామెర్లు ఉన్నాయంటే తల్లి పథ్యం పాటించాలి.
ఒప్పు- తల్లి ఆహారవిహారాలలో శిశువుల కామెర్లవ్యాధికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి పాలిచ్చే తల్లులు అన్నిరకాల పోషకాహారాన్ని తీసుకోవాలి.
తప్పు- ఉదయం పూట సూర్యకాంతిలో పెడితే కామెర్లు తగ్గుతాయి.
ఒప్పు- ఇదొక సంప్రదాయం మాత్రమే. కానీ పిల్లల శరీరానికి నేరుగా సూర్యకాంతి తాకితే అది ప్రమాదకరంగా మారవచ్చు. మంచాన్ని లేదా ఉయ్యాలను సన్నటి పొర అడ్డుగా ఉన్న కిటికీ పక్కన వేస్తే గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించి బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తప్పు- ఆడపిల్ల కన్నా మగపిల్లల్లో కామెర్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ఒప్పు- ఆడపిల్లల్లో కూడా ఈ రేటు అదే విధంగా ఉంటుంది.
Posted 8th July 2012 by



-కట్టా శేఖర్‌రెడ్డి
ఇప్పటికిప్పుడు తెలంగాణపై అవుననో కాదనో చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఇది తీవ్ర సమస్య. చత్తీస్‌ఘడ్‌ లాంటి చిన్న రాష్ట్రాల్లో తీవ్రవాదుల కద లికలు ఎక్కువై పరిస్థితి దారుణంగా తయారయింది. రాష్ట్రంలో కూడా నక్సలైట్లు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నందున ఉగ్రవాద సమస్య మరింత పెరిగే అవ కాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి…కాశ్మీర్‌ సమస్యపై పాక్‌తో భారత్‌ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు ఇతర విషయాలపై చర్చలూ జరుపుతోంది. అలాగే మనమూ వ్యవహరిద్దాం.
-ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి
* * *  
యుద్ధం అబద్ధాలతోనే మొదలవుతుంది. పిచ్చికుక్క అని ముద్ర వేస్తే తప్ప కొట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రీ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ ఇవ్వడానికి నక్సలిజం అడ్డంకి అయిందట. తెలంగాణ కాశ్మీరూ ఒకటేనట. నక్సలిజం తెలంగాణలో పుట్టిందా? నక్సలిజం తెలంగాణలో మాత్రమే ఉందా? నక్సలి జం సమైక్యాంధ్రలో ఉండవచ్చు కానీ, తెలంగాణలో మాత్రం ఉండరాదా? అసలు సమైక్యాంధ్రలో నక్సలిజం లేనిదెప్పుడు? ముఖ్యమంత్రులు, వారి తనయులు కోట్లాది రూపాయల ప్రజాధనంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు, జామర్లు, వందలాది మంది జవాన్ల మధ్య ఊరేగుతున్నది సమైక్యాంధ్రలోనే కాదా? నక్సలైట్ల భయంతోనే కాదా? వేలాది మంది నవయువకులు ఆవేశం కట్టలు తెంచుకుని, ఆశయాల ఊపిరిపోసుకుని తుపాకి గుళ్లను ముద్దాడి, మట్టిలో కలిసి పోయింది సమైక్యాంధ్రలోనే కాదా? కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలూ యథేచ్ఛగా జరిగిపోయింది సమైక్యాంధ్రలోనే కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్ల బారులో నక్సలైట్లు భూకంపం సృషి ్టంచింది సమైక్యాంధ్రలోనే కాదా? రాష్ట్ర హోంమంత్రిని నడిరోడ్డుపై మందుపాతర లతో పేల్చి వేసింది సమైక్యాంధ్రలోనే కాదా? మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై మందు పాతర పేలిందీ సమైక్య ఆంధ్రలో కాదా! శ్రీకాకుళ వసంత మేఘ గర్జనలు, సిరిసిల్లా-జగిత్యాల, గోదావరిలోయ సాయుధ పోరాటాలు వెల్లువె త్తింది సమైక్యాంధ్రలోనే కాదా? నిజానికి, ఇవ్వాళ నక్సలిజం తెలంగాణ పొలిమేరలు దాటిపోయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నా, నక్సలిజాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలిసినంతంగా మరెవరికీ తెలియదు. నక్సలిజం కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఎందుకు మొలకెత్తలేదో, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎందుకు ఉవ్వెత్తున ఎగసిపడిందో రాష్ట్ర ప్రజలకు ఎరుకే!
నక్సలిజం ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనే బలంగా ఉందన్న విషయమూ అందరికీ తెలుసు. ఇక తెలంగాణనయినా, హైదరాబాద్‌నయినా కాశ్మీరుగా మార్చ గల అనుభవం, కల్లోలం సృష్టించగల తెగింపు ఎవరికి ఉందో కూడా ఇప్పుడు ప్రజ లకు తెలుసు. అసత్యం ఒక సారి యుద్ధం గెలవడానికి మాత్రమే ఉపయోగ పడు తుంది. రెండోసారి ఆ ఆయుధం పని చేయదు. నిఘా సంస్థల నివేదికలు రాజకీయ అక్రమ సంబంధానికి పుట్టే అకాల పుత్రికలు. అవి నిలవవు. వాటికి విలువలేదు. ఇక పవిత్రత గురించి మాట్లాడడం అనవసరం.
హోంమంత్రి రిజాయిండర్‌
అటువంటి నివేదికలేవీ ఇంటలిజెన్స్‌ వర్గాలు ఇవ్వలేదు. అసలు ఎలాంటి నివేది కలూ లేకుండా అపోహలు సృష్టించడం మంచిది కాదు. ఇంటలిజెన్స్‌ నివేదికలతోనే చత్తీస్‌ఘడ్‌, జార్కండ్‌ రాష్ట్రాలను ఇచ్చారా? తెలంగాణ ఏర్పాటైతే నక్సలిజం పెరు గుతుందని, శాంతి భద్రతలు క్షీణిస్తాయని చెప్పడం కేవలం అపోహే.
-హోం మంత్రి కుందూరు జానారెడ్డి, ఐఐఐ
ఉన్నమాట
దేశంలో చాలా మంది రాజకీయ నాయకులకు గర్వం ఎక్కువ. ఇది ఇతర ప్రజా స్వామ్య దేశాల్లో కనిపించదు. ఇందువల్లే మన రాజకీయ నాయకులు ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తున్నారు.
-మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె అద్వానీ
‘నీతి’బీర
మనిషిలా మాట్లాడు..బుద్ధుండి మాట్లాడుతున్న మాటలేనా ఇవి..ఛీఛీఛీ..ఇవి మ నుషులు మాట్లాడే మాటలేనా..ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ..తొమ్మిదేళ్లు సిఎంగా పనిచేసిన మనిషి మాట్లాడాల్సిన మాటలేనా..ఛీఛీఛీ..సిగ్గుతో తలదించు కోవాలి.
-ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి
సలహాదారు అనుభవం
ఓ పెద్దమనిషి కారులో సోమాజిగూడ రోడ్డులో వస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్ల సమీపంలో ఉన్నట్టుండి ఓ సైకిలిస్టు అడ్డంగావచ్చి కారును డీకొని కిందపడి పోయాడు. సైకిలిస్టుకు కిందపడి, మోచేతులు డోక్కుపోయాయి. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ఆ పెద్దమనిషి కారు దిగి, అతడిని సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స చేయించాల్సిందిగా డ్రైవరుకు చెబుతున్నారు. సైకిలిస్టు గోల చేస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వచ్చి, ‘పదండి పోలీసు స్టేషనుకు’ అన్నారు. ‘బాబూ, నేను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును. అతనికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు’ అని ఆ పెద్దమనిషి చెప్పుకున్నారు. అంతే మనవాడు అలర్టయిపోయి, ‘మీరు వెళ్లిపోండి సార్‌, ఈ వ్యవహారం నేను చూసుకుంటాను’ అని, ఆటో పిలిచి పెద్దమనిషిని పంపించి వేశాడు.
పెద్దమనిషి ఇంటికి చేరాడో లేదో డ్రైవరు నుంచి ఫోను. ‘సార్‌. సైకిలతను వెళ్లిపోయాడు. కానిస్టేబుల్‌ ఐదొందలయినా ఇవ్వనిదే వదలి పెట్టనంటున్నాడు’. పెద్దాయనకు నోట మాట రాలేదు. ‘ప్రభుత్వ సలహాదా రునని చెప్పినా…వినలేదా’. ‘లేదు సార్‌, పోలీసు స్టేషనుకు రమ్మంటున్నాడు’. ‘సరే…ఇచ్చిరా’. ఆ పెద్దమనిషి ఓ జర్నలిస్టుకు ఫోను చేసి, మా ప్రభుత్వం ఇలా తగలబడిందని గోడు వెళ్లబోసుకున్నారు. ‘పోలీసుల్లో అవినీతి ఎప్పుడూ ఉన్నదే. కానీ ఇంత బరితెగింపా? నన్నే లెక్క చేయలేదంటే వాళ్లు సామన్యులను ఎంత పీక్కుతింటున్నారో’ అని ఆయన గింజుకున్నారు. ఆయన బాధ ఐదొందల గురించి కాదు. జరిగిన అవమానం గురించి. ‘యథా రాజా తథా పోలీసు’!

(16 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి సౌజన్యం)

తగ్గుతున్న పచ్చకామెర్లు: మెరుగుపడుతున్న ఆరోగ్యం!!  
గత కొన్ని రోజులుగా అనారోగ్యం బారినపడిన పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోంది. ఆయనకు సోకిన పచ్చ కామెర్ల వ్యాధి కూడా తగ్గుముఖం పట్టినట్టు ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరక్టర్ డాక్టర్ సఫాయా వెల్లడించారు.

బాబా ఆరోగ్యంపై ఆయన తాజాగా వైద్య బులిటెన్‌ను విడుదల చేశారు. సోమవారంతో పోల్చుకుంటే ఇపుడు సత్య సాయిబాబా ఆరోగ్యం మెరుగ్గా ఉందన్నారు. సత్యసాయిబాబా ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇపుడు సాయిబాబా మూత్ర పిండాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. దీంతో అప్పుడప్పుడు మాత్రమే డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. హృదయ స్పందన, రక్తంపోటు, బ్లడ్ షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయన్నారు. సత్య సాయిబాబా చికిత్సకు బాగా స్పందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, సత్య సాయిబాబాకు ఇంకా వెంటిలేటర్ ద్వారానే కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దీన్ని కూడా శోధించు: పచ్చకామెర్లు, ఆరోగ్యం, సత్యసాయి, ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ప్రాంతీయం


సిబిఐకి పచ్చకామెర్లు


  • 04/06/2012
TAGS:
గుంటూరు, జూన్ 3: కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న సిబిఐకు పచ్చ కామెర్ల రోగం పట్టుకుందని, అందుకే జగన్‌పై లేనిపోని ఆరోపణలతో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం రాత్రి వేలాది ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ ఉద్వేగంగా మాట్లాడారు. జగన్‌కు వైఎస్ సిఎం కాకముందే ఆస్తులు ఉన్నాయని స్పష్టం చేశారు. కర్ణాటకలో సండూర్ పవర్, ఆంధ్రలోని కరీంనగర్‌లో సర్వసతీ పవర్ వంటివి అంతకు ముందే జగన్‌కు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే విచారణ చేయటంలో తప్పులేదని, అయితే సిబిఐ విచారణ చేస్తున్న తీరే అడ్డగోలుగా ఉందని ఆమె దుయ్యబట్టారు. బోఫోర్స్ కేసులో రాజీవ్‌గాంధీ అవినీతి సిబిఐకి కనిపించలేదా? ఓక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ అవినీతి సిబిఐకి కనిపించలేదా? హైదరాబాద్‌లో భూముల క్రమబద్ధీకరణ విషయంలో ఎసిబి నివేదిక ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అవినీతి కనిపించలేదా? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ అవినీతి కనిపించలేదా అంటూ విజయమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అమలు చేయడం ఇదేం న్యాయమని సిబిఐని సూటి ప్రశ్నలు వేశారు. పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న సిబిఐ తమ బిడ్డకు న్యాయం చేయకపోవడంతో ప్రజాకోర్టుకు వచ్చామని విజయమ్మ అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలలే కనుక నా బిడ్డకు మీరే న్యాయం చేయాలని విజయమ్మ వేడుకున్నారు. మేమే వైఎస్‌ను చంపామని ఒక పెద్దాయన దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నాడని విజయమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఏనాడూ ఇల్లు వదిలి బయటకు రాలేదని, జగన్ జైలులో ఉన్నాడు కాబట్టే ఈనాడు మీ ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. జగన్‌కు నిజంగా అధికార కాంక్ష ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు సంతాకాలు పెట్టిననాడే సిఎం అయ్యేవాడని, కాని అధిష్టానం అదేశాలకు కట్టుబడి రోశయ్యను సిఎంగా ప్రతిపాదించారని అన్నారు. అంతకు ముందు జగన్ సోదరి షర్మిళ మాట్లాడుతూ జగన్‌ను సిఎం చేయడం ద్వారానే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని అన్నారు. జగన్ నిర్దోషి అని నమ్మితే ఈ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న 18 అసెంబ్లీ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందని, తెలుగువారి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలయజేయాలని, రాజన్న తమ గుండెల్లో ఉన్నాడని నిరూపించాలని ఆమె పిలుపునిచ్చారు. అధికార దాహంతో మేమే నాన్నను చంపామని కొందరు కాంగ్రెస్ నాయకులు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కుళ్ళు, కుట్రలతో కూడిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలని, విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని షర్మిళ పిలుపునిచ్చారు.
విజయమ్మ సభలకు విరగబడిన జనం
* వెల్దుర్తి, ప్రత్తిపాడుల్లో ఇసకేస్తే రాలనంత..!
గుంటూరు, జూన్ 3: జిల్లాలోని మాచర్ల, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆదివారం విచ్చేసిన వైఎస్ విజయమ్మ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. 47 డిగ్రీల మండుటెండలో వేసవి వడగాల్పుల మధ్య మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని వెల్దుర్తిలో ఓపెన్‌టాప్ వాహనంపై నుంచి ప్రసంగించిన విజయమ్మ సభకు జనం వెల్లువెత్తారు. పల్నాడు ప్రజల స్పందన చూసి విజయమ్మ, ఆమె కుమార్తె మంత్రముగ్ధులయ్యారు. దారి పొడవునా విజయమ్మకు జనం హారతులు పడుతూ నీరాజనాలర్పించారు. విజయమ్మ, షర్మిల ప్రసంగిస్తున్నంతసేపు కేరింతలు కొడుతూ తమ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతానికి ప్రత్తిపాడు చేరుకున్న విజయమ్మ సభకు కూడా పెద్దఎత్తున జనం నలుమూలల నుండి విచ్చేశారు. సాయంత్రం 5 గంటల నుంచే ప్రత్తిపాడు సెంటర్‌లో నలుమూలల నుంచి విచ్చేసిన జనం విజయమ్మ కోసం వేచిచూశారు. సుమారు కిలోమీటరు పొడవున ఆమె సభకు జనం హాజరై ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. విజయమ్మ సభలకు జనం నుంచి లభించిన భారీ స్పందనతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
మూడంచెల బందోబస్తు మధ్య
ఉప ఎన్నికల నిర్వహణ
మాచర్ల, జూన్ 3: మూడంచెల బందోబస్తు మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విష్ణు తెలిపారు. ఆదివారం స్థానిక పురపాలక సంఘ కౌన్సిల్ హాలులో నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ల సమీక్ష సమావేశంలో పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలలోకి జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఖర్చుల నియంత్రణ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్, అభ్యర్థి, ఎలక్షన్ ఏజంట్, పోలింగ్ ఏజంట్, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వ్యక్తులను క్యూలైన్ల వరకు మాత్రమే ఫోటోలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పోలింగ్ రోజున ఇవియంలు మొరాయిస్తే 2 గంటల్లోగా మరొకటి ఏర్పాటు చేయాలని, లేకుంటే రీపోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నిక గురించి ఎటువంటి అభ్యంతరాలైనా వస్తే వాటిపై ప్రొసీడింగ్ అధికారులదే పూర్తి బాధ్యత అని అన్నారు. వరుసగా 10 వేలిముద్రలను అబ్జర్వర్లు పరిశీలిస్తారని, వాటిలో తేడా ఉంటే పోలింగ్ బూత్‌లో పనిచేసే అధికారులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రొసీడింగ్ డైరీని అధికారులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో అరుణ్‌బాబు మాచర్ల మండల పరిధిలోని బూత్‌లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
శివాపురంలో ఘోర అగ్నిప్రమాదం
వినుకొండ, జూన్ 3: మండలంలోని శివాపురంలో ఆదివారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు కోటి 50 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగింది. గ్రామానికి చెందిన రైతు దిబ్బను ఏర్పాటు చేసుకునేందుకు చుట్టూ ఉన్న పిచ్చి ముళ్ళకంపను తగలబెట్టాడు. వడగాడ్పులకు నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో వ్యవసాయ సామాగ్రి బుగ్గిపాలయ్యాయి. వడగాలులకు నిప్పరవ్వలు ఎగిసిపడి సమీపంలో ఉన్న పూరిగుడిసెలకు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదంలో ఆరు పూరి గుడిసెలు, 53 వరి గడ్డివాములు, 62 పొగాకు ఆరవేసే కొష్టాలు, 11 టైరుబండ్లు, 450 పైపులు, మూడు వ్యవసాయ అయిల్ ఇంజన్లు, నాలుగు విద్యుత్ మోటార్లు, 63 స్పింక్లర్లు, పొగాకు మిషన్, మొక్కజొన్న మిషన్ అగ్ని ప్రమాదంలో (మిగతా 10లో)
కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో 50 క్వింటాళ్ళ మిర్చి, పూరి గుడిసెల్లోని వస్తు, వంట సామాగ్రి అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న వినుకొండ తహశీల్దార్ శింగంశెట్టి వెంకయ్య, ఆర్‌ఐ డానియేలు, విఆర్‌ఓలతో కలిసి సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. చిలకలూరిపేట, యర్రగొండపాలెం, దోర్నాలకు చెందిన అగ్నిమాపక శకటాలను రప్పించి, మంటలను అదుపు చేసేలోపే పూర్తి వస్తు సామాగ్రి కాలిబూదడియ్యాయి. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ సేవా సంస్థలైన శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్, రాజీవ్ ఫౌండేషన్, జనని ఫౌండేషన్, డాక్టర్ నన్నపనేని సుధకు చెందిన వాటర్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, ములకా రామతులసిరెడ్డి, నెల్లూరి ఆంజనేయులు తదితరులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మక్కెన మల్లిఖార్జునరావు మాట్లాడుతూ అన్ని విధాలా ఆదుకుంటామని అగ్ని బాధితులను ఓదార్చారు. అగ్ని ప్రమాదంలో బండ్ల ఆంజనేయులు, బండ్ల నాగయ్య, మేక పాపారావు, చప్పినేని శ్రీనివాసరావు, కాటూరి శ్రీను, కాటూరి నరసింహారావుకు చెందిన ఆరు పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ ప్రమాదంలో నగదుతోపాటు, బంగారు అభరణాలు, ఇంటి సామాగ్రి, వంట సామాగ్రి బుగ్గిపాలు కావడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. తహశీల్దార్ ఎస్ వెంకయ్య బాధితులకు తక్షణ సాయం కింద ఒక్కొక్క కుటుంబానికి 20 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, నష్టపరిహారం కింద ఐదు వేల రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
నీచ రాజకీయాలు పోవాలంటే జగనన్న సిఎం కావాలి
మాచర్ల, జూన్ 3: కాంగ్రెస్, టిడిపిలు చేస్తున్న నీచ రాజకీయాలు పోవాలంటే జగనన్న సిఎం కావలని జగన్ సోదరి షర్మిల అన్నారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్డుషోలో తల్లి విజయమ్మతో పాటు ఆమె పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఆసాంతం వైఎస్‌ను అనుకరిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపిలు వైఎస్ కుటుంబానికి చేస్తున్న అవమానాన్ని తెలిపేందుకే మీ ముందుకు వచ్చామని అన్నారు. తమ కుటుంబాన్ని ఏడ్పించి కాంగ్రెస్, టిడిపిలు నవ్వుకుంటున్నాయని ఆమె అన్నారు. రాజన్న మనసు గురించి మీకు తెలుసని, ఆయన మనసులో నుండి పుట్టిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక పథకాలను మీరు రుచి చూశారని, ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ ఫైలుపై సంతకం పెట్టినా తన తండ్రి పేద ప్రజల మేలుకోరే ఆలోచనలే చేసేవాడని అన్నారు. జగనన్న ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారని, మీ దగ్గర ఏ ఆధారం ఉందని సిబిఐని ప్రశ్నించింది. ఇన్నాళు ఏ ఒక్క సాక్షినైనా జగన్ ప్రభావితం చేశాడా, పార్టీ అధ్యక్షుడిగా ఉండటమే అరెస్టుకు కారణమా అంటూ ప్రశ్నించారు. సిబిఐని కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని, వారు ఆడుతున్నారని ఆరోపించింది. విలువలకు, విశ్వసనీయతకు నిలబడే నాయకుడు మనకు కావాలి, అలాగే నీతి నిజాయితీకి నిలబడే నాయకున్ని గెలిపించుకుందాం అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఉప ఎన్నికలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని, ఉప ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ సీపీ భవిష్యత్ ఏమిటని, అలాగే జగన్ బతకనిస్తారా లేదా అంటూ ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తే జగనన్న నిర్దోషి అని దేశానికి తెలుస్తుందన్నారు. ఈ రోడ్‌షో కార్యక్రమంలో అభ్యర్థి పినె్నల్లి రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, జంగా కృష్ణమూర్తి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు నలుగురి మృతి
ఫిరంగిపురం, జూన్ 3: జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆదివారం వాడగాడ్పలకు నలుగురు మృతి చెందారు. ఫిరంగిపురం విజ్ఞానపురానికి చెందిన గుంటి చిన్ను (70) శనివారం వడదెబ్బకు గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మేడికొండూరులో...
మేడికొండూరు: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మరిమాల మహాలక్ష్మి (65) శనివారం రాత్రి వడదెబ్బకు గురై మృతి చెందింది. మహాలక్ష్మి గత వారం రోజుల నుండి ఎండ తీవ్రతకు తట్టుకోలేక మంచంపట్టింది. గత రెండు రోజుల నుండి వీస్తున్న వడగాల్పులు అధికం కావడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
నకరికల్లులో...
నకరికల్లు: వడదెబ్బకు గురై వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన నకరికల్లులో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇర్ల వీరయ్య (60) అనే వృద్ధుడు వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందాడు. ఇటీవల ఎండ వేడిమి విపరీతంగా ఉండటంతో తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బొల్లాపల్లిలో...
బొల్లాపల్లి: మండలంలో వడదెబ్బకు ఒకరు మృతి చెందిన సంఘటన రావులాపురంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన మద్దికర వెంకటరెడ్డి (38) రేషన్‌షాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు.
రెండు రోజులుగా వేసవి తాపానికి తీవ్ర అస్వస్థతకు గురై అతిసార వ్యాధి బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆదివారం వెంకటరెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటరెడ్డికి భార్య శివరాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలి
రెంటచింతల, జూన్ 3: మండలంలోని సమస్యాత్మకమైన తుమృకోట, మంచికల్లు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉప ఎన్నికల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషలాఫీసర్ రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విష్ణు మాట్లాడుతూ గతంలో ఈ రెండు గ్రామాల్లో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మంచికల్లు, తుమృకోట గ్రామాల్లో ఉన్న పరిస్థితులను అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నివేదిక అందజేయాలన్నారు. పోలింగ్ బూత్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడగాలన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా పనిచేయాలన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద వీడియో కెమేరాలను ఏర్పాటు చేశామన్నారు. జోనల్, రూట్ , బూత్ లెవెల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఆర్డీవో పి అరుణ్‌బాబు, ఎండివో కృష్ణకుమారి, డెప్యూటీ తహశీల్దార్ విశే్వశ్వరరావు, హౌసింగ్ ఎఇ రాంబాబు, విఆర్‌ఓ ఆర్‌విఆర్‌వి ప్రసాదరావు, బాలయ్య, ముక్కంటి, వెంకటరామిరెడ్డి, మల్లిఖార్జునరావుతదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ప్రపంచ ‘మహాయోగి’ చంద్రశేఖరేంద్ర సరస్వతి
గుంటూరు , జూన్ 3: నడిచే దేవుడిగా ప్రసిద్ధిచెంది, కాలి నడకన ఆసేతు హిమాచలం పర్యంతం పర్యటించి సమాజంలో భక్తి చైతన్యాన్ని కల్గజేసిన కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఆధ్యాత్మిక ప్రపంచ మహాయోగి అని ప్రసిద్ధ వేద పండితులు బ్రహ్మశ్రీ దెందుకూరి చంద్రశేఖర వాజ్‌పాయ్ యాజులు, శ్రీరామ చంద్రయాజులు, బాల సుబ్రహ్మణ్యం దీక్షితులు కీర్తించారు. నగరంలోని బృందావన గార్డెన్స్ అన్నమయ్య పార్కులో రూపుదిద్దుకున్న ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో కంచిపీఠాధిపతిగా నిరుపమానమైన సేవలందించి, వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి 119వ జయంతిని భక్తిశ్రద్ధలతో జన చైతన్య సంస్థల అధినేత మాదల సుధాకర్, సువర్ణలక్ష్మిల సహకారంతో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సత్సంఘ గోష్టిలో చంద్రశేఖర వాజ్‌పాయ్, ఇతర వేద పండితులు ప్రసంగిస్తూ కంచి పరమాచార్య సాక్షాత్ అపరశంకరులని పేర్కొన్నారు. స్వామి నడయాడిన అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమై జనావళికి, యావత్ దేశానికి ఎంతో మేలు చేకూరిందని గుర్త చేశారు. ఈ సందర్భంగా 12 మంది వేద పండితులు ప్రభాత వేళ నుంచి మధ్యాహ్నం వరకూ శివ ప్రస్తుతి చేస్తూ పరమాచార్యను స్మరిస్తూ రుద్ర పారాయణ చేశారు. రుత్విక్కులంతా ప్రపంచ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు లభించాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ కన్వీనర్ బొల్లేపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి లలితాంబ, కంచిపీఠ గుంటూరు ప్రతినిధి కంభంపాటి నాగేశ్వరరావు, తంగిరాల శ్రీనివాసరావు, కంచిపీఠం సభ్యుడు కె రామారావు, జగన చైతన్య సుధాకర్ కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ జయంతిలో భాగంగా అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి నమక చమకాలను పటిస్తూ రుత్విక్కులు రుద్రాభిషేకం చేశారు.
నిమ్మ రైతు మోములో ’్ధర‘హాసం
తెనాలి, జూన్ 3: తెనాలి పరిసర ప్రాంత గ్రామాల్లో అనాదిగా నిమ్మ సాగుకు గుర్తింపు ఉంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు సీజన్‌లో నిమ్మకాయల విక్రయాల కోసం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల కమిషన్ దుకాణాలకు తెచ్చి మార్కెట్ రేటు ప్రకారం విక్రయాలు చేసి వెళుతుంటారు.
వేసవి సీజన్‌లో నిమ్మకాయలకు ఉన్న గిరాకీ, గూడూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేక, సకాలంలో నీరు అందని పరిస్థితుల్లో నిమ్మ సాగులో అక్కడి రైతులు వెనకబడ్డారు. ఈ ప్రాంత చుట్టుప్రక్కల గ్రామాల తోటల్లో నిమ్మసాకు దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా లేకున్నా, ప్రస్తుతం నిమ్మకాయలకు ఉన్న డిమాండ్ క్రమంలో ఎకరా నిమ్మతోట ఉన్న రైతు కూడా సాదాసీదా కాపు కాసిన తోట నుండి కూడా లక్ష రూపాయల వరకు ఆదాయం సంపాదించుకుంటున్నాడు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల హోల్‌సేల్ వ్యాపారులు రైతుల నుండి కొనుగోలు చేసిన నిమ్మకాయలు సుదూర ప్రాంతాలైన ఢిల్లీ, కాశి, నాసిక్, కోల్‌కత్తా ప్రాంత్రాలకు, ఈ మధ్యలో ఉండే అనేక ముఖ్య పట్టణాలకు వారికి వచ్చే ఆర్డర్లు బట్టి ఈ సీజన్‌లో సాలుసరిన రోజుకు 8 నుండి 10, 12 టైర్ల లారీల నిమ్మలోడులు ఎగుమతులు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పంట దిగుబడి తక్కువగా ఉన్నా వేసవి సీజన్ డిమాండ్‌ను బట్టి టిక్కి మంచి నాణ్యమైన కాయలు 1700 నుండి 2 వేల వరకు పలుకుతుంది. మీడియం సైజు కాయలు 1200 నుండి 1400 వరకు ధర పలుకుతుండటంతో రైతుల మోములో ఆనందం తొంగి చూస్తోంది. గత 10 సంవత్సరాల కాలంలో ప్రస్తుతం ఉన్న ధరలు ఎన్నడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా నిమ్మ సాగు చేస్తున్న రైతులకు సానుకూల పరిస్థితులే ఉన్నాయని, అంతకుముందు ధర లేక, కోత కూలి కూడా రాక అనేక ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. కాగా ఎకరా నిమ్మసాగుకు సంవత్సరానికి 30 వేల వరకు ఎరువులు, ఇతర ఖర్చులు ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఒకసారి నిమ్మ మొక్క నాటాక, 25 సంవత్సరాల వరకు ఫలసాయం వస్తుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రైతు సాగు భూమినే నమ్ముకుంటాడని, అలాగే నిమ్మ సాగులో ఒకనాడు నష్టాలు చూశామని ప్రస్తుతం ఆశాజనకంగానే ఉందని, ఏదేమైనా గాలి పాటు విధానంగా రైతుల పరిస్థితి ఉందనే భావన రైతుల నుండి వ్యక్తమవుతోంది. కాగా మార్కెట్ యార్డులో నిమ్మ వ్యాపారాలు చేసే హోల్ సేల్ షాపులు 10 వరకు ఉన్నాయి. సీజన్ కావడం, మంచి ధర పలుకుతుండటంతో దూర ప్రాంతాల నుండి కూడా నిమ్మకాయలు తెనాలి మార్కెట్‌కు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం తెనాలి చుట్టుపక్కల గల మూలుపూరు, చంపాడు, జంపని, పెరవలిపాలెం, చుండూరు, ఎడ్లపల్లి, జాగర్లమూడి, చిలువూరు, మోరంపూడి, చిన వడ్లపూడి ప్రాంతాల నుండి నిమ్మసాగు చేస్తున్న రైతులు తమ పంటను తెనాలి మార్కెట్‌కు తెస్తున్నట్లు గుమ్మడి రమేష్ అనే వ్యాపారి వివరించారు. మొత్తానికి వేసవి తీవ్రత కారణంగా మంచి గిరాకీ ఏర్పడటం, డిమాండ్‌కు తగిన విధంగా కొన్ని ప్రాంతాల్లో సాగు సరిగా లేని కారణంగా ఈ ప్రాంతంలో నిమ్మ రైతులకు ఆశించిన దానికంటే అధిక ధరలు పలుకుతున్నాయి.






ఈ వ్యాసము యొక్క శాస్త్రీయతను నిర్ధారించి ఈ మూసను తొలగించండి.
పచ్చకామెర్లు, జాండీస్
వర్గీకరణ & బయటి వనరులు
Jaundice eye.jpg
హెపటైటిస్ ఏ వలన పచ్చబడిన చర్మము మరియు కనుగుడ్లు
ICD-10 R17.
ICD-9 782.4
DiseasesDB 7038
MedlinePlus 003243
MeSH D007565
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు మరియు మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ[1] కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి.[2]జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.

లక్షణాలు మరియు నిర్ధారణ

  • కళ్ళు తెల్ల గుడ్డు పచ్చగా , నీరుడు మూత్రం ఎర్రగా, ఆకుపచ్చగా రంగులో ఉంటే అది అసలైన లివర్ కాలేయం పచ్చ కామెర్లు.
  • కళ్ళు పచ్చగా ఉండి నీరుడు మూత్రం తెల్లగా ఉంటే అది మలేరియాలో రక్తం విరిగి కావచ్చు.
  • కళ్ళు మూత్రం పచ్చగా ఉండి, కుడి వైపు డొక్కలో శూల పోటు వస్తుంటే అది పైత్యకోశ రాళ్ళు గురించి పరీక్ష చూడవలెను.
  • ఎన్ని పరీక్షలకు దొరక్క పోతే అది రాచపుండు కేన్సర్ కావచ్చా?
  • అల్ట్రాసౌండ్ స్కాన్, మామూలు ఎక్స్-రేల్లో రాళ్ళు తెలుస్తాయ
  • ఎండోస్కోప్ /లాపరోస్కోపుల్లో కొన్ని కేన్సర్లు దొరకవచ్చు.
పచ్ఛ కామెర్లు వస్తే రోజు స్వచ్ఛమైన ఈత కల్లు తాగాలి.

చికిత్స

వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి. ఎక్కువ తింటే మెదడుకు ఎక్కగలదు. మలేరియాకు క్లోరోక్విన్ పూర్తి కోర్సు 10 బిళ్ళలు రెండున్నర రోజులపాటు భోజనం తరువాత వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఖరీదైన మందులు ఇంజక్షన్లు అక్కర్లేదు. వైరస్ జాండిస్ ఉన్నవారికి చేసిన ఇంజక్షన్ సూదులు మళ్ళీ వాడవలసి వస్తే ఎక్కువ మరిగించవలెను.

మూలాలు

  1. Guyton, A and Hall, J, "Textbook of Medical Physiology", 11th Ed., Elsevier, 2006
  2. Guyton, A and Hall, J, "Textbook of Medical Physiology", 11th Ed., Elsevier, 2006

Your
Chakradhar,

Wednesday, 10 April 2013

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...