Monday, 23 April 2018

భక్తులు అనుబంధము

మరొక అనుభవం మీతో పంచు పంచుకుంటున్నానందుకు చాలా హ్యాపీ గ ఉంది . మా అక్క కి రెండూ కాళ్ళు లేదు .తనకి పెళ్ళీ అంటే ఇష్టం . బాబూజీ లెటర్ రాసినది .ఆ అబ్బాయి వచ్చి ఇష్టపడి పెళ్ళీ చేసుకున్నారు .వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు నీకు ఇంకొక పెళ్ళీ చేస్తాను అన్నది .ఎందుకంటే మా అక్కకి పూర్తిగా రెండూ కాళ్లు లేవు .మా భాదతో బాబూజీ కి లెటర్ రాసింది .ఎన్నో డాక్టర్స్ దగ్గరకు వెళ్ళింది వెల్లూరు కి వెళ్ళింది నరకం ఆ టెస్ట్ లో చేస్తారు అంతటా బాధ అనుభవించింది .డాక్టర్స్ ఏమి చెప్పలేదు .బాబూజీ ఏడుస్తూ లెటర్ రాసినది .బాబూజీ లీల తాను కడుపుతో ఉన్నదీ .హ్యాపీ గ ఉన్నాము .కానీ తనకి కాళ్లు లేవు ఆ బిడ్డని ఎలా మోస్తుంది అని భయం వేసింది 5 మంత్స్ లో చాల భయం వేసింది .హాస్పిటల్ అడ్మిట్ చేసాం .తరువాత 9 మంత్స్ అడ్మిట్ చేసాం అక్కకి మత్తు బాడీ ఫుల్ గ ఇవ్వాలి చెప్పలేము అన్నారు .మేము ఆ సాయిబాబా నే నమ్మకం .ఆశ్చ్యరంగా సిస్టర్ బాబు ని తీసుకోని నాకు ఇచ్చింది .మాకు బాబూజీ పిలిచాం .కానీ నాన్నకి వేరే నామ పెట్టాలని ఉందిగా బాబుకి లెటర్ స్ అని వచ్చింది అందరికి ఆనందం .మాకు శరత్ బాబు .ఆ బాబు సాయిబాబా నామం వింటేనే నిదుర పోతాడు .నామం అంటే బలే ఇష్టం. ఇది మా అనుభవం వచ్చారు

నా అనుభవాన్ని మీతో పంచుకోంటున్నాను బాబుజీ నా చేతా రమణా మహార్షి బుక్స్ చదివిపిస్తునారు ఒక రోజు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అనుకున్నాను మా వారిని అడిగాను లీవ్ లెదు అన్నారు . కాని ఎదో ప్రేరణా వెళ్లాలి .అనుకోకుండా లీవ్ ఇచ్చారు రా పోదాం ఆన్నారు కాని పాప ని ఎవరు చూసుకుంటారు .మా అమ్మ కాశీ వెళ్లునన్నారు మా అక్కని అడిగాను మా అక్కకి రెండు కాళ్ళు లేవు .నేను అడిగాను తాను చేసుకోలేను చెప్పింది ఐనా సరేలే చూసుకుంటాను అన్నది .కానీ నా మనసు లో టెన్షన్ గ ఉన్నింది .ఆ నైట్ అంత నిదురపోలేదు .నాకు ధ్యానం చేస్తాను .ఆ 2.30am నిదుర రాలేదు కాని ధ్యానం లో మా ఇల్లు మెద్దిపైన కింద సాయిపథం చెక్క కూర్చి అది కింద ఉనింది .నేను కిందకి వెళ్ళాను బాబుజీ 6guru బంధువులు ఉన్నారు .కానీ నాకు బాబుజీ కనపడం లెదు .నేను ఇంటికి రండి బాబుజీ అని పిలిచాను .ఉన్నిల్ రా అన్నారు. తరువాత అందరూ జరిగారు .అప్పుడు చూసాను మా పాపని బాబుజీ గుండెకి పెట్టుకొని ఉన్నారు. చాల ఆనందం వేసింది . గిరిప్రదక్షిణం ఆనందం చేసుకున్నాము. అప్పుడే తెలిసింది ఒక్క రోజు గిరిప్రదఃక్షిణం చేసినందుకు ఇంతగా చేసుకొన్న బాబుజీ జీవితం అనే గిరిప్రదక్షిణం నాన్ని చూసుకుంటారు అనిపించింది. ఇపుడు నేను డబ్బు తాకను ఏ షాపింగ్ కి వెళ్ళాను దేని గురించి ఆలోచించడం లెదు .గోల్డ్ ఎక్కువ వేసుకోను తెల్ల డ్రెస్ వేసుకుంటాను .మీరు అనుకుంటానన్నారు నేను ఇల్లుని చూసుకోలేదేమో అనుకుంటున్నారా .లేదు నన్ను మీకు ఆలా అనిపించదు .నేను చాల జోక్ గ ఉంటాను .పిల్లలతో ఎంజాయ్ చేస్తాను .కానీ నా లోని ఆ ఆవేదన 24hours ఉంటుంది .మా పాపకి అన్నం తినిపించేటపుడు ధ్యానం లో కి వెళ్ళ్తాను 20seconds వెళ్తుంటాను .ఇది నా అనుభవం .ఏమైనా తప్పు గా రాసివుంటే మన్నించండి .

పల్లవి:
బాబా! సాయిబాబా సాయిబాబా!
నిన్ను కీర్తించుట నా తరమా, వెన్నెల్లో వెలుగువై ఉన్న నీ మోము !
ఏమని వర్ణించగలను! బాబా...బాబా!
!!బాబా!!
చరణం:
నీ నీడలో పడివున్న మేము, ఎందుకు ఇలా మారిపోతున్నాము!
నీవు మా గుండెల్లో ఉన్నావని తెలిసే రోజు ,
కలిసే రోజు ఎప్పుడయ్యా ! ఇంకెప్పుడయ్యా!!
!!బాబా!!
చరణం:
తప్పులు చేయడం మా నైజం, క్షమించుట నీ చల్లని మనస్సు! నన్ను ఎప్పుడు బంధాలనుంచి విడిపించదవయ్య బాబా !!సాయిబాబా !సాయిబాబా !

ఈ అనుభవం సాయిబాబా లీలా విశేషం .మీతో పంచుకుంటునందుకు చాల ఆనందం గా ఉంది .ఈ లీలా 7 ఇయర్స్ ముందు జరిగింది .నేను అపట్లో సాయిబాబాకి మార్నింగ్ రాత్రి హారతి పాడుతాను .బాబా జీవిత చరిత్ర చదువుతాను .ఒక రోజు బాబా బుక్ లో నానా ఛన్దోకర్ కి బాబా కలలో కనపడి ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని రాసివుంది .నేను అది బాబా మా ఇంటికి కూడా భోజనానికి వస్తే బాగుంటుంది అనుకున్నాను .మరుసటి రోజు అన్ని రకాల వంటలు చేసి ఏదురుచూస్తూనన్ను .12 పీఎం ఇయ్యింది ఇంకా ఎవ్వరు కనపడలేదు అంటే బాబా ఏ రూపం లో వస్తారో తెలియదు కదా 1. 30 పీఎం ఇయ్యింది .నాకు చాల భాధ వేసింది .నేను తినలేదు ఇంటిలోకి వెళ్ళాను .అప్పుడు ఒక కాకి గట్టిగ అరిచింది .కాకి ఆలా అరవడం మొదటి సారీ విన్నాను .బయటకి వెళ్లి చూసాను .సరే నేను వండిన అన్నింటిని ఒక ప్లేట్ వేసి తీసుకెళ్ళాను .మాములుగా కాకి ఎవరైనా వస్తే ఎగిరిపోతుంది .కానీ ఈ కాకి నేను ఆ పేటేంతవరకు అక్కడే ఉన్నదీ అస్సలు కదలలేదు .న ముందరే అన్ని తిన్నది .10 సెకండ్స్ అలె ఉన్నదీ నాకు షాక్ ఇయ్యను తరువాత వెళ్ళింది .ఆ అనుభవం ఎప్పటికి మర్చిపోలేను .అప్పుడప్పుడు ఆ కాకి వచ్చి అరుస్తుంది .నేను దానికి పెట్టాకే నేను తింటాను .మేము వేరే ఇల్లు మారాము .నాకు పెట్టాకే తినేది అలవాటు ఇక్కడ ఒక కుక్క ఉంది .దానికి పెట్టాకే నేను తినేది . బాబా లీలలు అనంతాలు ఇది న అనుభవం .

పల్లవి:
ఎ౦తపని చేశావయ్య సాయిబాబా !
నిను వదలలేక ఉన్నామయ్యా సాయిబాబా!
మీలాగా నన్ను కాపాదెవరయ్యా,మి వలె నన్ను దీవి౦చు వారు ఎవరయ్యా...
చరణ౦:
ఏనాటి బ౦ధమై నీ ఒడిలో చేరాము,
ఈ జగత్తు వ్యామైహంలో పడి కొట్టుకుంటున్నా
నాకు ఆధారం నీవే సాయి ,నా ఆవేదన తీర్చేది నీవే సాయి,
సాయి,సాయి..... "సాయిబాబా "
చరణం:
ఎన్నెన్నో దేవతల రూపాలున్నా..
సాయిరూపం ఒకటే అన్నా...
భక్తులకు అభయమిచ్చే దేవుడవయ్యా,ఆపద్బాందవుడవయ్యా
పరమాత్ముడవయ్యా....పరమాత్ముడవయ్యా.....
"సాయిబాబా"

భగవాన్ రమణా మహార్షి గారూ నాకు ఇచ్చిన అనుభవాన్ని మీతో పంచు కొంటున్నందుకూ నాకు చాలా సంతోషం గ ఉన్నది .చాల అనుభవాలని అనుభూతులని ఇచ్చారు .ఒక రోజు నాకు ధ్యానం లో భగవాన్ చుసినట్టున్నది .ఒక రోజు ధ్యానం లో నేను భగవాన్ దగ్గరికి వచ్చి మీరు నన్ను మీ బిడ్డగా ఒప్పుకోవాలి అన్నాను. భగవాన్ పలుకలేదు సరే అని నేను అరుణాచల గోపురం మీదకి ఎక్కి మారం చేశాను .భగవాన్ వచ్చి నువ్వు న బిడ్డవే ర దిగు అన్నారు. అక్కడ ఉన్న శిష్యులతో బిడ్డని దింపండి అని అన్నారు .ఆ ధ్యానం లో న వయసు 10years చాలా ఆనందం గ ఉన్నది .ఇప్పకిటి తలుచుకున్న నాకు కన్నీళ్లు ఆగవు .భగవాన్ నాకు ఎదో మాట్లాడినట్లు ఉంటుంది .రమణ లేఖలు 3times చదివాను ఈ బుక్ కోసం 3years వేదికను డబ్బు ఉంటె బుక్ ఉండదు .బుక్ ఉంటె డబ్బు ఉండదు .నాకు ఇంతటి అనుభవాన్ని ఇచ్చిన భగవాన్ కి న సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను .రమణ లీల 2times రమణా విశిష్టిత చదివాను కాదు కాదు చదివించారు భగవాన్. మహాత్ముల బుక్ చదవాలంటే వారే వచ్చి వారే చూపు మనపై ప్రసరింపచేసి వారే కూర్చుని చదివిస్తారు అంటారు .అలానే ఇది (నేను ) చదవడానికి భగవాన్ వచ్చి చదివించిననంటుంది .

Sunday, 22 April 2018

*కిట్టయ్య సలహాలు

గోపిక: నేను గతం లో చాలా పుస్తకాలు చదివేదాన్ని ,పది నిమిషాల్లో సంకల్పం(ప్రనాళిక)
చేసుకుని మంచి మంచి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళేదాన్ని,కానీ ఇప్పుడు అలా జరుగుట లేదు,ఎందుకు?

కిట్టయ్య: రాధా బరువు ఎంతున్నావ్?

గోపిక: 70 kg.ఉన్నాను కిట్టయ్యా !

కిట్టయ్య: 10 kg తగ్గాలి రాధా

గోపిక:ఎందుకు కిట్టయ్య ?

కిట్టయ్య: శరీరంలో నీరెక్కువ ఉంటే మెదడు చురుగ్గా పనిచేయలేదు .

గోపిక: అవును మీరు చెప్పినది నిజమే కిట్టయ్యా!నేను  అప్పట్లో 63 kg ఉన్నాను అందుకే అప్పట్లో అంత చురుగ్గా ఉన్నాను,ఇప్పుడు అంత చురుగ్గా లేను.

కిట్టయ్య :  See whose thoughts they are. They will vanish. They have their root in the single ' I ' thought, hold it and they will disappear.
గోపన్న : మనం ఎలా చూస్తాము ?
కిట్టయ్య : మౌనంగా.
గోపన్న : ఎప్పుడూనా ?
కిట్టయ్య : అవును.
గోపన్న : మౌనంగా అంటే మాట్లాడకపోవడమా ?
కిట్టయ్య : కాదు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా ఆలోచన లేని స్థితి.
గోపన్న : ప్రతిక్షణంలో ఉండటం ఎలా ?
కిట్టయ్య : అలానే
గోపన్న : వర్తమానంలో ఉంటూ ?
కిట్టయ్య : అవును.
గోపన్న : ప్రస్తుత క్షణంలో ఉండటం ద్వారా ఏమవుతుంది ?
కిట్టయ్య : ఉండి చూడు నీకే తెలుస్తుంది.
గోపన్న : అలాగే.
గోపన్న : నేను ప్రస్తుత క్షణంలో ఉండటానికి అభ్యాసం చేస్తూ ఉన్నాను.
కిట్టయ్య : మంచిది.
గోపన్న : కానీ కొన్నిసార్లు మళ్లీ జారిపోతూ ఉంటాను.
కిట్టయ్య : అలాంటప్పుడు ఏదో ఒక నామమో, రూపమో పట్టుకుని ఉంటే సరి.

Sunday, 15 April 2018

*ఆరోగ్యం కోసం సామర్ధ్యాల సద్వినియోగం అత్యవసరం*

ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తెలుసుకోవడం ముఖ్యం౼
• ఆరోగ్యం అంటే ఏమిటి?
• ‎ ఆరోగ్యంగా ఎవరుంటారు?
• ‎ రోగం అంటే ఏమిటి ?
• ‎రోగం ఎందుకు,ఎప్పుడు,ఎవరికి వస్తుంది?

మనం ఇవన్ని కారణాలను తెలుసుకోవడం అత్యవసరం.ఇవి ప్రత్యక్షంగానో,పరోక్షంగానో మన ఆరోగ్యాన్ని పాడుచేయడంలో పలుపంచుకుంటాయి,మన రోగనిరోధక వ్యవస్థను తగ్గిస్తాయి,శరీరం మనసు మరియు ఆత్మ యొక్క వికారాలను పెంచుతాయి,వాటిమధ్య సంతులనాన్ని పాడుచేస్తాయి.

ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కళ, ఒక విజ్ఞానం,ఒక దృష్టి,ఆలోచన మరియు చింతన యొక్క ప్రతిఫలం.
దీనికోసం౼ వివేకపూర్ణమైన జ్ఞానము,తగు విధమగు సాధన,మరియు తగు పురుషార్ధము తప్పనిసరి. యోగ్యమైన వాటితో ౼వీలైనంత అధికముగా ,ప్రాధమికత ననుసరించి ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వికారాలనుండి మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఆరోగ్యవంతమగు జీవితం జీవించగలం .

ఒక ప్రక్క మనం  చికిత్సలు తీసుకుంటూ, ఒక ప్రక్క సంయమనం  లేకుండుట ,ఇంద్రియాలతో ఆశక్తులగుట, మొదలగునవి ఉంటే ఆరోగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?

• జీవితం తో పాటు  మృత్యువు నిశ్చితమై ఉన్నది.జన్మించిన మొదలు ఆయుష్షు రూపంలో శ్వాస అనగా ప్రాణశక్తి భాండారాన్ని((ఖజానాని) తీసుకుని మనం జన్మిస్తాము,అది మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది.జీవనం యొక్క అంతిమ క్షణాల వరుకు ప్రాణశక్తి ప్రవాహాన్ని సంతులనం చేసి నియంత్రించి మరియు సద్వినియోగపరచి మనం శాంతి ,సుఖము,మరియు ఆరోగ్యవంతమైన జీవితం గడపగలము.

అపరాధ విజ్ఞానం (crime science) రకరము ఏ ఇద్దరి వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు.హోమియోపతి యొక్క పరిశోధనలో తేలినదేమంటే మర్రి వృక్షము యొక్క ఒక్కో ఆకులో ఉన్న పోలిక ఆ వృక్షములో ఉన్న ఇతర ఏ ఆకులతోనూ,మరియు ఇతర మర్రి చెట్లతోనూ సరిపోలదు , అలాంటిది మనుషులలో పొలికలెట్లుంటాయి ?

ఇద్దరు వ్యక్తుల శారీరకత మరియు మానసికత దృష్టితో కూడా చాలా భేదములున్నప్పుడు,వారికి చికిత్స ఒకేలా ఎలా సాధ్యం ? ఇప్పుడు విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది డి.ఎన్.ఏ (DNA) విశ్లేషణ  అనుసారం ప్రతి ఒక్క వ్యక్తి చాలా భిన్నంగా ఉంటారని.

భారతీయ ఉపనిషత్తులలో వ్రాసిఉంది ౼ "అన్నాద్భవై ప్రజాయంతే "!
అన్నము వలన  ప్రజ ఉత్పన్నమగును.
"అన్నాహి భూతానాం జ్యేష్టం"  అన్నము ప్రాణుల యొక్క జ్యేష్ఠము,అనగా అన్నము సర్వ ప్రాణుల కన్నా ముందే ఉత్పన్నమయినది.

"తస్మాతే సర్వ ఔశిధ ముచ్యతే"అందులకే అన్నము సర్వ ఔషధము.
మాంసాహారం ఒక భయంకర విషము.

గిరి ప్రదక్షిణలో ౼దేహ ప్రదక్షిణ

• గిరి ప్రదక్షిణ లో తూర్పున ఇంద్రుడు( దేవతలకు అధిపతి),
దేహంలో శరీరానికి ముఖ్యమైన వాయువు  (శరీరానికి అధిపతి ఊపిరి తిత్తులు),

• ఆగ్నేయం ౼ఆగ్ని దేవుడు (ఉష్ణం)
అగ్ని ౼హృదయం నుంచి వెలువడే శక్తి,
గుండె నుంచి ఉద్భవించే ప్రాణశక్తి ,

• దక్షిణం౼యముడు౼(ప్రాణాన్ని అపహరించేవాడు)
జీర్ణశయం౼మనం తిన్న ఆహారం వల్లనే మన ఆరోగ్యం నిర్ణయించబడుతుంది,ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పోతుంది.

• నైరుతి౼ఋతువులతో సంబంధం లేనిది,అన్ని వేళలా ఒకేలా పనిచేస్తాయి
ప్రేగులు .తిన్న ఆహారాన్ని ఋతువులతో సంబంధం లేకుండా శక్తిని గ్రహించగలుగుతాయి .

• పడమర౼వాయువు(వాయు దేవుడు, గాలికి అధిపతి)
దేహంలో౼మలద్వారం.మనం తిన్న ఆహారం నుంచి వెలువడిన వాయువును,మలినాలను బయటకు పంపిస్తుంది.

• వయవ్యం (వరుణుడు)
• ‎శరీరంలో నుంచి వెలువడే వ్యర్ధమైన నీటిని నిలువ చేసి బయటకు పంపిస్తుంది.

• ఉత్తర౼కుబేర .విలువైన దానికి అధిపతి.
• ‎శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేస్తూ శక్తిని,వ్యర్ధాన్ని వేరుచేస్తుంది లివర్.

• ఈశాన్యం౼ఈశ్వరుడు(అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు)
శరీరం అంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి.

Saturday, 7 April 2018

మానవ ఆరోగ్యం

రాతి యుగం నుంచి పాలరాతియుగం వరుకు ఒకేలా చూపిస్తున్నవి వేదాలూ, పురాణాలు.

జరుగుతున్న మంచి౼ చెడులను ఒకేలాగ  చూపిస్తున్నది చరిత్ర.
రాతియుగం నాడు అరణ్యాల్లో వేటాడి జీవనం సాగించాడు మానవుడు. ఆహారం సరిగ్గా అరగక శరీరం అనారోగ్యంపాలు అవుతూ,ఫలాలు,కూరగాయలు దొరక్కా ఎన్నో మార్పులు చేసుకుంటూ, ధాన్యాలను మృదువుగా,మెత్తగా మనకు అనుకూలంగా మార్చుకుని తీసుకునేదే పాలరాతియుగం.

అసలు వేదాలూ, పురాణాలూ,రాసినది సంస్కృతమా? పర్షియన్ భాషా? పర్షియన్ అనగా ఉర్దూలో ఒక భాష. ఆర్యులు రష్యా ఆక్రమించే క్రమంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న మంచిని సంస్కృతంలోకి అనువాదం చేసుకుంటూ వచ్చారు.

తెలుగులో పదాలకే ప్రతిపదార్ధాలు, నానార్ధాలూ అని ఎన్నో ఉన్నాయి.

పాఠశాల అన్నది తెలుగు గ్రంధికం.  ఈ పదం ఎంతమందికి తెలుసు ? బడి అని మామూలు వ్యావహారిక భాష౼ఈ పదం ఎంతమందికి తెలుసు ? ఇటీవల జరిగిన మార్పుల్లోనే స్కూల్,టెక్నోస్కూల్  అని రకరకాలు వాడుకలో ఉన్నాయి.మనం మాట్లాడుతున్న తెలుగులోనే ఎన్నో మార్పులు భాషలో జరుగుతే, రాతియుగంలో జరిగిన సంఘటనలను  వేదాల ద్వారా సంస్కృతంలోకి, అనువాదం జరిగినది.

సంస్కృతం అన్నది చాలా కఠినమైన మరియు సుళువైన భాష.రెండు పేజీల సమాచారాన్ని రెండు శ్లోకాల్లో కూర్చవచ్చు.
అట్టి శ్లోకాల్లో ఒక్కొక్క అక్షరంకి ప్రతి పదార్ధం,నానార్ధం ఉంటాయి.ఏదో చదివామని,ఏదో తెలుసుకున్నామని మిడిమిడి జ్ఞానంతో సంస్కృత శ్లోకాలని తనకు తోచినట్లు అర్ధం చేసుకుని, తనకు నచ్చినట్లు రాసుకుని, అదే జ్ఞానమనుకుని పదిమందికి పంచుతూ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు.

అప్పట్లో సంస్కృతంలో  'గోవు' అనే పదం లేదు. 'కామధేనువు' అంటారు.

ఇటీవల కాలంలో ఉరుకులూ,పరుగుల వల్ల ఆహార నియమాలు మరిచి,సమయంకాని సమయంలో ఆహారంకాని ఆహారాన్ని తింటూ అనారోగ్య పాలవుతూ తన ఆయుష్షును (వయసును) తానే తగ్గించుకుంటున్నారు.

రవణాసురునిలో భక్తినీ చూపించింది,లోపం చూపించింది,రాముడిలోని వ్యక్తిత్వాన్నీ చూపింది, లోపమూ  చూపించింది. సీతలోని గుణం చూపించింది,ఓర్పునూ చూపింది.మండోదరిలో భక్తినీ చూపించింది, సహనం చూపింది,సూర్పణకలో  ఉన్న వ్యామోహాన్నీ చూపింది ,మందరలో ఉన్న చిచ్చుపెట్టే గుణం,కాపురాలను కూల్చే గుణం,స్నేహాన్ని,బంధాలను విడగొట్టే గుణాన్ని చూపించింది, తారలో ఉన్న ప్రేరణను చూపింది, సర్దుబాటు గుణాన్ని చూపించింది.

మంచిని చూపించారు,చెడునూ చూపించేరు,నీకు ఏది మంచిదో ఏది చెడో అది తెలుసు నీకు. మంచిని మాత్రం తీసుకుని ముందుకు వెళితే ఓ మంచి వ్యక్తిగా ఉంటావు .చెడుని తీసుకుని చెడును చూపిస్తూ నీకిష్టం వచ్చినట్లు నువ్వుంటే నీ చుట్టుపక్కల ఉన్నవారికి అనర్ధం ( భార్యా, బిడ్డలు,మిత్రులు,శత్రువులు)
~ ఇట్లు మీ
సత్యాన్వేషి.

మానవ శరీరం ఆరూపమైన సృష్టి, పంచతత్వాలైన  వేడి,నీరు,,భూమి,గాలి,ఆకాశం తో నిర్మించబడినది.మనవదేహంలో ఈ అయిదు పదార్ధాలూ సమానంగా ఉండవలెను  పుట్టిన పసివాడికి ఈ అయిదునూ సమానంగా ఉండుటవలన ప్రశాంతంగా,ఆరోగ్యంగా,ఆనందంగా ఎటువంటి సమస్యా లేకుండా హాయిగా ఉంటాడు,తల్లి పాలద్వారా శరీరాన్ని  దృడంగా చేసుకుని అయిదు పదార్థాలతో దృడంగా ఉంటాడు.

* మానవ శరీరంలో  'అగ్ని'-౼అంటే దేహంలో ఉన్న వెచ్చదనం.

* 'నీరు' అంటే దేహమంతా వ్యాపించి ఉన్న రక్తం.

* 'గాలి ' ౼ శ్వాస ద్వారా వచ్చినది,శ్వాస ద్వారా తీసుకున్నది,దేహములో నవరంధ్రాల ద్వారా  వెళుతున్న గాలి (శ్వాస,మలద్వారం మొ. గు వాటిద్వారా పోయే గాలి.

• 'భూమి'౼అంటే దేహంలో ఉన్న ధృడంగా  ఉన్న అన్ని భాగాలు.
• 'ఆకాశం'౼అంటే దేహంలో ఉన్న గుండె ద్వారా వెలువడుతున్న శక్తి అంత పరిమాణంలో దేహమంతా వ్యాపించి ఉన్న దేహం.

*ఇటీవల కాలంలో ప్రకృతి వైద్యం,ఆయుర్వేదం,ఆలోపతి, ఆక్యుప్రెషర్,వాటర్ ట్రీట్మెంట్ (నీటి ద్వారా చికిత్సలు),అయస్కాంతం ద్వారా చికిత్సలు,యోగా,రకరకాల అద్దతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు.
పసివాడు నేల పైన సమానంగా పడుకుని దేహాన్ని గమనిస్తూ ఆలోచన లేని స్థితిలో(ధ్యానం వల్ల) ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు.

*పంచ పదార్థాలు ఇటీవల కాలంలో విటమిన్లుగా విభజించారు. 1.విటమిన్౼ఎ,2. విటమిన్౼బి,3.విటమిన్ ౼సి,4.విటమిన్౼డి మరియు 5.విటమిన్౼కె గా విభజించారు.
*విటమిన్౼A అనగా ఆక్టివ్ (active) ఉల్లాసంగా ఉన్నవారు ఎక్కువగా A విటమిన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటారు.
*విటమిన్౼B (best) ఉత్తమమైనవి.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి B విటమిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాడు.

*విటమిన్౼c అంటే  (cool) చల్లదనం . దగ్గు ,జలుబు తో  అలర్జీతో అతిగా బాధ పడుతూ ఉంటారు.

*విటమిన్ ౼D అంటే (danger) ప్రమాదం౼ అతిగా  చెమట పట్టడం,మలబద్దకం, అతినిద్ర,వంటి సమస్యలతో బాధ పడుతుంటారు.

*విటమిన్౼k౼(control) నియంత్రణ,శరీర కణాలను అదుపులో ఉంచి నియంత్రిస్తుంది.కాన్సర్ వంటి వాటివల్ల బాధపడతారు.

Friday, 6 April 2018

YouTube Link

కుమారి ఖండం తమిళ భాషలో చాలా రహస్యాలున్నాయి

https://youtu.be/mGJMva-LRV0

https://youtu.be/mXmS4mMUF0A

Tuesday, 3 April 2018

అందమైన స్త్రీ

రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది.....

అందం అంటే కంటికి కనిపించే
ముఖంలోనూ,మేనులో కాదు..

ఉన్నతమైన అలోచనలు
ఉన్నతమైన భావాలు ఉన్న
మంచి మనసులో ఉంటుంది...

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...