ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తెలుసుకోవడం ముఖ్యం౼
• ఆరోగ్యం అంటే ఏమిటి?
• ఆరోగ్యంగా ఎవరుంటారు?
• రోగం అంటే ఏమిటి ?
• రోగం ఎందుకు,ఎప్పుడు,ఎవరికి వస్తుంది?
మనం ఇవన్ని కారణాలను తెలుసుకోవడం అత్యవసరం.ఇవి ప్రత్యక్షంగానో,పరోక్షంగానో మన ఆరోగ్యాన్ని పాడుచేయడంలో పలుపంచుకుంటాయి,మన రోగనిరోధక వ్యవస్థను తగ్గిస్తాయి,శరీరం మనసు మరియు ఆత్మ యొక్క వికారాలను పెంచుతాయి,వాటిమధ్య సంతులనాన్ని పాడుచేస్తాయి.
ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కళ, ఒక విజ్ఞానం,ఒక దృష్టి,ఆలోచన మరియు చింతన యొక్క ప్రతిఫలం.
దీనికోసం౼ వివేకపూర్ణమైన జ్ఞానము,తగు విధమగు సాధన,మరియు తగు పురుషార్ధము తప్పనిసరి. యోగ్యమైన వాటితో ౼వీలైనంత అధికముగా ,ప్రాధమికత ననుసరించి ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వికారాలనుండి మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఆరోగ్యవంతమగు జీవితం జీవించగలం .
ఒక ప్రక్క మనం చికిత్సలు తీసుకుంటూ, ఒక ప్రక్క సంయమనం లేకుండుట ,ఇంద్రియాలతో ఆశక్తులగుట, మొదలగునవి ఉంటే ఆరోగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
• జీవితం తో పాటు మృత్యువు నిశ్చితమై ఉన్నది.జన్మించిన మొదలు ఆయుష్షు రూపంలో శ్వాస అనగా ప్రాణశక్తి భాండారాన్ని((ఖజానాని) తీసుకుని మనం జన్మిస్తాము,అది మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది.జీవనం యొక్క అంతిమ క్షణాల వరుకు ప్రాణశక్తి ప్రవాహాన్ని సంతులనం చేసి నియంత్రించి మరియు సద్వినియోగపరచి మనం శాంతి ,సుఖము,మరియు ఆరోగ్యవంతమైన జీవితం గడపగలము.
అపరాధ విజ్ఞానం (crime science) రకరము ఏ ఇద్దరి వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు.హోమియోపతి యొక్క పరిశోధనలో తేలినదేమంటే మర్రి వృక్షము యొక్క ఒక్కో ఆకులో ఉన్న పోలిక ఆ వృక్షములో ఉన్న ఇతర ఏ ఆకులతోనూ,మరియు ఇతర మర్రి చెట్లతోనూ సరిపోలదు , అలాంటిది మనుషులలో పొలికలెట్లుంటాయి ?
ఇద్దరు వ్యక్తుల శారీరకత మరియు మానసికత దృష్టితో కూడా చాలా భేదములున్నప్పుడు,వారికి చికిత్స ఒకేలా ఎలా సాధ్యం ? ఇప్పుడు విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది డి.ఎన్.ఏ (DNA) విశ్లేషణ అనుసారం ప్రతి ఒక్క వ్యక్తి చాలా భిన్నంగా ఉంటారని.
భారతీయ ఉపనిషత్తులలో వ్రాసిఉంది ౼ "అన్నాద్భవై ప్రజాయంతే "!
అన్నము వలన ప్రజ ఉత్పన్నమగును.
"అన్నాహి భూతానాం జ్యేష్టం" అన్నము ప్రాణుల యొక్క జ్యేష్ఠము,అనగా అన్నము సర్వ ప్రాణుల కన్నా ముందే ఉత్పన్నమయినది.
"తస్మాతే సర్వ ఔశిధ ముచ్యతే"అందులకే అన్నము సర్వ ఔషధము.
మాంసాహారం ఒక భయంకర విషము.
No comments:
Post a Comment