Sunday, 22 April 2018

*కిట్టయ్య సలహాలు

గోపిక: నేను గతం లో చాలా పుస్తకాలు చదివేదాన్ని ,పది నిమిషాల్లో సంకల్పం(ప్రనాళిక)
చేసుకుని మంచి మంచి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళేదాన్ని,కానీ ఇప్పుడు అలా జరుగుట లేదు,ఎందుకు?

కిట్టయ్య: రాధా బరువు ఎంతున్నావ్?

గోపిక: 70 kg.ఉన్నాను కిట్టయ్యా !

కిట్టయ్య: 10 kg తగ్గాలి రాధా

గోపిక:ఎందుకు కిట్టయ్య ?

కిట్టయ్య: శరీరంలో నీరెక్కువ ఉంటే మెదడు చురుగ్గా పనిచేయలేదు .

గోపిక: అవును మీరు చెప్పినది నిజమే కిట్టయ్యా!నేను  అప్పట్లో 63 kg ఉన్నాను అందుకే అప్పట్లో అంత చురుగ్గా ఉన్నాను,ఇప్పుడు అంత చురుగ్గా లేను.

కిట్టయ్య :  See whose thoughts they are. They will vanish. They have their root in the single ' I ' thought, hold it and they will disappear.
గోపన్న : మనం ఎలా చూస్తాము ?
కిట్టయ్య : మౌనంగా.
గోపన్న : ఎప్పుడూనా ?
కిట్టయ్య : అవును.
గోపన్న : మౌనంగా అంటే మాట్లాడకపోవడమా ?
కిట్టయ్య : కాదు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా ఆలోచన లేని స్థితి.
గోపన్న : ప్రతిక్షణంలో ఉండటం ఎలా ?
కిట్టయ్య : అలానే
గోపన్న : వర్తమానంలో ఉంటూ ?
కిట్టయ్య : అవును.
గోపన్న : ప్రస్తుత క్షణంలో ఉండటం ద్వారా ఏమవుతుంది ?
కిట్టయ్య : ఉండి చూడు నీకే తెలుస్తుంది.
గోపన్న : అలాగే.
గోపన్న : నేను ప్రస్తుత క్షణంలో ఉండటానికి అభ్యాసం చేస్తూ ఉన్నాను.
కిట్టయ్య : మంచిది.
గోపన్న : కానీ కొన్నిసార్లు మళ్లీ జారిపోతూ ఉంటాను.
కిట్టయ్య : అలాంటప్పుడు ఏదో ఒక నామమో, రూపమో పట్టుకుని ఉంటే సరి.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...