*ధ్యానం*
ధ్యానం అంటే చాలా మంది కళ్ళుమూసుకుని, ముక్కు ద్వారా వెళ్ళే గాలి (శ్వాస) ను గమనించడం అనుకుంటారు, చేస్తారు కాని ఎందరికో కొందరికి మాత్రమే విజయం సాధించగలరు. ఆ ధ్యానంలో యొక్క ఫలితాల గురించి చెపుతుంటారు. కానీ ఇల్లు, వాకిలి, ధనం, సమయాన్ని వదిలిన వ్యక్తిే ఇలాంటివి సాధించగలరు.
* ధ్యానం చేస్తే ముందు ఆ దీపం పెట్టాలి,ఫలానాది చెయ్యాలి. యోగా చేయాలి, ఫలానా ఆహారాన్ని తీసుకోవాలి అని రకరకాల పద్ధతులు చెబుతారు, కానీ అది ఎవరికి వారు తెలుసుకుని చేస్తూఉండాలి. తనకు వచ్చిన అనుభవంతో చేసుకోవాలి.
• ఒకరు చేసారు, వాళ్ళకి అలా జరిగిందని నేనలా చేయకూడదు. తనకు తాను తెలుసుకుని ఇది నాకు సరిపోతుంది అని తెలుసుకుని ధ్యానాన్ని చేయాలి.
• మంత్ర జపమని , పూజలని, హోమమని రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవి కూడా"ఆ మంత్ర జపం ఫలితం బాగుంది,ఈ మంత్ర ఫలితం బాగుంది" అని చేయకూడదు. అది కూడా నక్షత్రం బట్టి గురువును, సాధనను, మంత్రాన్ని చేయాలి.
*ధ్యానం అంటే ఏకాగ్రతతో బండినడపడం, వంటచేయడం, పుస్తకం చదవడం, చేసే పని మీద ద్రుష్టి పెట్టడం, ఆలోచించే దాని మీదే ద్రుష్టి పెట్టడం ఇలా రకరకాల ధ్యానం పద్ధతులు ఉన్నాయని స్వామి వివేకానంద_'ధ్యానం దాని పద్ధతులు' అనే పుస్తకంలో చెప్పారు.
• అందరికీ అర్ధమయ్యేలా అందుబాటులో ఉండేలా, అందరూ చేసే విధంగా ప్రశాంతంగా ఉండటానికి ఒక చిన్న ధ్యాన పద్ధతి ఉన్నది.
• ఈ పద్ధతిని చాలా మంది చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసేరు.
• ధ్యానం చేసుకునే ముందు వెన్నుపూసను ఒక గీతవలెను ఉంచవలెను.పడుకునియైన , గోడకు ఆనుకునియైన ఏదైనా ఆధారం తీసుకుని ఐనా వెన్నుముకను గీత వలే ఉంచవలెను. భూమికి ఎత్తులో కాకుండా భూమిపై కూర్చుని, కాళ్ళు చాపుకుని ఐనా మీకు నచ్చిన విధంగా చేసిన కొంత సేపటికి ఆలోచనలు వేగం పెరుగుతుంది. మిమ్మల్ని ధ్యానంలో కూర్చోనివ్వదు.
• ఆ సమయాన్ని కొద్దిగా నిదానంగా శ్రధ్ధగా ,ప్రేమగా,తలనుంచి పాదాల వరుకు నెమ్మదిగా చూసుకుంటూ రావాలి. ఇలా పదె పదే చేయడం వలన ఆలోచనల వేగం తగ్గిన తరువాత శాంతంగా , ప్రశాంతమైన ఆలోచనతో మనం రోజువారీ చేయాల్సిన ప్రతిపనిని ప్రతి నిమిషానికి గుర్తుచేసుకోవాలి.
• ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పనులు చేసిందీ, జరిగినది, డైరీలో రాసుకున్నట్లు గుర్తు చేసు కోవాలి. దానిని పట్టించు కోకుండా, అనగా రాగం, ద్వేషం, ఆకర్షణ లేకుండా కోపం, అసూయ,ప్రేమ ఉండాలి. ఇలా చేసి ప్రశాంతంగా నిద్ర పోవాలి.
• ఉదయం లేచిన తరువాత వెన్ను పూసలు గీత వలే ఉంచి మీకు నచ్చిన పద్ధతిలో ఉంచి ఆలోచనల వేగం రాక ముందే శాంతంగా ప్రశాంతమైన ఆలోచనతో, భక్తి శ్రద్ధ తో,ప్రేమతో ఈ రోజు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రణాళికను చేసు కోవాలి.ప్రతి నిముషం రోజువారీ చేయాల్సినవి గుర్తు చేసుకుని వాటి పరిష్కారాలను కూడా గుర్తు చేసుకుని ప్రశాంతంగా పాదాలనుంచి , తలవైపుకు గమనించుకుంటూ ప్రశాంతంగా, నెమ్మదిగా వెళ్ళాలి.
• ఈ విధమైన ధ్యానం చేస్తూ ఉంటే మన రోజువారీ పనుల వల్ల కలిగే బాధలూ కష్టాలు తట్టుకుని ప్రశాంతంగా ఉండవలెను.
No comments:
Post a Comment