Wednesday, 30 August 2017

The sevenbstages of jnana yogam

The seven stages of Jnana

by Swami Shamanda

There are seven stages of Jnana or the seven Jnana

Bhumikas. First, Jnana should be developed through a deep

study of Atma Jnana Sastras and association with the wise

and the performance of virtuous actions without any

expectation of fruits. This Subheccha or good desire forms

the first Bhumika or stage of Jnana. This will inrigate the

mind with the waters of discrimination and protect it.

There will be non-attraction or indifference to sensual

objects in this stage. The first stage is the substratum of

the other stages. From it the next two stages, viz.,

Vicharana and Tanumanasi will be reached, Constant Atma

Vichara (Atmic enquiry) forms the second stage. The third

stage is Tanumanasi. This is attained through the cultivation

of special indifference to objects. The mind becomes thin

like a thread, Hence the name Tanumanasi. Tanu means

thread-thread-like state of mind. The third stage is also

known by the name Asanga Bhavana. n the third stage, the

aspirant is free from all attractions. If any one dies in the

third stage, he will remain in heaven for a long time and

will reincarnate on earth again as a Jnani. The above three

stages can be included under the Jagrat state. The fourth

stage is Sattvapatti. This stage will destroy all Vasanas to

the root. This can be included under the Svapna state. The

world appears like a dream. Those who have reached the

fourth stage will look upon all things of the universe with

an equal eye. The fifth stage is Asamsakti. There is perfect

non-attachment to the objects of the world. There is no

Upadhi or waking or sleeping in this stage. This
is the

Jivanmukti stage in which there is the experience of

Ananda Svarupa (the Eternal Bliss of Brahman) replete with

spotless Jnana. This will come under Sushupti. The sixth

stage is Padartha Bhavana. There is knowledge of Truth

The
seventh stage is Turiya or the state of

superconsciousness. This is a. This is also known by

the name Turiyatita. There are no Sankalpas. All the Gunas

disappear. This is above the reach of mind and speech

Disembodied salvation IVidehamukti) is attained in the

seventh stage.

Remaining in the certitude of Atman, without desires, and

with an equal vision over all, having completely eradicated

all complications of differentiations of
'l' or 'he, existence

or non-existence, is Turiya.

That which is of the nature of bliss with intelligence is

called Turiya. The sage in this stage is completely divested

of all Vasanas. He is free from all ideas of difference and

non-difference, 'I' and 'not
being and non-being

The exalted stage of the seventh is the isolation or Moksha

which is partless, equal in all, immaculate, beneficent,

quiescent and the pure Turiya. The seventh stage, free

from all objects and replete with bliss, is stated by some to

be Turiyatita seat of Moksha, which is Chit itself. The

seventh stage is above the reach of the mind, self-shining

and of the nature of Sat
In the seventh stage, the

disembodied salvation is attained. It is homogeneous. It is

indescribable; it is beyond the power of speech.

Tuesday, 29 August 2017

మహద్గురు శ్రీ పూర్ణానంద సచ్చరిత్ర

ఓం శుభమస్తు.

మహద్గురు శ్రీ పూర్ణానంద సచ్చరిత్ర (నిత్యపారాయణ గ్రంధము
అధ్యాయము  -  1    (2 8)*

అయితే ఏ జన్మ కర్మఫలమో ,దొరైరాజు కుటుంభము ఆ కాలంలో అష్ట కష్తాలు అనుభవిస్తుండేది.  పరిస్థితిని అర్థం చేసుకున్నరాఖాడిబాబావారు దొరైరాజు గారికి యాబై రూపాయలు ఇచ్చి ఒక ఆవును తీసుకురమ్మని ఆదేశించారు. అది 1968 సం//ము ఆగష్టులో జరిగిన సంఘటన .

ఆ కాలంలో ఆ అడవి ప్రాంతంలో ఆవులు చాలాతక్కువగా ఉండేవి. అయినా వారి ఆధేశానుసారం దొరైరాజు గారుఆవు కోసం ఒకరిని కలవగా అతను “నాకుఆవు ఉన్న మాట నిజమేకాని , అది ఎప్పటి నుండో అడవిలోనే ఉంటుంది.  దాన్నిపట్టుకొని రావడానికి ఇప్పటికే ఎంతో మంది ప్రయత్నించారు. ఎందుకో మనుషులంటే నే దానికి సరిపడదు. పైగా కుమ్మడానికి కూడా వస్తుంది. అది ఈని కూడా మూడు సంవత్సారాలవుతుంది. నీకు అవసరమైతే దాన్ని కట్టేసుకో,ఖరీదుగా నాకు పదిహెనురూపాయలిస్తే చాలు”,  అని అన్నాడు.  ఆ దట్టమైన అడవిలో ఆవు ఎక్కడుందో తెలియకనే అతను మూల్యం చెల్లించాడు. చిన్నప్పటినుండి ఆ అడవిలో తిరుగుతుండే అతనికి ఆ అ డవి  అంతా కొట్టినపిండే .వెంటనేదొరైరాజు గారు ఆవును వెదుకు కుంటూ వెళ్ళి చెట్లమధ్యలో ఉన్న ఆవునుకనిపెట్టారు.  వెంటనే ఆ ఆవు చూట్టూ ఉనా చెట్లకు దడి కట్టి ,అది బయటకు వెళ్ళకుండా భద్రపరచి,అడవిలో తిరుగుతున్న మరి కొన్ని ఆవులను దడిలోకి తోలారు. తరువాత అతను 
చెట్టుపైకెక్కి,ఒక త్రాడును క్రిందకు దించి , ఆ ఆవు కొమ్ములకు పగ్గము వేసి, ప్రక్కనున్న నాలుగైదు ఆవులతో కలిపి కట్టి, తామ్రపర్ణి నదిలోకి తోలి , ఒక దబ్బడంను దాని ముక్కులోకి గ్రుచ్చి , ముక్కుతాడు కట్టి, తీసుకొచ్చి దొడ్లో కట్టేసారు! ఆ కాలంలో ఆ ఆవును బంధించినవిషయం ఆ ప్రాంతములో చర్చనీయాంశమైంది.*

ఆవును తీనుకొచ్చిన విషయం గ్రురుశిష్యులకు తెలుపగా వారు దాని దగ్గరకు వచ్చి, దాని శరీరమంతా నిమురుతూ , హరిహర పుత్రుడైన, ‘అయ్యప్పస్వామి’ నామధేయానికి సమానమైన “ అయ్యమ్మా” అని నామకరణ చేశారు!  ఆశ్చర్యమేమిటంటే , దేనిని చూసినా, ప్రత్యేకంగా మనుషులను కుమ్ముతుండే ఆ గోమాత వారిద్దరూ దగ్గరకు రాగానే ఎంతో సౌమ్యంగాచూస్తూ, నమ్రతగా నిలబడిపోయింది! అన్నిటి కంటే అద్భుతమైన విషయము ఏమిటంటే , దాన్ని తీసుకువచ్చిన మూడవ రోజుననే అది ఈని సమృద్దిగా పాలు ఇవ్వసాగింది.

అలా ఆ గురుశిష్యులు యజ్ణం ప్రారంభించారు. వారు యజ్ణం చెస్తుండగా దొరైరాజు గారు హోమద్రవ్యాన్ని అందిస్తూ, సహాయపడేవారు. రాత్రి చాలా ప్రొద్ధు పోయేంతవరకూ, ఆమహోయజ్ణం జరుగుతుండేది. ఆ రోజులలో ఆ యజ్ణకర్తలిరువురూ, ఆ ప్రాంగణము వదలి, బయటకు వెళ్ళేవారుకాదు.  ఆ ఆవు నమ్మలెని విధంగా పాలిచ్చి ఆ ఇంటి వారిదారిద్ర్యాన్ని తొలగించింది! రోజుకు 30 ,40 లీటర్ల పాలిచ్చే ఆ కామధేనువు అద్భుత విషయాన్ని విని ఎందరో అడిగినంత డబ్బిచ్చి కొనడానికి ముందుకు వచ్చారు.  డబ్బాల చొప్పున పాలు అమ్మడానికి పంపించినప్పుడు ఓర్చుకోలేని కొందరూ పాల వ్యాపారులు, దొరైరాజు గారు పాల పౌడరు తో పాలుతయారు చెసి ప్రజలను మోసం చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయగా , వాళ్ళు వచ్చిపాలు పరీక్ష్ చెసి తృప్తి చెందిన సంఘటన కూడా జరిగింది.  ఆ మహా యజ్ణం మండలం రోజులు నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరిగింది.  కాలగమనంలో ఆ యజ్ణ స్థానంలోనే స్వామివారికి పర్ణశాల నిర్మించబడింది.

ఆ యజ్ణానంతరం శ్రీరాఖాడైబాబావారు తిరిగి సోరుముత్తుఅ యానార్ క్షేత్రానికి వెళ్ళగా , స్వామివారు దొరైరాజు గారి ఇంటి ప్రక్కన ప్రత్యేకంగా నిర్మించబడింది.  కుటీరంలో ఉండిపోయారు . చివరుకు 1968 సం// లో గురుపౌర్ణమానంతరం నలబై ఒకటవ రోజున శ్రీబాబావారు , స్వామీజీ , దొరైరాజుగారితో కలసి కారయార్ నుండి గణేశ్ పురికి బయలుదేరారు. దొరైరాజు గారు తప్ప ఆ ఆవును ఇంకెవ్వరూ విప్పి కట్టేవాళ్ళు కాదు కాబట్టి , బయలుదేరీ ముందు అతను దానిని ఇంటి వెనుక సమృద్ధిగా  గడ్డి ఉన్న చోట కట్టేసారు. వాళ్ళు బస్టాండు చేరి ఉండవచ్చు .  అంతలోనే ఆ ఆవు గ డ్డి తింటూ దాన్ని కట్టివేసిన కొబ్బరిచెట్టు చుట్టూ తిరుగుతూ కాలు జారి ప్రక్కనున్న గోతిలో పడి, మెడకు త్రాడు గ ట్టిగా బిగుసుకుపోవడంతో  చచ్చిపోయింది..  ఆ బాధతో దొరైరాజుగారి కుటుంబ సభ్యులుఏడుస్తుండగా స్వామివారు, “ ఎందుకు అంత బాధపడడం? అమ్మవారు వచ్చి అవసరమైన సేవలు చేసి దేహాన్ని వదలి వెళ్ళి పోయారు” అని వాళ్ళను ఓదార్చారు.

అలా వారిద్దరూ కారియార్ నుండి బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ,ఒకరోజు తమిళనాడు రాష్ట్రములోని కుంభకోణమునకు కొంత దూరములోనున్న “స్వామిమలై శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి” క్షేత్రమునకు  అపరాహ్ణవేళకు చేరుకున్నారు. అప్పుడు కూడా బాబావారు తమ శిష్యుని యొక్క మనోస్థాయిని పరిక్షాలనుకున్నారేమో? , దర్శానానంతరము ఆకొండమెట్లు దిగుచ్న్నరాఖాడీబాబావారు ఉన్నట్లుండి “శివానాకు ఆకలిగాఉంది అన్నారు” గురుదేవుల వారు ఆకలి అనడంతో స్వామీజీ వారు వెంటనే “అలాగైతే మీరు ఇక్కడేఉండండి నేను క్రిందికి వెళ్ళీ భిక్ష తీసుకు వస్తాను” అని అన్నారు. అయితే భిక్ష కోసమువెళుతున్నశిష్యున్ని చూసి వెడుతున్న శిష్యున్ని  పలచి, “చూడుశివా! , భిక్షకోసం అంత దూరం వెళ్ళవలసిందేనా? అక్కడచూడు వాళ్ళు అక్కడ కూర్చుని తమ ఆహారాన్నిఅక్కడే సంపాదించుకుంటున్నారు కదా ! మనం కూడా అక్కడ కూర్చూందాం” . అని ఒక పరీక్షలా అంటూ మెట్ల పై కూర్చున్న భిక్షువులను చూపారు.  స్థిత ప్రజ్నూలైన స్వామిజి , పై మెట్టుపై తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్న గురుదేవుల వారికి , క్రింద మెట్టు పై  తాముకూడా ఒక తుండు గుడ్డ పరచుకొని కూర్చున్నారు!?.

రమణ మహర్షి దివ్య బోధ

రమణ మహర్షి దివ్య బోధ
-----------------------------------------------------------------భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను అనుకునే సాధకునికోసం రమణుని సమాధానం .

ఎక్కడ భగవంతుని అన్వేషిస్తున్నావు ?,బయట  వున్నాడా భగవంతుడు ? లేక లోపడ వున్నాడా భగవంతుడు .? ఎకాడవున్నాడు అని వెతుకుతున్నావు ?

వున్నది అంతా ఒక శక్తిమాత్రమే .ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే దానిని కనుగొనడము ,అన్వేషించడము ఎవ్వరితరము కాదు .సాక్షాత్ ఆ పరమేశ్వరుని తరము కూడా కాదు .ఎందుకంటే ఆది ,అంతమూ ,చావు ,పుట్టుక ,అందము ,వికారము ,స్వార్ధము ,నిస్వార్ధము ,కోరిక ,కొరిక లేకపోవడము ,సుఖము ,దుఃఖము ,ఆనందం ,
విచారం - ఇలా చెప్పుకుంటూ పోతే చాలావున్నాయి గుణాలు .ఈ గుణాలులో ఎదో ఒక గుణము ఆ భగవంతుని కి వున్నా ఆ భగవంతునికోసం సాధకుడు  అన్వేషించవచ్చు .కాని ఏగుణాలు లేని ,ఏ ఆకారము లేని ఆ భగవంతునికోసం ఎక్కడఉన్నాడని వెతుకుతువు ?

వున్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు .ఆ శక్తి నీవు ఈ బౌతిక కనులతో చూడలేవు .నీయొక్క దివ్య చక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు .భగవంతుడు కాంతి స్వరూపుడూ ఆ కాంతి ఇలావుంటుంది అనిచెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి , ఆ భగవంతుని అనుభూతి పొందిన సాధకుడు చెప్పలేడు .ఎందుకంటే చెపితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు .ఎందుకంటే నీవు భగవంతుడిని నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో ,లేక నీ ఇంటిలొ ఉన్న దేవుని మందిరం లోనో ,లేక బయట ఉన్న గుడిలోనో ,లేక చర్చిలోనే ,లేక మసీదు లొనో ,లేక కొండల్లోనో ,లేక కొనల్లోనో వున్నాడని వెతుకుతున్నవు .ఎక్కడ వున్నాడని వెతుకుతావు ?ఎక్కడా నీకు కనబడడు నీ సమయం వృదా !

వెతక వలసినది నిలోపల !  వేసుకోవాల్సినది ప్రశ్న నిలోపడ .నేనెవరు ? భగవంతుడెవరు ? ఎలా వుంటాడు ? ఎక్కడ వుంటాడు ?అసలు ఉంటె ఎలావుంటాడు ? అసలు నేను ఈ భుమిమీదకు ఎందుకు వచ్చాను ? ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చెయ్యడానికి వచ్చానా ? ధనము సంపాదించడానికి ,పేరు ప్రతిష్టలు ,ఆస్తి ,అంతస్తులు ,హోదా ,సంపాదించడానికి వచ్చానా ? అసలు దేనికోసం వచ్చాను ?ఇవేమి నిర్దారించుకోకుండా ,నీకు నీవు ప్రశ్నించుకోకుండా ,నీప్రశ్నకు సమాధానం తెలుసుకొకుండా ,భగవంతునికొసం అన్వేషణ చేస్తున్నను .అంటావేమిటి ?

అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నవా?  ,నేను ఎవరు ?
నేను ఎక్కడనుండి వచ్చాను ?
ఏపని నిమిత్తమై వచ్చాను ?
అసలు నా నిజమయిన లక్ష్యం ఏమిటి ?
నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికీ గల సంబందం ఏమిటి ? ప్రశ్నించుకో ? సమాదానాలు పొందు .అప్పుడు అన్వేషించు భగవంతునికొసం .

నీ ప్రశ్నలకు సమాదానాలు దొరికేంతవరకు భగవంతుని జోలికి వెళ్ళమకు ,నీకు తెలియదు
భగవంతుని గురించి .

మరల ,నీ ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకొవడం గురించి పురోహితుల వద్దకు ,జోతిష్య సిద్ధాంతుల వద్దకు ,గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహం వద్దకు ,చర్చికి ,మసీదుకు వేళ్ళకు అక్కడ సమాధానం దొరకదు .అక్కడ దొరికేది నీ యెక్క బౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారము ,లేక మనసు ప్రశాంతత దొరుకుతుంది .అంతే కానీ నీ ప్రశ్నకు సమాధానము దొరికేది నిలోపడే ,నీ అంతరంలోనే ,అన్వేషించు .శోధించు ,ప్రశ్నించు ,
నిరంతరం కనుల మూసినా ,తెరచిన ,కూర్చున్న ,నిలబడిన ,పడుకున్నా ,నడుస్తున్నా ,ఏమిచేస్తున్న ఇదే ఆలోచన -
నేను ఎవరు ? అని ప్రశ్నించుకో అదే సాధన .

ముందు నీకోసం అన్వేషించు ,తరువాత భగవంతునికొసం నీకే అర్థమవుతుంది .
సమయము వృదా పోనియాకు ,సమయము చాలా తక్కువ ఉంది .సమయము మించిపోనియ్యకు .ప్రశ్నించు ,శోధించు

నేను ఎవరు ?????

అవధూత అంటే ఎవరు?

అవధూత’ అంటే ఎవరు?

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!

ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.

అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?

త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.

ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?

కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.

ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.

అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.

త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?

అవధూత గీతయే అష్టమాధ్యాయంలో ‘అవధూత’ పదంలోని నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరం శ్లోక ఆరంభ అక్షరంగా, నాలుగు అక్షరాలకు నాలుగు శ్లోకాలలో అవధూత లక్షణాలను వ్యక్తం చేసింది:

ఆశాపాశ వినిర్ముక్తః
ఆదిమధ్యాన్త నిర్మలః
ఆనందే వర్తతే నిత్యం
ఆకారం తస్య లక్షణమ్

ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.

వాసవా వర్జితా యేవ
వ్యక్తవ్యం చ నిరామయమ్
వర్తమానేషు వర్తేత
వకారం తస్య లక్షణమ్

ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమై ఉన్నది.

ధూర్ది ధూసర గాత్రాణి
ధూత చిత్తో నిరామయః
ధారణ ధ్యాన నిర్ముక్తో
ధూకార స్తస్య లక్షణమ్

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.

తత్త్వ చిన్తా ధృతా యేవ
చిన్తా చేష్టా వివర్జితః
తమోహంకార నిర్ముక్తః
తకార స్తస్య లక్షణమ్

తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.

అవధూత గీత అద్వయ సత్తా స్వరూపమై భాసిల్లే ఆత్మస్థితిని ప్రతిబోధించే జ్ఞాన బోధయేకాక ఈ గీత రచన చక్కని పదజాలంతో సంగీతపరంగా శ్రవణానందంగా ఉంటుంది. మచ్చుకు,

తత్త్వమస్యా ది వాక్యేన
హ్యాత్మాహి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్భూయా
దనృతం పజ్ఞ్చాభౌతికమ్

‘తత్త్వమసి’ ఆది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదించబడినది. అసత్యమై పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కానేరాదని వేదం చెబుతోంది.

అనంత రూపం నహి వస్తు కిజ్ఞ్చత్
తత్త్వ స్వరూపం నహి వస్తు కిజ్ఞ్చత్
ఆత్మైక రూపం పరమార్థ తత్త్వం
న హింస కొ వాపి న చాస్య హింసా

ఆత్మ తప్ప వేరైన వస్తువేదీ నాశనము లేనిది కాదు. ఆత్మైక రూపమైన పరమాత్మతత్త్వం ఒక్కటే నాశనం లేనిది. ఇది దేనిని హింసించేది కాదు. ఇది దేని చేతను హింసింపబడేది కాదు.

నషండో న పుమాన్ న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానందో వా నిరానందం ఆత్మానం మన్యసేకథమ్

నువ్వు నపుంసకుడవు కావు. పురుషుడవూ కావు. స్త్రీవి కావు. జ్ఞానమూ కావు. కల్పనవూ కావు. నువ్వు ఆనందమూ కావు. నిరానందమూ కావు. అలాంటి ఆత్మనైన నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు?

న తేచ మాతాచ పితాచ బందుః
న తేచ పత్నీ సుతాశ్చ మిత్రమ్
న పక్షపాతో న విపక్ష పాతః
కథం హి సంతాప పరోసి చేతః

ఓ చిత్తమా! నీకు తల్లీ, తండ్రి, బంధువు, భార్య, బిడ్డ, మిత్రుడు ఎవరూ లేరు. పక్షపాతం ఉండుట, లేక పోవుట రెండూ లేవు. అలాంటి నీకు సంతాపం ఎలా కలుగుతుంది?

విన్దతి విన్దతి నహినహి యత్ర
ఛందో లక్షణం నహి నహి యత్ర
సమరస మగ్నో భావిత పూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః

అవధూత ఎక్కడా దేనిని పొందడు. ఛందో లక్షణాలను ఎరుగడు. సమరసంలో మునిగినవాడై, భావం చేత పవిత్రుడై పరమాత్మ తత్త్వాన్ని చక్కగా చెబుతాడు.

ననురూప విరూప విహీన ఇతి
నను భిన్న విభిన్న విహీన ఇతి
నను సర్వ విసర్వ విహీన ఇతి
కిము రొదిషు మానసి సర్వసమమ్

నువ్వు రూపారూపాల లేనివాడివి, భేదాభేదాలు లేనివాడివి. సర్వాసర్వములు లేనివాడివి. సర్వసముడవైన నీకు దుఃఖం ఎందుకు?

తైలొక్య జననీ ధాత్రీ,
సా భగీ నరకో ధృవం
తస్యాం జాతో రతస్తత్ర,
హాహా సంసార సంస్థితిః

స్త్రీ ముల్లోకాలకీ కన్నతల్లి. ధరించేది. ఆమె భగసౌఖ్యం ఇస్తున్నపుడు నరకమే అవుతున్నది. ఇదినిజం. ప్రాణుల పుట్టుకస్థానమే రతిస్థానం. అవడము కడు శోచనీయం. అయ్యయ్యో! ఇదీ సంసారం.

మద్యపానం మహాపాపం,
నారీసంగ స్తథైవచ
తస్మాద్ద్వయం పరిత్యజ్య,
తత్త్వ విష్ఠో భవెన్మునిః

మద్యపానం మహాపాపం. స్త్రీ సంగమం కూడ అలాంటిదే. ఈ రెండిటినీ వదలి తత్త్వనిష్ఠలో ఉన్నవాడుమౌని అనబడతాడు.

ఇంతటి అపూర్వమైన ఆధ్యాత్మిక గ్రంథం ఉచిత ప్రచారం పొందక అజ్ఞాతంలో ఉండిపోవడం కడు శోచనీయం. మన దౌర్భాగ్యం. ఆణిముత్యాల వంటి ఈ ఇటువంటి గ్రంథాల పఠనం ఆవశ్యం.

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...