రమణ మహర్షి దివ్య బోధ
-----------------------------------------------------------------భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను అనుకునే సాధకునికోసం రమణుని సమాధానం .
ఎక్కడ భగవంతుని అన్వేషిస్తున్నావు ?,బయట వున్నాడా భగవంతుడు ? లేక లోపడ వున్నాడా భగవంతుడు .? ఎకాడవున్నాడు అని వెతుకుతున్నావు ?
వున్నది అంతా ఒక శక్తిమాత్రమే .ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే దానిని కనుగొనడము ,అన్వేషించడము ఎవ్వరితరము కాదు .సాక్షాత్ ఆ పరమేశ్వరుని తరము కూడా కాదు .ఎందుకంటే ఆది ,అంతమూ ,చావు ,పుట్టుక ,అందము ,వికారము ,స్వార్ధము ,నిస్వార్ధము ,కోరిక ,కొరిక లేకపోవడము ,సుఖము ,దుఃఖము ,ఆనందం ,
విచారం - ఇలా చెప్పుకుంటూ పోతే చాలావున్నాయి గుణాలు .ఈ గుణాలులో ఎదో ఒక గుణము ఆ భగవంతుని కి వున్నా ఆ భగవంతునికోసం సాధకుడు అన్వేషించవచ్చు .కాని ఏగుణాలు లేని ,ఏ ఆకారము లేని ఆ భగవంతునికోసం ఎక్కడఉన్నాడని వెతుకుతువు ?
వున్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు .ఆ శక్తి నీవు ఈ బౌతిక కనులతో చూడలేవు .నీయొక్క దివ్య చక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు .భగవంతుడు కాంతి స్వరూపుడూ ఆ కాంతి ఇలావుంటుంది అనిచెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి , ఆ భగవంతుని అనుభూతి పొందిన సాధకుడు చెప్పలేడు .ఎందుకంటే చెపితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు .ఎందుకంటే నీవు భగవంతుడిని నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో ,లేక నీ ఇంటిలొ ఉన్న దేవుని మందిరం లోనో ,లేక బయట ఉన్న గుడిలోనో ,లేక చర్చిలోనే ,లేక మసీదు లొనో ,లేక కొండల్లోనో ,లేక కొనల్లోనో వున్నాడని వెతుకుతున్నవు .ఎక్కడ వున్నాడని వెతుకుతావు ?ఎక్కడా నీకు కనబడడు నీ సమయం వృదా !
వెతక వలసినది నిలోపల ! వేసుకోవాల్సినది ప్రశ్న నిలోపడ .నేనెవరు ? భగవంతుడెవరు ? ఎలా వుంటాడు ? ఎక్కడ వుంటాడు ?అసలు ఉంటె ఎలావుంటాడు ? అసలు నేను ఈ భుమిమీదకు ఎందుకు వచ్చాను ? ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చెయ్యడానికి వచ్చానా ? ధనము సంపాదించడానికి ,పేరు ప్రతిష్టలు ,ఆస్తి ,అంతస్తులు ,హోదా ,సంపాదించడానికి వచ్చానా ? అసలు దేనికోసం వచ్చాను ?ఇవేమి నిర్దారించుకోకుండా ,నీకు నీవు ప్రశ్నించుకోకుండా ,నీప్రశ్నకు సమాధానం తెలుసుకొకుండా ,భగవంతునికొసం అన్వేషణ చేస్తున్నను .అంటావేమిటి ?
అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నవా? ,నేను ఎవరు ?
నేను ఎక్కడనుండి వచ్చాను ?
ఏపని నిమిత్తమై వచ్చాను ?
అసలు నా నిజమయిన లక్ష్యం ఏమిటి ?
నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికీ గల సంబందం ఏమిటి ? ప్రశ్నించుకో ? సమాదానాలు పొందు .అప్పుడు అన్వేషించు భగవంతునికొసం .
నీ ప్రశ్నలకు సమాదానాలు దొరికేంతవరకు భగవంతుని జోలికి వెళ్ళమకు ,నీకు తెలియదు
భగవంతుని గురించి .
మరల ,నీ ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకొవడం గురించి పురోహితుల వద్దకు ,జోతిష్య సిద్ధాంతుల వద్దకు ,గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహం వద్దకు ,చర్చికి ,మసీదుకు వేళ్ళకు అక్కడ సమాధానం దొరకదు .అక్కడ దొరికేది నీ యెక్క బౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారము ,లేక మనసు ప్రశాంతత దొరుకుతుంది .అంతే కానీ నీ ప్రశ్నకు సమాధానము దొరికేది నిలోపడే ,నీ అంతరంలోనే ,అన్వేషించు .శోధించు ,ప్రశ్నించు ,
నిరంతరం కనుల మూసినా ,తెరచిన ,కూర్చున్న ,నిలబడిన ,పడుకున్నా ,నడుస్తున్నా ,ఏమిచేస్తున్న ఇదే ఆలోచన -
నేను ఎవరు ? అని ప్రశ్నించుకో అదే సాధన .
ముందు నీకోసం అన్వేషించు ,తరువాత భగవంతునికొసం నీకే అర్థమవుతుంది .
సమయము వృదా పోనియాకు ,సమయము చాలా తక్కువ ఉంది .సమయము మించిపోనియ్యకు .ప్రశ్నించు ,శోధించు
నేను ఎవరు ?????
No comments:
Post a Comment