ఓం శుభమస్తు.
మహద్గురు శ్రీ పూర్ణానంద సచ్చరిత్ర (నిత్యపారాయణ గ్రంధము
అధ్యాయము - 1 (2 8)*
అయితే ఏ జన్మ కర్మఫలమో ,దొరైరాజు కుటుంభము ఆ కాలంలో అష్ట కష్తాలు అనుభవిస్తుండేది. పరిస్థితిని అర్థం చేసుకున్నరాఖాడిబాబావారు దొరైరాజు గారికి యాబై రూపాయలు ఇచ్చి ఒక ఆవును తీసుకురమ్మని ఆదేశించారు. అది 1968 సం//ము ఆగష్టులో జరిగిన సంఘటన .
ఆ కాలంలో ఆ అడవి ప్రాంతంలో ఆవులు చాలాతక్కువగా ఉండేవి. అయినా వారి ఆధేశానుసారం దొరైరాజు గారుఆవు కోసం ఒకరిని కలవగా అతను “నాకుఆవు ఉన్న మాట నిజమేకాని , అది ఎప్పటి నుండో అడవిలోనే ఉంటుంది. దాన్నిపట్టుకొని రావడానికి ఇప్పటికే ఎంతో మంది ప్రయత్నించారు. ఎందుకో మనుషులంటే నే దానికి సరిపడదు. పైగా కుమ్మడానికి కూడా వస్తుంది. అది ఈని కూడా మూడు సంవత్సారాలవుతుంది. నీకు అవసరమైతే దాన్ని కట్టేసుకో,ఖరీదుగా నాకు పదిహెనురూపాయలిస్తే చాలు”, అని అన్నాడు. ఆ దట్టమైన అడవిలో ఆవు ఎక్కడుందో తెలియకనే అతను మూల్యం చెల్లించాడు. చిన్నప్పటినుండి ఆ అడవిలో తిరుగుతుండే అతనికి ఆ అ డవి అంతా కొట్టినపిండే .వెంటనేదొరైరాజు గారు ఆవును వెదుకు కుంటూ వెళ్ళి చెట్లమధ్యలో ఉన్న ఆవునుకనిపెట్టారు. వెంటనే ఆ ఆవు చూట్టూ ఉనా చెట్లకు దడి కట్టి ,అది బయటకు వెళ్ళకుండా భద్రపరచి,అడవిలో తిరుగుతున్న మరి కొన్ని ఆవులను దడిలోకి తోలారు. తరువాత అతను
చెట్టుపైకెక్కి,ఒక త్రాడును క్రిందకు దించి , ఆ ఆవు కొమ్ములకు పగ్గము వేసి, ప్రక్కనున్న నాలుగైదు ఆవులతో కలిపి కట్టి, తామ్రపర్ణి నదిలోకి తోలి , ఒక దబ్బడంను దాని ముక్కులోకి గ్రుచ్చి , ముక్కుతాడు కట్టి, తీసుకొచ్చి దొడ్లో కట్టేసారు! ఆ కాలంలో ఆ ఆవును బంధించినవిషయం ఆ ప్రాంతములో చర్చనీయాంశమైంది.*
ఆవును తీనుకొచ్చిన విషయం గ్రురుశిష్యులకు తెలుపగా వారు దాని దగ్గరకు వచ్చి, దాని శరీరమంతా నిమురుతూ , హరిహర పుత్రుడైన, ‘అయ్యప్పస్వామి’ నామధేయానికి సమానమైన “ అయ్యమ్మా” అని నామకరణ చేశారు! ఆశ్చర్యమేమిటంటే , దేనిని చూసినా, ప్రత్యేకంగా మనుషులను కుమ్ముతుండే ఆ గోమాత వారిద్దరూ దగ్గరకు రాగానే ఎంతో సౌమ్యంగాచూస్తూ, నమ్రతగా నిలబడిపోయింది! అన్నిటి కంటే అద్భుతమైన విషయము ఏమిటంటే , దాన్ని తీసుకువచ్చిన మూడవ రోజుననే అది ఈని సమృద్దిగా పాలు ఇవ్వసాగింది.
అలా ఆ గురుశిష్యులు యజ్ణం ప్రారంభించారు. వారు యజ్ణం చెస్తుండగా దొరైరాజు గారు హోమద్రవ్యాన్ని అందిస్తూ, సహాయపడేవారు. రాత్రి చాలా ప్రొద్ధు పోయేంతవరకూ, ఆమహోయజ్ణం జరుగుతుండేది. ఆ రోజులలో ఆ యజ్ణకర్తలిరువురూ, ఆ ప్రాంగణము వదలి, బయటకు వెళ్ళేవారుకాదు. ఆ ఆవు నమ్మలెని విధంగా పాలిచ్చి ఆ ఇంటి వారిదారిద్ర్యాన్ని తొలగించింది! రోజుకు 30 ,40 లీటర్ల పాలిచ్చే ఆ కామధేనువు అద్భుత విషయాన్ని విని ఎందరో అడిగినంత డబ్బిచ్చి కొనడానికి ముందుకు వచ్చారు. డబ్బాల చొప్పున పాలు అమ్మడానికి పంపించినప్పుడు ఓర్చుకోలేని కొందరూ పాల వ్యాపారులు, దొరైరాజు గారు పాల పౌడరు తో పాలుతయారు చెసి ప్రజలను మోసం చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయగా , వాళ్ళు వచ్చిపాలు పరీక్ష్ చెసి తృప్తి చెందిన సంఘటన కూడా జరిగింది. ఆ మహా యజ్ణం మండలం రోజులు నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరిగింది. కాలగమనంలో ఆ యజ్ణ స్థానంలోనే స్వామివారికి పర్ణశాల నిర్మించబడింది.
ఆ యజ్ణానంతరం శ్రీరాఖాడైబాబావారు తిరిగి సోరుముత్తుఅ యానార్ క్షేత్రానికి వెళ్ళగా , స్వామివారు దొరైరాజు గారి ఇంటి ప్రక్కన ప్రత్యేకంగా నిర్మించబడింది. కుటీరంలో ఉండిపోయారు . చివరుకు 1968 సం// లో గురుపౌర్ణమానంతరం నలబై ఒకటవ రోజున శ్రీబాబావారు , స్వామీజీ , దొరైరాజుగారితో కలసి కారయార్ నుండి గణేశ్ పురికి బయలుదేరారు. దొరైరాజు గారు తప్ప ఆ ఆవును ఇంకెవ్వరూ విప్పి కట్టేవాళ్ళు కాదు కాబట్టి , బయలుదేరీ ముందు అతను దానిని ఇంటి వెనుక సమృద్ధిగా గడ్డి ఉన్న చోట కట్టేసారు. వాళ్ళు బస్టాండు చేరి ఉండవచ్చు . అంతలోనే ఆ ఆవు గ డ్డి తింటూ దాన్ని కట్టివేసిన కొబ్బరిచెట్టు చుట్టూ తిరుగుతూ కాలు జారి ప్రక్కనున్న గోతిలో పడి, మెడకు త్రాడు గ ట్టిగా బిగుసుకుపోవడంతో చచ్చిపోయింది.. ఆ బాధతో దొరైరాజుగారి కుటుంబ సభ్యులుఏడుస్తుండగా స్వామివారు, “ ఎందుకు అంత బాధపడడం? అమ్మవారు వచ్చి అవసరమైన సేవలు చేసి దేహాన్ని వదలి వెళ్ళి పోయారు” అని వాళ్ళను ఓదార్చారు.
అలా వారిద్దరూ కారియార్ నుండి బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ,ఒకరోజు తమిళనాడు రాష్ట్రములోని కుంభకోణమునకు కొంత దూరములోనున్న “స్వామిమలై శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి” క్షేత్రమునకు అపరాహ్ణవేళకు చేరుకున్నారు. అప్పుడు కూడా బాబావారు తమ శిష్యుని యొక్క మనోస్థాయిని పరిక్షాలనుకున్నారేమో? , దర్శానానంతరము ఆకొండమెట్లు దిగుచ్న్నరాఖాడీబాబావారు ఉన్నట్లుండి “శివానాకు ఆకలిగాఉంది అన్నారు” గురుదేవుల వారు ఆకలి అనడంతో స్వామీజీ వారు వెంటనే “అలాగైతే మీరు ఇక్కడేఉండండి నేను క్రిందికి వెళ్ళీ భిక్ష తీసుకు వస్తాను” అని అన్నారు. అయితే భిక్ష కోసమువెళుతున్నశిష్యున్ని చూసి వెడుతున్న శిష్యున్ని పలచి, “చూడుశివా! , భిక్షకోసం అంత దూరం వెళ్ళవలసిందేనా? అక్కడచూడు వాళ్ళు అక్కడ కూర్చుని తమ ఆహారాన్నిఅక్కడే సంపాదించుకుంటున్నారు కదా ! మనం కూడా అక్కడ కూర్చూందాం” . అని ఒక పరీక్షలా అంటూ మెట్ల పై కూర్చున్న భిక్షువులను చూపారు. స్థిత ప్రజ్నూలైన స్వామిజి , పై మెట్టుపై తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్న గురుదేవుల వారికి , క్రింద మెట్టు పై తాముకూడా ఒక తుండు గుడ్డ పరచుకొని కూర్చున్నారు!?.
No comments:
Post a Comment