💝ప్రకృతి వర ప్రసాదాలు: *మెంతులు*💝
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*మెంతులు మన ఆరోగ్యానికి రక్షణ కవచం.
మెంతులు వేసిన పచ్చళ్ళు,ఊరగాయలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
పిత్త రోగి మెంతులు తీసుకోరాదు, వాత, కఫ రోగులు మెంతులు తీసుకుంటే చాలా శ్రేయస్కరం,వాత నొప్పులు,కఫ దోషాలు పూర్తిగా నయమౌతాయి.
*అయితే మెంతులు ఎలా తీసుకోవాలి?*
ఒక చెంచాడు మెంతులు గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టి,ఉదయం నమిలి తినాలి.
కొందరు మెంతులు పొడిచేసి తింటారు,కానీ మెంతులు నమిలి తింటే నోటిలో లాలాజలం ఊరుతుంది,మన నోటిలోని లాలాజలం మన శరీరం ఆరోగ్యం కోసం తయారు చేయబడుతున్న ఆత్యంత విలువైన ద్రవం.
No comments:
Post a Comment