Tuesday, 27 February 2018

నీవు,నేను ?

శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడే అనడానికి అలానే
పునర్జన్మ సిద్ధాంతం మీద భగవద్గీత నుండి చక్కని శ్లోకం.

నీకు నాకు అనేక జన్మలు గతించాయి  అనడంలో భగవానుడి ఆంతర్యం ఏమిటి??? ఈ జన్మలు నీవు ఎరుగవు నాకు తెలుసు అనడంలో ఆంతర్యం ఏమిటి???

శ్రీమద్భగవద్గీత
నాల్గవ అధ్యాయము
4:5

బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున,
తా న్యహం వేద సర్వాణి‌
న త్వం వేత్థ పరంతప

శ్రీ భగవానుడిట్లు పలికెను:- శత్రువులను తరింపజేయు ఓ అర్జునా! నీకును, నాకును ఇంతవర కనేక జన్మలు గడిచినవి. వాని నన్నిటిని నే నెఱుగుదును. నీ వెఱుగవు.

పూర్తి వివరణ

నీవు,నేను ఇప్పుడు ఉన్నాము. ఇదివరలో లేము అనే మాట సరైనది కాదు. మనము నిత్యులము. నిత్యమైన నా మూల స్వరూపము ఉండనే ఉన్నది. అది కాక.... మత్స్య,కూర్మ,వరాహ,నృసింహ, వామన ఇత్యాది బహురూపాలు నేను పూర్వము స్వీకరించినటువంటి వసుదేవ సుతునిగా నేను ఇటీవల వాడినే అయినను లోగడ వివిధ రూపాల్లో (జన్మలో) పెక్కు మంది పురుషులకు అనేక ఉపదేశాలని ఇచ్చి ఉన్నాను...... ఇది శ్రీకృష్ణుడు తెలిపిన
ఆయన అవతారముల రహస్యము
దీని బట్టీ శ్రీకృష్ణుని మూల రూపము నారాయణుడే అని స్పష్టం ఐనది. కనుక ఈ శ్రీకృష్ణుడే నారాయణ రూపంలో కల్పాది యందు సూర్యునికి ఈ యోగమును ఉపదేశించెను. వసుదేవ సుతునిగా నేడు దీనిని అర్జునుడికి ఉపదేశించెను. ఇందులో కాల వ్యత్యాసం ఉన్నది కానీ వైరుధ్యాలు ఏమి లేవు

ఇందు భగవానుడు తన సర్వజ్ఞత్వమును జీవుల అల్పజ్ఞత్వముని ప్రకటించుచున్నాడు.... అతను ప్రకటించిన లీలలని, ఘటనలని ఇతర విశేషాలను అతను ఎరుగును. సర్వజ్ఞుడు కానందున అర్జునుడు ఎరుగడు. అర్జునుడికి తన పూర్వ జన్మల స్మృతియే లేదు. కనుక అతను ఇలా ప్రశ్నించెను. జగత్తు లో ప్రతీ సంఘటన ఆయనకి (శ్రీకృష్ణుడు కి) తెలియకుండా జరగదు. భూత,భవిష్య,వర్తమాన కాలాలు అన్ని భగవానుడుకి వర్తమానాలే. సర్వజ్ఞుడు అయిన అతను అన్ని ఎరుంగును. కల్పాది యందు నారాయణ రూపము యందు  శ్రీకృష్ణుడు ఉపదేశించైనా విషయాలని అర్జునుడు ఎరుగడు....కానీ భగవానునికి తెలుసు
సుదర్శన చక్రం

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...