Thursday, 6 September 2018

GKM life story part 2 in telugu

G. కృష్ణమూర్తి గురువు గారు.(GKM)

ఉచిత వైద్యం అని తెలిసి 1968 జూన్ ..ఆ ప్రాంతంలో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో  జాయిన్ చేయటం , డాక్టర్లు మానవ ప్రయత్నం చేస్తాం అని చెప్పి ఆపరేషన్ చేయటం , అది ఫలించక పోవటం... శాశ్వతంగా అంగ వైకల్యానికి తెర లేపింది.  నా కళ్ళముందు ఆ హాస్పటల్ కి  స్ట్రెచర్ (stretcher ) మీద వచ్ఛిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 

  70 ఏళ్ళ నుంచి టీబీ. ఒక వ్యాధి కాదు, దానికి ఒక ఔషధముంది దాని విషఫలితాలకి కారణం మన నిర్లక్ష్యం మాత్రమే. ఔషధం లేకపోవటం కాదు. విషం మనం గుర్తించాలి.

శాశ్వతంగా పరుపుకే అంకితమైపోయాను.

మనసు తొందరగా తనను తాను మలచుకుంటూ... అదే సహజ స్థితి, అదే కరెక్ట్ స్థితి .. అదే అనుకూలమైన స్థితి అనిపించటం ..అనిపింపచేయటం భగవంతుడిచ్చిన వరమే అనుకుందాం.

  ఇక చిన్నప్పటి నుంచి అంటే సుమారుగా తెలుగు బాగా రాయటం ,చదవటం వచ్చింది 11 ఏళ్ళకి. తొమ్మిదేళ్ళ వరుకూ తెలుగు సైతం పెద్దగా చదవటం రాయటంలో  ప్రావీణ్యం లేదు. ఇంటికి ఆంధ్రప్రభ వచ్చేది వారపత్రిక.  అందులోని సీరియళ్ళు చదవటం అలవాటయింది. పఠనాసక్తి ఆ విధంగా మొదలైంది.

అప్పటినుంచి నవలలు చదవాలి... చదవాలి.. చదవాలి అనిపించేది. అంతకు మించి మరోధ్యాస లేదు. దీనికి బలాన్నిచ్ఛింది హాస్పిటల్ లో 8 నెలల్లో ఉన్న సమయంలో పూర్తికాలం  పఠనానికే అంకితమైపోయిఃది. ఏం పుస్తకాలంటారా ? డిటెక్టివ్ లు,నవలలు ,నవలలయితే ఒకటీ_రెండు. డిటెక్టివ్ లయితే 5_6. రోజుకి. పది గంటవయినా ఖచ్చితంగా చదవటంలో మునిగిపోయేవాణ్ణి.

  దాంతో నాకేమీ తెలిసేది కాదు, ఏ విధమైనటువంటి చింతా ఉండేది కాదు. ఆ లోకంలో..ఆ పాత్రలలో సంఘటనలలో మునిగి తెలుగువాడిని. క్రమక్రమంగా నాలో రచయిత బీజం. పడింది... తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం...

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...