G. కృష్ణమూర్తి గురువు గారు.(GKM)
బాల్యానికి వీడ్కోలు పలికే దశలో ఈ ప్రపంచం చూసిన నాకు నా కోరికలకు ఆకాశమే చాలా చిన్నదని అనిపించేది. కానీ సత్యాన్వేషణ కొనసాగిస్తున్నకొద్ధీ , వయసు మీద పడుతున్న కొద్దీ , జీవితంలో ఆటుపోట్లు రాపిడి జరిగిన కొద్ది నేనూ , నా కోరికలు కేవలం నీటి బుడగలు అని ,అంతకుమించీ మరేమీ కాదనీ బోధపడసాగింది. నా జీవితంలో నాకు ఐదారేళ్ళ వయసులో అప్పడివరుకూ అందరి పిల్లల లాగానే ఏ వంకరా లేకుండా ,ఏ అనారోగ్యం లేకుండా ఉండే వాణ్ణి. కానీ పౌష్టికాహార లోపం వల్ల శారీరక దుర్భలత ఉండేది. కానీ మానసిక ఉత్సాహం ముందు నా దుర్భలత నాకేనాడూ కూడా .. ఆనాడే కాదు ఈనాడు కూడా ఒక వీక్ పాయింట్ అనిపించటం లేదు. బాల్యంలో పౌష్టికాహార లోపం వల్ల వ్యాధులు చుట్టుముట్టడం వల్ల వెన్నుపూసలో టీబి ప్రవేశించింది. బహుశా మూడు లేదా నాలుగేళ్ల వయసులో కావచ్చు ... ప్రవేశించింది. డాక్టర్లు గుర్తించేరు. ట్రీట్మెంట్ చేస్తే పోతుంది లేకపోతే కాళ్ళు చచ్చు బడతాయి అని స్పష్టంగా చెప్పారు.
కానీ మా నాన్న ...అద్ధానిని నిర్లక్ష్యమందామో ,ఏమందామో నాకైతే ఏ పేరు పెట్టాలని అనిపించటం లేదు. అప్పుడే ఆయన చెప్పారు ఆర్ధిక పరిస్థితి వల్ల కావచ్చు. కేవలం ఆర్ధిక పరిస్థితుల వల్లనే సరైన వైద్యం చేయించలేకపోయారు, పౌష్టికాహారం ఇవ్వలేకపోయారు. అప్పటికే నేను మూడవ సంతానాన్ని. చిన్న జీతం , తల్లి తండ్రులు, అన్నదమ్ములు, బాధ్యతలు ,ఆ బరువు బాధ్యతలో నా సమస్య ఆయనకి పెద్దగా అనిపించ లేదు. ఏది ఏమైనా జరగాల్సింది జరిగి పోయింది. వెన్ను పూసలో ఆవగింజంత మొదలైన టీబీ క్రిమి పదమూడేళ్ళ పాటు పెరిగి పెద్దదై బాడీని అస్తవ్యస్తం చేసేసింది. బాడీ రూపు రేఖలన్నీ మార్చేసింది. గూని ఏర్పడింది. కాళ్ళు వీకైపోయాయి. నడిస్తే పడిపోవడం ఇవన్నీ కూడా పదేళ్ళ వయసు నుంచే ప్రారంభమయ్యాయి. గూననేది ఏడేళ్ల వయసు నుంచే ఏర్పడింది.
ఆ తరువాత ...సరే... ఏదో... తింటున్నా, తిరుగుతున్నా అందరి పిల్లల్లాగానే కాలం గడిపేస్తున్నాను, క్రమశిక్షణ అంటూ ఏమీ పెద్దగా లేదు.
ఇంటి నిండా ఎప్పుడూ చుట్టాలు. వాళ్ళకు భోజనాలు, పిల్లలకు భోజనాలు, బట్టలు, చదువులు, వచ్చేది అరాకొరా జీతం, అప్పులు, వడ్డీలు. అయినా ఆయన పరిస్థితి అది. ఆ సమయంలో షుమారు ఏడేళ్ళ వయస్సులో విజయవాడ , నేను పుట్టింది కృష్ణ లంకలో ,1954 డిసెంబర్ 11, రాత్రి 8.10 ని.లకు. భూమ్మీద పడ్డాను ఏడ్చుకుంటూ.
6_7 ఏళ్ళ వయసులో ఆయన నన్ను ... ఆయనకు RSS సంస్కారాలు , రామకృష్ణ, వివేకానంద సాహిత్య సన్నిహితం బాగా ఉండేది. మహాత్ముల జీవిత గాధలు ఆయన బాగా అధ్యయనం చేసేవారు.
ఏకాంతాన్ని ఇష్టపడేవారు. నలుగురిలో కలిసే వారు కాదు. మౌనాన్ని ఇష్టపడే వారు. విజయవాడ లోని 'దుర్గా కళాభవన్' అనుకుంటా.. ఏదో లైట్ గా గుర్తుంది. రామదాసు నాటకానికి తీసుకెళ్ళారు.
ఆధ్యాత్మికంగా మొదటి ముద్ర అది. ఆ తరువాత రామకోటి ఉత్సవాలకు అమ్మతో వెళ్ళటం, హరికథలు వినటం, ఆ హరికధల్ని ఇంటీకొచ్ఛి అనుకరించటం, అది మరో ఆధ్యాత్మిక ముద్ర. ఆ తరువాత తరచుగా కాదు కానీ ... నాకు గుర్తున్నంతవరకు ఒకటి రెండు సార్లు పున్నమ్మ తోటలో రామకృష్ణ సేవా సమితికి తీసుకు వెళ్ళటం, అక్కడ భజనలలో కూర్చో పెట్టటం, రామకృష్ణ, వివేకానంద ఫోటోలు అక్కడ పెద్ధమనుషులివ్వడం, వాటిని భక్తి పూర్వకంగా స్వీకరించటం , ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ముద్రలే.
అలా అజ్ఞాతంగా... ఎలా అయితే టీబీ కృమి నాలుగేళ్ళ వయసులో ప్రవేశించిందో, ఈ ఆధ్యాత్మిక బీజం కూడా ఒకే సమయంలో పడటం జరిగింది.
రెండూ పోటాపోటీగా పెరగలేదు కానీ , వ్యాధి వేగంగా పెరిగింది, ఆధ్యాత్మిక బీజం అట్టడుగుకి వెళ్ళిపోయింది. అనుకూల వాతావరణం ఆ బీజం అజ్ఞాతంగా .. మనసు పొరలలో దాగి ఉంది . వ్యాధి ముదరటం , శరీరంలో సగానికి పైగా భాగం స్పర్శ తెలియక పోవటం , మలమూత్రాలు వచ్ఛేది తెలియకపోవటం, బాహు మూలల్లో నుంచి స్పర్శ లేకపోవటం , పదమూడేళ్ళ వయసులో మొదలైంది (ఇంకాఉంది)
No comments:
Post a Comment