Sunday, 22 July 2018

భారతీయ సంస్కృతిలో నేటితరం

*భారతీయ సంస్కృతిలో నేటితరం*

అమ్మమ్మలూ, నానమ్మలూ దగ్గర  సెలవుల్లో గడిపి వారు చెప్పే ఆరోగ్య సూత్రాలను , సాంప్రదాయాలను తెలుసుకుని,  వారు చెప్పిన కధలతో అనుభవాలతో కాలక్షేపం  చేస్తున్న పిల్లలు, వీటిని వారి దినచర్య రాసుకునే  పుస్తకం లో  (డైరీ)  రాసుకుని తన అనుభవాలను కూడా రసుకుని ,ఆనాటి పాతకాలం  నాటి ఆటలు ఆడుతూ , అందులో  ఉన్న  మర్మాన్ని తెలుసుకుని , నిజజీవితంలో నడుచుకుంటూ, 64 కళలలో  ఏదోఒక  కళను తన  చిన్నతనంలోనే అభ్యసించి , పట్టుసాధించి  ఏకాగ్రతను పొందాలి , పలుభాషలలో మాట్లాడే చాతుర్యాన్ని పెంచుకుంటూ  ఉండాలి. (సంస్కృతం వంటి మూలభాషలు.)

* వ్యక్తిత్వం కలిగిన ఆదర్శమైన వ్యక్తుల యొక్క  జీవితాలు , చందమామ , బాలమిత్ర వంటి కధల పుస్తకాలు చదువుతూ , టీవీలకూ, కంప్యూటర్లకు ,ఫోన్లకూ దూరంగా ఉంచుతూ అప్పుడప్పుడు వాటితో  వారి భవిష్యత్ కుపయోగపడేవి మత్రమే  వాడవలెను.

• పదవ తరగతి నుండి చదువు మీద శ్రధ్ధ , దృష్టి పెట్టి , పదవతరగతిలో ఉత్తీర్ణులైనట్లు  చూసుకోవాలి. ఆ తరువాత, వారికున్న  అభిలాష‌ , తండ్రి యొక్క సంపాదనా , తల్లి యొక్క ప్రేరణా చూసుకుని  ఏ మార్గంలో వెళ్ళాలో తెలుసుకోవాలి .

తక్కువ కాలం పట్టే చదువులు, దీర్ఘకాలం పట్టే చదువులు , ఉద్యోగం చేసే శక్తి ఉంటే , పదవతరగతి లో వచ్చే మార్కులను బట్టే , ఏదో ఒక జాబ్ ను  చేసుకుని,  ఓపెన్ డిగ్రీ  చదువుకోవాలి. ఇంటికి సహాయ పడాలి.

ఒకవేళ  ప్రభుత్వోద్యోగం  చేయాలని మనసుంటే వాటికి సంబంధించిన పుస్తకాలను చదవాలి.  ఖాళీ సమయంలో కాలక్షేపం చేసే సమయంలో ఇటువంటి పుస్తకాలను చదవవలెను.

ఆడపిల్లలు దీర్ఘ చదువులు లేదా ఉన్నతమైన చదువులు చదవాలనుకుంటే దేహానికున్న కోరికలు తీర్చిన తరువాత చదవడం ఉత్తమం అంటే వివాహమైన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత జాబు కొనసాగవలెను.

మగవారు దీర్ఘ చదువుల తరువాత (డిగ్రీ బీటెక్ తర్వాత ) ఉద్యోగం  వెతికి సంవత్సర కాలం  చేసి,వచ్చిన ధనాన్ని  దాచుకుని , ఖర్చు పెట్టకుండా దాచి  దేశాటనకు వెళ్ళాలి.(బ్రహ్మ చర్యానికి) చిన్న ఉద్యోగాలు. ఆశ్రమాల్లో, పుణ్యక్షేత్రాలలో, సత్రాలలో ఉంటూ, ఖర్చు తగ్గించుకుంటూ , ఉంటూ ప్రభుత్వోద్యోగం చేయాలనుకునే వారు అలా ప్రయత్నించాలి లేదా చిన్న చిన్న ఉద్యోగాలు గానీ  చేస్తూ  తన ఖర్చులకు ధనం సమకూర్చుకుని, ప్రభుత్వోద్యోగానికి  ప్రయత్నం చేయాలి .ఉన్నత చదువులు చదవాలనుకునే వారు ఇలా వెళ్లాలి. (తల్లిదండ్రులపై ఆధారపడకూడదు) తనకేది ఇష్టమో, తనకేమి  నైపుణ్యం ఉందో ,తనకెంత సత్తా ఉందో తెలుసుకుని తనపై తనకు  పట్టు రావలెను. భవిష్యత్  లో చదువులు అనగా ఎమ్.టెక్ , పి.హెచ్.డి. వంటి చదువులు వివాహమైన తరువాత ,పిల్లల చదువుల తో పాటు ,వారికి ఆదర్శంగా నిలిచి చదువుకోవాలి.

ఇతరులను చూసి , తనకుటుంబానికి లేనిపోని ఖర్చు లను రాకుండా , పరిసరాలను  అర్థం  చేసుకుని ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుంటూ, ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా, ద్రవపదార్థాలను తీసుకుంటూ , ఉపవాసం ఉంటూ , దేహాన్ని శుద్ధి చేస్తూ , పిల్లలని కనీసం ఒక ఆడ మగును పెంచవలెను.(దత్తత అయినా సరే పెంచవలెను.)

వారిని ఇదే మార్గం లో పెంచవలెను. ఇలా పిల్లల ను పెంచి , భారతీయ సంస్కృతిని కాపాడవలెను.

పిల్లల్ని  పెంచిన తరువాత , పెళ్ళిళ్ళు అయిన తరువాత  తను  ఆపిన బ్రహ్మచర్యాన్ని  చేస్తూ యవ్వనంలో తెలుసుకున్న తనపై  తో తనకున్న పట్టును కొనసాగిస్తూ, తనకుతాను తెలుసుకోవలెను.తన భాగస్వామి కి నేర్పిస్తూ ఇంటికి  దూరంగా ,భాగస్వామికి నేర్పిస్తూ ఆశ్రమాలకూ,పుణ్యక్షేత్రాలకూ వెళుతూ , సంసారం సాగరాన్ని  మరుస్తూ, భగవత్ చింతనతో , ఏకాంతంతో ( నామ స్మరణ/ధ్యానము/ లేదా సేవ చేస్తూ  (మొక్కలకు నీరు పెట్టడం  వంటివి.) )

ఏకాంతాన్ని   అనుభవిస్తూ చేయాలి. అనంతమైన ఏకాంతాన్ని కోరుకునే వారు  భాగస్వామి యొక్క అనుమతి తో సురక్షిత మైన స్థలంలో  లేదా  కొడుకు దగ్గర ఉంచి , శాశ్వతమైన  ఏకాంతం కోసం దేశాటనకు వెళ్ళాలి. తన ఆరోగ్యాన్ని బాగున్నా ,బాగులేకపోయినా ఎవరికీ తెలపకుండా , ఈశ్వరుని కోసం  తపించ వలెను. తరం*

ఏకాంతాన్ని   అనుభవిస్తూ చేయాలి. అనంతమైన ఏకాంతాన్ని కోరుకునే వారు  భాగస్వామి యొక్క అనుమతి తో సురక్షిత మైన స్థలంలో  లేదా  కొడుకు దగ్గర ఉంచి , శాశ్వతమైన  ఏకాంతం కోసం దేశాటనకు వెళ్ళాలి. తన ఆరోగ్యాన్ని బాగున్నా ,బాగులేకపోయినా ఎవరికీ తెలపకుండా , ఈశ్వరుని కోసం  తపించ వలెను.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...