*!! స్త్రీ !!
మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక *స్త్రీని సృష్టించడం* మొదలుపెట్టాడు .. ఒక రోజూ రెండు రోజులూ కాదు, ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు *స్త్రీ సృష్టికోసం,* మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది ..
*స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని ..?*
దేవుడు ఏం చెయ్యను మరి... ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా .. *ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ, సృష్టి వివక్ష తగదు, మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి, చిన్న - చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా ..*
ఆమె ఎంత మందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా ..
*ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి, అడిగేవారు ఉండరూ, ఉండకపోవచ్చు .. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి, ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే ..*
*ఏంటీ .. ?*
ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా ..? అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది,
ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది.
*దేవుడు .. ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు,. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు, అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు,. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు .,*
*ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం,. అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి,. అవసరమైతే దిగమింగాలి,. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి,. తనకు aన్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు, .. ఇతరుల దగ్గర .. ఆశించేది ప్రేమానురాగాలను ..*
ఓహో.. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.
దేవుడు ఎందుకాలోచించదు .. *?* అన్ని *విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు ..*
దేవత ఆమె చెక్కిళ్ళను తాకి ..
చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ .. *?* కన్నీరు కారుస్తోందిగా .. ఏంటిది .. *?* అని అడిగింది.
*దేవుడు అదా ... కన్నీరది,. ఆ కన్నీటిలో ఆనందమూ, ఆవేదనా, దుఃఖమూ, దిగులూ, ఆశ్చర్యమూ, భయమూ,. అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం .. పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది చెప్పాడు.*
దేవత ఆశ్చర్యపోతూ మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే .. అని చెప్పింది ..
*అయితే దేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు .. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది* .. చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని ..
No comments:
Post a Comment