Sunday, 1 July 2018

*శ్రీ రమణ అష్టోత్తర వ్యాఖ్యానం *

ఓం మహాశేన మహోంశేన జాతాయా నమః

ప్రతి పదార్ధం :- మహాసేన = గొప్పదండు (సైన్యం)
కలవాడైన స్కందుని; మహాస్ = తేజస్సు యొక్క అంసేన = అంశ చేత , జాత = పుట్టినవాడు.

తాత్పర్యం :- మహాసేనుని   తేజాంశమున (స్కందుని /సుబ్రహ్మన్యుని)
పుట్టినవాడు.

వ్యాఖ్య:- అభయము చిత్తశుద్ధి, యోగజ్ఞానముల యందు సుస్థిరత, దానము,నిగ్రహము,యజ్ఞము, స్వాధ్యాయము,తపస్సు,సరళత్వము,అహింస,సత్యము,క్రోధారాహిత్యము,త్యాగము, శాంతి,ఇతరుల దోషముల నెన్నమి,భూతదయ,దూరాసలేమి,మృదు ప్రవర్తన,నిశ్చలత,ధైర్యం,సహనము, చిత్తస్థైర్యం ,శుచిత్వము, ద్రోహచింతన లేకుండుట,గర్వరాహిత్యము _ ఇవి దైవీసంపదకు సంబంధించిన లక్షణములు.దేవసేన ఇదే.

    స్కందుడు దేవసేనాపతి. అంతరాత్మనుండి మనసును బాహ్యవిషయముల వైపు త్రిప్పే అసురీ వాసనలను అంతమొందించు నట్టివాడు. భగవాన్ శ్రీరామణ మహర్షి కలి ప్రభావకలితులైన ప్రజల నుద్ధరింప నవతరించిన సుబ్రహ్మణ్యవతారము.
భక్తనుగ్రహము కొరకు బ్రహ్మజ్ఞాన బోధకై దివి నుండి భువికి దిగివచ్చిన సకల లోకాగురుడు, సనత్కుమారుడు అయిన స్కందమూర్తి.   ‎

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...