Tuesday, 3 July 2018

మానవ ఆరోగ్యం

నిత్యజీవితంలో ఆరోగ్యంగా ఉండుటకు పాటించాల్సిన నియమాలు  -

*  సూర్యోదయానికి మూడు గంటల ముందుగా నిద్రలేచి చక్కగా ముఖప్రక్షాళణ చేయవలెను .

*  చక్కగా దంతములు శుభ్రపరుచుకొని నాలుకపైన ఉన్న మలిన పదార్థాలను తొలగించి , మలవిసర్జన గావించవలెను.దీనివలన నోటిరోగాలు రావు .

*  గంట, గంటన్నర వరకు శరీరం అలిసిపోయేంతవరకు వ్యాయామాలు , యోగాసనాలు వేయవలెను .

*  అటుపిమ్మట శుభ్రమైన నీళ్లతో శిరఃస్నానం
చేయవలెను .చల్లని ప్రవాహంలో నీరు చాలా శ్రేష్టమైనది. మూడు లేదా వారం రోజులకొకసారి
అభ్యంగస్నానం చేయవలెను .  అభ్యంగస్నానం చేయడం వలన ముసలితనం, వాతం, శ్రమ మొదలగువాటిని హరించి శరీరానికి దృఢత్వం ప్రసాదిస్తుంది.

*  ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆ సూర్యకిరణాలు శరీరం అంతా ప్రసరించే విధంగా చేయవలెను .సూర్యకిరణాల ప్రభావం వలన రోగోత్పత్తికి కారణం అయిన సూక్ష్మక్రిములు హరించును .

*  అటుపిమ్మట తేలికయిన ఆహారం భుజించవలెను.

*  అతివేడి , అతిచల్లని ఆహారపదార్థములు తినరాదు. తొందర పడకుండా చిన్నగా భుజించవలెను. రెండు వంతులు ఆహారం , ఒక వంతు జలం , మరొక వంతు వాయుప్రసారానికి అణుగుణంగా ఖాళీగా ఉంచవలెను.

*  శరీర ఆరోగ్య రక్షణ కొరకు పరిశుభ్రమైన గాలి చాలా అవసరం . ఈ గాలి లభించు ప్రదేశాల యందు ఎక్కువసేపు ఉండుటకు ప్రయత్నించాలి.

*  ప్రతినిత్యం ఉతికిన బట్టలను మాత్రమే వాడవలెను.చెప్పులు లేకుండా నడవరాదు.

*  సాత్విక ఆహారాలు , ఆకుకూరలు , పప్పు, నెయ్యి , చిక్కటి మజ్జిగ , చారు , పండ్లు, రొట్టెలు భుజించవలెను.

*  అన్నం తిన్నవెంటనే కూర్చొనుట, పడుకొనుట , చేయరాదు . ఫర్లాంగు దూరం అయినా నడవవలెను . ఆ తరువాత ఎడమవైపుకు తిరిగి పడుకోవలెను. ప్రాణులకు
ఎడమవైపు బొడ్డుకు పై భాగం నందు జఠరాగ్ని ఉండును. కావున తినిన పదార్థాలు తొందరగా జీర్ణం అవుతాయి.

*  నేరేడు , రేగు , బీర, మేడి , చింత, తాటి, కొబ్బరి , శొంటి, అరటి, పనస, కొబ్బరి తో చేసిన పదార్థాలు , నూవ్వులనూనెతో చేసిన పదార్థాలు ప్రాతఃకాలంలో తినరాదు.

*  అరగడానికి సమయం తీసుకునే పదార్థాలు అయిన పిండివంటలు , లడ్డులు, అటుకులు
మొదలయిన పదార్థాలు భొజనం చేసిన తరువాత తినరాదు.

* బాగా చన్నీటితో స్నానం , వేడినీటితో తలస్నానం చేయరాదు .

* ఏ సమయంలో కూడా ఎక్కువసేపు సూర్యుణ్ణి చూడరాదు. ఉదయం , సాయంత్రపు అస్తమించుచున్న సూర్యుడిని , నీటి యందు సూర్యుడిని చూడటం, అద్దము నందు ప్రతిఫలించే సూర్యుడిని , గ్రహణం పట్టిన సూర్యుడిని చూడుట నిషిద్దం.

*  రాగిపాత్ర యందు నిండుగా నీరు పోసి వాటిని తెల్లవారుజామున తాగిన మూలవ్యాధి , శోభి , జ్వరం, ఉదరవ్యాధి, మూత్రవ్యాధి, గ్రహణి, శూలలు , నేత్రరోగములు రాకుండా నిరోధించును

*  కఠినమగు ఆహార పదార్థాలు అయిన నెయ్యి, రొట్టె, పప్పు, దుంప వంటివాటిని మొదట భుజించి పిదప  మృదు పదార్థాలు అయిన అన్నం , కూర, పచ్చడి మొదలగునవి చివరకి పులుసు, మజ్జిగ, నీరు తీసికొనవలెను.
ఈ విధముగా క్రమ పద్ధతిలో ఆహారం తీసుకొనేవారు ఆరోగ్యంగా బహుకాలం జీవించుదురు.

*  దప్పిక కలిగినపుడు భుజించటం, ఆకలి ఉన్నప్పుడు నీరు త్రాగటం చేయకూడదు . భుజించినప్పుడు చిన్నగా ఆహారం పూర్తిగా నమిలి మింగవలెను. అప్పుడు ఆహారం బాగుగా జీర్ణం అగును.

*  దగ్గునప్పుడు , నవ్వునప్పుడు చేతికి అడ్డుపెట్టుకొనవలెను . సంధ్యాకాలం నందు భోజనం , నిద్ర , స్త్రీ సంగమం , పఠనం పనికిరావు .

*  వాజీకరణ , రసాయనిక ఔషధాలు సూర్యోదయానికి ముందుగానే సేవించవలెను .

       పైన చెప్పిన నియమాలు పాటించినచో ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందును .

       నా నుంచి రాబోతున్న గ్రంథము నందు ఇంకా వివరంగా ఇస్తున్నాను . భోజన నియమాలు , నీటిని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను.

  
             కాళహస్తి వెంకటేశ్వరరావు

               అనువంశిక ఆయుర్వేదం

                       9885030034

☘ మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 9 ) ☘

మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి ........
      వాగ్భటులు చెప్పిన సూత్రం , భోజనం చేసిన 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీపమై ఉంటుంది.

      భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే , కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు. భోజనం మగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకల నీరు త్రాగవచ్చును.

  భోజనం తరువాత తీసుకోతగిన ఉత్తమమైన పదార్థాలు, పండ్లరసాలు , మజ్జిగ , పాలు. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను ( ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు మాత్రమే) ఉదయం భోజనాంతరము, మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరము , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది. 

💧నీళ్ళు ఎలా త్రాగాలి : ----

      నీటిని ఎప్పుడు నిలబడి త్రాగరాదు.

💦 రిఫ్రిజరేటర్ నీళ్ళు చాలా హానికరం.

💧గట గటా నీరుత్రాగే విధానం ఏ మాత్రం మంచిది కాదు.

💧ఒక్కొక గుటక గుటకగా నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. ఇది నీరు త్రాగే సరియైన విధానం. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి.

      ఎందుకంటే  నోటిలో లాలజలం తయారవుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. మనం నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగితే నోటిలో లాలజలంతో కలసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలోని ఆమ్లాలతో కలసి న్యూ ట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలజలం తయారయ్యేది పొట్టలోనికి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికే. అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల భారిన పడకుండా ఆరోగ్యం గా జీవించ వచ్చును.

      ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కోక్క గుటగా త్రాగుతుంది.
   " ఆరోగ్యమే ---- మహాభాగ్యం "
  శ్రీ రాజీవ్ దీక్షిత్.....💐💐

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...