Wednesday, 3 April 2019

నేటి సమాజం అభివృద్ధి

   రామకృష్ణ పరమహంస గారికి శారదా మాత కు వివాహం జరిగిన తరువాత ఎలా ఉందో వారి జీవిత చరిత్ర తెలుసుకుంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఇటువంటి సమస్యలు రావు చాలా గొప్పవారు గాంధీ లాంటి వారికి అలాగే వివాహాలు జరిగాయి కొన్ని తప్పులు జరగడం వల్ల ఇలా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  పెళ్లి అయిన తరువాత అత్తవారింటికి పంపించినట్లయితే బాల్యంలో ఉన్న పాపకు అవగాహన లేక ఇటువంటి సమస్యలు వస్తాయి. శారదా మాత గారు యుక్తవయసుకి వచ్చే వరకు అత్తవారింటికి పంపలేదు అది గుర్తుంచుకుంటే ఎంతో మంచిది ఈ కలియుగంలో లో మంచి కన్నా  చెడు ఎక్కువ జరుగుతుందని చూపించడం తెలపడం తిరుగుతున్నది.

మంచి చెడు రెండూ ఉంటాయి అర్థం చేసుకునే మనసు బట్టి, సమాజం బట్టి వ్యక్తిగతమైన నాయకులు చెప్పే మాటలు బట్టి సమాజంలో మార్పు జరుగుతుంది కానీ మన భవిష్యత్తు కోరి నిర్ణయించిన ఋషుల పద్ధతి మన జీవితానికి ఎంతో ఆనందాన్ని కలిగించేలా చేశారు, కానీ ఈ కలియుగంలో మూడనమ్మకాలని వాటిని పక్కన పెట్టి అందులో ఉన్న సైన్స్ ని అర్థం చేసుకోక ఇటీవల ఉన్న యువత స్వేచ్ఛ కావాలని ఎటువంటి అవగాహన లేకుండా నియంత్రించుకునే మందులు వాడి సమాజం స్వేచ్ఛ కోరుతున్నది మీరే చెప్పండి.

  కొంతమంది నాయకులు వారి వాక్చాతుర్యం వల్ల సమాజంలో ఉన్న కొన్ని లోపాల్ని అందులో ఉన్న రహస్యం దాచి లోపాన్ని పెద్దగా చేసి వారిని బయటికి తీసుకుని వస్తే మంచిదని ఆ నాయకులు భావించి బాగా పేరుతెచ్చుకున్నారు.
 
  'గృహలక్ష్మి ' అన్నాపదాన్ని అర్థం చేసుకోకుండా 'వంటింటి కుందేలు' అని చెప్పి అందులో ఉన్న రహస్యం మరిచి ఎన్ని అనారోగ్యాలకు కారణం అయ్యాము.
 
  ఆడవాళ్లు బయటికి వస్తే ఏం జరుగుతుందో మన పెద్దవాళ్ళు ఋషులు కి బాగా తెలుసు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ఆడవారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాము మరియు ఉద్యోగం చేస్తూ చాలా మంది యువకులు నిరుద్యోగులుగా ఉండటంవల్ల కొన్ని కుటుంబాలు కష్టాల్లో ఉన్నారు.

  అతిగా సంపాదన వల్ల ఇటు వైపు వెళ్తున్నాము. మీరే అర్థం చేసుకోండి నీతిగా, నిజాయితీ సంపాదన వల్ల ప్రకృతికి హాని కలిగించకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన ఆనాటి కాలాన్ని గుర్తు చేసుకోండి. సమాజాన్ని, ప్రకృతిని కాపాడాలంటే మీరే సరికొత్త నిర్ణయం చేయండి మరి. పాత చింతపండు రుచి ఉండదు కదా మీకు.

  ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య వస్తే నేనంటే నేనని అని గొడవ పడకుండా, ఒకరు అర్ధం చేసుకుని మౌనంగా ఆ వస్తువును అయినా, కోరికను అయినా త్యాగం చేసి తనలో అహంకారాన్ని తగ్గించుకుని సర్దుకుపోతూ ఉంటే ఏ సంసారమైనా ఆనందంగా ఉంటుంది. అలాకాకుండా, అహంకారాన్ని పెంచుకుని నేనంటే నేనని, నా ఆలోచనల్ని, వ్యక్తిగతంగా గౌరవించడం లేదని, నా మాట వినట్లేదని ఇష్టం వచ్చినట్టు, వస్తువులను, కోరికలను వదిలి, ఇల్లు సంసారాన్ని వదిలి, బాధ పెంచుకుని, చదువుకున్నామనే అహంకారంతో, ఉద్యోగం చేసి బ్రతకగలమనే ధీమాతో, ధైర్యంతో చిన్న చిన్న గొడవలకి కూడా బెట్టు చేసి, ఇటీవల కాలంలో కోర్టుల్లో కేసులున్నాయి.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...