https://youtu.be/abejQDqcg7M
ఓ... గాలి, నీరు, ఆకాశమా అమ్మను చూసారా?
మీరు అగుపిస్తే నేనడిగానని అమ్మకు చెపుతారా?
మీరు అగుపిస్తే నేనడిగానని ఓసారి చెపుతారా?
ఆకాశం కిందికి వేస్తే నేను అడుగుతాను
మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను.
నవమాసాలూ మోసి,జన్మ నాకు ఇచ్చింది.
కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది .మా అమ్మ దూరమయ్యింది.
ఓ... గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా?
మీరు అగుపిస్తే నేనడిగానని ఓసారి చెప్పుతారా?
1. చంకనెత్తుకుని నాకు చనుపాలనివ్వలేదు..2
గోరుముద్దలు తినిపిస్తూ నన్నూరడించలేదు
చందమామను చూపిస్తూ నేను బుజ్జగించలేదు
ఎక్కి ఎక్కి నేనెంత ఏడ్చినా జోలపాడలేదు
ఒడిలో ఊయలూపలేదు...ఓ... గాలి నీరు ఆకాశమా...
https://sps-yogam.blogspot.com/2019/04/blog-post_10.html
2. తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురవలేదు
తుళ్ళిపడి అమ్మంటు ఏడ్చినా బాధవినగరాదు
అరచేతులపై ఎత్తుకుని ఆడించలేదు నన్ను 2
నాన్న ఎదలపై గారం చేస్తూ ఆడలేదు నేను
ఎపుడూ ఆటలాడలేదు...ఓ...గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా...
3. పటపటమంటూ చినుకు రాలితే చెట్టు పీల్చుకుంది..2
చెత్తకుండీ నా బాధను చూసి ఆకలి తీర్చింది
ఉరుములు ఉరిమి మెరుస్తుంటే ఏ ఒడిలో దాచుకోను?
అమ్మ ఒడిలోని పిల్లను చూస్తే గుండె పగిలె నాకు
బాల్యం తల్లడిల్లుతుందే...ఓ...గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా...
4. అమ్మల్లారా,ఓ తండ్రుల్లారా నా బాధ వినగరండి..2
నాలాగే మీ పిల్లలను పారేసి వెళ్ళకండి
మూడు తలల ఆ బ్రహ్మదేవుడు జాలిలేనివాడు
అయినవాళ్ళను ఎడబాపి నను అనాధ చేసాడు
అమ్మకు దూరం చేసాడు....ఓ... గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా?
No comments:
Post a Comment