Sunday, 26 November 2017

Serch god


Searching God, found solution in Bharat

-American born Catholic Marteena

దేవుడిని వెతికా, చివరికి సమాధానం దొరికింది భారతపుణ్య భూమిలో. సనాతన ధర్మాన్ని పాటించే హిందుత్వం స్వీకరించిన తరువాత దేవుడు గుడిలోనో, చర్చిలందో లేదా మస్జిద్ లందో లేడు .. సృష్టి అణువణువునా దైవ స్పర్శతో పునీతమై ఉన్నదీ అని తెలుసుకున్నాను :
అని అంటున్న మార్టీన

నేను ఒక అమెరికన్, కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాను .. నాకు చిన్నపుడు నుండి మా చర్చి ఫాస్టర్.. యేషు ఒక్కడే దేవుడు ఇంకెవ్వరు లేరు అని చెప్తుండే వాడు .. ఐతే నాకు అంతగా అతని మాటలకూ నమ్మబుద్ధి కాలేదు.. నేను పాత, కొత్త నిబంధనలు రప్పించి చదివి .. మా పాస్టర్ కి అడిగాను .. పాత.. కొత్త నిబంధలు వేరు వేరుగా ఎందుకు ఉన్నాయి అంటే ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు ..

ఐతే ఒక రోజు చర్చిలో అందరి ముందు ప్రార్ధన అనంతరం ఈ ప్రశ్న లేవనేత్తను .. అప్పుడు ఇలా అడిగాను .. భూమి ఆకారం కోసం బైబిల్ ఎందుకు తప్పుగా చెప్పింది ..??
బైబిల్ ప్రకారం తప్పు..నింద స్త్రీ పైనే ఎందుకు పెట్టారు??
తండ్రి పక్కన కూతురు కామాలీలలతో పాల్గోవచ్చు అని ఉంది .. ఇంతకు బైబిల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి .? ఒక గ్రంధంలో "కామం" మొహం" అసూయలకు ఎలా స్థానం కల్పించారు అని ప్రశించే సారికి ఆ చర్చి సభ్యులు నన్ను ఇంకోసారి చర్చికి రావొద్దు అని నన్ను అక్కడ నుండి తరిమిసారు అప్పుడు వయషు 13 ఏళ్ళు..

ఆ తరువాత నా ముస్లిం స్నేహితులతో కొన్ని రోజులు గడపగా వాలు చెప్తున్నా మాటలు విని ఒక రోజు వాళ్ళతో మస్జిద్ కి వెళ్ళాలని ప్రయత్నించాను కానీ అక్కడ నాకు చేదు అనుబవం ఎదురవ్వింది, నేను ముందు హిజాబ్ వేసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు హిజాబ్ వేసుకొని ఇంటికి వెళ్లి అక్కడే నమాజ్ చేయాలనీ "అల్లాహ్ నేను పాపి ని నేను ఏ జన్మలో ఎంతో పాపం చేశాను అందుకు నన్ను మహిళగా సృష్టించావు" అంటూ వేడుకోవాలని చెప్పారు. ఆ మాట విని నాకు కన్నీళ్ళు ఆగలేదు నేను వెంటనే వాళ్ళకు అడిగాను .. అల్లాహ్ ఎవ్వరు .. అంటే వాళ్ళు చెప్పారు ఇస్లాం దైవం అని .. అల్లాహ్ ని మీరు చూసారా అంటే లేదు అల్లాహ్ ని మేము చూడాలే అల్లాహ్ కి రూపం లేదు అని చెప్పారు, వెంటనే నేను వాళ్ళకు అడిగాను .. రూపం లేని దైవానికి మగడు అనే ఎలా ముద్ర వేసారు అని అడిగే సారికి "మొహమద్ ప్రవక్త చెప్పారు అని వాళ్ళు బదులించారు చెప్పారు, అప్పుడే అర్ధం అవ్వింది ఇస్లాం లో మహిళా సామ్రాజ్యంపై చాల తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి అని ఇస్లాం లో మహిళలను కేవలం కామా వంచన తీర్చడానికి ఒక బొమ్మగా ఉపయోగిస్తారు అని .. మహిళలకు మస్జిద్ లోపనకి ప్రవేశం కూడా ఉండదు అంటే ఎంత అపవిత్రం గా చుస్తునారో తెలుసుకొని నాలో నేను కుమాలి పోతు ఏడుస్తున్న తరుణంలో ..

ఓ రోజు ఒక వృద్దా మహిళా న చెంతకు వచ్చి .. పవిత్రమైన భావాలకు ఆధ్యాత్మిక నిలయం .. భారతదేశం మరియు ఇక్కడ పుట్టిన నిజమైన దైవం కోసం కొన్ని ఆధారాలతో నాకు మొత్తం వివరించి చెప్పారు .. ఐతే నేను ఆమె మాటకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే ఇంతకు ముందు వెళ్ళిన  మతంలో మహిళలకు విలువ లేదు అని తెలుసుకున్న ఇంకా భారతదేశంలో ఇంకా దారుణంగా ఉంటుంది అని పాస్టర్ చెప్పిన వాఖ్యలు గుర్తొచ్చి ఇంకే హిందుత్వం వైపు వెల్ల గోడుదని నిక్షయిన్చాకున్నాను..

కానీ ఒక రోజు నా స్నేహితురాలు భారతదేశం నుండి తీసుకు వచ్చిన గంగ జలం ఇచ్చి నన్ను త్రాగామని చెప్పింది ఎందుకో కొంచం అయిష్టంగనైన తాగేస .. మీరు నమ్ముతారో లేదు ఆ క్షణం నేను నా స్నేహితురాలి అడిగా గంగ ఎవ్వరు ఏమిటి ఈ కదా అని అడిగా అప్పుడు ఆమె చెప్పిన మాటలు "గంగ అంటే నీరు" భారతీయులు మంచి నీటిలో దేవుణ్ణి చూస్తారు ..నేను అశ్చర్యంగా అడిగా గంగ మహిళా కదా మరి మహిళా మీద అక్కడ విపక్షం చూపార అని అడిగే సారికి ఆమె సమాధానం .. వాస్తవానికి కేవలం భారతియులు ఆరాధించేది "భరత మాత, భూమాత, వేదమాత, గోమాత, ధన మత, ధాన్యమాత అంటూ ఇలా
భారతీయులు ప్రతి మంచి విషయాలలో కూడా మహిళలకే ప్రథమస్థానం ఇస్తారు ... మనం అక్కడికి వెళ్తే తప్ప మనకు భారతియుత యొక్క పవిత్రత కోసం మనకు తెలియదు .. మనం చర్చిలంట వింటున్న వన్నీ తప్పుడు ప్రచారంలే..

అప్పుడు నేను అడిగా మరి అంత మంచి హిందుత్వం కదా మరి నేడు ప్రపంచంలో అత్యధిక శాతం క్రిస్టియన్ మతం ఇస్లాం మతం ఎందుకు తీసుకుంటున్నారు అనే సరికి , ఆమె చాల చక్కగా జవాబు ఇచ్చారు "స్వర్గం చాల చిన్నది" నరకం చాల పెద్దది" నరకం వైపు వెళ్ళడానికి అన్ని తలుపులు తెరిచి ఉంటాయి.. కానీ స్వర్గం వైపు పయనించాలంటే ఒక చిన్న ఇరుకు సందులో నుండి ప్రయాణించాలి అని సమాధానం నా గుండె అంతర్భాగానికి తాకింది .. ఆ మరుసటి నెల వచ్చే సారికి నేను భారతదేశానికి ఎలాగైనా వెళ్లి అక్కడ వస్తావా రూపం తెలుస్కుంట అని వచ్చా .. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత తెలుసుకున్న .. ప్రపంచానికి .. తల్లి-తండ్రి లాంటిది ఈ వేద భూమి భారతదేశం అన్ని ఇక్కడ ఉన్న ప్రేమనురాగాలు ప్రపంచ మొత్తం ఎక్కడ వెతికినా దొరకవు.. ఇక్కడ మహిళాలకు ఇచ్చే గౌరవం చూస్తుంటే నాకు ఇంకో జన్మంటూ ఉంటె ఒక మహిళగా ఈ వేద భూమిలో పుట్టాలని ఉంది అంటూ .. స్థానికి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మార్టీన పై వీధంగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి సోదర మన దేశం ఎంత గొప్పదో??
మల్లేశం విశ్వనాథం  గారి సౌజన్యముతో

Monday, 18 September 2017

Raman1,2,3

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -1.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
శ్రీ రమణుల ముత్తాతల కాలంలో ఒకసన్యాసి భిక్షకోసం రమణుల పూర్వీకుల యింటికి వచ్చాడు.   వారి ముత్తాత చిరాగ్గా  ఆ భిక్షకుని చూస్తూ  " దున్నపోతులా వున్నావు.  ఏదైనా పనిచేసుకోరాదా? " అని కేకలు  వేశాడు.  అయితే ఆ సన్యాసి కూడా అంతే కోపంతో " నీ వంశములో కూడా నాలాగే తరానికి వకరు సన్యాసియై యింటింటికీ వెళ్లి అడుక్కుందురు గాక! "  అని శపించాడు.  అప్పుడు ముత్తాత గారు ఆ భిక్షుకునికి నమస్కరించి "  ఏమిటి  ఈ విపరీత భావన.  కనికరించండి "   అని అడుగగా " మాకోపం తాటాకుమంట లాంటిది.  కానీ మావాక్కు తిరుగులేనిది.  అంతా మంచే జరుగుతుంది " అని వెళ్ళిపోయాడు. 

అన్నట్లుగానే, మూడుతరాలు ఆశాపం కార్యరూపం దాల్చింది.  భగవాన్ రమణుల తాతలలో వొకరు సన్యాసం స్వీకరించారు.  ఆయనపేరు శివానందయోగి.   రెండోతరంలో భగవాన్ పెదతండ్రి వెంకటేశ్వర్ 18 సం. లకే  ప్రాపంచిక సుఖాలపై  విరక్తుడయ్యాడు.  తరువాత తరంలో  మన రమణులు కూడా 16 సం.ల వయస్సులోనే యిల్లువదలి అరుణాచలం వెళ్ళిపోయారు.

ఆహా ! మహాత్ముల శాపాలు మానవ కల్యాణం కోసమే కదా! ఆ శాపమే, మానవాళికి రమణమహర్షి ద్వారా జీవిత సత్యాలని చెప్పి పునీతులని చేసింది.  ఎందరినో  ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తున్నది.

శ్రీ రమణుల ఆశీస్సులతో మరికొంత రేపు....

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -2.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

అది 1879 డిసెంబరు, 29వ తేదీ.  అర్ధరాత్రి దాటింది.  ఇంగ్లీషు లెక్కల ప్రకారం 30 వ తేదీ వచ్చింది. ఒంటిగంట సమయం.  ఆరోజు హిందువులకు పర్వదినం అయిన ఆరుద్రా దర్శనోత్సవం.

ప్రదేశం :  తమిళనాడులో మదురై దగ్గర తిరుచ్చుళి గ్రామం.  ఈ గ్రామమే ' త్రిశూలపురం ' అని స్కాందపురాణం లో పేర్కొనబడింది.   ఆగ్రామంలో శ్రీ భూమినాధేశ్వరుని  ఆలయంలో ఈశాన్యం వేపు వున్న ఓ ఇల్లు.

ఆ యింటిలో శ్రీ సుందరఅయ్యర్  గారి  భార్య అళగమ్మ ఉదయం నుండి పురిటినొప్పులు పడుతున్నది.  ఆమెకు బాసటగా ఆమె అత్తగారు, పొరుగింటి అంధస్త్రీ లక్ష్మీఅమ్మాళ్, మరికొందరు స్త్రీలు వున్నారు.  అప్పుడే  పునర్వసు నక్షత్రంతో చంద్రుడుకూడి కాంతులు వెదజల్లుతున్నాడు.  శ్రీ భూమినాదేశ్వరుడు గ్రామం అంతా ఊరేగి,  తన ఊరేగింపు ముగించుకుని ఆలయానికి చేరబోతూ, ఒక్క క్షణం ఆయింటి ముందు ఆగాడు.   సరిగ్గా ఆసమయం లోనే, ఉదయం నుండి నొప్పులు పడుతున్న అళగమ్మ  పండంటి మగబిడ్డను ప్రసవించింది.  ఆ  భూమినాధేశ్వరుడు, తన ఊరేగింపు ముగించుకుని వచ్చి తన చల్లని దృష్టి ప్రసరింప చేయడం కోసమే,  ఆమె ప్రసవం ఆగినట్లున్నది.

మనుమడు పుట్టినందుకు ఆమె అత్తగారు సంతోషింపక పోగా, తన కుమార్తెకుమారుడికి ఆడపిల్లని యిచ్చి మేనరికం చెయ్యలేక పోతున్నామే అని బాధపడింది.  అయితే, ప్రక్కనే వున్న అంధమహిళ " మగబిడ్డ బంగారుముద్ద లాగా వెలిగిపోతున్నాడు.  కాంతిపుంజంతో అవతారమూర్తి లాగా వున్నాడు. ఎందుకు ఏడుస్తావు. " అని వోదార్చింది.    ఆశ్చర్యం.  ఆ అంధురాలు, లక్ష్మీఅమ్మాళ్ కి యెలా ఆ కాంతిపుంజం దర్శనం అయింది.  బాలుని రూపురేఖలు యెలా కనబడ్డాయి?   తరువాత రోజుల్లో  అజ్ఞాన అంధకారంలో నుంచి  మనుష్యుల జీవితాలను వెలుగులోనికి తీసుకువచ్చే మహనీయుడు జన్మించాడని సంకేతమా?   అంతే అయివుంటుంది.  ఎందుకంటె,  ఆ బాలుడే, ' భగవాన్ శ్రీ రమణమహర్షి ' నామంతో కలియుగ కుమార స్వామిగా ఆరాధింప బడినవాడే కదా!

సుందరఅయ్యరు గారు ఆబాలునికి తమ కులదైవమైన వేంకటేశ్వరుని పేరుపెట్టారు.  కానీ, వేంకటేశ్వరుడు బడిలో ప్రవేశించిన తరువాత ' వెంకటరామన్ ' గా మారాడు.   లక్ష్మణ్ అయ్యర్ అనే తెలుగు పండితుడు
' రమణుడు ' అనీ ' రమణీ ' అని ముద్దుగా పిలిచేవాడు.  అదే కాలక్రమేణ స్థిరపడింది.  ఆయన తెలుగు సాంప్రదాయాన్ని రమణుడికి  అలవాటు చేశాడు.    ఆ విధంగా రమణుడి   ఎలిమెంటరీ విద్యాభ్యాసం జరుగుతుండగా, 8 సం. వయస్సులో ఆ బాలునికి తండ్రి శాస్త్రోక్తంగా ఉపనయనం చేశాడు.
 
స్వస్తి.

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -3.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

రమణుడికి  ఆంగ్లభాష నేర్పాలని తండ్రి సుందరం అయ్యరు కోరిక.  అయితే తిరుచ్చుళి లో అలాంటి బడి లేక పోవడంతో 1891 లో  మన వెంకటరామనుని  దిండిగల్లులో వున్న తన పెద్దతమ్ముడు సుబ్బయ్యరు  వద్దకు పంపాడు.  అప్పటికే రమణుని అన్నగారు నాగస్వామి అక్కడే చదువుకుంటున్నాడు.  రమణుడు మొదటిఫారంలో చేరాడు.  రమణుడు ఏకసంధాగ్రాహి.  అయితే చదువుపట్ల పెద్దఆసక్తి కనబరచేవాడు కాదు.  విన్నదివిన్నట్లుగా వప్పగించేవాడు.  కానీ శ్రద్ధలేదు.  నిద్రలో   అపరకుంభకర్ణునిలా వుండేవాడు.  ఆ నిద్ర మొద్దునిద్రగా భావించలేము.  అది రాబోయేకాలంలో కఠొరమైన  ఆత్మానుభవానికి నాందిగా అనుకోవచ్చు.  కొద్దిరోజుల్లోనే సుబ్బయ్యరు గారు దిండిగల్లు నుండి మధురకు మారారు.  పినతండ్రి, అన్నగారితో పాటు మన వేంకటరామన్ కూడా మదురై చేరారు.  అక్కడవున్న స్కాట్ మిడిల్ స్కూల్ లో రెండవ ఫారంలో చేరాడు.

కాలం మార్పులను తెస్తుందికదా!  సుందరం అయ్యరు మధ్యవయస్కులుగా వుండగానే, అనగా 48వ యేటనే అనారోగ్యానికి గురి అయ్యి మరణించారు.  ఆయన చనిపోయే నాటికి నలుగురుసంతానంలో పెద్దవాడు నాగస్వామికి 16 సం.  రెండవవాడు వెంకటరామన్ కి 12 సం.  మూడవవాడు నాగాసుందరానికి 6 ఏళ్ళు.  ఆఖరిదైన  ఆడపిల్ల అలువేలుమంగ    యింకా పోత్తిళ్లలోనే వున్నది.  అట్టిపరిస్థితులలో సుబ్బయ్యరు గారు అన్నగారి మొదటి యిద్దరుపిల్లలని మదురై లో వుంచుకుని తన  భ్రాతృప్రేమ   చాటుకున్నాడు.  అదేవిధంగా మిగిలిన యిద్దరుపిల్లల భారం రెండవతమ్ముడు నెల్లియప్పయ్యర్ వహించాడు.   అవీ ఆరోజుల్లో కటుంబవిలువలు.  అన్నదమ్ములు  కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునె తీరు.  ఈరోజులలో వూహకుకూడా అందనివి.

ఇంతజరిగినా, తండ్రిమరణం గానీ కుటుంబమార్పులు కానీ వెంకటరామన్ పై యేప్రభావం చూపలేదు.  జీవితాన్ని ఉదాసీనంగా గడుపుతున్నాడు.  అమెరికన్ మిడిల్ స్కూల్లో 4వ ఫారం లో చేరాడు.  అయితే చదువునందు మాత్రం పెద్ద శ్రద్ధ కనబరచుట  లేదు.  ఆంగ్లము, గణితము  అసలే పట్టలేదు.  తమిళ వ్యాకరణం తమిళ శ్లోకాలు మాత్రం వింటే మర్చిపోయేవాడు కాదు.  స్వతహాగా తెలివిగలవాడు అవడం వలన ఆసక్తి చూపకపోయినా అన్నిపరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు.

వేంకటరామన్ మంచి కండపుష్టి కలవాడు.  ఈ దారుధ్యమే తనకు దీర్ఘకాలం మౌననిష్టలో కూర్చునేందుకు దోహదపడింది అనిపిస్తుంది.   అతని కండబలం చూసి అందరూ ముచ్చటపడేవారు.  ఆటలపట్ల ఆసక్తి చూపించేవాడు.   ఫుట్బాలుఆటలో మేటిగా వుండేవాడు.  ప్రతీరోజు వైఖానదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు.  ఎండాకాలం తనూ, స్నేహితులతో కలిసి చెలమలు తవ్వి, వారు స్నానమాడి, గ్రామస్తులకు నీటి కొరత తీర్చేవారు.  పినతల్లికి వంటలో, ఇంటిపనుల్లో సాయం చేసేవాడు.  ఆమెకి మడీ ఆచారం ఎక్కువ కావడంతో తడిగోచీతో వంటింట్లోకి రమ్మంటే యిష్ట పడేవాడు కాదు. 

ఆహా!  కాలమహిమ.  అట్టి తడిగోచీ ఇష్టపడని వేంకటరామన్ భవిష్యత్తులో  శాశ్వతంగా గోచీ ( కౌపీనం ) తోనే జీవితం గడిపి యితరులకు వైరాగ్యమార్గం చూపించాడు.

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

Sunday, 17 September 2017

రమణమహర్షి జీవితచరిత

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -7.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

అరుణాచలేశునిచే అక్కున చేర్చుకోబడిన  వేంకటరామన్, తరువాత ' అపీతకుచాంబ '  ఆలయాన్ని దర్శించుకున్నాడు.  ' అయ్యంగుల ' కోనేటి వద్దకు వెళ్ళాడు.  దగ్గరవున్న భక్ష్యపొట్లాలు  కోనేటిలోనికి విసిరి వేసాడు.   తన వెనుకటి జీవిత స్మృతులు గుర్తుకోచ్చేవన్నీ దూరంచేసుకునే కార్యక్రమంలో తన ఒత్తైన పొడవాటిజుట్టు కూడా అనవసరం అనుకున్నాడు.   అలాఅనుకుంటూ వుండగానే, ఒక అపరిచితుడు  ఆతనిని ఒకమంగలి యింటివద్దకు చేర్చి అద్రుశ్యుడయ్యాడు.   ఏమి  ఈశ్వరలీలా పరంపర.  అడుగడుగునా వేంకటరామన్ ని చెయ్యిపట్టుకుని నడిపించిన తండ్రి.   శిరోముండనం అనుకున్నంతలో తనప్రమేయం లేకుండానే ముగించుకున్నాడు  వేంకటరామన్.  ఇక కౌపీన వస్త్రధారణ. ఇది బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు.   తనుకట్టుకున్న వస్త్రాన్నే చింపి, ఒక పేలికను కౌపీనంగా కట్టుకున్నాడు.  మంగలికి ఇవ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారవైచాడు.   మళ్ళీ జీవితంలో ద్రవ్యాన్ని చేతులతో తాకలేదు.   ఇక మిగిలింది బ్రాహ్మణ సంకేతమైన యజ్ఞోపవీతం.  తన పూర్వజీవితములో తండ్రిగారు ఉపనయనం లో వేసినది.  జగానికే తండ్రి అయిన అరుణాచలపుత్రుడను కనుక నేను కులాలకు అతీతుడను అనుకుని వెంటనే  జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు.

ఇక  మిగిలింది స్నానం .  అదికూడా అనవసరమని వేంకటరామన్ వూరుకున్నాడు.  అయితే తండ్రి నియమలోపం జరుగనివ్వలేదు.  బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు. నీటిధారల మధ్య సన్యాస వ్రతధారణ నిరాటంకంగా పరిసమాప్తమైనది.  ఆశ్చర్యం.  అప్పటిదాకా గ్రామంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు.  చాలారోజుల తరువాత వెంకటరామన్ వచ్చి అక్కడ వర్షం కురిపించాడు తన సన్యాసధారణ కోసం. 

ఆరాత్రి అంతా వేంకటరామన్ ఆలయంలోని వేగాళ్ళమండపం లో చలికి గజగజ వణికిపోతూ కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మౌనంగా ధ్యాననిష్టలో కూర్చున్నాడు, కటిక ఉపవాసంతో.  మరునాడు ఉదయం ప్రక్కనే వున్న శ్రీగోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లో వుంటున్న మౌనస్వామి శిష్యునితో ఆ మండపంవద్దకు వచ్చాడు.  అక్కడే పచార్లుచేస్తున్న వేంకటరామన్ ని పరీక్షగాచూచి ఈ కుర్రవానికి ఆహారం తీసుకురమ్మని శిష్యునికి  చెప్పాడు.  వారు తెచ్చుకున్న భిక్షాన్నం లోని కొంతభాగాన్ని ఉప్పుడు బియ్యపు అన్నం పెద్ద పెద్దమెతుకులతో పైన ఉప్పు, అడుగున పుల్లనీళ్ళు, నంచుకునేందుకు ఊరగాయబద్దతో తీసుకువచ్చాడు.  ' అదే ఈశ్వరుడు మనకు పెట్టిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను ' అని తరువాత రోజుల్లో భక్తులతో ఆ సంఘటన తరచూ చెప్పేవారు, రమణులు.

ఆ తరువాత 3 యేండ్లదాకా   వేంకటరామన్ దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు.  హృదయ గర్భంలో తండ్రి పదిలంగా వున్నాడు కదా! 

అక్కడి సాంప్రదాయం ప్రకారం విరాగులు అయిన వారిని ' పరదేశులు ' అంటారు.  మన వేంకటరామన్ కూడా ఆ విధంగా బ్రాహ్మణ పరదేశి అయినాడు.  వేంకటరామన్  జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది. 

మొదటి రోజుల్లో వేగాళ్ళ మండపం మధ్యలో వున్న అరుగుమీద మౌనంగా ధ్యానంలో వుండేవాడు.  అప్పుడప్పుడు లేచి పచార్లు చేసినా మాట్లాడేవాడు కాదు.  ఆహారం గురించి యెవరినీ అడిగే  ప్రసక్తేలేదు తమకు తాముగా యెవరైనా యేదైనా యిస్తే, సమాధిస్థితిలో లేకపొతే తీసుకునేవాడు.  కొత్తప్రదేశం.  ఆదరించేవారు లేరు.  ఏ విధమైన రక్షణలేదు.  అసలు సిసలైన సన్యాస జీవితం.

కొంటె పిల్లలు కొందరు రాళ్ళు, చిల్లపెంకులు వేసి పరదేశి ధ్యానానికి అంతరాయం కలిగించేవారు.  వారి బారినుండి తప్పించుకొనడానికి పరదేశి అక్కడున్న పాతాళలింగ గుహను ప్రవేశించాడు.  అందులోకి వెళ్ళడానికి పిల్లలు భయపడే వారు.  లోపల అంతాచీకటి.  అందులోనికి వెళ్లి పరదేశి ధ్యాననిష్టలో వుండేవాడు.    అక్కడా కీటకాల బాధ, పిల్లల బాధ మొదలైంది.   పరదేశి ధ్యాననిష్టను చూసి, కంచి నుండి వచ్చిన శేషాద్రిస్వామి,  ఆయనను గుహ వెలుపల నుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. 

శేషాద్రిస్వామినీ   లెక్కచెయ్యక కొంతమంది తురకబాలురు గుహలోనికి రాళ్ళు వేయుచుండగా, ప్రక్కనుంచి వెళుతున్న వేంకటాచలమొదలియారు వారిని తరిమి, గుహలోనికి వెళ్లి కటికచీకటిలో  శివలింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి ( పరదేశి ) ని చూశాడు.  అక్కడే దగ్గరలో వేగాళ్ళమండపానికి పశ్చిమంగా వున్న తోటలో పళనిస్వామి  అనే ఆయన తన శిష్యులతో వుండేవాడు.  వారిని సహాయం పిలిచి అక్కడి నుంచి పరదేశిని బైటకు తీసుకువద్దామని ప్రయత్నించినా దేహస్మృతి కలగలేదు చిన్నస్వామికి.  వారు యేమీ చెయ్యలేక ధ్యానభంగం చెయ్యడం యిష్టంలేక ఆయనకు మ్రొక్కి వెళ్లిపోయారు.    చిన్నస్వామి ని అప్పటి నుంచి ' బ్రాహ్మణస్వామి ' అని పిలవడం మొదలుపెట్టారు.  అలా  'పరదేశి' పేరు నుండి ' స్వామి' అయ్యాడు మన వెంకటరామన్.   

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

Saturday, 16 September 2017

శ్రీ రమణుల

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -6.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

అతుల్యనాధేశ్వరుని కోవెల వెలుపల వెంకటరామన్ కూర్చున్నాడు, పూజారికై  యెదురుచూస్తూ..
కొంతసేపటికి పూజారివచ్చి పూజ ప్రారంభించాడు.  వేంకటరామన్ లోపలికివెళ్లి మండపం దగ్గర కూర్చుని ధ్యానం మొదలుపెట్టాడు.   ఉన్నట్లుంది ఏదో గొప్ప వెలుతురు తనదేహాన్ని కప్పినట్లుగా  అనిపించసాగింది.   కళ్ళు తెరచి నాలుగుడుగులు వేస్తే ఇంకెక్కడా ఆ వెలుగు కనిపించలేదు.  వెంటనే యధాస్థానానికి వచ్చి ద్య్హానంలో నిమగ్నుడైనాడు వేంకటరామన్.   ఇక్కడ చెప్పుకో వలసిన అద్భుతమైన విషయం యేమిటంటే  యిదే ప్రదేశంలో 16 సం. వయస్సులోనే జ్ఞానసంబంధమూర్తి అనబడే గొప్ప శివభక్తునికి కూడా యిక్కడే జ్యోతి దర్శనం అయ్యింది.  ఓం శ్రీ అతుల్యనాధేశ్వరాయనమ :

పూజారి పూజ ముగించుకుని వేంకటరామన్ని లేపి గుడితలుపులు మూసి వేరేగుడికి పూజ చెయ్యడానికి వెళ్ళాడు.  వేంకటరామన్ కూడా ఆయనను అనుసరించి  అక్కడా పూజ జరుగుతున్నంత సేపు ధ్యానంలో వుండిపోయాడు.   మళ్ళీ పూజారి అతనినిలేపాడు.  ఆకలి అవుతున్నది ప్రసాదం పెట్టమని వేంకటరామన్ పదేపదే అడిగినా కఠినహృదయుడైన పూజారి,  ప్రసాదం అతనికి యివ్వలేదు.  అతని పరస్థితి చూసి, అక్కడి నాదస్వరబృందంలో వాద్యగాళ్ళలో ఒకరి మనసు కరిగి తనప్రసాదం అతనికి ఇచ్చివేశాడు.  తరువాతి కాలంలో ఆపూజారి యెంత వగచాడో, ఆ వాద్యగాడు యెంత మురిశాడో, రమణునికి ప్రసాదం పెట్టనందుకు, రమణునికి ప్రసాదం పంచినందుకు.   

ఆప్రసాదం తీసుకుని కొండదిగి  ఒక యింటిముందు ఆగి నీరు యివ్వమని అడిగాడు వేంకటరామన్.  అంతలో యేమయ్యిందో తెలీదు.  శరీరం వశంతప్పింది. బాహ్యస్మృతి పోయింది.  మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి కొంత దూరంలో పడి వున్నాడు.  ప్రసాదం  చెల్లాచెదురు అయివుంది.  చుట్టూ జనం మూగి వున్నారు.  క్రింద పడిన ప్రసాదాన్నే కొంచెం తిని నీరుత్రాగాడు.  ఆ రాత్రి అక్కడే ఇసుకమీద నిద్రపోయాడు వేంకటరామన్.

మర్నాడు గోకులాష్టమి.  1896 ఆగష్టు 31వ తేదీ.   వెంకటరామన్, పూర్తిగా అలిసిపోయి వున్నాడు.  తిరువన్నామలై ఇంకా 20 మైళ్ళ దూరం వున్నది.  చేతిలో చిల్లిగవ్వ లేదు.  చెవులకి వున్న కెంపుల పోగులు తప్ప వంటిమీద ఖరీదైన వస్తువులు కూడా లేవు.  కడుపు ఆకలితో మండిపోతోంది.   ఒక బ్రాహ్మణ వీధిలో  ముత్తుకృష్ణ భాగవతార్ అనే ఆయన  యింటిముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు.   ఆయన సోదరి, జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడే తమ యింటికివచ్చాడని భావించి వంటచెయ్యడం మొదలుపెట్టింది.  వేంకటరామన్ పరిస్థితి చూసి, వంట అయ్యేవరకు  వుండలేడని  భావించి ముందురోజు మిగిలిన చలిది అన్నం తినిపించింది.   వంట పూర్తిఅయిన తరువాత పిండివంటలతో భోజనంపెట్టి, శ్రీకృష్ణునికి నైవేద్యం పెట్టడం కూడా మర్చిపోయి, వేంకటరామన్ కు   రాత్రి భోజనానికి మూట కట్టి ఇచ్చింది.   ఆమె చేసుకున్న సుకృతం  మాటలలో వర్ణించగలమా!  ఆమె సేవకు వెలగట్టగలమా!! 

మిగిలిన ప్రయాణానికి తన కెంపుల చెవి కమ్మలు 4 రూ. లకు ఆ ఇంటి భాగవతారు వద్ద తాకట్టుపెట్టి   ఆయన యిచ్చిన తాకట్టు చీటీని ఆయింటిబయటే చించివేశాడు, వున్న  ఆఒక్క బంధాన్నీ వదిలించు కున్నట్లుగా.  

ఆమె ఇచ్చిన మూట తీసుకుని రైలులో అరుణాచలానికి బయలుదేరి 1896 సెప్టెంబరు 1వ తేదీ నాడు అరుణాచలంలో అడుగుబెట్టాడు వెంకటరామన్.

అడుగుపెట్టీ పెట్టగానే, వేంకటరామన్ అపరిమితమైన ఆనందంతో వూగిపోతున్నాడు.  వెంటనే అరుణా చలేశుని ఆలయానికి పరిగెత్తాడు.  బిడ్డకోసం యెదురుచూస్తున్నట్లుగా  ఆ అరుణాచలేశ్వరుని  గుడి ద్వారాలన్నీ తెరిచేవున్నాయి, గర్భగుడితో సహా. 

వేంకటరామన్ దివ్యావేశంతో గర్భగుడిలోనికి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు.  ఉబికివస్తున్న ఆనంద బాష్పాలతో అరుణాచలేశ్వరుని అభిషేకిస్తూ "  తండ్రీ నీ ఆజ్ఞమేరకు వచ్చాను." అని విన్నవించుకున్నాడు.  ఆహా ! ఏమిదృశ్యము.   ఆతండ్రి యీబిడ్డకు ఏమి మౌనోపదేశం చేశాడో తెలియదు.  అంతవరకూ వేంకటరామన్ అనుభవిస్తున్న అశాంతి అనేమంట  చల్లారిపోయింది  అమృతం చిలకరించినట్లయ్యింది.   వేంకటరామన్ మామూలుభక్తులలా చేతులెత్తి నమస్కరించలేదు.  గుడికి ప్రదక్షిణాలు చెయ్యలేదు.   సాష్టాంగపడి మ్రొక్కలేదు.   మామూలుగా తండ్రికి బిడ్డ యివన్నీ చెయ్యవలసిన అవసరం లేదుకదా!   బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగలించుకున్నట్లు  అరుణాచలేశుని పెనవేసుకున్నాడు, యింక నీవేదిక్కని.   రేపటి గురించి చింతలేని పరిపూర్ణ శరణాగతి !  యెంత మనోహర దృశ్యం  !!

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....

ప్రేమతో,
ప్రభాకర్.

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...