Sunday, 30 July 2017


హోమ్ / ఆరోగ్యం / ఆయుష్ / ఆయుర్వేదం

పంచుకోండి

    చూపుము ఎడిట్ సూచించండి విషయ రచన భాగస్వామి

    స్థితి: సవరణ కు సిద్ధం

ఆయుర్వేదం

Contents

        ఆయుర్వేదం - ప్రాథమిక అంశాలు
        ప్రచురణలు సమాచారం
            దోషం
            ధాతువు
            మలం
            అగ్ని
        శరీర నిర్మాణం
        పంచమహాభూతాలు
        ఆరోగ్యం మరియు అస్వస్ధత
        రోగ నిర్ధారణ
        చికిత్స
        చికిత్సలో రకాలు
            శోధన చికిత్స (శుధ్దిచేయు చికిత్స)
            షమన చికిత్స (ఉపశమనాన్నిచ్చే చికిత్స)
            పథ్య వ్యవస్ధ (ఆహారం మరియు దినచర్యను వివరించడం)
            నిదాన్ పరివర్జన (వ్యాధిని కలిగించే మరియు తీవ్రం చేసే లక్షణాలను నిరోధించడం)
            మానసిక వ్యాధుల చికిత్స (సత్వవజయత్)
            రసాయన చికిత్స
        ఆహారం మరియు ఆయుర్వేద చికిత్స
        భారతదేశంలో జాతీయ స్ధాయిలో ఉన్న ఆయుర్వేద సంస్థలు
            రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం, కొత్త ఢిల్లీ
            జాతీయ ఆయుర్వేద సంస్థ, జైపూర్
            పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధన మరియు ఆయుర్వేద పరిశోధనా సంస్థ, జామ్ నగర్ (గుజరాత్)
        మలినాలను కడిగే పంచకర్మలు
        ఆస్థమాకి ఆయుర్వేద చికిత్స..!
        విషగర్భతైలం
        ధారా చికిత్స
        ఆయుర్వేదంలో రసాయన చికిత్స
        ఆయుర్వేదం... అద్భుత విషయాలు!

ఆయుర్వేదం - ప్రాథమిక అంశాలు

భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం. ఆయుర్వేదం అన్నది అక్షరాలా ‘జీవితం యొక్క శాస్త్రం’ అని అర్ధం. ఇతర వైద్య విధానాలలాగ కాకుండా ఆయుర్వేదం వ్యాధుల చికిత్స కంటే ఆరోగ్యకరమైన జీవనంపై మరింతగా దృష్టిని పెడుతుంది. ఆయుర్వేదంలోని భావన ఏమిటంటే ఇది కోలుకుని, ఉపశమనాన్ని పొందే ప్రక్రియను వ్యక్తిగతమైనదిగా చేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం నాలుగు ప్రధాన అంశాలతో రూపొందించబడి ఉంటుంది – దోషం, ధాతువు, మలం మరియు అగ్ని. ఆయుర్వేధంలో ఈ నాలుగు ప్రధాన అంశాలకు అత్యంత విశిష్టత ఉంది. ఇవన్నీ
ప్రచురణలు సమాచారం

‘మూల సిధ్ధాంతాలు’ లేక ‘ఆయుర్వేదం యొక్క ప్రాథమిక మౌలిక అంశాలు’ అని కూడా పిలువబడతాయి.
దోషం

వాతం, పిత్తం మరియు ఖఫం దోషం యొక్క జీవనాధారం వంటి అతి ప్రధానమైన మూడు సూత్రాలుః ఇవి క్యాటబోలిజమ్ (జీవధాతు నిర్మాణమందు రసాయనిక శక్తి విడుదల అగుట), మరియు అనాబోలిక్ (వివిధ రకాలైన పరమాణువులను వాటి అతి సరళ స్ధితి నుండి వాటి శక్తితో సహా సంగ్రహించి సంయోగం చేయు ప్రక్రియ) మెటాబోలిజమ్ (జీవక్రియ–శరీరంలో కలుగు భౌతిక, రసాయనిక మార్పులు, కణములు వృద్ధి చెందునపుడు గాని, నాశనమగునపుడు గాని వాటి యందు కలుగు మార్పు)ను క్రమబద్ధీకరించి, నియంత్రిస్తూ ఉంటాయి. శరీర ధాతు నిర్మాణానికి సహకరించే, అరిగి జీర్ణమైన ఆహారం యొక్క ఉప ఉత్పత్తులను (బై ప్రోడక్ట్స్) శరీరమంతటా వ్యాపింపచేయడం ఈ మూడు దోషాల ప్రధాన విధి. ఈ దోషాలలో ఏది సరిగా పని చేయకపోయినా అది వ్యాధికి కారణమవుతుంది.
ధాతువు

ధాతువును శరీరానికి సహకారాన్ని అందించేదిగా వర్ణించవచ్చు. శరీరంలో ఏడు ధాతు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రం అనేవి. ఇవి వరుసగా ప్లాస్మా, రక్తం, కండరాలు, కొవ్వు కణజాలం, ఎముక, ఎముక మజ్జ (నూలగ) లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ధాతువులు శరీరానికి మూల పొషకాలను మాత్రమే అందిస్తాయి. ఇది మెదడు యొక్క నిర్మాణానికి, పెరుగుదలకు సహకరిస్తుంది.
మలం

మలం అంటే వ్యర్ధం లేక మురికి పదార్ధం అని అర్ధం. శరీరంలోని మూడింటి గుంపులో అంటే దోషాలు మరియు ధాతువులతో కలిపి ఇది మూడవది. ప్రధానంగా మూడు రకాలైన మలాలు ఉన్నాయి. ఉదాహరణకుః మలం, మూత్రం మరియు చెమట. మలం అనేది ముఖ్యంగా శరీరం యొక్క వ్యర్ధ పదార్ధంవంటి ఉత్పత్తి. ఒక వ్యక్తియొక్క ఆరోగ్యం సరిగా ఉండాలంటే శరీరం నుండి వ్యర్ధ పదార్ధం సక్రమంగా విసర్జన జరగాలి అనేది ముఖ్యం. మలంలో ప్రధానంగా రెండు అంశాలున్నాయి, అంటే మలం మరియు కిత్తా. మలం అనేది శరీరంలోని వ్యర్ధ పదార్ధాలకు సంబంధించింది, కిత్తా అనేదంతా ధాతువుల యొక్క వ్యర్ధ పదార్ధపు ఉత్పత్తి.
అగ్ని

జీవక్రియకు మరియు జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల క్రియలు అగ్ని అని పిలువబడే, శరీరంలోని జీవశాస్త్రపరంగా ఉండే ఎంజైములు విడుదల చేసే ఉష్ణం యొక్క సహాయంతో జరుగుతాయి. ఆహార నాళం, కాలేయం, ధాతుకణాలలో ఉండే వివిధ రసాయనాలనే ఈ అగ్నిగా పిలువవచ్చు.
శరీర నిర్మాణం

ఆయుర్వేదంలో జీవం అనేది మానవ శరీరం, ఇంద్రియాలు, మెదడు మరియు ఆత్మల సమ్మేళనంగా భావించ బడుతోంది. జీవించి ఉండే మనిషి మూడు దోషాలు (వాత, పిత్త మరియు ఖఫములు), ఏడు ప్రాథమిక ధాతు కణజాలాలు (రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రాలు) అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు (మలం, మూత్రం మరియు చెమట) లతో కలిసి ఉన్న ఒక సమ్మేళనం వంటిది. ఆ విధంగా మొత్తం శరీర నిర్మాణం శరీరంలో ఉండే ఈ దోషాలతోనూ, ధాతువులు, కణజాలంతోనూ మరియు వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తులతోనూ కలిసి వుంటుంది. రసాలుగాను, ధాతువులుగానూ మరియు వ్యర్ధ పదార్ధంగానూ జీర్ణ ప్రక్రియ ద్వారా మారే మనం తీసుకునే ఆహారం చుట్టూ శరీరాకృతి మరియు అవయవ సంబంధిత పెరుగుదల మరియు క్షీణత అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆహారాన్ని మింగడం, అది జీర్ణమవడం, శరీరం దానిని గ్రహించడం, జీర్ణమయింది వంటబట్టడం అనేవి మానసిక వ్యవస్థపైన, అలాగే జీవాగ్ని (బయో ఫైర్) పైన, ప్రభావితం చేస్తూ, చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపే మన ఆరోగ్యంతోనూ, వ్యాధులతోనూ ఒకదానితో మరొకటి అంతర చర్యలను కలిగి ఉంటాయి.
పంచమహాభూతాలు

ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంతో సహా విశ్వంలో ఉండే ప్రతి పదార్ధం, వస్తువూ కూడా, ఐదు ప్రాథమిక సూత్రాలతో (పంచ మహాభూతాలు) రూపొందించబడి ఉన్నాయి. అవిః భూమి, నీరు, అగ్ని, గాలి మరియు శూన్యం (ఆకాశం). ఈ అంశాలతో, వివిధ ప్రమాణాలలో, శరీరాకృతి మరియు దాని ఇతర భాగాల విధులకు అవసరమయ్యే మరియు వాటి శరీర నిర్మాణాలకు అమరే విధులకు అవసరమయ్యే, ఈ పంచభూతాల ఒక సమీకృత కూర్పు తగిన నిష్పత్తులలో ఉంది. శరీరాకృతి పెరుగుదల మరియు అభివృధ్ది వీటి పొషక విలువలపై ఆధారపడి ఉంటుంది, అంటే మనం తీసుకునే ఆహారం మీద, ఈ ఆహారం, తిరిగి శరీరంలో జీవాగ్ని నిర్వహించే చర్య పూర్తయిన తరువాత, ఇదే శరీరం యొక్క ఈ మాదిరి భాగాలను నింపడం లేక వాటితో పొషణనిస్తూ, పై ఐదు పంచభూతాలతో నిండివుంటుంది. శరీరంలో ఉండే ధాతువులు నిర్మాణసంబంధితమైనవి, అయితే పంచభూతాలనుండి వివిధ సమీకరణలు మరియు మార్పిడినుండి ఆవిర్భవించిన రసాలు మాత్రం మానిసిక సంబంధిత పదార్ధాల వంటివి.
ఆరోగ్యం మరియు అస్వస్ధత

ఆరోగ్యం లేక అస్వస్ధత అనేవి వివిధ అవయవాల మధ్య ఉండే సమతుల్యతతో సహా మొత్తం శరీరం యొక్క సమతుల్యత ఉందా లేక లేదా అనే పరిస్ధితిపై ఆధారపడి ఉంటుంది, ఇందులో అంతర్లీనంగా మరియు బాహ్యంగానూ ఉండే రెండు అంశాలూ సహజ సమస్ధితి, సమతౌల్యంలో విఘాతానికి, గందరగోళానికి కారణమై రోగాలకు దారితీయవచ్చు. విచక్షణారహితమైన ఆహారం, అనుచితమైన, అవాంఛిత అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన జీవనసరళి నిబంధనలను పాటించకపోవడం అనే వాటివల్ల సహజ సమతౌల్యం లోపించవచ్చు. వివిధ ఋతుసంబంధిత అసమానతలు, వైపరీత్యాలు, లేక సున్నితమైన శరీరాంగాల అనిశ్చిత, అస్ధవ్యస్థమైన అభ్యాసాలు లేక వాటి అనుచిత వినియోగం మరియు శరీరం, మెదడు యొక్క పొంతనలేని చేష్టలు కూడా ప్రస్తుతం ఉన్న మానసిక సమతౌల్యంపై విఘాతాన్ని సృష్టించడానికి కారణ మవ్వవచ్చు. ఈ విధంగా విఘాతానికి గురైన శరీరాకృతిని, మెదడును తిరిగి యధాస్ధితికి తీసుకురావడానికి ఆహారాన్ని తీసుకోవడాన్ని క్రమబధ్దీకరించడం ద్వారా, మామూలుగా రోజూ గడుస్తూ వుండే జీవన విధానాన్ని, ప్రవర్తనను సరిచెయ్యడం, మందులని సరైన రీతిలో వాడుతూ ఉండడం వంటి వాటి నివారణోపాయంతో ఉండే పంచకర్మలను మరియు రసాయనిక చికిత్సా విధానాన్ని అనుసరిస్తూ ఉండడం ఉంటుంది.
రోగ నిర్ధారణ

ఆయుర్వేదంలో ఎప్పుడూ కూడా రోగ నిర్ధారణ వైద్యుడు రోగిని పూర్తిగా పరిశీలించిన తర్వాత జరుగుతుంది. వైద్యుడు రోగి యొక్క అంతర్గత బౌతిక, శారీరక లక్షణాలను మరియు మానసిక స్ధితి, స్వభావాలను శ్రధ్ధగా గుర్తిస్తాడు. రోగికి సంబంధించిన ఇతర అంశాలను, అంటే శరీరంలో ప్రభావితం కాబడిన ధాతువులు, కణజాలం, రసాలు, రోగం కేంద్రీకృతమైన ఉన్న చోటు, రోగి నిగ్రహం, తట్టకోగలిగే శక్తి, అతని దినచర్య, ఆహారపు అలవాట్లు, చికిత్సా సంబంధిత పరిస్ధితుల ప్రాధాన్యత వల్ల కలిగే ప్రభావం, జీర్ణం చేసుకోగలిగే పరిస్ధితులు, రోగి యొక్క వ్యక్తిగత, సాంఘిక, ఆర్ధిక మరియు పర్యావరణ సంబంధిత పరిస్ధితి అనే అంశాలను కూడా అధ్యయనం చేస్తాడు. రోగ నిర్ధారణ ఈ క్రింది పరీక్షలతో సహా కలిసి ఉంటుందిః

    సాధారణ శారీరక పరీక్ష
    నాడి పరీక్ష
    మూత్ర పరీక్ష
    మల పరీక్ష
    నాలుక మరియు కళ్ల పరీక్ష
    చర్మం మరియు చెవుల పరీక్ష, స్పర్శ మరియు వినికిడి సంబంధిత పరీక్ష

చికిత్స

ప్రాథమిక చికిత్సా విధానం అనేది ‘మంచి ఆరోగ్యానికి రక్షణనిచ్చేది మాత్రమే సరైన చికిత్సా విధానం మరియు మనల్ని వ్యాధులకు దూరంగా ఉంచేవాడే మంచి వైద్యుడు’. ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాన్ని ఇది దృవీకరిస్తుంది, అంటే ఆరోగ్య పరిరక్షణ మరియు పెంపొందించుకోవడం, రోగ నివారణ మరియు అనారోగ్యానికి చికిత్స వంటివి.

వ్యాధి నివారణ లేక చికిత్స అంటే పంచకర్మ పధ్దతులననుసరించడం ద్వారా మందులను తీసుకుంటూ ఉండడం, సరైన ఆహారం, చురుకుగా ఉండడం మరియు సమతౌల్యాన్ని మరియు శరీర యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన అభ్యాసాలు, పథ్యాన్ని పాటిస్తూ ఉండడం భవిష్యత్తులో సంక్రమించకుండా వ్యాధుల నివారణ లేక వాటిని తగ్గించడం కోసం చికిత్స అనే వాటి ద్వారా శరీరం యొక్క, దాని ఆకృతిని, లేక దాని ఇతర ఏ అవయవాల యొక్క అసమతౌల్యం, అనిశ్చితస్ధితికి గురిచేసే అంశాలను నివారించడం.

సామాన్యంగా చికిత్సా చర్యలు మందుల వాడకం, ఖచ్చితమైన, స్పష్టమైన ఆహారం, అలాగే విహితపరచబడిన దినచర్యలు అనే వాటి ప్రమేయంతో ఉంటాయి. రెండు విధాలుగా ఈ మూడు చర్యలను వినియోగించుకోవడం జరుగుతుంది. చికిత్స చేసే ఒకటో విధానంలో ఈ మూడు చర్యలు కూడా రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలనూ మరియు వివిధ రూపాలలో రూపాంతరం చెందుతూ ఉండే రోగాన్ని తమ ప్రతిచర్య ద్వారా వ్యాధిని నిరోధిస్తాయి, రెండో విధానంలో ఇదే మూడు రకాలుః మందుల వాడకం, ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన దినచర్యలను రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలు మరియు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వుండే వ్యాధి ప్రక్రియల మాదిరిగానే తమ ప్రభావాన్ని చూపించే విధంగా లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాయి. ఈ రెండు రకాలైన చికిత్సావిధానాలు విపరీత మరియు విపరీతార్ధకారి చికిత్సలు అనే పేర్లతో, ఆ వరుసలో పిలువబడుతూ ఉంటాయి.

విజయవంతంగా చికిత్సను విర్వహించడానికి నాలుగు ముఖ్యమైన విషయాలున్నాయి. అవి:

    వైద్యుడు
    ఔషధ ద్రవ్యాలు
    సేవచేసే సిబ్బంది
    రోగి

ఈ ప్రాధాన్య క్రమంలో మొదటి అంశం వైద్యుడు. అతను సాంకేతిక నైవుణ్యాన్ని, శాస్ర్రీయ పరిజ్ఞానాన్ని, స్వఛ్చత మరియు మనిషి యొక్క మనోగతాన్ని అర్ధం చేసుకోగలగడం వంటి లక్షణాలను కలిగివుండాలి. మానవసేవ చేయడంలో వైద్యుడు తన కౌశల్యాన్ని, జ్ఞానాన్ని వినయం, విధేయత, నమ్రత, విజ్ఞతలను ఉపయోగించాలి. ఇక ఈ ప్రధాన క్రమంలో తరువాత వచ్చే రెండవ అంశం ఆహారం, మందులు. ఇవి అత్యంత నాణ్యతకలిగి, విస్తృతంగా వినియోగించుకోవడానికి తయారుచేయబడి, అనుమతింపబడిన పధ్దతుల ద్వారా పెంచబడిన మరియు తయారుచేయబడి ఉండి, చాలినంత మేరకు అందుబాటులో ఉండాలి. ఇక మూడవ అంశం, సేవలనందించడంలో మంచి తెలివితో, వారియొక్క వృత్తిలో, కళలో ఆరితేరి ఉండే మరియు ఆప్యాయత, జాలి, దయతో, తెలివితేటలు, పరిశుభ్రతతో, స్వయంసిధ్దులుగా ఉండే సేవలనందించే సిబ్బంది (నర్సులు) పోషించే పాత్ర. చివరిగా నాలుగో అంశం సహకార స్వభావంతో వైద్యుడి సూచనలను, సలహాలను విధేయతతో అనుసరిస్తూ ఉంటూ, తన ఇబ్బందులను, బాధలను చక్కగా వివరించి చేప్పగలిగి ఉంటూ, చికిత్సనందుకోవడానికి కావలసిందంతా చేయగలిగే రోగియే.

వ్యాధికి చికిత్స చేయడంలో, వ్యాధికి కారణమయ్యే లక్షణాలు ప్రారంభమైనప్పటినుండి చోటు చేసుకుని వ్యాధి చివరికి రూపాంతరం చెందే వరకూ సంభవించే సంఘటనలను, పరిణామాల వివిధ దశల యొక్క స్పష్టమైన విశ్లేషణాత్మకమైన వివరణలను విశదీకరిస్తూ వ్యాధికి చికిత్స చేయడంలో ఆయుర్వేదం అభివృధ్ది చేసింది. వ్యాధిని కలిగించే, ప్రఛ్చన్నంగా దాగివుండే, వ్యాధి రావడానికి అవకాశమున్న లక్షణాలను బయటపడడానికి ముందే కనిపెట్టగలిగే, అదనపు సౌలభ్యాన్ని ఈ ఆయుర్వేద పధ్దతికి ఇది కలిగిస్తుంది. వ్యాధి ప్రబలడానికి ముందు దశలోనే దానిని అరికట్టడానికి సరైన, సమర్ధవంతమైన చికిత్సాపరమైన చర్యలను తీసుకోవడానికి వీలును కలిగించడం ద్వారా అది మరింతగా వృధ్ది అయ్యే అవకాశాన్ని తప్పనిసరిగా నివారించే పాత్రను ఇది చురుకుగా పోషిస్తుంది.
చికిత్సలో రకాలు

వ్యాధికి చేసే చికిత్సను ఈ క్రింది విధంగా విస్తృతంగా వర్గీకరించవచ్చు.
శోధన చికిత్స (శుధ్దిచేయు చికిత్స)

శారీరక (సోమేటికి) మరియు మనోవికృత హేతుక శరీర జాఢ్య సంబంధిత (సైకో-సోమేటిక్) వ్యాధులకు కారణమయ్యే అంశాలను తొలగించే ఉద్దేశ్యంతో ఈ శోధన చికిత్స అనేది పనిచేస్తుంది. ఈ ప్రక్రియ అంతర్గత మరియు భాహ్య శుద్ధీకరణ (ప్యూరిఫికేషన్) తో ప్రమేయం కలిగి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చికిత్సతో ప్రమేయం కలిగి ఉండేవిః పంచకర్మలు ఎమిసిస్ (వైద్యపరంగా ప్రేరేపించబడి, నోటిద్వారా కడుపులోని పదార్ధాలను బయటకు కక్కించే ఒక ప్రక్రియ), పర్గేషన్ (విరేచనకారి మందు వాడకం), అయిల్ ఎనీమా (ఆయిల్ ను గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), డికాక్షన్ ఎనీమా (కషాయాన్ని గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), ముక్కు రంధ్రాల ద్వారా మందును లోనికి పంపే ప్రక్రియ. మరియు పంచకర్మ విధానానికి ముందు అనుసరించే పధ్దతులు (అంతర్గత మరియు బాహ్య ఓలియేషన్ మరియు చెమట పట్టడాన్ని ప్రోత్సహించే సాంబ్రాణి వాడకం) గా ఉంటాయి. జీవక్రియ నిర్వహణపై పంచకర్మ దృష్టిని సారిస్తుంది. చికిత్సా సంబంధిత లాభాలతో పాటుగా, ఇది అవసరమైన శుధ్ది చేయబడే ప్రభావాన్ని అదనంగా కలుగ జేస్తుంది, ముఖ్యంగా నరాల సంబంధిత అనారోగ్య సమస్యలకు, అస్ధిపంజర-కండర సంబంధిత వ్యాధి పరిస్ధితులలోనూ, కొన్ని రకాలైన రక్తనాళమయ లేక నాడీ-రక్త సంభంధిత పరిస్ధితులలోనూ, శ్వాస సంబంధిత అనారోగ్యంలోనూ, జీవక్రియ మరియు జీవక్రియ క్షీణిస్తూ ఉండే అనారోగ్యం వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా సహాయకారిగా ఉంటుంది.
షమన చికిత్స (ఉపశమనాన్నిచ్చే చికిత్స)

అణగారి ఉన్న విషపూరిత రసాయనాల (దోషాల)తో ఈ షమన చికిత్స ప్రమేయం కలిగివుంటుంది. ఈ విధమైన ఇబ్బందికరమైన దోషాలు తగ్గిపోవడం లేక ఇతర దోషాలలో అసమతుల్యాన్ని కలిగించకుండా, సాధారణ పరిస్థితికి తిరిగి చేరుకునే ఈ ప్రక్రియ షమనగా పిలువబడుతుంది. ఆకలిని పుట్టించే వాటిని, జీర్ణమవడానికి సహకరించే వాటిని, వ్యాయామాలు మరియు సూర్యరశ్మికి గురి కాబడడం, స్వఛ్చమైన గాలి మొదలైన వాటి ద్వారా ఈ చికిత్సను విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ చికిత్సా విధానంలో ఉపశమనాన్నిచ్చే వాటిని మరియు ప్రశాంతతను కలిగించే వాటిని ఉపయోగించడం జరుగుతుంది.
పథ్య వ్యవస్ధ (ఆహారం మరియు దినచర్యను వివరించడం)

పథ్య వ్యవస్ధ అనేది ఆహర, దినచర్య, అలవాట్లు మరియు భావోద్రేక పరిస్ధితులకు సంబంధించిన లక్షణాలను లేక ప్రతిలక్షణాలతో కలిసి ఉండేది. చికిత్సాపరమైన చర్యల ప్రభావాన్ని అధికం చేయడానికి మరియు వ్యాధిని పుట్టించే ప్రక్రియను నిరోధించే ఉద్దేశ్యంతో ఇది చేయబడుతుంది. అగ్నిని ప్రేరేపించడానికి మరియు తగినంతగా జీర్ణమవడానికి మరియు ఆహారాన్ని సమీకృతం చేయడానికి, దీని ద్వారా ధాతువులలో బలాన్ని కలిగించేటట్లు చూసే ఉద్దేశ్యంతో ఆహార విషయంలో చేయవలసిన మరియు చేయకూడని వాటిని నొక్కి చెప్పబడుతుంది.
నిదాన్ పరివర్జన (వ్యాధిని కలిగించే మరియు తీవ్రం చేసే లక్షణాలను నిరోధించడం)

ఆహారంలోనూ మరియు జీవనశైలిలోనూ రోగి యొక్క తెలిసి ఉండి, గుర్తించిన వ్యాధి లక్షణాలను నివారించడానికి లేక నిరోధించడానికే నిదాన్ పరివర్జన్ ఉద్దేశింపబడింది. వ్యాధిని పెంచి లేక తీవ్రతరం చేసే లక్షణాల నుండి జాగ్రత్తపడుతూ, వాటికి దూరంగా ఉంటూ ఉండాలనే భావాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది.
మానసిక వ్యాధుల చికిత్స (సత్వవజయత్)

సత్వవజయత్ అనే మానసిక వ్యాధుల చికిత్స ప్రధానంగా మానసిక అలజడికి సంబంధించింది. ఇది మనసును అనారోగ్యకరమైన కోరికలను కలిగించే విషయాలనుండి దూరంగా ఉంచడం మరియు ధైర్యాన్ని అలవరుచుకోవడం, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించుకోవడం వంటి వాటితో కూడి ఉంటుంది. ఆయుర్వేదంలో మానసిక శాస్త్రాన్ని మరియు మనోవ్యాధుల చికిత్సా శాస్త్రాలను అధ్యయనం చేయడం, అలాగే మానసిక అనారోగ్యాల చికిత్సలో విస్తృత శ్రేణిలో అనుసరించే విధానాలూ అభివృధ్ది చేయబడ్డాయి.
రసాయన చికిత్స

రసాయన చికిత్స బలాన్ని, శక్తిని వృధ్ది చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరాకృతి పొందికగా ఉండడం, జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడం, వ్యాధి నిరోధక శక్తి, యవ్వనాన్ని, శరీర కాంతిని మరియు శరీర ఛాయను కాపాడడం మరియు శరీరం మరియు ఇంద్రియాల యొక్క శక్తిని, బలాన్ని అత్యున్నత స్ధాయిలో పోషించడం అనే కొన్ని సానుకూల లాభాలు ఈ చికిత్సా విధానానికి జత చేయ బడ్డాయి. శరీర ధాతువుల అకాల (పరిణతి చెందకుండానే) అరుగుదలను అరికట్టడం మరియు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని పెంపొందించడం అనేవి ఈ రసాయన చికిత్స పొషించే పాత్ర.
ఆహారం మరియు ఆయుర్వేద చికిత్స

ఆయుర్వేదంలో ఆహార నియమాన్ని ఒక క్రమ పధ్దతిలో, ఒక చికిత్సగా, పాటించడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా ఎందుకంటే, ఇది మానవ శరీరాన్ని ఒక ఆహార ఉత్పత్తిగా పరిగణిస్తుంది కాబట్టి. ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు ఆధ్యాత్మిక పెరుగుదల, అలాగే అతని స్వభావం, వ్యక్తిత్వం అనేవి అతను తీసుకునే ఆహారపు నాణ్యతతో ప్రభావితం చేయబడి ఉంటాయి. మానవ శరీరంలోని ఆహారం ముందుగా అన్నరసం లేక అన్నధాతుసారం లేక రసంగా మార్పుచెందుతుంది. అటు తర్వాత ఒకదాని వెంబడి ఒకటిగా ఈ ప్రక్రియ అంతా దీనిని రక్తం, కండరాలు, కొవ్వు, ఎముకలు, ఎముకలలో మజ్జ, పునరుత్పత్తికి అవసరమయ్యే మూల పదార్ధాలుగా మార్చడంతో కూడి ఉంటుంది. అన్ని జీవ ప్రక్రియలతో చెందే మార్పులకు మరియు జీవిత చైతన్యానికి ఈ విధంగా ఆహరం మూలాధారమైనటువంటిది. ఆహారంలో పొషకాలు కొరవడడం లేక సరిగా జీర్ణం కాకుండా, మార్పు చెందని ఆహారం అనేక విధాలైన వ్యాధులను కలిగించే పరిస్ధితులకు దారితీయవచ్చు.
భారతదేశంలో జాతీయ స్ధాయిలో ఉన్న ఆయుర్వేద సంస్థలు
రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం, కొత్త ఢిల్లీ

    ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఆయుష్ శాఖ, క్రింద ఉండే రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది సొసైటీస్ చట్టం 1860 క్రింద, 1988లో నమోదు కాబడిన రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం. 28 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నఆయుర్వేద పట్టభధ్రులకు, అలాగే 33 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లకు గురు శిష్య పరంపర ద్వారా, అంటే సాంప్రదాయసిధ్దమైన రీతిలో జ్ఞానాన్ని శిష్యులకు బోధించడం ద్వారా ఆధునికి, ఆచరణయోగ్యమైన శిక్షణనిస్తుంది.
    రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం యొక్క ఈ రెండు సంవత్సరాల సభ్యత్వ కోర్సు ఆయుర్వేద సంహితాలలోనూ మరియు వాటిపై ఉండే వ్యాఖ్యానాలపైనా జ్ఞానాన్ని పొందడానికి, సాహిత్య పరమైన పరిశోధన చేయడానికి, అలాగే మంచి బోధకులు గానూ, పరిశోధనావేత్తలు గానూ మరియు సంహితలలో నిపుణులుగానూ తయారవడానికి వీలును కలిగిస్తుంది. ఆయుర్వేదంలో తమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసిన విద్యార్ధులు పొస్ట్ గ్రాడ్యుషన్ కు సంబంధించిన సంహితాలను విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడానికి ప్రవేశాన్ని పొందుతారు. వారు చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన అంశాలపై శిష్యులు పరస్పరం చర్చించుకునేందుకు సరిపోయినంత సమయాన్ని కలిగి ఉంటారు.
    ఈ రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠంలోని ఒక సంవత్సరపు సర్టిఫికెట్ కోర్సులో (సి.ఆర్.ఏ.వి - CRAV) ఆయుర్వేదాచార్య (బి.ఏ.ఎమ్.ఎస్ – BAMS) లేక తత్సమానమైన డిగ్రీ కలిగివున్న అభ్యర్ధులు ప్రఖ్యాతి గాంచిన వైద్యుల క్రింద, మరియు సాంప్రదాయసిధ్దమైన చికిత్స చేసే వైద్యుల క్రింద మంచి చికిత్సను చేసే వైద్యులుగా తయారవడానికి, కొన్ని ఆయుర్వేద చికిత్సాసంబంధిత పధ్దతులపై శిక్షణ పొందుతారు.
    భారతదేశ మంతటా ప్రకటన (అడ్వర్టైజ్ మెంట్స్) లనివ్వడం ద్వారానూ, వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్ధులకు ఈ కోర్సులలో ప్రవేశం ఇవ్వబడుతుంది. ఈ ఉభయ కోర్సుల లోను చదివే విద్యార్ధులు నెలకు రూ. 15,820/-లు శిక్షణాకాలంలో ఇచ్చే భృతితో పాటుగా సమయానుకూలంగా వర్తించే కరువు భత్యాన్ని (డి.ఏ) కూడా పొందుతారు. రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠంలో చదువుకునే విద్యార్ధులు నెలకు రూ. 2500/-లు అదనంగా పొందుతారు.

జాతీయ ఆయుర్వేద సంస్థ, జైపూర్

    ఒక శాస్త్రీయ విధానంతో, ఆయుర్వేద చికిత్స విధానంలోని అన్ని అంశాలలోనూ అత్యున్నత ప్రమాణాలతో బోధన, శిక్షణ, మరియు పరిశోధనలు నిర్వహించడానికి, దేశంలో ఆయుర్వేదంలో ఒక శిఖరాగ్ర సంస్థగా ఈ జాతీయ ఆయుర్వేద సంస్థను భారత ప్రభుత్వంచే 1976లో నెలకొల్పడం జరిగింది.
    పట్టభధ్రులు (గ్రాడ్యుయేట్లు) క్రింది స్ధాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పి.హెచ్.డి. స్ధాయిలో బోధన, వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఆంశాలలోనూ మరియు పరిశోధనలను నిర్వహించడంలోనూ ఈ సంస్థ నిమగ్నమై, జోధ్ పూర్ లోని రాజస్ధాన్ ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయంచే దేశవ్యాప్తంగా నిర్వహింపబడు ప్రవేశ పరీక్షల (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ టెస్ట్) ఆధారంగా గ్రాడ్యుయేషన్, క్రింది స్ధాయి కోర్సులకు ప్రవేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పి.జి. కోర్సులకు ప్రవేశం ఎన్.ఐ.ఏ మరియు ఐ.పి.జి.టి.ఆర్.ఏ (ప్రత్యామ్నాయంగా) చే దేశవ్యాప్తంగా నిర్వహించబడే ఉమ్మడి పి.పి. ప్రేవేశ పరీక్ష (I.P.G.T.R.A - ఆల్ ఇండియా జాయింట్ పి.జి.ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా ఇవ్వబడతుంది.
    మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: National Institute of Ayurveda

పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధన మరియు ఆయుర్వేద పరిశోధనా సంస్థ, జామ్ నగర్ (గుజరాత్)

    ఒక శాస్త్రీయ విధానంతో, ఆయుర్వేద చికిత్స విధానంలోని అన్ని అంశాలలోనూ అత్యున్నత ప్రమాణాలతో బోధన, శిక్షణ, మరియు పరిశోధనలు నిర్వహించడానికి, దేశంలో ఆయుర్వేదంలో ఒక శిఖరాగ్ర సంస్థగా ఈ జాతీయ ఆయుర్వేద సంస్థను భారత ప్రభుత్వంచే 1976లో నెలకొల్పడం జరిగింది.
    పట్టభధ్రులు (గ్రాడ్యుయేట్లు) క్రింది స్ధాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పి.హెచ్.డి. స్ధాయిలో బోధన, వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఆంశాలలోనూ మరియు పరిశోధనలను నిర్వహించడంలోనూ ఈ సంస్థ నిమగ్నమై, జోధ్ పూర్ లోని రాజస్ధాన్ ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయంచే దేశవ్యాప్తంగా నిర్వహింపబడు ప్రవేశ పరీక్షల (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ టెస్ట్) ఆధారంగా గ్రాడ్యుయేషన్, క్రింది స్ధాయి కోర్సులకు ప్రవేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పి.జి. కోర్సులకు ప్రవేశం ఎన్.ఐ.ఏ మరియు ఐ.పి.జి.టి.ఆర్.ఏ (ప్రత్యామ్నాయంగా) చే దేశవ్యాప్తంగా నిర్వహించబడే ఉమ్మడి పి.పి. ప్రవేశ పరీక్ష (I.P.G.T.R.A - ఆల్ ఇండియా జాయింట్ పి.జి.ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా ఇవ్వబడుతుంది.
    మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: Department of Ayurveda

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
మలినాలను కడిగే పంచకర్మలు

ఎంత సేపూ వ్యాధి లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల కోసం వెళతాం కానీ, వ్యాధి కారకమైన ఆ మూలాల మీదికి చాలా సార్లు మన దృష్టే వెళ్లదు. శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించుకోకుండా ఏ వ్యాధైనా శాశ్వతంగా పోదుకదా! అందుకే ఆయుర్వేదం ఆ కల్మషాలను తొలగించే పంచకర్మ చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి సొరియాసిస్ వ్యాధి నిర్మూలనలో ఈ పంచకర్మ చికిత్సలు మరీ ముఖ్యమైపోయాయి.

శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలు సొరియాసిస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. ఈ మాలిన్యాలకు మానసిక ఒత్తిళ్లు కూడా తోడైతే, సమస్య మరీ తీవ్రమవుతుంది. అందుకే సొరియాసిస్‌కు ఈ రెండు కోణాల్లోంచి చికి త్సలు అందించవలసి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉద్దేశించినవే పంచకర్మ చికిత్సలు.

వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఈ ఐదు చికిత్సలు సొరియాసిస్ నిర్మూలనలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరాన్ని పంచకర్మ చికిత్సలకు సిద్ధం చేయడానికి కూదా కొన్ని విధానాలు ఉంటాయి. వీటినే పూర్వకర్మలు అంటారు. అందులో భాగంగా స్నేహం ( తైలమర్ధనం) స్వేదం ( స్టీమ్) ఉంటాయి.

చర్మ వ్యాధుల్లో సాధారణంగా శరీరం పొడిబారిపోయి ఉంటుంది. ఔషధాలు కలిసిన నెయ్యి గానీ, నూనె గానీ ఇచ్చే ఈ స్నేహపాన ం వల్ల ఆ పొడితనం పోయి చ ర్మానికి ఒక నూనెతనం, ఒక మృదుత్వం వస్తాయి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజుల దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో వాడే నూనె లేదా నెయ్యికి సహజంగా జిడ్డుతనం, జారుడు గుణం ఉంటాయి. వీటివల్ల శరీరంలో పేరుకుపోయి, గ ట్టిపడిన దోషాలను ఇది మెత్తబడతాయి. ఆ తరువాత శరీరానికి చెమట పట్టించే స్వేదం చేస్తాం. దీనివల్ల అప్పటికే మెత్తబడిన మలినాలన్నీ కడుపులోకి వచ్చేస్తాయి. వాటిని కడుపులోంచి బయటికి పంపించడానికి ఇక పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి.

వమనం
సొరియాసిస్ మచ్చలు మందంగా ఉండి దురద కలిగిస్తూ, నలుపెక్కి ఉంటే శరీరంలో ఖఫదోషం ఎక్కువగా ఉన్నట్లు భావించబడుతుంది. ఈ దోషాన్ని నిర్మూలించడానికి 'వమన క్రియ' అవసరమవుతుంది. ఇది ఔషధాలు కలిపిన ద్రవాలు ఇచ్చి వాంతి చేయించే ప్రక్రియ. వమన క్రియ వల్ల కడుపులోకి చేరిన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.

విరేచన క్రియ
సొరియాసిస్ మచ్చలు ఎర్రబడి, పొట్టు ఎక్కువగా రాలుతూ ఉండడం వాతం ఎక్కువగా ఉన్నట్లు చెప్పే సూచనలు. ఈ స్థితిలో విరేచన క్రియ అవసరమవుతుంది. వాతాన్ని తొలగించడంలో విరేచన క్రియను మించింది లేదు. ఇది మలద్వారం ద్వారా శరీరంలోని మలినాలన్నిటినీ బయటికి పంపించే ప్రక్రియ.

వస్తికర్మ
సొరియాసిస్ చికిత్సలో వస్తికర్మ పాత్ర చాలా తక్కువ. కాకపోతే, సమస్య సొరియాసిస్ ఆర్థరైటిస్‌గా పరిణమించిన స్థితిలో మాత్రం వస్తికర్మ అవసరమవుతుంది. ఈ సమస్యేమీ లేనప్పుడు వస్తికర్మ అవసరం లేదు. నిజానికి సొరియాసిస్ చికిత్సలో వమన, విరేచనాలదే కీలక పాత్ర అవుతుంది.

నస్యకర్మ
ఔషధపు చుక్కలను నాసిక రంద్రాల్లో వేసే ప్రక్రియను నస్యకర్మ అంటారు. ఇది శారీరక ప్రధానమే కాకుండా మానసిక ప్రధానం కూడా. ఈ చికత్సతో ప్రతికూల ప్రేరకాలన్నీ తొలగిపోయి మెదడు చైతన్యవంతమవుతుంది. అలాగే అస్తవ్యస్తమైపోయిన మెదడులోని అల్ఫా, బీటా, గామాలు నియంత్రణలోకి వస్తాయి.

ఇవి తరంగాల వంటివి. వీటి ఆధారంగానే మనిషి ఆలోచన సరళి ఉంటుంది. ఆ తరంగాలను నియంత్రించడం నస్యకర్మ వల్ల సాధ్యమవుతుంది. దీనివల్ల భయాందోళనలు, దిగులు, డిప్రెషన్ తొలగిపోయి, మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.

రక్తమోక్షణం
కొందరిలో సొరియాసిస్ మచ్చలు కొన్ని చోట్ల మందంగా మారిపోతాయి. అక్కడ గడ్డకట్టుకుపోయిన చెడు రక్తమే ఇందుకు కారణం. ఆ చెడు రక్తాన్ని తీసివేయకుండా ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గవు. గడ్డకట్టుకుపోయిన ఆ చెడు రక్తాన్ని, జలగల సహాయంతో తీసివేయవలసి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు. ఆ తరువాత కూడా ఆ వ్యాధి మళ్లీ రాకుండా ఒక ఏడాది పాటు మందులు వాడవలసి ఉంటుంది.

నిజానికి, పంచకర్మల తరువాత శరీరంలో మందులను గ్రహించే శక్తి బాగా పెరుగుతుంది. పంచ కర్మ చికిత్సలకు ముందే మందులు వాడితే, 50 శాతం ఉండే ప్రయోజనం ఆ చికిత్సల తరువాత అయితే 100 శాతం ఉంటుంది. కాకపోతే, పంచకర్మ చికిత్సలతో శరీరం పరిశుద్ధంగా మారి, మందులతో వ్యాధి తగ్గినా, అది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేమీ కాదు.

ఆ శక్తి పెరగకపోతే మళ్లీ ఏదో ఒక వ్యాధి వచ్చే వీలుంది. అందుకే పంచకర్మ చికిత్సలు తీసుకున్నాక వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికి త్సలు తప్పనిసరి అవుతాయి. అశ్వగంధ, శతావరి, గుడూచి, బ్రాహ్మి, యష్టిమధు వంటి ఔషధాల మిశ్రమంతో తయారయ్యే ఈ రసాయనాలు శరీరాన్ని సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా స్థిరంగా ఉంటుంది.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
ఆస్థమాకి ఆయుర్వేద చికిత్స..!

ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.

ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం... ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.

ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.

అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్... ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు

ఆస్త్మా తగ్గించే ఆహారం

కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

బేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.

ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.

ఇలా కూడా తీసుకోవచ్చు...
పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.

ఇవి వద్దు!
పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.

‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.
- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
విషగర్భతైలం

ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను తీసుకుని తయారు చేసే తైలాన్ని " మహా విషగర్భ తైలం'' అంటారు.

తక్కువ సంఖ్యలోనూ, తక్కువ మోతాదులోనూ అలాగే తక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను వినియోగించి తయారు చేసే తైలాన్ని " లఘు విషగర్భ తైలం'' అంటారు. తైలం తయారీకి మూలికలు, ఖనిజ రసాయనాలు కలిపిన ఒక ముద్దను తయారు చే సుకుని అందుకు నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకుంటారు. ఆ తరువాత నూనెకు నాలుగు రెట్లు 16 భాగాల ద్రవాంశం కోసం ముందు కషాయాన్ని తయారు చేసుకుంటారు.

మహా విషగర్భ తైలం
ఈ తైలం తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త విత్తులు, వావిలి విత్తులు, చేదు సొరకాయ విత్తులు, గలిజేరు వేర్లు, ఆముదం విత్తులు, అశ్వగంధ, చిత్రమూలం, మునగ పట్ట, కాకమాచీ, లాంగలీ దుంప, వేపపట్ట, వెర్రిపుచ్చ వేర్లు, దశమూలాలు, శతావరీ, సారిబా, ముండీ, విదారీకంద, స్నుహీ, అర్క, కర్కాటక శృంగి, గన్నేరు వేర్లు, కాకజంఘ వేర్లు, ఉత్తరేణు వేర్లు, బలా, అతిబలా, నాగబలా, మహాబలా, అడ్డసరం, తిప్పతీగె, ప్రసారిణీ మొదలైన మూలికలకు నీరు చేర్చి కషాయం సిద్ధం చేసుకుంటారు.

అలాగే విషముష్టి (శుద్ధి చేయనివి), శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, రాస్నా, కోష్టు, హరితాలకం, తుంగముస్తలు, దేవదారు, వత్సనాభి, యవక్షారం,సర్జక్షారం, పంచలవణాలు, మైల తుత్తం, కాయఫలం, పాఠా, భారంగీ, నవసారం, వెర్రిపుచ్చ, జవాసా, జీరక మూలికలను చూర్ణం చేసుకుని, తడిపి ముద్ద చేస్తారు. తైలపాక వి«ధి ప్రకారం నువ్వుల నూనెను కూడా తీసుకుంటారు.

పైన తెలిపిన అన్ని ద్రవాలను తగిన పాత్రలో కలిపి పొయ్యి పైన ఉంచుతారు. మూలికల ముద్ధ మాడిపోకుండా, కషాయ ద్రవం ఇగిరిపోయి తైలాంశం మాత్రమే మిగిలేంతవరకు ఉడికించి తైలాన్ని జాగ్రత్తగా తయారు చేస్తారు.

ఉపయోగాలు

    ఈ తైలాన్ని చర్మం పైన మర్ధనకే ఉపయోగిస్తారు. ప్రధానంగా బాగా నొప్పి కలిగించే వాత వ్యాధుల్లో అంటే ఆమవాతం, సంధివాతం, కటివాతం, అర్థాంగ వాతం, గృధ్రసీ వాతం, దండాపతానకం వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడతారు.
    దీర్ఘకాలికంగా పక్షవాతం ఉన్నవారిలో కాళ్లూ చేతులు బిగుసుకుపోయి ఉంటాయి. వీరికి ఫిజియోథెరపీ కష్టంగా ఉంటుంది. ఈ స్థితిలో ఈ తైలంతో రోజూ మర్ధన చేస్తే ఆ సమస్య తొలగిపోతుంది.
    వాత వ్యాధుల కారణంగా శరీరం బిగుసుకుపోయే గుణం చలికాలం మరింత ఎక్కువవుతుంది. ఈ స్థితిని ఈ తైలం నివారిస్తుంది. అయితే ఎండాకాలం ఈ తైలాన్ని వాడకపోవడం మంచిది. అలాగే ఒంటిపైన మంటగా, పొగలుగా ఉన్న వారు కూడా ఈ తైలాన్ని వాడకూడదు.
    నొప్పిని తగ్గించే గుణం ఉండడం వల్ల ఈ తైలాన్ని చెవినొప్పికి చుక్కల మందుగా కూడా వాడవచ్చు. అలాగే వినికిడి లోపం, చెవిలో శబ్ధాలు రావడం వంటివి కూడా ఈ తైలంతో తగ్గుతాయి. అయితే ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

లఘు విషగర్భ తైలం
లఘు అనే పదం లేకుండా చాలా మంది కేవలం విషగర్భ తైలం అని కూడా పిలుస్తారు. ఈ తైలం తయారీకి అవసరమైన ద్రవం కోసం ఈసబ్గోల్ కషాయం, గన్నేరు వేర్లు క షాయం, ఉమ్మెత్త స్వరసం, నిర్గుండీ స్వరసం, జటామాంసీ కషాయం, ఇవన్నీ కలిపి తీసుకుంటారు.

మూలికల ముద్దకోసం ఉమ్మెత్త విత్తులు, కోష్టు, ప్రియంగు పూలు, వత్సనాభి, పిచ్చి కుసుమ వేళ్లు, రాస్నా, గన్నేరు వేర్లు, మాల్కంగినీ విత్తులు, మిరియాలు, దంతీ, జటామాంసీ, చిత్రమూలం, పచ్చ ఆవాలు, దేవదారు, పసుపు, కస్తూరి పసుపు, ఆముదం వేర్లు, లక్షా, త్రిఫలా, మంజిష్ఠా చూర్ణాలను సమానంగతా తీసుకుంటారు. వీటన్నిటినీ తైలపాక నిష్పత్తిలో నువ్వుల నూనె చేర్చి తైలం మిగిలేలా ఉడికిస్తారు.

దీని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మహా విషగర్భ తైలం లాగే ఉంటాయి. కాకపోతే తీక్షణత తక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నితులకు ఇది ఉత్తమం. పైగా వేడి వాతావరణంలోనూ ఈ తైలాన్ని వాడవచ్చు.

విషముష్టి తైలం:
ఈ తైలం తయారీకి ప్రత్యేకించి విషముష్టి గింజలు మాత్రమే తీసుకుంటారు. దీనికి జొన్న కలి (కాంజికం) చేర్చి కషాయం తయారు చేస్తారు. ముద్ద కోసం విషముష్టి గింజల పొడినే వాడతారు. నువ్వుల నూనెతో పాటు ఆముదం కూడా జతచేస్తారు. అన్నిటినీ తైలపాక నిష్పత్తిలో కలిపి తైలం మిగిలేలా ఉడికిస్తారు. దీని ఉపయోగాలు విషగర్భ తైలంలాగే ఉంటాయి.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్.
ధారా చికిత్స

ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని , సాంకేతిక , పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం , తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన , ఆగ్రహం , ఒత్తిడి , ఆందోళనకు లోనవుతున్నాడు.

మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో , పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత , ఉద్రిక్తత , సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి , ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం , దుఃఖం , నిస్సహాయత , స్తబ్దత , సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.

    మానస వికార: అసూయ , భయ , చిత్తోద్వేగ , దైన్య , హర్ష , కామ , క్రోధ , లోభ , మద , మన్న , మోహ , శోక , విషాద , ఈర్ష్య , తమ , అతిప్రలాప , అస్వప్న , అతినిద్ర , భ్రమ.
    ఉభయాత్మక మానస వికార: మానస అధిష్ఠాన ఉన్మాద , అపస్మార ( epilepsy), అపతాంత్ర ( hysteria)ü), అతత్వాభినివేశ ( obsessive syndrome), మదత్యయ ( alcoholic psychosis)), సన్య ( coma)..
    శరీర అధిష్ఠాన: కామ జ్వర , క్రోధ జ్వర , భయజ అతిసార , శోకజ అతిసార.
    ధారా చికిత్స ప్రాధాన్యత:
    పద్ధతి: కేరళీయ పంచకర్మలో ధారా ఒక ప్రత్యేక చికిత్స. ద్రవరూపంలో ఉన్న ఓషధులను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోసే ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు దీనిని మూర్ధ తైల , శేక పరిశేకగా అభివర్ణించారు. దీనిని కేరళ సంప్రదాయ వైద్యులు మరింత మెరుగుపరచి , ప్రయోగాలు చేసి ‘ధారా చికిత్స’ లో నైపు ణ్యం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళీయ పంచకర్మ పద్ధతులలో ప్రముఖమైనదిగా పేరొందింది. ధారా చికిత్సలో కూడా మూడు రకాలు ఉన్నాయి. అవి:
        మూర్ధాన్య ధార (శిరో ధార)
        సర్వాంగ ధార (శరీరం మొత్తం)
        పరిశేక (శరీరంలో ఒక చోట మాత్రమే చేసేది)
    మూర్ధన్య ధారే శిరోధారగా ప్రాచుర్యం పొందింది. ద్రవ రూపంలో ఉన్న ఓషధులను నుదిటపై ధారగా పోస్తారు. దీనిని మానసిక రోగాలైన సైకోసిస్‌ , పిచ్చి , అపస్మారకం , ఒత్తిడి , ఆందోళన , న్యూరోసిస్‌ , అయోమయం , నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం విజయవంతంగా ప్రయోగించారు. అయితే దోషాన్ని బట్టి ఓషధులు మారుతాయి.
    శిరోధార రకాలు , సూచనలు:
    తక్రధార : గ్లాని , ఓజక్షయ , శిరశూల , హృద్రోగ
    క్షీర ధార: అనిద్ర , ఉన్మాద , శిరశూల , ఒత్తిడి
    తైల ధార: శిరశూల , మానసిక వ్యాధి
    ఘృతధార : అనిద్ర , పిత్త వ్యాధులు
    వీటికి అదనంగా నారికేళ జల అరనాల కషాయాలు లేదా శుద్ధమైన నీటిని అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.

ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి , దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.

శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం , ధ్యానం , చక్రాలను చైతన్యవంతం చేయడం , ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం , దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను , ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.

డా ప్రసాద్‌ , ఎం.డి.(ఆయుర్వేద) ,
డా స్వాతి , ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌ ,
101, రామచంద్రనివాస్‌ అపార్ట్‌మెంట్స్‌ ,

వెంగళరావ్‌నగర్‌ , హైదరాబాద్‌
ఫోన్‌: 93909 57168 / 9666649665 / 09503628150
Prasad _ayur@rediffmail.com
swathi_ayur@rediffmail.com



ఆయుర్వేదంలో రసాయన చికిత్స

సుదీర్ఘ కాలం జీవించడం ఎలా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తూ వచ్చిన ప్రశ్న. కేవలం సుదీర్ఘ కాలం జీవించడమే కాదు జీవితంలో అన్ని సంతోషాలనూ అనుభవిస్తూ జీవించాలని కోరుకుంటాడు. మానవుడు 125-150 ఏళ్ళ వరకూ భౌతికంగా జీవించగలడు. అంత సుదీర్ఘ కాలం మనుషులు జీవించినట్టు రికార్డులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వయసు మీద పడడానికి ప్రాథమిక కారణాలు జన్యుపరమైనవి. వాటిని తప్పించుకోలేం. జన్యుపరంగా భౌతిక స్వరూపం , శరీర తత్వం వ్యక్తులకు ముందస్తుగా నిర్ణయించిన జీవితకాలం ఉంటుంది. నివారించగల ఇతర కారణాలలో వ్యాధులు , ఇన్ఫెక్షన్లు , విటమిన్లు , ఎంజైములు , హార్మోన్లు , ఇతర కీలక పదార్ధాల లోటు. వీటివల్ల ప్రాణాలకు భంగం నేరుగా వాటిల్లకపోయినప్పటికీ కణజాలాన్ని , ధాతువులకు సరిచేయలేని హాని కలిగించి తద్వారా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

రసాయన చికిత్స శరీరానికి బలాన్ని , ఉత్తేజాన్ని కలిగించి వ్యాధులను నివారించే చికిత్స. శరీరంలోని రసాది సప్త ధాతువుల సమగ్రతకు దోహదం చేస్తూ సుదీర్ఘ కాలం జీవించేందుకు తోడ్పడుతుంది. జీవక్రియలలో మార్పులను సవరించే సామర్ధ్యం కలిగిన రసాయనం మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. అది జీవిత కాలాన్ని పొడిగించడమే కాదు జీవితాన్ని గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది.

రసాయన చికిత్సలో ఉపయోగించేందుకు అనేక మందులను సూచించారు. వైద్యపరమైనవి కాని వాటిలో నిత్యం ఆహారంలో నెయ్యి తీసుకోవడం , బ్రహ్మచర్యాన్ని పాటించడం వ్యక్తి సుదీర్ఘ కాలం జీవించడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అష్టాంగ ఆయుర్వేదలో రసాయన చికిత్స కీలకమైన శాఖ. ఆరోగ్యమైన వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి , వ్యాధుల బారిన పడిన వారికి శరీర బలం , ఉత్తేజం పెంచడం ద్వారా వ్యాధిని చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రసాయన చికిత్సలో భాగంగా రస , ఇతర ధాతువులను పరిపుష్టం చేస్తారు. నిర్వహణ దృక్కోణం నుంచి చూస్తే రెండు రకాల రసాయన చికిత్సలు ఉంటాయి:

    కామ్య రసాయన: ఒక నిర్ధిష్ట లక్ష్యం కోసం చేపట్టినది
    నైమిత్తిక రసాయన: వ్యాధి తగ్గిన తరువాత కోలుకోవడానికి ఇచ్చే పునరుద్ధరణ టానిక్కులు
    ఆజస్రిక రసాయన : రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
    ఆయుర్వేదంలో పేర్కొన్న రసాయన ఓషధులు , సమ్మిళిత ఔషధాలు ఎన్నో ఉన్నాయి.
        హరితకి
        ఆమ్లకి
        విభితకి
    దిగువన ఒకటి లేదా రెండు లేదా ఈ మూడు ప్రధాన వస్తువులను మేళవించి చేసిన ఔషధాలు:
    బ్రహ్మ రసాయ చ్యవన ప్రాస , ఆమలకా రసాయన , హరితక్యాది రసాయన , హరితక్యాది యోగ , త్రిఫల రసాయన.

విదంగ - విదంగ అవలేహ------------ నాగబల - నాగబల రసాయన
భల్లాతక - భల్లాతక సర్పి , భల్లాతక క్షీర , గుడ భల్లాతక , భల్లాతక తైలం ,
లోహ - లోహాది రసాయన , బ్రాహ్మ రసాయన పిప్పలి - పిప్పలి రసాయన , పిప్పలి వర్ధమాన రసాయన
మండూక పర్ణి స్వరస --- యష్టిమధు చూర్ణ --- శంఖపుష్పి కల్క శిలాజిత్‌ --- బాల - బాలకల్ప --- వరాహి కంద
బ్రాహ్మి రసాయ , --- బ్రాహ్మి కల్ప-- వచ వచ రసాయన సువర్ణ ----- శతావరి - శతావరి ఘృత---- అరవింద రసాయన ---- గోక్షుర రసాయన
తువారక రసాయన ---- పునర్నవ , భృంగరాజ రసాయన నరసింహ ఘృత.
వాత ప్రకృతి ఉన్న వ్యక్తులను పాలు , పిత్త ప్రకృతి ఉన్నవారిని నెయ్యి , కఫ ప్రకృతి ఉన్న వ్యక్తులను తేనె , రక్త ప్రకృతి ఉన్నవారిని చల్లటి నీటినీ ఆహారానికి ముందు తీసుకోమని సూచిస్తారు. ఇది అవసరమైన రసాయన ప్రభావాన్ని చూపి వార్ధక్యాన్ని నిరోధించేందుకు ఈ సూచనలు చేస్తారు.
సుదీర్ఘ జీవితానికి , పటిష్టతకు ముందుగా శరీర శుద్ధి చేసుకోవాలని సూచిస్తారు. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ ఎంతో ఉపయోగపడుతుంది. రసాయన ఔషధాలను ఇచ్చే ముందు శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. వమన , విరేచన , బస్తి , రక్తమోక్షన , స్వేదన అనేవి పంచకర్మలోని శుద్ధి ప్రక్రియలు. శరీర మసాజ్‌లు , పిండ స్వేద , ధారా , పదాభ్యంగన అనేవి శరీరానికి పునశ్శక్తినిచ్చే చికిత్సలు.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను , ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు..

డా స్వాతి , ఎం.డి. (ఆయుర్వేద)
డా ప్రసాద్‌ , ఎం.డి.(ఆయుర్వేద)

Saturday, 29 July 2017

నక్షత్ర మిత్రులు

🌠🎆🎇🌟🎆🎇🌟🌠🎆🎇

          🌠 *నక్షత్ర మిత్రులు* 🌠
           *-బార్బరా మార్సిన్యాక్*

           🎤 *ఆడియో - 4*
             *-పార్వతి మేడమ్*

                    🎆🌟🎆

🌟 *ప్లైడియన్లు భూ గ్రహేతర సామూహిక జీవులు. ప్లైడిస్ నక్షత్ర రాశి వాసులు.*

🌟 *18-5-88 నుండి శ్రీమతి మార్సిన్యాక్  ద్వారా వారు మాట్లాడడం  ప్రారంభించారు. తొమ్మిది నెలల తర్వాత ఏథెన్స్ లో ఏర్పాటయిన ఓ సమ్మేళనంలో వారి సమాఖ్య ఏర్పడిందని వారు తెలియజేసారు.*

🌟 *వీరి బోధనలు ప్రాచీన షామన్ ల బోధనలలాగ ఉంటాయి. భౌతిక ఆధ్యాత్మిక చైతన్య తలాల మధ్య వారధిలా వారి ఉనికీ, వైరుధ్యాల ప్రపంచంలో  ఆత్మాన్వేషణే ధ్యేయంగా వారి ప్రవృత్తి ఉంది.*
     
                   🎇🌟🎇

💚🔆 *Light Workers* ---
🔄♻🔁 *Connected with Universe* 💖🌟🌕✨💥☣

 ఎంపీ3 audio నక్షత్రం

Thursday, 27 July 2017


Programming language collection on google drive - https://drive.google.com/drive/folders/0ByWO0aO1eI_MN1BEd3VNRUZENkU
Books -

Monday, 17 July 2017

+++++++కట్నం తీసుకోవడాన్ని
శాస్త్రం అంగీకరించలేదు.+++++++++
"శాస్త్రం చెప్పిన వైదిక కర్మలు చేయడానికి అమితమైన డబ్బు అవసరం లేదు, అలాగే పూజ చేయడానికి పెద్ద హంగులు, ఆర్భాటమూ కూడా అవసరం లేదు. కేవలం ఎండిపోయిన తులసి ఆకులు, మారేడు దళాలు నాలుగు ఉన్నా, పూజ చేయవచ్చు. మనం రోజూ తినడానికి వండుకునే అన్నమే నైవేద్యంగా నివేదించవచ్చు.
'ఈ రోజుల్లో వివాహం అనగానే చాలా చాలా డబ్బు దాని కొఱకు వెచ్చిస్తున్నారు కదా దీని మీద అభిప్రాయం 'శాస్త్రం ప్రకారం వివాహము కూడా ఒక వైదికమైన క్రతువు. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా, వివాహము అమితమైన వ్యయంతో కూడుకుని చేయమని మన ఏ శాస్త్రాలలో కూడా చెప్పలేదు.
అనగా వివాహం పేరు మీద అంతంత డబ్బు ఖర్చు చేయడానికి శాస్త్రం అంగీకరించలేదు. అందునా ప్రత్యేకంగా వివాహ క్రతువులో, కట్నం తీసుకోవడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధము, మన శాస్త్రాలు కట్నం తీసుకోవడాన్ని అంగీకరించలేదు".
పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.
కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?
కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?
"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.
అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!
అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.
పూజ్యులు శ్రీ పరమాచార్య వాణి వారి మాటలు
మీ ఫణికుమార్

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

*కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం*
ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .
1. *ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?*
గోరు వెచ్చని .
2. *నీళ్ళు ఎలా త్రాగాలి ?*
సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి .
3. *తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?*
32 సార్లు .
4. *కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?*
ఉదయం .
5 . *ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?*
సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి .
6 *ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ?*
పండ్ల రసాలు .
7 *మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?*
లస్సి / మజ్జిగ .
8 *రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి?*
పాలు .
9 *పండ్లు ఏ సమయంలో తినరాదు ?*
రాత్రి .
10 *ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?*
తినరాదు .
11 *ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి?*
1 గంట తర్వాత .
12 *COOL DRINKS త్రాగ వచ్చా ?*
త్రాగరాదు .
13 *వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?*
40 నిమిషాలలోపు .
14 *రాత్రి భోజనం ఎంత తినాలి ?*
మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి .
15 *రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ?*
సూర్యాస్తమయం లోపల .
16 *బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు?*
48 నిమిషాల ముందు .
17 *రాత్రి లస్సీ త్రాగవచ్చా ?*
త్రాగరాదు .
18. *ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
పని చెయ్యాలి .
19 *మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
విశ్రాంతి తీసుకోవాలి .
20 *రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
500 అడుగులు నడవాలి .
21 *ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?*
5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 *ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?*
లాలా జలం .
23 *రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?*
9 -- 10 గంటలలోపు .
24 *3 విషాలు ఏవి ?*
చెక్కర , మైదా , తెల్ల ఉప్పు .
25 *మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ?*
వాము .
26 *రాత్రి SALAD తిన వచ్చా ?*
తినరాదు .
27 *ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?*
సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి .
28 *టీ ( tea ) త్రాగ వచ్చా ?*
త్రాగ రాదు .
29 *పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ?*
పసుపు .
30 *పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ?*
క్యాన్సర్ రాకుండా .
31 *ఏ చికిత్సలు మంచివి ?*
ఆయుర్వేధం .
32 *బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
October ... March.
33 *రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
June ... September.
34 *మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
March .... June.
35 *ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ?*
కనీసం 2 లేక 3 గ్లాసులు .
36 *ఉదయం ఎప్పుడు లేవాలి ?* సూర్యోదయానికి 1 1/2 గంట ముందు.


వ్యాధులకు చికిత్స కంటే ఏ రోగాలు రాకుండా చేసుకోగలగటమే ఉత్తమం అంటారు మన # వాగ్భటాచార్యులు .
"భోజనాంతే విషం వారీ" అంటారు దీని అర్ధం భోజనం చివర నీరు త్రాగటం "విషం"తో సమానం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ జఠరాగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇదే ముఖ్యం.
భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్నిచట్టబడిపోతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కుళ్ళి పోతుంది. ఆ విషయవాయువుల వలన 103 రకాల రోగాలు వస్తాయి.
అందుకే నీటిని వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి. గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.
నిదానంగా నీటిని త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలుస్తుంది. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి, లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి. అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును. ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది గురుత్ఉంచుకోండి.
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి.
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తరువాత త్రాగాలి.
భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును.
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి. ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది. దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను.
ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి.
నిలబడి నీళ్ళు త్రాగరాదు.
చల్లని నీళ్ళు ( Cool Water) త్రాగరాదు.
గోరు వెచ్చని నీళ్ళు త్రాగగలిగితే ఇంకా మంచిది.
ఎండాకాలములో మట్టికుండలోని నీరు త్రాగవలెను .
మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు.
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు.
మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి.
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది.
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి.


లాలాజలం(ఉమ్మి) వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
లాలాజలం భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. మనకే కాదు జంతువులకు కూడా ఇది అద్భుత ఔషధమే. జంతువులకు గాయాలు తగిలితే అవి డాక్టర్ దగ్గరకు పోలేవుకదా. అవి తమ నాలుకతో గాయాన్ని నాకుతాయి వెంటనే గాయాలు మానుతాయి. మానవులకు కూడా ఇది వర్తిస్తుంది కానీ నాలుకతో నాకవలసిన అవసరంలేదు. నోటిలోని లాలాజలాన్ని చేతితో తీసి గాయం మీద పూయండి. ఎంత త్వరగా మానుతుందో చూడండి.కండ్ల కలక వస్తే చాలా బాధగా ఉంటుంది. కండ్ల కలక వస్తే కళ్ళు ఎర్రగా మారడం, మంటలు, జిలలు విపరీతమైన బాధ ఉంటుంది. నోటిలో లాలాజలాన్ని కళ్ళకు కాటుకలాగా పెట్టండి. ఒక్కరోజులో ఎర్రదనం తగ్గుతుంది, మంటలు, జిలలు తగ్గుతాయి.ఈ రోజుల్లో పిల్లలు చిన్నతనంలోనే కళ్ళద్ధాలు పెట్టకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజూ ఉదయంలేవగానే వారినోటిలోని లాలాజలం వారికంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా మూడునెలలు చేస్తే పిల్లలకు కళ్ళద్ధాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది. అతిభయంకరమైన చర్మవ్యాధులు కూడా లాలాజలం పూయడం వలన నయమౌతాయి. సొరియాసిస్ కూడా నయమైన సంఘటనలు కూడా ఉన్నాయి.భగవంతుడు మన నోట్లోనే మన జబ్బులకు ఔషధాన్ని ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప ఔషధన్ని మన అలవాట్లవల్ల ఉమ్మి, ఉమ్మి వృధా చేసుకుంటున్నాం. ఈ ఉపచారం చెబితే చాలామంది నవ్వుకోవచ్చు, చాలామంది అసహ్యంగా అనుభూతి చెందవచ్చు. కానీ, ఇది స్వతః సిద్దంగా భగవంతుడు మన నోట్లో ఏర్పాటుచేసిన ఔషధం. ఈ వైద్యంతో భయంకరమైన కంటి జబ్బులు కూడా నయమైన సంఘటనలు ఉన్నాయి.ఇలా ఎన్నో సులభమైన ఉపాయాలు మన పెద్దలు మనకందించారు. కానీ మన తరం నుండి ఈ విజ్ఞానం మన తరువాతి తరానికి చేరకుండా పోతుంది.



శంకరాచార్య విరచిత గురు అష్టకం

శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం

1.శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
చక్కని రూపం గల అందమైన భార్య  ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికి గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

2.కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

3.   షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
నీవు ఆరు అంగముల లోను, నాలుగు వేదముల లోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

4. విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య 
సదాచార వృత్తేషు మత్తో న చాన్యా 
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలవానిగా జీవించు వాడవని పొగడ బడినా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
5. క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితమ్ యస్య పాదారవిందమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందఱో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? 
6.యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినాను, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

7. న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూప నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

8. అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

    
ఫలశృతి: 
 గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్
ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు పవిత్రులైనా, సంయాసులైనా, రాజైనా, సజ్జనులైనా, బ్రహ్మచారు లైనా, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.......🙏🌺🌸

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రజిహ్యే నచ ఘ్రాణనేత్రే
నచ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం! శివోహం!
మనస్సు, బుద్ది, అహంకార,చిత్తాలు నేను కాదు.శ్రవణ జిహ్వలు గాని చక్షు ఘ్రాణాలు గాని నేను కాదు. ఆకాశం, వాయువు, అగ్ని,జలం,పృథ్వి ఇవేవి నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
నచ ప్రాణసంజ్ఞో నవై పంచ వాయుః
న వా సప్త ధాతుర్నవా పంచకోశా
న వాక్పాణిపాదౌ నచోపస్థ పాయు
చిదానందరూపః శివోహం! శివోహం!
ప్రాణశక్తిని నేను కాదు. పంచవాయువులు నేను కాదు.శరీరపు సప్తధాతువులు నేను కాదు. దాని పంచకోశాలు పాణిపాదాలు రసనం తదితర కర్మేంద్రియాలు-ఏవీ నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
నమే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మేనైవ మాత్సర్య బావః
న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం! శివోహం!
లోభమోహాలు నాకు లేవు. రాగద్వేషాలు నాకు లేవు. గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ, మోక్షం- ఏవీ నాకు లేవు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
న పుణ్యం న పాపం న సౌఖ్యం న ధుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఙ్నాః
అహం భోజనంనైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం! శివోహం!
వేదయజ్ఙాలు సుఖధుఃఖాలు ధర్మాధర్మాలు మంత్ర తీర్థాలు నాకు తెలియవు.. నేను అనుభవించే వాడిని కాను. అనుభవించదగిన వస్తువును కాను. అనుభవింపబడే వాడిని కాను.. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితానైవ మేనైవ మాతా న జన్మః
న బంధుర్నమితృం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోహం! శివోహం!
చావు భీతి నాకు లేవు. జాతి విచక్షణ లేదు. తల్లీతండ్రీ లేరు. జన్మయే లేదు. బంధుమిత్రులు నాకు లేరు. గురువు శిష్యుడు లేరు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
అహం నిర్వికల్పో నిరాకరరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానందరూపః శివోహం! శివోహం!
నాకు రూపం లేదు, కల్పన లేదు. సర్వవ్యాపిని సర్వగతుణ్ణి. అయినా ఇంద్రియాలకతీతుణ్ణి. మోక్షాన్ని కాను. జ్ఙేయాన్ని కాను. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
మనో బుద్ధ్యహంకార చిత్తాలు నేను కాదు
శ్రవణ జిహ్వలుగాని చక్షు ఘ్రాణాలుగాని నేను కాదు
ఆకాశం వాయువు అగ్ని జలం పృధివి ఇవేవీ నేను కాదు
నేను శాశ్వతానందాన్ని చైత్యాన్ని శివుణ్ణి శివుణ్ణి
ప్రాణ శక్తిని నేను కాదు పంచవాయువులు నేను కాదు
శరీరపు సప్త ధాతువులు నేను కాదు దాని పంచకోశాలు
పాణిపాదాలు రసనం తదితర కర్మెంద్రియాలు ఏవీ నేను కాదు
నేను శివుణ్ణి శివుణ్ణి
లోభ మోహాలు నాకు లేవు రాగ ద్వేషాలు నాకు లేవు
గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ మోక్షం
ఏవీ నాకు లేవు శాశ్యతమైన చిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
వేదయజ్ఞాలు సుఖదుఃఖాలు ధర్మాధర్మాలు మంత్రతీర్దాలు
నాకు తెలియవు నేను భోక్తనుగాని భోజనాన్ని గాని భోజ్యాన్ని
గాని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
చావు భీతి నాకు లేదు జాతి విచక్షణ లేదు తల్లీతండ్రీ లేరు
జన్మయే లేదు బంధుమిత్రులు నాకు లేరు గురువు శిషుడు లేరు
శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి నేను
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
నాకు రూపం లేదు కల్పన లేదు సర్వవ్యాపిని సర్వగతుణ్ణి
అయినా ఇంద్రియాలకతీతుణ్ణి మోక్షాన్ని కాదు
జ్ఞేయాన్ని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
– జగద్గురు శ్రీ శంకర భగవద్పాద విరచితం నిర్వాణ షట్కము
(శ్రీ శంకర ఉవాచ అనే రామకృష్ణ మఠం ప్రచురణ నుంచి)

నాకు స్ఫూర్తినిచ్చే పాట!
ఇది వ్రాసింది నేను అని చెప్పే అర్హత నాకు లేదు. అవి నా జీవితంలో అతి పెద్ద దెబ్బ తగిలిన రోజులు. బ్రతుకులో బాధ్యతలు తప్పితే కోరికలు/ఆశయాలు కనబడని రోజులు. మౌంటైన్ వ్యూ లో ఉన్నాను. ఒక ప్రభాతవేళ నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి వ్రాసింది ఈ పాటని, అని నా నమ్మకం.
ఈ పాటలో వ్యాకరణదోషాలు ఉండచ్చు - అప్పటికే నేను సంసృతంలో మాట్లాడి ఒక ఐదు ఏళ్ళు దాటింది. కానీ ఆ భావం నేను అనుభవించగలుగుతున్నాను...ఒక్క సారిగా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. కష్టానికి, సుఖానికి తేడా తెలియదు. నాలో ఉన్నా మనిషి చచ్చిపోయి, దైవం మిగుల్తుంది....శివోహం అనిపిస్తుంది. అది అనుభవించాలి!
మానవరూపేశివోహం, వర్ణధారాధృతోహం
అర్ణవమథనాసమయే గరళం పీత్వాపి సజీవోహం ||
మాయామృత్తికాయాముత్పన్న, వాంఛాలతాః దగ్ధ్వా
కాయం నిత్యమాఛ్ఛేదయామి, భస్మితలిప్సాః ధృత్వా
హృదయేజాతభావసందోహం, కఠిన్యేణ హత్వా
మానసరుద్రభూమ్యాం చరామి నిత్యం, మామేవ జీత్వా
నిత్యాహారం కపాలే సత్యం, స్థితప్రఙా మే వృషభవాహనం
సర్వేషామపి బంధువత్ అహం, నాస్తి మే కోపి మిత్రం ||
విధిదత్తం మహోత్తరం కార్యం, మానసకర్ణైః శ్రుత్వా,
నిత్యం తాన్ హి ధారామి కాయే , విషసర్పాః కృత్వా
అనుభవనామజటాం తు మూర్ధ్నే, గాఢతరేణ బధ్ధ్వా
నిరతం సమ్నియమ్య తిష్టామి, గాత్రగంగాం గృహీత్వా
సత్యేందుర్మే నిత్యభూషణం, లజ్జా మహ్యం భవతి అంబరం
అర్థాంగీ తు విధ్యుక్త ధర్మం, ఙానం భవతి త్రినేత్రం ||
మామూలు మాటల్లో చెప్పాలంటే:
మానవుడి రూపంలో ఉన్నా శివుణ్ణి నేను. అక్షరాల ధారను మోస్తున్నాను (శివుని ఢమరుకంలోనుండి శబ్దాలు వెలువడ్డాయి). సముద్రాన్ని మథనం చేసినప్పుడు పుట్టిన విషం తాగినా ఇంకా బ్రతికే ఉన్నాను.
మాయ అనే మట్టిలో (పాంచభౌతిక ప్రపంచం మాయ - అంటా మట్టే) పుట్టిన కోరిక అనే తీగలను నేను తగలబెట్టి ఆ బూడిదతో నన్ను నేను అలంకరించుకుంటాను. మనసులో పుట్టిన భావాల సమూహాన్ని నేను నిర్దాక్షణ్యంగా చంపి, ఆ స్మశానంలో, నన్ను (నా భావాలను) నేను జయించి తిరుగుతూ ఉంటాను. నాకు నిజమే ఆహారం. స్థితప్రఙ నాకున్న వృషభవాహనం (బలానికి, నిబ్బరానికి చిహ్నం). అందరికీ నేను బంధువునే. కానీ నాకు ఎవరూ మిత్రులు కారు. (నేను ఎవరడిగినా సాయం చేద్దామనే చూస్తాను. కానీ, నేను ఎవరి దగ్గరనుండి ఏది ఆశించను).
నాకు విధి ఒక కర్తవ్యాన్ని ఇచ్చింది. అది నా మనసు గ్రహించింది. ఆ కర్తవ్యాన్నే విషసర్పాలుగా ధరిస్తున్నాను. ఎంత కష్టమైనా, ప్రమాదమైనా అవే నాకు అలంకారం. అనుభవం అనే జడలో గంగలాగా ప్రవహిస్తున్న నా అంగాలను బలంగా బంధించి ఆ సంనియమంలోనే నేను సంతృప్తిని పొందుతాను. నాకు సత్యమే చంద్రుడివంటి భూషణం, లజ్జ నిజమైన కట్టుబట్ట, విధి నిర్దేశించిన బాధ్యతే భార్య (భరించవలసినది), ఙానం మూడో కన్ను.
నా జీవితంలో నన్ను అన్నిటికంటే ప్రభావితం చేసిన పుస్తకం మనిషి వ్రాసింది కాదు. మాధవుడు చెప్పింది, మహర్షి వ్రాసింది! అది భగవద్గీత. భగవద్గీతను అందరి కంటే యథాతథంగా అనుసరించేది - విష్ణువుకి అతిశ్రేష్ఠుడైన భక్తుడు, మిత్రుడు - శివుడు. ఆ శివుడికి నేను చిన్నప్పటినుండి కింకరుణ్ని. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినవాల్లల్లో మొదటివాడు కూడా శివుడే. ఆయనకు మనసా, శిరసా అనేకకోటి నమస్కారాలు చేస్తూ నా చేతులమీద ఆయన వ్రాయించుకున్న పాట

Saturday, 15 July 2017

ఉప్పు


*మనం వాడే ఉప్పు*
*ఉప్పు*
మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర . మన శరీరంలో జరిగే రసాయనక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి
జీర్ణ వ్వవస్ధకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి . జాతీయ పోషకహార సంస్ధ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 6 గ్రాముల కన్నా ఎక్కవ ఉప్పు తీసుకోకూడదు . కాని ప్రతి రౌజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు . ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు . హై బీ.పి. చక్కెర వ్యాధులు , రక్త దోషాలు , గుండె పోటు , తలనొప్పి , ఛాతి నొప్పి మొదలగు వ్యాధులు వస్తాయి .
*సముద్రపు ఉప్పు ( Sea Salt )*
1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడే వారు . ఆంగ్లేయులు దీన్ని నిషేధించి సముద్రపు ఉప్పును ప్రవేశ పెట్టినారు . ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా హానికరమైన రసాయనాలను కలుపుతారు . దీనిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో 1200* పై వేడి చేయబడును . అందుచేత ఇది ఫ్రీఫ్లోగా వుండి జారి పోతుంది . సాధారణ ఉప్పులో 97.5 % సోడియం క్లోరైడ్ , 25% రసాయనాలతో కూడిన ఐయోడిన్ , పోటాషియం , అయోడైడ్ , సోడియం బయోకార్బోనేట్ , అల్యూమినియం , లవణం , సోడియం మోనో గ్లుటోమెట్ లు వున్నాయి .
ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు.
# పెరుగులో జీవామృత కీటకాలు ఉంటాయి . అవి శరీరానికి చాలా ఉపయోగము . ఉప్పును పెరుగుతో కలిపి తింటే 20 రకాల జబ్బులకు గురి అవుతారు .
# ఈ ఉప్పును వాడటం వల్ల వాత, పిత్త , కఫ దోశాలు కలుగును .
# ఈ ఉప్పును ఆయుర్వేద మందులలో వాడదగినది కాదు .
# సముద్రంలో అనేక రకాల జీవరాసులు సముద్రంలోనే జీవిస్తూ , అందులోనే చనిపోవడం వల్ల వాటి అవశేషాలు అందులోనే కలిసి పోవడం వల్ల ఇది శాఖాహారం కాదు .
# ప్రాసెస్ చేసిన ఉప్పును , అయోడిన్ ఉప్పును వాడరాదు .
# అయోడిన్ ఉప్పుని వాడిన యెడల శృంగార సామర్ద్యం ఖచ్చితంగా తగ్గి పోతుంది .
*సైంధవ లవణం*
( Rock Salt ) .
# మనకు ప్రకృతి ప్రసాదించినది , లక్షలాది సంవత్సరాల పురాతనమైనది . స్వచ్చమైనది , ఏ మాత్రం కాలుష్యం సోకనిది ఈ *సైంధవ లవణం* .
# 100% *శాఖాహారం* , తక్కువ సోడియం మోతాదు కలది .
# *ఖనిజాలు* అత్యధికంగా కలిగినది .
# మన శరీరానికి కావలసిన పోషక విలువలు కలిగినది .
# *కాల్షియం , కాపర్, ఐరన్, మెగ్నీషియం , పాస్ఫరస్ , పొటాషియం , సిలికాన్ , సల్ఫర్ , జింక్ , అయోడిన్ , ఆక్సిజన్* , మొదలగు పోషక విలువలు కలవు .
# కణం స్ధాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించును .
# సుఖ నిద్రకు సహాయకారి .
# ఎముకల దృడత్వాన్ని పరి రక్షిస్తుంది .
# ఆస్తమా , సైనసైటిస్ ను అదుపు చేస్తుంది .
# శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది .
# అధిక బరువును నియంత్రించటంలో సహాయకారి .
# మలబద్ధకాన్ని పోగొట్టును .
# గ్యాస్టిక్ ను తగ్గిస్తుంది .
# కాలేయంలోని వేడిని నియంత్రించును .
# వాయు సంభందిత వ్యాధులకు ఉపశమనం .
ఈ *హిమాలయన్ రాక్ సాల్ట్* రాళ్ళు *ఎరుపు , గులాబి మరియు తెలుపు* రంగుల్లో లభించును . ఉ ఉప్పును ఎందులో వేసినా ఆ పదార్ధం యొక్క రుచి మరింతగా పెరుగుతుంది . సైంధవ లవణం వ్రతాలలోను , పూజలలోను , ఉపవాసాల్లోను వాడుతారు . ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు .
# కూరగాయలను సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే , పెస్టిసైడ్స్ యొక్క దుష్పలితాలను కొంత వరకు నివారించ వచ్చును .
# *ఆయుర్వేద మందులలో ఈ సైంధవలవణంని వాడవలెను*.
# నిత్యం ఈ సైంధవలవణం వాడే వారికి వాత , పిత్త , కఫాలు సమంగా ఉండును .
# ధైరాయిడ్ , బీ.పి. , పక్షపాతం , చక్కెర వ్యాధి , కీళ్ళ సమస్యలు మొదలగునవి రావు .
# పెరుగులో సైంధవ లవణం కలిపి తింటే జీవితాంతం ఆరోగ్యంగా వుంటారు .
*సైంధవ లవణం ( Rock Salt )* ని వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .
*గమనిక :-- వంటల్లో సైంధవలవణం మరియు నల్ల ఉప్పు వాడవచ్చును* . సుభ
> "ఆరోగ్యమే మహాభాగ్యం"(HEALTH TIPS)
త్రిఫలా చూర్ణం - ఉపయోగాలు .
* శిరోవ్యాధులకు -
త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.
* మూర్చ - అపస్మారం -
త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.
* కామెర్లు - ఉబ్బస రోగం . -
ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.
* కడుపు నొప్పుల కోరకు -
త్రిఫలా చూర్ణం , అతిమధుర చూర్ణం , ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.
* విరేచనాలు కొరకు -
త్రిఫలా చూర్ణం , కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం , జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.
* అతిమూత్ర వ్యాదికి -
త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.
* శరీరం ఉబ్బు -
50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.
* కామెర్ల వ్యాధి నివారణ -
10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.
* పైత్య రోగాలు -
ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్ త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.
* యోని దుర్వాసన కొరకు -
త్రిఫల కషాయంలో ప్రతిరోజు మూడు పూటలా స్త్రీలు తమ యోనిని కడుగుతూ ఉంటే భోజనంలో తీపి పదార్దాలు కొంచం ఎక్కువుగా తింటూ ఉంటే యోని దుర్గంధం హరించిపొయి భర్తకు ఇష్టులవుతారు.
* దగ్గుల కొరకు -
త్రిఫలా చూర్ణం , శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి.
పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫలా చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి .
కంటి మసకలకు -
త్రిఫల చూర్ణం 30 గ్రా , మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.
* సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన -
త్రిఫలా చూర్ణం , సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం- Health tips
పోపు పెట్టెలో దాగివున్న పది ఆరోగ్య సూత్రాలు!
1.చక్కెరను నియంత్రించేదాల్చిన చెక్క:దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్లశరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి
.2.అల్లం పైత్యానికి విరుగుడు :అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
3.వెల్లుల్లి గుండెకు నేస్తంపచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ఇందులో మెండుగా వున్నాయి.
4.కుంకుంపువ్వు అందం ఆరోగ్యంఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.
5.లవంగాలు శ్వాసకు మేలు :లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.
6.జీర్ణశక్తికి జీలకర్రజీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
7.ఆవాలుఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
.8.నల్లమిరియాలుఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
9.పచ్చి ఏలకులుఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.
10.ఫెన్నల్ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడుతారు. ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది.
యోగ Dosha సమతుల్యం యోగ పాట్రాన్

SharePin ItTweet

మే 12, 2017
CureJoy ఎడిటోరియల్ ద్వారా

యోగ భంగిమలో భంగిమలు వాటా dosha శరీర రకాలకు ఉత్తమమైనవి. సులభంగా క్రాస్ కాళ్ళ భంగిమలో ప్రారంభం మరియు యోధుడు ఒక ఘన పునాది సృష్టించడానికి భంగిమలో. వాటా dosha యోగ కూడా కోబ్రా భంగిమలో వంటి తక్కువ తిరిగి అప్ విప్పు అని భంగిమలు ఉండాలి. స్థానాల మధ్య రిలాక్సేషన్ అవసరం, కాబట్టి మరొక స్థానం లోకి బదిలీ చేసినప్పుడు పిల్లల భంగిమలో చేయండి. పునరుద్ధరణ శవం భంగిస్తుంది, ఇది చాలా కాలం పాటు జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి, వాటా దోష యొక్క విశ్రాంతి లేకపోవడం. వాటా అసమతుల్యతను తృప్తి పరచడానికి, ఆకస్మిక కదలికలను నివారించండి.

అన్ని doshas యొక్క, వాటా స్థిరత్వం చాలా అవసరం. ఇది ఉద్యమాన్ని సూచిస్తుంది ఎందుకంటే సులభంగా ఆఫ్ విసిరి ఉంది! ఒక అసమతుల్యత తృప్తిపరచటానికి, వాటా dosha యోగ నిలుపుదల మరియు calming కదలికలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ వాటా డోషా ప్రవాహానికి ఐదు విసిరింది.

యోగ ఒక Vata Dosha ఫ్లో కోసం పాట్రాన్

1. సులువు పోజ్



వాటా అసమతుల్యత కోసం యోగ సులభంగా భంగి లేదా సుఖసనా వంటి నిలుపుదల విసిరింది దృష్టి ఉండాలి. ఇది చాలా సులభం కానీ చాలా శక్తివంతమైనది. ఈ స్థితి మీ శరీరం భూమికి ఒక పునాదిని సృష్టించడానికి సహాయం చేస్తుంది.

నేలపై కూర్చుని. మీ కాళ్ళకు ముందు మీ కాళ్ళను విస్తరించండి మరియు మీ తిరిగి నిఠారుగా చేయండి. వ్యతిరేక మోకాలి కింద ప్రతి పాదాలను ఉంచడం, మీ కాళ్ళను దాటండి. మీ చేతులను మీ లోపలికి నెట్టడానికి శాంతముగా, మీ పండ్లు మరియు మోకాలు విస్తరించడానికి వీలు కల్పిస్తాయి. మీ చేతులను మీ మోకాళ్లపై వేయండి, తద్వారా అరచేతులు క్రిందికి వస్తాయి. మీ బట్ రెండు వైపులా అన్ని సార్లు వద్ద మైదానంలో ఉండాలి.మీ తల, మెడ, మరియు వెన్నెముక గుర్తు. Nice మరియు నేరుగా కూర్చుని, మరియు ఒక నిమిషం కోసం ఉంచండి.

2. వారియర్ పోజ్ -1



మరో యోధుని స్థానం యోధుడు భంగిస్తే లేదా విరాబద్రాసానా-నేను. ఇది మీరు బలమైన మరియు స్థిరమైన అనుభూతి చేస్తాము, ఇది వాటా మనస్సు స్థిరీకరించడానికి గొప్ప.

మీ మెట్ పాదాల వద్ద నిలబడి, మీ మిగిలిన భాగం మీ వెనుక ఉంది. మీ అడుగుల కలిసి ఉంచండి. మీ మొత్తం శరీరాన్ని సమలేఖనం చేయండి మరియు మీ చేతులను మీ పక్కలో ఉంచండి. మీ ఎడమ పాదంతో తిరిగి కదలండి. మీ కుడి పాదంతో 45 డిగ్రీల కోణాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఈ చీలమండను తిప్పండి. మీ కుడి పాదం మీద మీ కుడి మోకాలు hovers తద్వారా డౌన్ మునిగిపోతుంది. ఇది ఒక సున్నితమైన చర్మాన్ని వంటి అనుభూతి ఉంటుంది. మీ చేతులు పైకి ఎత్తండి, వాటిని భుజం-పొడవు వేరుగా ఉంచండి. మీ వెన్నెముకను నిఠారుగా నిలబెట్టుకోండి మరియు ధూళి మరియు శక్తివంతమైన శక్తిని ఉంచండి. మీ చేతులను మీ తుంటి మీద వేయండి. కలిసి మీ కాళ్ళను తిరిగి తీసుకురండి. ఎడమ కాలుతో పునరావృతం చేయండి.

కోబ్రా పోజ్



ఒక వాటా యోగ క్రమం కూడా మీ దిగువ తిరిగి నుండి ఒత్తిడి తీసుకోవాలి. కోబ్రా భంగిమ లేదా భుజంగాసానా దీనికి చాలా గొప్పది. ఈ స్థానం కూడా వెన్నెముకను విస్తరించింది మరియు ఛాతీని విస్తరించింది, వీటా విశ్రాంతికి సహాయం చేస్తుంది.

మీ కడుపు మీద పడుకో. మీ భుజాల క్రింద, అరచేతులలో మీ చేతులను ఉంచండి. మీ అడుగుల రిలాక్స్ చేయండి, తద్వారా మీ చీలమండల ముందు మత్లో కూడా ఉంటాయి. మీ నుదుటి మీద నేల మీద ఉంచి, మీ కాళ్ళను కలిపి ఉంచండి.మీ తల, ఛాతీ, మరియు బొడ్డును ఎత్తండి. మీ పొత్తికడుపు నేల మీద ఉండాలి, మరియు మీ భుజాలు తెరిచి ఉండాలి. ఒక సమయంలో మీ వెన్నెముక, ఒక వెన్నుపూస కర్వ్.

4. పిల్లల పోజ్



ఆసాన్ల మధ్య సడలించడం వాటా యోగ కోసం ముఖ్యమైనది. కానీ మీరు ఇలా చేయటం చాలా కష్టంగా ఉంటే, పిల్లల భంగిమ లేదా బాలసానా చేయటానికి సమయాన్ని తీసుకోండి. ఇది సాధారణంగా పునరుద్ధరించే భంగిమలో సవాలు కదలికల మధ్య జరుగుతుంది.

మీ పాదాలకు మీ పిరుదులు విశ్రాంతిగా కిందికి వస్తాయి. మీ మోకాలు కలిసి ఉండండి. ముందుకు వంగండి మరియు తొడలమీద మీ మొండెం వేయండి.మీ నుదిటిపై మత్ తాకే వరకు కొనసాగించండి. మీ చేతులను మీ ముందు నిలపండి లేదా మీ వైపున వాటిని విశ్రాంతి తీసుకోండి.

5. కార్ప్స్ పోజ్



దాదాపు ప్రతి యోగ సన్నివేశం శవం భంగిమైనా లేదా సవసానాతో ముగుస్తుంది. కానీ వాటా బ్యాలెన్సింగ్ యోగ కోసం మరింత ముఖ్యమైనది. ఈ calming భంగిమ వాటా యొక్క విశ్రాంతి లేకపోవడం సులభం చేస్తుంది, కాబట్టి మీరు దీన్ని చాలా కాలం ఖర్చు చేయాలి.

మీ వెనుకకు వస్తాయి. మీ శరీరం యొక్క ప్రతి వైపు మీ చేతులను ఉంచండి, అరచేతులు. మీ కాళ్ళు నేరుగా ఉంచండి కానీ సడలించడం. మీ ముఖంతో ప్రారంభించడం, మీ శరీరం యొక్క ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోండి. మీ భుజాలను తగ్గించడం మానుకోండి. ఐదు నిమిషాలు పట్టుకోండి.

వాటా dosha యోగా నెమ్మదిగా కదిలే అదనపు ప్రయత్నం అవసరం. మీ శ్వాసను నియంత్రించడానికి మీరు ఎక్కువ సమయం కావాలి. మీరు కష్ట సమయాన్ని కలిగి ఉంటే, మొత్తం ప్రవాహం అంతటా మీతో తరచుగా తనిఖీ చేసుకోండి.
5 Yoga Poses To Balance Vata Dosha

SharePin ItTweet

May 12, 2017
by CureJoy Editorial

Grounding yoga poses are best for vata dosha body types.Start with the easy cross-legged pose and warrior pose to create a solid foundation.Vata dosha yoga should also include poses that loosen up the lower back, like cobra pose.Relaxation in between positions is necessary, so do a child’s pose when transitioning into another position.The restorative corpse pose will relax vata dosha’s restlessness, especially when it’s done for a long time.To pacify vata imbalance, avoid abrupt movements.

Of all the doshas, vata needs a lot of stability.It’s easily thrown off because it symbolizes movement!In order to pacify an imbalance, vata dosha yoga should focus on grounding and calming moves.Here are five poses for a vata dosha flow.

5 Yoga Poses For A Vata Dosha Flow

1. Easy Pose



Yoga for vata imbalance should focus on grounding poses, like the easy pose or Sukhasana.It’s extremely simple but very powerful.This position will help your body create a foundation with the earth.

Sit on the floor.Extend your legs in front of you and straighten your back.Cross your legs, placing each foot under the opposite knee.Use your hands to gently push your feet inward, letting your hips and knees widen.Rest your hands on your knees so that the palms face downward.Both sides of your butt should be on the ground at all times.Align your head, neck, and spine.Sit up nice and straight, and hold for one minute.

2. Warrior Pose-I



Another grounding position is the warrior pose or Virabhadrasana-I.It’ll make you feel strong and steady, which is great for stabilizing the vata mind.

Stand at the foot of your mat, so that the rest of it is behind you.Keep your feet together.Align your entire body and put your hands on your hips.Step back with your left foot.Rotate this ankle so that it creates a 45-degree angle with your right foot.Sink down so that your right knee hovers over your right foot.It’ll feel like a gentle lunge.Raise your arms upward, keeping them shoulder-length apart.Straighten your spine and keep the pose solid and powerful.Lower your hands onto your hips.Bring your legs back together.Repeat with the left leg.

3. Cobra Pose



A vata yoga sequence should also take pressure off from your lower back.The cobra pose or Bhujangasana is great for this.This position will also stretch out the spine and expand the chest, helping the vata relax.

Lie down on your stomach.Place your hands just under your shoulders, palms down.Relax your feet so that the front of your ankles are also on the mat.Rest your forehead on the ground and keep your legs together.Lift your head, chest, and belly.Your pelvis should stay on the floor, and your shoulders should be open.Curve your spine, one vertebra at a time.

4. Child’s Pose



Relaxing in between asanas is important for vata yoga.But if you have a hard time doing this, take out time to do the child’s pose or Balasana.It’s a restorative pose that’s typically done in between challenging moves.

Kneel down, resting your buttocks on your feet.Keep your knees together.Bend forward and lay your torso on your thighs.Continue until your forehead touches the mat.Straighten your arms in front of you or relax them at your side.

5. Corpse Pose



Almost every yoga sequence ends with corpse pose, or Savasana.But it’s even more important for vata balancing yoga.This calming pose will ease vata’s restlessness, so you should spend a long time doing it.

Lie on your back.Position your hands on each side of your body, palms up.Keep your legs straight but relaxed.Starting with your face, relax each part of your body.Avoid tensing up your shoulders and let yourself feel heavy on the ground.Hold for five minutes.

Vata dosha yoga needs to place extra effort on moving slowly.You may also need more time to control your breath.If you’re having a hard time, frequently check in with yourself throughout the entire flow.https://india.curejoy.com/content/yoga-poses-balance-vata-dosha/?utm_medium=IAO&utm_source=FBFeed&utm_campaign=FBYoga#

Friday, 14 July 2017

*మధు మేహ వ్యాధి ( DIABETES )*

        వేదకాలంలో మధు మేహ వ్యాధి ప్రస్తావన ఉంది . ఆ కాలంలో మధు మేహాన్ని *ఆశ్రవ* అని పేరుతో గుర్తించారు . క్రీస్తు శకానికి వెయ్యి సంవత్సరాల క్రిందట ఈ వ్యాధి వర్ణన ఉంది . ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయం అనే గ్రంధంలో *మధు మేహం* అనే పదం వాడబడింది .
#  *మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగు తున్నారు*.

*మధు మేహ వ్యాధి  -- కారణాలు* .
# ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు పాడై పోయి , ఆ గ్రంధి ఇన్సులిన్ ని తయారు చేయలేక పోవడం లేక ఆల్ప మోతాదులో తయారు చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .
# మనిషిలోని ఇన్సులిన్ హార్మోన్ పని తీరు దెబ్బతినప్పుడు , శరీరం గ్లూకోజును సరిగ్గా వినియోగించు కోనప్పుడు ఈ వ్యాది వస్తుంది .
# వంశపారం పర్యంగా మధు మేహం వచ్చే అవకాశం కలదు .
#  శారీరక శ్రమ పూర్తిగా లోపించడం , గంటల తరబడి కూర్చోని ఉండటం ,
# పోషక  పదార్ధాలు లేని ఆహారం తీసుకోవడం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది .
# కొన్ని రకాల మందుల దుష్ఫరిణామం , స్టెరాయిడ్స్ , వైరస్   ఇన్పెక్షన్స్ , హార్మోన్ల అసమతుల్యత వల్ల మధు మేహం వస్తుంది .
# తిన్న ఆహారం జీర్ణం కాక ముందే తిరిగి భుజించడం , ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం వలన మధు మేహం వస్తుంది .
# అధికంగా చక్కెర ఉపయోగించడం .
# అతిగా నిద్ర పోవడం .
# మానసిక ఆందోళన , భారీకాయం మరియు ఆహారపు అలవాట్లు .
# తరచుగా జబ్బులతో బాధ పడువారు . రోగ నిరోధక శక్తిని కోల్పోయి  -- మధు మేహ వ్యాధి రావచ్చును .

*మధు మేహ వ్యాధి లక్షణాలు* : ---
# అతి మూత్రం , దాహం ఎక్కువగా వేయడం , కంటి చూపు మందగించడం , బరువు తగ్గడం , మలబద్ధకం , శృంగార శక్తి తగ్గుట , గాయాలు త్వరగా మానక పోవడం , హృద్రోగాలు  , మూత్ర పిండాలు దెబ్బతినడం , స్త్రీలలో అసాధారణంగా తెల్ల బట్ట ( White Discharge ) కావడం , చర్మ వ్యాధులు , కాళ్ళు , చేతులు , అరచేతులు తిమ్మిరిగా వుండడం , త్వరగా  అలసి పోవడం , చికాకు , అసహనం కలిగి వుంటారు .
# మధు మేహ వ్యాధిగ్రస్తుతులకు మెట్ట మొదట ఆకలి ఎక్కువగా ఉండటం , కాని నిధానంగా ఆకలి వుండదు .
# మధు మేహం వలన ఎక్కవ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది . ( మూత్ర పిండాలు , గుండె , రక్తనాళాలు , కళ్ళు ) .

*ఆయుర్వేధ ఔషధాలు మధు మేహ వ్యాధిని శక్తివంతంగా తగ్గిస్తాయి* : ---

*గృహ చికిత్స* :----

1. మెంతుల పొడి ..... 100 గ్రాములు .
2 .బిరియాని ఆకుల పొడి .... 100 గ్రాములు .
3 . నేరేడు గింజల పొడి ... 150 గ్రాములు .
4 . బిల్వ పత్రముల పొడి .. 250 గ్రాములు .
( బిల్వం ఆకులు )
*గమనిక : --  ఈ బిల్వం ఆకులను గుడిలో శివుడికి అర్పించి , తర్వాత ఆ ఆకులను ఎండలో ఎండ పెట్టి పొడి చేయవలెన.*
*ఈ 4 రకాల పొడులను బాగా కలిపి గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి*

*ఈ చూర్ణం వాడే విధానము* : --
# ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 1 గంట ముందు 1 Tea Spoon చూర్ణంని  + 1  గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగండి.
# ప్రతి రోజు రాత్రి భోజనం చేయడానికి 1 గంట ముందు 1 Tea Spoon చూర్ణంని + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగండి .
*ప్రతి రోజు రెండు పూటల ఈ చూర్ణంని తీసుకొనవలెను*
 *ఈ చూర్ణంని 2 లేక 3 నెలల వరకు తీసుకొనండి*
 *ఈ చూర్ణంని పూర్వం ఆయుర్వేద వైద్యులందరు ఉపయోగించి , ఫలితం పోందినారు*.

*ఖచ్చితంగా మార్పు చేసుకోవలసిన జీవన విధానం*  : ---
*1. నీళ్ళు త్రాగే విధానం*
   నీటిని ఎప్పుడు త్రాగినా గుటక గుటక గా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 40  నిమిషాల ముందు త్రాగవలెను .
బ్రేక్ ఫాస్ట్ , భోజనము మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక  3 గుటకల నీరు త్రాగవచ్చును . ఆహారం తీసుకున్న తర్వాత గొంతు శుద్ది కోసం , గొంతు సాఫీగా ఉంచటానికి 2  లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును .
ఆహారం తీసుకున్న తర్వాత 1 1/2  గంట తర్వాత నీళ్ళు త్రాగాలి .
పై విధంగా నీళ్ళు త్రాగడం వలన *మలబద్ధకం* రాదు , నివారింపబడును . శరీరంలో తిన్న ఆహారం కుళ్ళదు , చెడు కొలెస్ట్రాల్ ‌( L.D.L / V.L.D.L ) తయారవ్వదు .
*వంట నూనెలు*
శుద్దమైన వంట నూనె ( Non Refined Oil ) ను తయారు చేసే ఆహారంలో వాడవలెను. అప్పుడు శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్  ( H.D.L ) ఎక్కవ మోతాదులో తయారవుతుంది . ఈ H.D.L .వలన స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది . చెడుకొలెస్ట్రాల్ తగ్గిపోతుంది .
Non Refined oils  వేరుశనగ నూనె , నువ్వుల నూనె లేక కుసుమల నూనెలను వాడండి .
*ఉప్పు* : ---
ఎల్లప్పుడు వంటలలో సైంధవ లవణం ( Rock Salt ) నే వాడండి. ఈ Rock Salt ని వాడితే B. P. Normal అవుతుంది .
*మట్టిపాత్రలు*
మట్టి పాత్రలు పరమ పవిత్రమైనది . మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . అందుకు మట్టి పాత్రలు , ఇత్తడి , రాగి పాత్రలు అత్యుత్తమము . కాని మట్టి పాత్రలో వండిన పదార్ధములో 100 % న్యూట్రియన్స్ ఉంటాయి . ఈ పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైన ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి . 2 - 3  నెలల లోపే ఖచ్చితంగా వారు డయాబెటీస్ రోగం నుండి విముక్థ లవుతారు . ఆనందంగా జీవిస్తారు .
*చక్కెర ( Sugar ) = విషం*
  విదేశీయులు కనిపెట్టిన ఈ *చక్కెర లో ఎటువంటి పోషకాలు , విటమిన్స్ మొదలగునవి ఏమియు లేవు* . చక్కెర తయారు కాగానే అందులోని ఫాస్ఫరస్ అంతమై పోతుంది . కఫాన్ని సక్రమంగా ఉంచటానికి ఈ ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం . చక్కెరని , చక్కెరతో తిన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యటానికి కడుపు ఎంతో కష్టపడ వలసి ఉంటుంది . కడుపులో చక్కెర జీర్ణమయ్యాక మిగిలేది యాసిడ్ . ఈ యాసిడ్ అనేక రోగాలకు మూలం . *మధు మేహ వ్యాధి గ్రస్తులు చక్కెరని తినరాదు . చక్కెరని తింటుంన్నంత వరకూ మీ వ్యాధి బాగు కాదు . ఆరోగ్యవంతులు కూడా ఈ చక్కెరను తినవలదు . బెల్లంతో చేసిన పదార్ధాలు తినడం ఆరోగ్యకరం* .

*ప్రెషర్ కుక్కర్*
    ఆయుర్వేద ప్రకారం ఏ ఆహారమైన ని వండేటప్పుడు *గాలి , వెలుతురు* తగులుతూ వుండ వలెను . *ప్రెషర్ కుక్కర్* లో వండిన ఆహారానికి ఏ మాత్రమూ గాలి , వెలుతురు తగిలే అవకాశమే లేదు . ఆయుర్వేద ప్రకారం ఈ ఆహారము విషంతో సమానం .ఈ ప్రెషర్ కుక్కర్ తయారు చేసేది అల్యూమినియంతో . అల్యూమినియం పాత్రలు ఆహారం వండటానికి , పదార్ధాలు నిల్వ వుంచటానికి ఏ మాత్రం పనికి రావు . ఈ పాత్రలలో వండిన ఆహారం మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే మధ మేహం , జీర్ణ సంబంధిత , టి.బి., ఆస్తమా మరియు కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి . కావున మట్టి పాత్రలు లేక ఇత్తడి పాత్రలను వాడండి .
*ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారంలో 13 % న్యూట్రియన్స్ ఉన్నాయి . కావున శరీరానికి కావలసిన పోషకాలు లభించనందు వలన *మధు మేహ వ్యాధి వచ్చును*
# మధు మేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి పరిస్ధితులలో INSULIN ని వాడరాదు .చక్కెర వ్యాధి కంటే ఈ Insulin ఎక్కవ ప్రమాధకరం . Side effects ఎక్కవగా వుంటాయి .

*బెల్లం ( Jaggery )* .

   బెల్లం ఔషధాల గని. పాత తరంలో బెల్లంతోనే పలురకాల తిండి పదార్ధాలను వండే వారు . ప్రస్తుతం చక్కెర వల్ల బలవర్ధకమైన బెల్లని కోల్పోతున్నాం . చక్కెర వల్ల పలు దుష్ ప్రభావాలు పొడ చూపుతున్నాయి . కఫాన్ని సక్రమంగా ఉంచటానికి ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం . ఇది బెల్లంలో పరిపుర్ణంగా ఉంది .

*పండ్లు* : --
  ప్రకృతి సిద్ధమైన తీపి తినవచ్చును . భగవంతుడు ప్రసాదించిన తీపి పండ్లలో తేలికగా జీర్ణమయ్యే ఫ్రక్టోజ్ అనే తీపి వుంటుంది. కావున ఈ పండ్లను తినవచ్చును .పక్వమైన మామిడి పండ్లు , ద్రాక్ష , అరటి పండ్లు , కమలా పండ్లు , బత్తాయి పండ్లు , దానిమ్మ , బొప్పాయి మరియు ఆపిల్ .

*HIGH FIBER & LOW FAT DIET* :--
చిరుధాన్యాలలో ఎక్కువ పీచు పదార్ధం మరియు Low Fat వుంటుంది . ప్రతి రోజు ఒక పూట చిరుధాన్యాలను తినవలెను .
*చిరు ధాన్యాలు ( Millets )*
రాగులు , జొన్నలు , అరికలు , వరిగలు , సామలు , ఊదలు మరియు కొర్రలు .
# *ప్రాణాయామం చేయ వలెను*

*గమనిక* :----
# ఆయుర్వేద ఔషదాలు మధు మేహ వ్యాధిని శక్తి వంతంగా తగ్గిస్తాయి . మధు మేహాన్ని తగ్గించటానికి గాను , అల్లోపతి మందులను కూడా వాడితే , ఆయుర్వేద ఔషదాలను వాడే ముందు మీ ఆయుర్వేధ వైద్యుడిని , నిపుణులని సంప్రదించటం చాలా మంచిది .
# టూత్ పేస్ట్ లో అధిక మోతాదులో *చక్కెర* వుండును. *వాడరాదు* . ఆయుర్వేద టూత్ పేస్ట్ లు , టూత్ పౌడరులు వాడండి .
# Cool Drinks లలో అధిక మోతాదులో *చక్కెర* వుండును . త్రాగరాదు .
*------- శ్రీ రాజీవ్ దీక్షిత్*

Thursday, 13 July 2017

బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది.
హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. ఈ పండు తింటే గర్భస్రావం అవుతుందని, గర్భిణులు తినకపోవడమే మేలని పెద్దలు చెపుతుంటారు.
పుట్టు పూర్వోత్తరాలు...
బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది.
రోగ నిరోధక శక్తి...
వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
ఉపయోగాలు...
* బొప్పాయి మలబద్ధకాన్ని
పోగొడుతుంది.
* ఆహారాన్ని వెంటనే
అరిగేలా చేస్తుంది.
* టీబీని నివారిస్తుంది.
* రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* రక్తంలోని దోషాలను నివారిస్తుంది.
* రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది.
* వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
* కడుపులోని యాసిడ్స్ను కంట్రోల్ చేస్తుంది.
జీర్ణక్రీయ వేగవంతం...
బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.
బ్రేక్ ఫాస్ట్గా బొప్పాయి...
* బొప్పాయి పండును ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది.
* బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.
నీళ్ల విరేచనాలకు
నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
బొప్పాయి పాలతో ఎంతో మేలు
10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.
బొప్పాయి ఆకులతో వైద్యం
బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.
బీపీ తగ్గిస్తుంది
రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు : బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.
ఔషధంగా...
* అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
* వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.
* బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
* బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
* ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.
సౌందర్య సాధనంగా...
* బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
* బ్యూటీక్రీమ్లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు.
* బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్గా ఉపయోగపడుతాయి.
* బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది.
* బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది.
* బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...