Thursday, 13 July 2017

సైంధవ లవణం అనేది భూమి మీద లభించే పురాతనమైన, శుద్ధమైన ఉప్పు. సాధారణ ఉప్పుకి బదులుగా ఈ సైంధవ లవణాన్ని, వంటలలో వినియోగించవచ్చు. ఇది చాలా చిన్న విషయంగా కనిపించినప్పటికీ ఫలితంలో ఎంతో తేడా వుంటుంది. 84 రకాల పోషక విలువలు కలిగిన ఈ సైంధవ లవణం, భూమి పై లభించేటటువంటి స్వచ్చమైన ఉప్పు. ఇది నిత్యం వంటలలో వాడినవారికి ఆరోగ్యపరమైన ఎన్నో లాభాలు కలుగుతాయి. దీనిని వాడటం వల్ల పక్షవాతం, థైరాయిడ్, బీపీ, చక్కెర వ్యాధి, కీళ్ల సమస్యలు వంటివి తలెత్తవు. వయస్సు పెరిగే కొద్దీ చాలామందికి కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీని నివారణకు సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, శనగగింజంత మాత్రలుగా చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గుతాయని నాటు వైద్యులు చెబుతారు. కడుపుబ్బరంతో బాధపడేవారు వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయ, సాయంకాలాలు పుచ్చుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఈ సైంధవ లవణం వలన మరెన్నో వుపయోగాలున్నాయి. సైంధవ లవణం వలన వేడి చెయ్యదు. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించడం వల్ల పైత్య సమస్యల నుండి బయటపడవచ్చు. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. గొంతులో కఫం పేరుకుని ఊపిరాడనపుడు, కొద్దిగా సైంధవ లవణం నోట్లో వేసుకుని చప్పరించడం లేదా తేనె కలిపి చప్పరించడం గనుక చేసినట్లయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. సైంధవ లవణంలో సాత్విక గుణం అధికంగా వుంటుందని, మిగిలిన  సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు వంటి లవణాలలో రాజస గుణాలు ఎక్కువ వుంటాయి కనుక ధ్యాన సాధన చేసేవాళ్ళు సైంధవ లవణం వాడడం మంచిది. దీనిలో ఇనుప ధాతువులు వుండడం చేత, రక్త హీనతతో బాధపడే వాళ్ళు వంటలలో సైంధవ లవణం వాడితే రక్తంలో ఇనుము శాతం పెరుగుతుంది.  దీని వాడకం వలన ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఇది అన్ని రకాల శరీర తత్వాలకు అనుకూలమైనది మాత్రమే కాక నిర్జలీయతను సైతం తగ్గిస్తుంది. 

ప్రకృతి ప్రాసాదితమైన సైంధవ లవణం(ఉప్పు) గనులు అత్యధికంగా హిమాలయాల్లో ఉన్నాయి.  సైంధవ లవణం రాయిని ఇంట్లో, ఆఫీస్‌లో, టేబుల్‌పై పెట్టుకుంటే పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష నివారిణిగా దీనిని చెప్పుకుంటారు. ఇది ఇంట్లోని గాలిని సైతం శుద్ధి చేస్తుంది.

 *ఉప్పు* మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర . మన శరీరంలో జరిగే రసాయనక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి జీర్ణ వ్వవస్ధకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి . జాతీయ పోషకహార సంస్ధ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 6 గ్రాముల కన్నా ఎక్కవ ఉప్పు తీసుకోకూడదు . కాని ప్రతి రౌజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు . ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు . హై బీ.పి. చక్కెర వ్యాధులు , రక్త దోషాలు , గుండె పోటు , తలనొప్పి , ఛాతి నొప్పి మొదలగు వ్యాధులు వస్తాయి . *సముద్రపు ఉప్పు ( Sea Salt )* 1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడే వారు . ఆంగ్లేయులు దీన్ని నిషేధించి సముద్రపు ఉప్పును ప్రవేశ పెట్టినారు . ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా హానికరమైన రసాయనాలను కలుపుతారు . దీనిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో 1200* పై వేడి చేయబడును . అందుచేత ఇది ఫ్రీఫ్లోగా వుండి జారి పోతుంది . సాధారణ ఉప్పులో 97.5 % సోడియం క్లోరైడ్ , 25% రసాయనాలతో కూడిన ఐయోడిన్ , పోటాషియం , అయోడైడ్ , సోడియం బయోకార్బోనేట్ , అల్యూమినియం , లవణం , సోడియం మోనో గ్లుటోమెట్ లు వున్నాయి . ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు. # పెరుగులో జీవామృత కీటకాలు ఉంటాయి . అవి శరీరానికి చాలా ఉపయోగము . ఉప్పును పెరుగుతో కలిపి తింటే 20 రకాల జబ్బులకు గురి అవుతారు . # ఈ ఉప్పును వాడటం వల్ల వాత, పిత్త , కఫ దోశాలు కలుగును . # ఈ ఉప్పును ఆయుర్వేద మందులలో వాడదగినది కాదు . # సముద్రంలో అనేక రకాల జీవరాసులు సముద్రంలోనే జీవిస్తూ , అందులోనే చనిపోవడం వల్ల వాటి అవశేషాలు అందులోనే కలిసి పోవడం వల్ల ఇది శాఖాహారం కాదు . # ప్రాసెస్ చేసిన ఉప్పును , అయోడిన్ ఉప్పును వాడరాదు . # అయోడిన్ ఉప్పుని వాడిన యెడల శృంగార సామర్ద్యం ఖచ్చితంగా తగ్గి పోతుంది . *సైంధవ లవణం* ( Rock Salt ) . # మనకు ప్రకృతి ప్రసాదించినది , లక్షలాది సంవత్సరాల పురాతనమైనది . స్వచ్చమైనది , ఏ మాత్రం కాలుష్యం సోకనిది ఈ *సైంధవ లవణం* . # 100% *శాఖాహారం* , తక్కువ సోడియం మోతాదు కలది . # *ఖనిజాలు* అత్యధికంగా కలిగినది . # మన శరీరానికి కావలసిన పోషక విలువలు కలిగినది . # *కాల్షియం , కాపర్, ఐరన్, మెగ్నీషియం , పాస్ఫరస్ , పొటాషియం , సిలికాన్ , సల్ఫర్ , జింక్ , అయోడిన్ , ఆక్సిజన్* , మొదలగు పోషక విలువలు కలవు . # కణం స్ధాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించును . # సుఖ నిద్రకు సహాయకారి . # ఎముకల దృడత్వాన్ని పరి రక్షిస్తుంది . # ఆస్తమా , సైనసైటిస్ ను అదుపు చేస్తుంది . # శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది . # అధిక బరువును నియంత్రించటంలో సహాయకారి . # మలబద్ధకాన్ని పోగొట్టును . # గ్యాస్టిక్ ను తగ్గిస్తుంది . # కాలేయంలోని వేడిని నియంత్రించును . # వాయు సంభందిత వ్యాధులకు ఉపశమనం . ఈ *హిమాలయన్ రాక్ సాల్ట్* రాళ్ళు *ఎరుపు , గులాబి మరియు తెలుపు* రంగుల్లో లభించును . ఉ ఉప్పును ఎందులో వేసినా ఆ పదార్ధం యొక్క రుచి మరింతగా పెరుగుతుంది . సైంధవ లవణం వ్రతాలలోను , పూజలలోను , ఉపవాసాల్లోను వాడుతారు . ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు . # కూరగాయలను సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే , పెస్టిసైడ్స్ యొక్క దుష్పలితాలను కొంత వరకు నివారించ వచ్చును . # *ఆయుర్వేద మందులలో ఈ సైంధవలవణంని వాడవలెను*. # నిత్యం ఈ సైంధవలవణం వాడే వారికి వాత , పిత్త , కఫాలు సమంగా ఉండును . # ధైరాయిడ్ , బీ.పి. , పక్షపాతం , చక్కెర వ్యాధి , కీళ్ళ సమస్యలు మొదలగునవి రావు . # పెరుగులో సైంధవ లవణం కలిపి తింటే జీవితాంతం ఆరోగ్యంగా వుంటారు . *సైంధవ లవణం ( Rock Salt )* ని వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...