లక్ష్మీప్రసన్నకు గ్రూప్ 2 ఉద్యోగం
తాడిపత్రి:: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు జేసీ సోదరులుమంగళవారం లక్ష్మీప్రసన్నను వెలగపూడిలోని సచివాలయానికి తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment