Thursday, 29 March 2018

భగవాన్ వాణి

"

ఒక పెద్దమనిషి, భగవాన్ ఎదుటకు వచ్చాడు అతడు అతడు భగవాన్ ముందు మోకరిల్లి విలపిస్తూ నా కుండలినిని లేపాడు. తత్పలితంగా నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. కానీ, భగవాన్ బోధించే ఆత్మ విచార సాధనకు , నాకొక విషయం ప్రతిబంధకంగా కనిపిస్తున్నది .మా గ్రామంలో మా ఇంటి ఎదుట నివసిస్తున్న ఒక యువతి ,నన్ను విపరీతంగా ఆకర్షిస్తున్నది . నేను ఆమెపట్ల నా కోరికను నిగ్రహించుకోలేక ఉన్నాను .దీనికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. దీనికి భగవాన్ ప్రశాంతంగా అతి శాంతంగా "ఆ ఆకర్షింపబడు తున్నవాడు ఎవరు?  అని అడిగాడు." నేనే" అన్నాడు ఆ పెద్దమనిషి ."ఎప్పుడెప్పుడు ఆమె కనిపిస్తున్నదో, అప్పుడప్పుడు నా మనస్సు ఆమెపై పరుగెడుతుంది. ఆమె సాంగత్యం గురించిన ఆలోచనలు ముమ్మరంగా మూసురుకొంటాయి.?' అన్నాడు ఆయన.  భగవాన్ ఇలా బోధించారు "ఎవరు చూస్తున్నారు ? ఎవరు ఆకర్షింపబడుతున్నారు? ఉద్రేకం పొందేది ఎవరు ?కోరికలు ఎవరికి ఉద్భవిస్తున్నాయి?  అని ప్రశ్నించుకో. ఈ ప్రశ్నలు వేసుకున్న క్షణాన ,నీ కోరికలు నేనుండి జారుకుంటాయి."

రామ్

Bhattacharya:
ఉపదేశసారము ---రమణ మహర్షి

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము:

1. దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.

2. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.

3. ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.

4. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.

5. బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.

6. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.

7. నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే * *సరళధ్యానం *ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.

8. పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.

9. ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.

10. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.

11. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ధ్యానం చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.

12. ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.

13. లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును.ధ్యానంలో నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.

14. ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

15. మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?

16. దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.

17. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.

18. వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.

19. నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.

20. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.

21. అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది.

22. దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.

23. సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?

24. శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు.

25. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.

26. ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.

27. జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు ధ్యానం కాక వేరువస్తువు ఏమున్నది.

28. తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.

29. తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.

30. నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది. దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని? ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, ధ్యానం ద్వారా తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసిల్లుతున్నాడు.ఇదియే పరమపదం.

"ఎక్కువగా చదివినందువలన, విస్తృతంగా జ్ఞానం సంపాదించినందువలన ఆత్మసాక్షాత్కారం లభించదు. ఒక్కొక్కసారి అది ప్రతిబంధకం కూడా అవుతుంది. సామాన్య మానవుడికి తన చుట్టు ఉన్న భార్యాబిడ్డలు, స్నేహితులు, తదితర బంధువులు మొదలైన కొద్దిమంది మాత్రమే ప్రతిబంధకాలు కానీ, గొప్ప గొప్ప శాస్త్రాధ్యయనం చేసిన పండితులకు, ఇతోధిక సంసారం ఏర్పడి ,ఆత్మజ్ఞానం ప్రాప్తికి అడ్డం వస్తుంది. సామాన్య మానవుడు, తన కొద్ది సంసారబంధాన్ని నిరంతర ఆత్మ విచారంతో త్రెంచుకోగలిగితే, మోక్షానికి చేరువ కాగలుగుతాడు. కానీ పండితుడు అయితే భార్యాబిడ్డలు, చుట్టుప్రక్కల అనే సన్నిహిత బంధాన్నేగాక; శాస్త్ర విచారంవలన కలిగే సందేహాలవలన, దిగుళౢ వలన ఏర్పడే బంధాన్ని కూడా వదులుకోవలసి ఉంటుంది. సాధనలో కొంతదూరం సాగిన తర్వాత ఈ పాండిత్యపు బంధాన్ని (శాస్త్రవాసనను) పూర్తిగా వదులుకోవలసి ఉంటుంది. చదివినదంతా వ్యర్ధంమనిపించి, దానిని మరచి పోవడానికి ప్రయత్నించవలసి ఉంటుంది" అని వివరించారు రమణులు. వారు ఇంకా ఇట్లా సెలవిచ్చారు : "ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. అది ఎంత చదువు చదివిన లభించదు (నా మేధాయా) అభ్యాసం వలన మాత్రమే సిద్ధిస్తుంది." అప్పుడు ఎనలేని మనశాంతి లభిస్తుంది.

ప్రశ్న : సేవ నుంచి నివృత్తి అయి శ్రీ భగవాన్ తో సదా ఉండిపోవాలని మనసు కోరుతుంది.
మహర్షి :  భగవంతుడు సదా మీతోనే ఉన్నారు,మీ లోపలే ఉన్నారు.మీ ఆత్మ భగవంతుడు. ఈ సత్యాన్ని అనుభవం పొందడానికి మీ కార్యములనుంచి అవ్వాల్సిన అవసరంలేదు. దుస్తులను మార్చడం ,ఇల్లూ ,వాకిలీ ,కుటుంబాన్ని వదిలివేయడం త్యాగమనిపించుకోదు. కోరికలు మమత్వమునూ,ఆశక్తులను వదలటం త్యాగం.మీకు మీ సేవా కార్యములనుంచి, వృత్తులనుంచీ నివృత్తి అవసరం లేదు .కేవలం నిన్ను నువ్వు ఈశ్వరునికి సమర్పించుకో.అతనే అందరి బరువునూ  మోయుదురు. ఏ మనిషి తన కోరికలను త్యాగము చేయునో ,వారు జగతిలో విలీనమై తన ప్రేమను పూర్తి విస్తారంగా  వ్యాప్తి చేస్తారు.త్యాగము బదులు ప్రేమ మరియు కరుణ యొక్క విస్తరణ ఒక నిజమైన భక్తునికి చాలా మంచిది,అది దగ్గరి బంధనాలను తెంచుతుంది.అతను తన ప్రేమ యొక్క విస్తారాన్ని  హద్దు,వర్గం,సంప్రదాయాలను మరియు జాతి మర్యాదను దాటి సంపూర్ణ జగత్తులో వ్యాప్తి చేస్తాడు.
సన్యాసి ఎప్పుడైతే తన వస్త్రాలను మరియు ఇంటిని త్యాగం చేస్తాడో,అప్పుడు తన దగ్గరి సంబంధీకుల పట్ల ద్వేషానికి కారణమవ్వడు,పైగా తన దగ్గరివారి కనిపించే వారందరి పట్ల ప్రేమను విస్తరింప చేసేందుకు చేస్తాడు. ఎప్పుడైతే ప్రేమ విస్తరించే ఘటన ఘటిస్తుందో, అప్పుడు మనిషి  ఇంటినుంచి పారిపోతున్నాను అని అనుభూతి చెందడు, పైగా పక్వానికొచ్చిన ఫలం చెట్టునుండి అనాయాసంగానే వేరుపడుతుంది.ఆ విధంగా ఇంటినుంచి వేరవుతాడు.అప్పటివరకు ఇంటినీ ,కార్యాన్నీ (బాధ్యతలను) విడుచు మూర్ఖత్వం. ~  రమణ మహర్షి .

Maharshi Teachings. श्री रमण महर्षि के उपदेश

Q: I have a good mind to resign from service and remain constantly with Sri Bhagavan.

Sri Ramana Maharshi :

Bhagavan is always with you, in you,
and you are yourself Bhagavan.

To realize this it is neither necessary to resign your job nor run away from home.

Renunciation does not imply apparent divesting of costumes, family ties, home, etc., but renunciation of desires, affection and attachment.

There is no need to resign your job, only resign yourself to God, the bearer of the burden of all.

One who renounces desires actually merges in the world and expands his love to the whole universe.

Expansion of love and affection would be a far better term for a true devotee of God than renunciation, for one who renounces the immediate ties actually extends the bonds of affection and love to a wider world beyond the borders of caste, creed and race.

A sannyasi who apparently casts away his clothes and leaves his home does not do so out of aversion to his immediate relations but because of the expansion of his love to others around him.

When this expansion comes,
one does not feel that one is running away from home,
instead one drops from it like a ripe fruit from a tree.

Till then it would be folly to leave one's home or job.

~ From Be as you are book

Monday, 26 March 2018

బ్రహ్మము

బ్రహ్మము

  బ్రహ్మమొక్కటే ఎంగిలి పడనిది అంటారు శ్రీ రామకృష్ణులు. అంటే నిర్వచనానికి అతీత మైనది. దేన్నైనా నిర్వచించ గాలిగా మంటే అది మన నోటిలో ఎంగిలి అవుతుంది. బ్రహ్మమొక్కటే అనిర్వచనీయం. అదే జగత్తుకు మూలం. వాక్కుకు అతీత మైనది గా దానిని వేదములు వర్ణించాయి. ఇదే బ్రహ్మం. దీనినే లావో జు తన భాషలో టావో అన్నాడు. దీనినే వేదాంతము బ్రహ్మము అని, పురాణములు భగవంతుడు అని, తంత్రములు పరమ శివుడు అని పిలిచాయి. ఇది బుద్ధికి అతీత మైన అనిర్వచనీయమైన, అనుభవైక వేద్యమైన ఒక స్థితి.

పేరు పెట్టి దానిని పిలిచినా మరు క్షణం అది ఎంగిలి అవుతుంది. అప్పుడది నిజమైన టావో కాదు. మాటల స్థాయికి దిగి వచ్చిందంటే అది తన స్వ స్వరూపం నుంచి ఒక మెట్టు దిగినట్లే. కనుక అది అసలైన టావో కాదు. అందుకనే జ్ఞానులు మౌన బోధ చేశారు. బుద్ధుని దేవుని గురించి అడిగితె మౌనం వహించాడు. రమణ మహర్షి కూడా అదే పని చేశాడు. శ్రీ రామకృష్ణుడూ అదే చేశాడు.

నిర్వచనకు మూలం కోరిక. ఏదో చేయాలని తపన. దానితో అనేక భావాలలోచిక్కుకొనుట జరుగుతుంది. ప్రతి దానినీ నిర్వచించి అర్థం చేసుకోవాలని తపన కలుగుతుంది. సత్యము ఈ తపనకు అతీత మైనది. కనుక కోరిక తో సృష్టి మొదలైనది. కోరిక లేకపోతే సృష్టి మూలం ఎరుకలోకి వస్తుంది.

కాని ఈ అతీతమూ అనిర్వాచ్యమూ అయిన స్థితీ సృష్టీ రెండూ ఒకే చీకటి నుంచి ఉద్భవించాయి. సృష్టి ఉనికి అయితే, ఉనికి లేమి దాని నీడలా ఉందనే ఉంటుంది. ఈ రెంటికీ మూలమే చిమ్మ చీకటి. ఆ చీకటికి మూలమైన చీకటి లో సర్వం ఉంది. అన్ని ఆశ్చర్యాలూ అక్కడ కలసి మెలసి ఉన్నాయి. అది అద్భుతాలకు నెలవు.

Sunday, 25 March 2018

జ్ఞాని, అజ్ఞాని, జ్ఞానంమార్గం

*జ్ఞాని, అజ్ఞాని, జ్ఞానంమార్గం,*

జ్ఞానము సంపాదించి దానితో దైవమును చేరటం,
ఒకప్పుడు పండితుడు జ్ఞాని  అయిన మహానుభావులు ఉండే వారు ఆయనకు నృసింహస్వామినీ చర్మ చక్షువులతొ దర్శించి కోవాలనే కోరిక కలిగింది దానితో వారు అడవిలొ ఒక చెట్టు కింద ఆసనం వేసుకోని కుర్చొని తపస్సు చెయ్యసాగారు ఇది ప్రతి రోజూ ఒక బోయవాడు గమనిస్తూ ఉండెవాడు.ఇల కొన్ని సంవత్సరాలు జరిగిన తరువాత ఆ తపస్వికి విరక్తి కలగడంతో ప్రాణత్యాగం చేయాలని అనుకున్నారు తను కుర్చున చెట్టుకు ఉరి వేసుకున్నాడు,                ఇది గమనించిన బోయవాడు ఉరి తప్పించి,    స్వామి ఇన్నిరోజులుగా ఈ చెట్టుక్రింద కుర్చొని ఏమి చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఉరి వేసుకుంటున్నారు అని అడిగాడు,!

పండితుడు అనుకొన్నాడు వీడు అజ్ఞాని వీడికి సాధనాలు మంత్రాలు నృసింహస్వామి ఇవి అన్ని అర్ధం కావు అనుకొన్నవాడై, ఏమీ లేదు నాయనా! కూర్చోని రోజు చేసేదాన్ని తపస్సు అంటారు ఎందుకోసం అంటే, శరీరం మొత్తం మనిషిగా తల  సింహంలా ఉన్నవారిని చూడాలని నేను ఇన్ని రోజులు ఆశపడ్డాను ఇప్పుడు నా ఆకాంక్ష నెరవేరలేదు దానితో విరక్తి చెంది ప్రాణత్యాగం చేయబోయాను అని చెప్పారు,
బోయవాడు! అయో ఇంత చిన్న విషయానికి మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు. రాగానే నాతొ చేప్పినట్టు అయితే అప్పుడే చూపించే వాడిని, ఇక్కడనే ఉండండి ఏ అఘాయిత్యం చేయకండి నేను వేళ్ళి  నరసీంహుడిని పట్టుకోని వస్త అంటూ బోయవాడు అడవిలోకి వెళ్ళాడు కోంత సేపు తరువాత ఒక తాడు పట్టుకుని బలంగా లాగుతు  ఈ పండితుడి వద్ధకు లాక్కొని వచ్చాడు, స్వామి​ ఏంత బ్రతిమాలిన మి వద్ధకు రానన్నరు అందుకే తాడుతో కట్టి మీ వద్ధకు తిసుకొని వచ్చను ఈయన నేన మీరు చూడలని అనుకున్నది అని అడిగాడు బోయవాడు,
పండితుడికి ఎవ్వరు కనిపించలేదు,       నాయనా!  నాకు ఏవ్వరు కనిపీంచటం లేదు తాడు కట్టినట్లు కనిపిస్తోంది అని అన్నరు,
వేంటనే బోయవాడు తాడు వైపు తిరిగి నేను ఈయనకు మాట ఇచ్చాను నిన్ను చూపిస్తాను అని నా మాట నిజం చేయాలి లేదా నేను మాటతప్పిన వాడిని అవుతాను,మాట తప్పడం కన్న మరణించటం మేలు అనుకోంటు తన కత్తిని తీశాడు, స్వామి వారు పండితుడిని అనుగ్రహిస్తూ
తన దివ్య దర్శనం అనుగ్రహించారు.

             *శుభం*

ఈ కథను కొంత విశ్లేషిస్తాను మిగతా విషయాలు మీరు చెప్పండి.

ఓకరు జ్ఞాని,మరిఒకరు అజ్ఞాని,

🌹 *అజ్ఞాని* 🌹

బోయవాడు అడవిలో ప్రతి రోజూ నృసింహస్వామినీ దర్శనం కలుగుతున్న అతను భగవంతుడు అనీ గుర్తు పట్టలేదు, ఎప్పుడైతే జ్ఞానిని కలిశాడొ అప్పుడు భగవంతుని గుర్తింపు పొందాడు,

🌹 *జ్ఞాని* 🌹

పండితుడికి మంత్రము తెలుసు, తంత్రములు తెలుసు సాధన ఏప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో ఎలా చేయాలో కూడా తెలుసు కానీ భగవంతుడు ఎక్కడో వేరే ఉన్నారు నేను సాధన తొ మాత్రమే చూడగలం అనుకొన్నాడు,అదే మాయ,,

🌺 *భగవంతుడు ఏక్కడ ఉన్నరు* 🌺

నీవారశుఖవత్వని శ్యామభ సత్యనుపమః అన్నది పురుష సూక్తం​,

భిసతంతు తనియసి అని చేప్పింది లలితా సహస్రనామ స్తోత్రము.

ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రణి కంటే అన్నారు పోతన గారు.

🌺 *భగవంతుని ఎలా చూడగలము* 🌺

కర్మ ప్రారబ్ధము అనే చీకటిలో భగవంతుడిపై నమ్మకం అనే చిన్న దీపం వేలిగించండి భగవానుడు మీరు కోరిన రూపంలో మీ ముందు ఉంటారు, మీరు పరిపూర్ణముగా నమ్మి శరణము వెడితే
ఇవన్నీ మీకు ముందే తెలుసు కానీ నాకు మరలా మీకు చేప్పలని అనిపించింది ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

Friday, 23 March 2018

ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ

ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ
----------------------------

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం ! అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది. ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. ‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.
నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది ! ఇది సత్యం !
(సేకరణ)

Thursday, 22 March 2018

నెయ్యి తింటే ఎలాంటి లాభాలు

*టీస్పూన్ నెయ్యి తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?*

మ‌న‌లో చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని కూర‌ల్లో వేసుకుంటారు. కొంద‌రు భోజ‌నం చేసేట‌ప్పుడు అందులో క‌లుపుకుని తింటారు. ఇక కొంద‌రైతే నెయ్యితో తీపి వంట‌కాల‌ను చేసుకుని తింటారు. అయితే ఇలా కాకుండా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక టీస్పూన్ నెయ్యి తింటే చాలా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. నెయ్యి తిన్న వెంట‌నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మై ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నెయ్యి తింటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. జీర్ణాశ‌యంలో అగ్ని పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌లు కూడా బాధించ‌వు.

2. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు నెయ్యిని తీసుకోవాలి. దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.

3. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌న చాలా మందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

4. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నిత్యం నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీల‌క పోష‌కాలు గ‌ర్భిణీ స్త్రీలకు ల‌భిస్తాయి. దాంతోపాటు పిండం చ‌క్క‌గా ఎదుగుతుంది కూడా.

5. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మ‌డ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి.

6. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే త‌గ్గిపోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. నెయ్యిని నిత్యం తింటుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

7. ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి పాజిటివ్ ఫుడ్‌. ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు. శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది.

8. నెయ్యిలో ఉండే విట‌మిన్ డి ఎముక‌లకు మేలు చేస్తుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...