Sunday, 18 March 2018

మన శరీరంలో రహాస్యం


ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.
అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం

మన శరీరంలో ఉన్న ప్రతి అవయవమునకు సంభందించిన ఒత్తిడి కేంద్రాలు మన పాదాలలో చేతులలో ఉంటాయి ఈ కేంద్రాలకు ఒత్తిడి కలిగించడం వల్ల ఆ యా అవయవాలను ఉత్తేజపరచడం ద్వారా వ్యాధులను నిరోదించే వైద్య ప్రక్రియ ( పీడన వైద్యం ) మన ఆయుర్వేదంలో భాగంగా ఉన్నది దీనినే ఇప్పుడు ఆక్యు ప్రెషర్ ( పంక్చర్ ) అని పిలుస్తున్నారు మీరు చెప్పులు లేకుండా నడిచినట్లయితే మీ పాదాలకు ఒత్తిడి కలిగి ఆరోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది.
రెండు చేతులతో 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం ద్వారా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. చెప్పులు లేకుండా రోడ్డు పైన కాకుండా రోడ్డు పక్కన మట్టిలో కాని , ఇసుకలో కాని, చిన్న చిన్న గులక రాళ్ళు లేక కంకర రాళ్ళు ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల మీకు చాల ఉపయోగం ఉంటుంది. ఉదయం సాయంత్రం 5 నిమిషాలపాటు కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, మన పూర్వీకులు అందుకే గుడిలో భజన చేసేవారు.
వెంటనే ఈ రెండు చిట్కాలు పాటించండి 3 లేక 4 రోజుల్లో మీ శరీరం తేలికపడి, కాళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు తగ్గి మంచి నిద్ర పడుతుంది 10 రోజుల పాటు పాటించండి మీ అనారోగ్య సమస్యలు అన్ని తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు ఆ పైన మీరే కొనసాగిస్తారు. మధుమేహ బాదితులు మాత్రం కాళ్ళకు గాయాలు కాకుండా జాగ్రత్తగా నడవడం మరచిపోవద్దు.

* Human body energy clock*
*ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా???*
ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్ర పోవాలి… ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తారనుకోండి అది వేరే విషయం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్గా పనిచేస్తాయి. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్ గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలగుతుంది. ఈ క్రమంలో అసలు ఏయే భాగాలు ఏయే సమయాల్లో యాక్టివ్గా పనిచేస్తాయో, అవి పనిచేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య*
– ఈ సమయంలో పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదు.
* ఉదయం 7 నుంచి 9 మధ్య*
– ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని, పండ్లను ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. దీని వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయి.
* ఉదయం 9 నుంచి 11 మధ్య*
– ఈ సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరరీంలో జరిగే జీవక్రియలను గాడిలో పెడుతుంది. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది.
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య*
– ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుంది. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చూస్తుంది. దీని వల్ల శరీర కణాలకు శక్తి అందుతుంది.
* మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు*
– ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్ల జీర్ణప్రక్రియను ముగిస్తుంటాయి.
* మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు*
– ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి.
* సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు*
– ఈ సమయంలోనూ మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి.
* రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య*
– ఈ సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది.
* రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య*
– ఈ సమయంలోభోజనం అస్సలు చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి.
* రాత్రి 11 నుంచి 1 గంట మధ్య*
– ఈ సమయంలో మూత్రాశయం యాక్టివ్గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుంటుంది.
* రాత్రి 1 నుంచి ఉదయం 3 మధ్య*
– ఈ సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో కచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటికి వెళ్లవు.
* ఉదయం 3 నుంచి 5 మధ్య*
– ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్గా ఉంటాయి. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:
* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.
* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.
* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి
* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.
* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.
* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.
* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.
* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.
* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.
* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.
* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.
* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.
* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.
* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.
* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.
* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.
* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.
* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.
మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి.
మీరు ఈ పోస్టుని అందరికి పంపండి. వాళ్లు చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు....

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...