Monday, 19 March 2018

గాయత్రి మంత్ర మహిమ -

ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు

గాయత్రి  మంత్ర మహిమ - కర్ణ పిశాచి చెప్పినమాటలు

ఈ కథని జ్ఞాన పీఠం అవార్డ్ పొందిన కవి సామ్రాట్టు అయినశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన నవలలో ఈసంఘటన గురించి చెప్పడం జరిగింది. ఇది వాస్తవంగాజరిగిన సంఘటనయే.

పూర్వం కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరుఉండేది. ఆ పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి వ్యవసాయం చేసుకోవడానికి కొన్నిఎకరాలభూములుఉండేవి . ఆ బ్రాహ్మణుడు పాలేర్లని పెట్టుకునివ్యవసాయం చేస్తుండే వాడు. ఎంతో కొంత వేద పఠనము, జ్యోతిష్యం, ఈ పంచాంగమంతా చూసేవాడు. వాళ్లకితోచిన సలహాలేవో ఇస్తుండే వాడు. ఆ రోజుల్లోబ్రాహ్మణులకి ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవడానికిభూములు ఉండేవి. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక పాలేరు పనిచేస్తుండే వాడు. చాలా మంచి వాడు.

ఒక రోజు ఆ బ్రాహ్మణుడు పొలం పనులన్నీ చూసుకునిఇంటికి వచ్చిఇంటి బయట ఉన్న ఒక కుక్కి మంచంలోపడుకుని విశ్రమిస్తున్నాడు. కాసేపటికి ఆ పాలేరు పొలంనుంచి వచ్చి అమ్మగారూ! అమ్మగారూ! పని చేసి చేసిపోలంనుంచి అలసిపోయి వచ్చాను. కాస్త మంచి తీర్థంఇప్పించండి అలాగే మీరు చేసిన గారెలు రెండో మూడోనాకు పెట్టండి అని అడగటం జరిగింది. అప్పుడు ఆఅమ్మగారు వాడికి మంచినీళ్ళిచ్చి, అసలు గారేలేమిటీ? నేను చేయడం ఏమిటీ? ఏం మాట్లాడుతున్నావు నీవు? నేనెప్పుడు గారెలు చేసాను? అని అన్నారు. అమ్మగారూ! మీరు అబద్ధాలు చెప్పుతున్నారు . మీరు మొత్తం 22 గారెలు చేసారు. అందులో రెండు మీరు తిని రెండు మీపిల్లవాడికి పెట్టారు. ఇంకా మీ దగ్గర 18 గారెలు ఉన్నాయి. 18 ఉన్నాయో లేదో అని కావాలంటే లెక్క చూసుకోండి. నేను నిజం చెప్పుతున్నానో లేదో చూసుకుని చెప్పండి అని ఆ పాలేరు చెప్పటం విని ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇదేమిటీ వీడు ఇలా వచ్చి ఈవిడ గారెలుచేసింది అని అంటాడు. అసలు సంగతేమిటీ అనికుతూహలంగా జరుగుతున్నదంతా అతనుగమనిస్తున్నాడు. అమ్మగారు కూడా తను  గారెలు చేసాననివీడికెలా తెలిసింది అని చాలా ఆశ్చర్య పోయారు. తానుచేసిన గారెలు లెక్క పెట్టేసరికి సరిగ్గా పాలేరు చెప్పినట్టే 18 ఉన్నాయి. అవునురా! నీవు చెప్పింది నిజమే. కాని నేనుగారెలు చేసానని నీకెలా తెలిసింది? ఏమైనా మంత్రోపాసనచేస్తున్నావా?  సంగతేమిటీ ?అని అడిగారు. ఏంలేదమ్మగారూ! నేనేమంత్రం ఉపాసన చేయటంలేదు. రాగానే గారెల వాసన తగిలి గారెలు చేసారని , ఏదో నానోటికి వచ్చిన సంఖ్య ఏదో నేను చెప్పాను.అంతేనండిఅమ్మగారు ఇంకా ఏమి లేదు అని అన్నాడు. అదృష్టంబాగుండి ఆ సంఖ్య సరిగ్గా సరి పోయింది. మంత్రాలునేనెందుకు చేస్తాను అని చెప్పి తప్పించుకున్నాడు.

ఆ పాలేరేదో దేవతని ఉపాసన చేస్తున్నాడని ఆబ్రాహ్మణుడు గ్రహించాడు. అతనికి అదేదో తెలుసుకోవాలిఅని కుతూహలం కలిగింది. దానితో ఆ పాలేరు వెంట పడినానా విధాలుగా ప్రశ్నించాడు. ఏరా! నాకా మంత్రం చెప్తావాలేదా నేను కూడా ఉపాసన  చేస్తాను అని అంటేఅయ్యగారూ! మంత్రమూ లేదు తంత్రమూ లేదు ఊరికేచెప్పాను అని అన్నాడు .లేదు! లేదు! నేను నమ్మను. నీవుఏదో  ఒకటి ఖచ్చితంగా సాధన చేస్తున్నావు నాకుచెప్పాల్సిందే అని ఇరవై నాలుగు గంటలు అతని వెనకపడడం మొదలు పెట్టాడు. ఆ పాలేరుకి విసుగు పుట్టిచివరకి నేను ఒక కర్ణ పిశాచి అనే చిన్న దేవతను ఉపాసనచేసి నా అధీనంలో పెట్టుకున్నాను. నేనేమైనా ప్రశ్నలుఅడిగితే ఆ పిశాచం నా చెవిలో జవాబులు చెప్తుంది. సరే! మీరు ఇంత ప్రాధేయ పడుతున్నారు కదా! ఆ దేవతని నేనుఅడుగుతాను. అయినా మీరు బ్రాహ్మణులు మీకు ఈ చిన్నదేవత కర్ణ పిశాచి ఎందుకండీ? ఏం చెప్పినా కూడా మీరువినటం లేదు కాబట్టి నేను కనుక్కుని చెప్తాను అని చెప్పి ఆపాలేరు వెళ్లి పోయాడు.

             

ఆ మర్నాడు పాలేరు రాగానే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకునివచ్చి ఏం నాయనా! ఏమంటున్నది మీ దేవత? అనగాఅయ్యా! నేను కర్ణ పిశాచాన్ని అడిగాను. అయితే ఆ కర్ణపిశాచి ఇలా అన్నది, మీ దొర గారు పిచ్చి వాడు. అతనుమనస్సు లోపలే  ప్రతి నిత్యం పగలనక  రాత్రనక  గాయత్రిమంత్రం జపిస్తూ ఉంటాడు కదా అటువంటి గాయత్రి మహామంత్రం చదువుతున్న అతని దగ్గరకి నేనెలా రాగలన? నన్ను ఆయన ఎలా ఉపాసన చేస్తాడు? నా మంత్రాలు ఎలాచదువుతాడు? ఆయన దగ్గరకి నేను రాలేకుండా ఉన్నాను. ఆయనకి నేనెంతో దూరంలో ఉంటున్నాను. మరి ఎందుకుమీ పిచ్చి బ్రాహ్మణుడు అంత మంచి మంత్రంతో గాయత్రిమాతని ఉపాసన చేస్తూ నాలాంటి క్షుద్రదేవతని గురించిఆలోచిస్తున్నాడు పిచ్చా వెర్రా అని ఆవిడ వారించింది. అలాకాదు కూడదు అని అనుకుంటే. నన్ను ఉపాసన చేయాలిఅని అనుకుంటే మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలితప్పదు. ముందు వారింటిలో ఉన్న ఆ దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ అవతల పారేయాలి. నేను గాయత్రిమంత్రం చదవనని ఆయన ప్రతిజ్ఞ చేయాలి. పొరబాటునకూడా గాయత్రి మంత్రం చదవకూడదు. అలా చేస్తాననికనక ఆయన ఒప్పుకుంటే అప్పుడే నేను అతనివశమవుతాను. అంత వరకు నేను అతని దగ్గరకి రాలేను. 

అతనికి కొన్ని గజాల దూరంలో కూడా నేను నిలబడ లేకపోతున్నాను. అంత శక్తివంతమైనది ఆ గాయత్రి మంత్రంఅని నీవు వెళ్లి ఆ పిచ్చి బ్రాహ్మణుడికి చెప్పు అని ఆ కర్ణపిశాచి చెప్పింది అని ఆ పాలేరు చెప్పాడు. అది విని ఆబ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. బాబోయ్! గాయత్రిమంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? నాకేమీ తెలియదు. వీడుకర్ణ పిశాచిని చెవిలో పెట్టుకుని అన్నీ చెప్తుంటే ఆహా! ఓహో! అని ఏదో అనుకున్నాను. గాయత్రి మంత్రాన్ని చదువుతున్ననా దగ్గరకే ఈ కర్ణ పిశాచి రాలేక పోయినప్పుడు ఇటువంటిచిన్న చిన్న క్షుద్ర దేవతల ఉపాసన చేయటం నాకు తగదుఅని లెంపలేసుకుని నాకు నీ కర్ణ పిశాచి మంత్రం అక్ఖర్లేదు. నేను హాయిగా నా గాయత్రి మంత్రాన్నే చేసుకుంటాను అనిఆ పాలేరుకి చెప్పటం జరిగింది. ఎలా ఉపాసన చేస్తాడు? నా మంత్రాలు ఎలాచదువుతాడు? ఆయన దగ్గరకి నేను రాలేకుండా ఉన్నాను. ఆయనకి నేనెంతో దూరంలో ఉంటున్నాను. మరి ఎందుకుమీ పిచ్చి బ్రాహ్మణుడు అంత మంచి మంత్రంతో గాయత్రిమాతని ఉపాసన చేస్తూ నాలాంటి క్షుద్రదేవతని గురించిఆలోచిస్తున్నాడు పిచ్చా వెర్రా అని ఆవిడ వారించింది. అలాకాదు కూడదు అని అనుకుంటే. నన్ను ఉపాసన చేయాలిఅని అనుకుంటే మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలితప్పదు. ముందు వారింటిలో ఉన్న ఆ దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ అవతల పారేయాలి. నేను గాయత్రిమంత్రం చదవనని ఆయన ప్రతిజ్ఞ చేయాలి. పొరబాటునకూడా గాయత్రి మంత్రం చదవకూడదు. అలా చేస్తాననికనక ఆయన ఒప్పుకుంటే అప్పుడే నేను అతనివశమవుతాను. అంత వరకు నేను అతని దగ్గరకి రాలేను. 

అతనికి కొన్ని గజాల దూరంలో కూడా నేను నిలబడ లేకపోతున్నాను. అంత శక్తివంతమైనది ఆ గాయత్రి మంత్రంఅని నీవు వెళ్లి ఆ పిచ్చి బ్రాహ్మణుడికి చెప్పు అని ఆ కర్ణపిశాచి చెప్పింది అని ఆ పాలేరు చెప్పాడు. అది విని ఆబ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. బాబోయ్! గాయత్రిమంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? నాకేమీ తెలియదు. వీడుకర్ణ పిశాచిని చెవిలో పెట్టుకుని అన్నీ చెప్తుంటే ఆహా! ఓహో! అని ఏదో అనుకున్నాను. గాయత్రి మంత్రాన్ని చదువుతున్ననా దగ్గరకే ఈ కర్ణ పిశాచి రాలేక పోయినప్పుడు ఇటువంటిచిన్న చిన్న క్షుద్ర దేవతల ఉపాసన చేయటం నాకు తగదుఅని లెంపలేసుకుని నాకు నీ కర్ణ పిశాచి మంత్రం అక్ఖర్లేదు. నేను హాయిగా నా గాయత్రి మంత్రాన్నే చేసుకుంటాను అనిఆ పాలేరుకి చెప్పటం జరిగింది.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...