Monday, 19 March 2018

భార్యా భర్తల  లక్షణాలు

పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు  క్రింది విదంగా ఉంటాయి .

(1) శ్లో॥    కార్యేషు యోగీ, కరణేషు దక్షః
         రూపేచ కృష్ణః క్షమయా తు రామః
         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం
         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త  లక్షణాలు )

కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
 కరణేషు దక్షః 
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
 రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
 క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
 భోజ్యేషు తృప్తః
భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.
 సుఖదుఃఖ మిత్రం
 సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ భర్తగా కొనియాడబడతాడు.

(2). శ్లో॥    కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
         రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
         భోజ్యేషు మాతా, శయనేషు రంభా
         షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)

 కార్యేషు దాసీ
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.
కరణేషు మంత్రీ
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.
    రూపేచ లక్ష్మీ
 రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.
క్షమయా ధరిత్రీ
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.
భోజ్యేషు మాతా
  భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
శయనేషు రంభా
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.
 ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...