భగవాన్ :నీ వెవరు?
శిష్యుడు :నేను నారాయణస్వామిని
భ: 'నేను' అంటున్నది నీ శరీరమ,నోర, చేతులా?
శి: నోరు, నాలుక ,శరీరం అన్నింటి మొత్తమే 'నేను'
భ: శిష్యుని శరీరం వైపు చూచి 'ఆ' శరీరం ఎవరిది ?
శి: ఇది నా శరీరం
భ: 'నీవు శరీరం కన్నా వేరు' అన్నమాట . 'నీవు యజమానివి, శరీరం నీ సొత్తు' అన్నమాట.
శి: 'నేను శరీరమును కాను' అని అర్థమయ్యింది. కానీ నా శరీరానికి, 'నేను' అనేదానికి మధ్యగల విభజన రేఖ నాకర్ధం కావడం లేదు .నేనెవరో నాకు తెలియడం లేదు .
భ: ఆ ప్రశ్నకు నీకు నీవే వేసుకో అప్పుడు నీవెవరివో తెలుస్తుంది.
శి: ప్రశ్న ఎవరికి వేయాలి? ఎలా వేయాలి ?
భ: ఆ ప్రశ్నను 'నేను' కు వేసుకుని, ఆ 'నేను' ఎక్కడ ఉత్పన్నమౌవుతున్నదో దానిని వెతుకు. నీకు జవాబు లభిస్తుంది.
భగవాన్ పాతాళ లింగం దగ్గర దేహభ్రాంతి లేని స్థితిలో ఉన్నారు అప్పటినుంచి శరీరం వదిలేవరుకు ఆ స్థాయిలోనే ఉన్నారు.వారి స్థాయీ, మన స్థాయి చాలా భిన్నం.వారు దేహభ్రాంతి లేకుండా చేశారు,అందులో ఒక్కశాతం మాత్రమే మనకు చెప్తున్నారు,ఆ ఒక్క శాతం అంటే మనస్సు (నీది,నాది అంటున్న వస్తువులపై కోరికలు).ఆ అహంకారాన్ని తొలగించుకోవాలని చెప్పేవారు.
ప్రతియొక్క ఆలోచన వెనుక నిరంతరంగా 'నేను' అనే తలంపు ఉంటుంది,అదే 'నీవు'.ఈ నేను తలంపుకు హత్తుకుపోయి అది ఏమిటి అని ప్రశ్నిస్తూ వెతుకు.
ఎప్పుడైతే ఈ ప్రశ్న నిన్ను గట్టిగా పట్టేసుకుంటుందో నీవు ఇతర ఆలోచనలు చేయలేవు.
ఆత్మ కొరకు నీవు తీవ్రమైన అన్వేషణ చేసినపుడు ఈ 'నేను' తలంపు మాయమైపోతుంది మరియు ఎంతో లోతు నుంచి ఇంకేదో నిన్ను పట్టేసుకుంటుంది.
అది నీవు అన్వేషణ ప్రారంభించిినప్పటి 'నేను' మాత్రము కాదు.
అదే సత్యమైన ఆత్మ, నేను యొక్క మూలము.
అది అహంకొరకు కాదు. అది స్వయంగా పరమాత్మనే .
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
సత్ దర్శన భాష్యము సంభాషణ 1.
సత్యమైన స్థితి ,ద్వంద్వ రహిత ఆత్మ .
అది శాశ్వతము స్థిరము,ఒకరు దాని తెలుసుకున్నా లేక తెలుసుకోలేకపోయినా కూడా.
సంభాషణలు౼499
భక్తుడు : మృత్యువు అందరికీ. సమాన్యమే.అటువంటప్పుడు మృత్యువంటే భయపడి ఏమి ప్రయోజనం?
మహర్షి : నిజమే.అది అందరికీ సమానమే.ఆ భయానికి ప్రయోజనమూ లేదు.మనసులోని వాసనల ప్రాబల్యం వల్ల మానవుడు సహజంగానే చనిపోతాడు. ఆ భయంవల్ల వైరాగ్యం కలుగదు.
భక్తుడు : కానీ మిమ్ము చూడవచ్చిన వారందరికీ తారతమ్యం లేక ఒకే ఉపదేశం ఇస్తున్నారే ?
మహర్షి : నేను చెప్పేదేమి ? ప్రతీవారిలోని అహంకారం చావాల్సిందే . దానిపై వానిని విచారించనీ. అహంకారం ఉందంటావా?లేదంటావా?
దానినే మననం చేస్తుంటే అధికాధికంగా వాడర్హత సాధిస్తాడు.
%______----------__;___--------------//\\\\\\___--------__;;_------%
భక్తుడు -- సంఘాన్ని గురించిగాని నా దేశాన్నిగురించిగాని ఆలోచన వచ్చినప్పుడు " నిన్ను నువ్వు తెలుసుకో" అని మీరు చెప్పిన సమాధానం గుర్తుకొచ్చును.
మహర్షి : జ్ఞాని అయినప్పుడు కర్మచేయుటకు అవసరమైన శక్తిని కోల్పోయెదవని భయపడవద్దు.
భక్తుడు -- నాకు ఆ భయమున్నది.
మహర్షి -- భయం ఉండకూడదు. ఒక పని నీచేత జరగాలని ఉంటే అది అటులనే జరుగును.
భక్తుడు -- అయితే అన్నిటిని వదిలేసి తపస్సు చేత నా కోరికలను తీర్చమని భగవంతుడిని వేడుకొనవచ్చా ?
మహర్షి -- అటుల చేయవచ్చును. నేను నిన్ను ఒక ప్రశ్న వేసెదను. రైలుబండి ఎక్కిన ప్రయాణికుడు తన సామాను ఎక్కడ పెట్టును ?
భక్తుడు -- తాను ఎక్కిన రైలుపెట్టెలో పెట్టును.
మహర్షి : కదు !? అతడు ఆ బరువును తన తలపైన లేక ఒడిలోనో పెట్టుకోడు.
భక్తుడు -- అలా తన బరువును తానే మోయువాడు మూర్ఖుడగును.
మహర్షి : బరువును తన తలమీద మోయువాడు మూర్ఖుడైనచో , ఆధ్యాత్మమార్గంలో పయనించే వారు తమ భారాన్ని తామే మోయుట అంతే మూర్ఖత్వమనిపించుకొనును. అది ఆత్మవిచార మార్గమైనా కావచ్చు లేక భక్తి మార్గమైనా కావచ్చు.
భక్తుడు -- కాని , నేను నా బాధ్యతలన్నింటిని ఎలా వదిలివేయగలను ?
మహర్షి : ఇప్పుడు ఆ గోపురంకేసి చూడు. ఆ గోపురంలో ఎన్నో విగ్రహాలు , నలుమూలలయందు పెద్దవిగ్రహాలు కలవు.
భక్తుడు -- ఔను. చూశాను.
మహర్షి : ఇప్పుడు నేను చెప్పేది వినుము. ఆ పెద్ద స్ధంబమును ఆ విగ్రహాలు నిలుపుతున్నాయి.
భక్తుడు -- అదెటుల సాధ్యము ? మీరు అన్నదానికి అర్ధమేమి ?
మహర్షి : సర్వలోకాధిపతి అయిన ఈశ్వరుడు ఈ ప్రపంచభారమునంతయు మోయుచున్నప్పుడు , భారమంతా అంటే బాధ్యతలన్నియు నువ్వేమోయుచున్నావనుటలో అర్ధమున్నదా ? భారమంతయూ మోయుచున్నదాయన ఐతే దాన్ని మోయుచున్నానని నీవు ఊహించుకొనుచున్నావు. ఒకపని చేయవలెను అన్న కోరిక ఉన్నంతమాత్రాన , ఆ పని జరగదు. దానికి దైవ బలము కావలెను. నువ్వు నిమిత్తమాత్రుడవు. దైవబలం నీచేత జరుగవలసిన పనులు జరిపించును.
భ : ద్రౌపది చీర ఆనంతమవటానికి తార్కికమైన వివరన్స్ ఏమిటి ?
మ : ఆధ్యాత్మిక విషయాలు హేతువాదంలో ఇమడలేవు.ఆధ్యాత్మికము వీటన్నింటికీ అతీతము.ద్రౌపది శరణాగతి తర్వాత ఈ అద్భుతం జరిగింది.దాని రహస్యం సరణాగతిలో ఉంది. ~ T. 101.
వివరణ: ద్రౌపది అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీ కృష్ణుడు వారిని పలుకరించ వచ్చినపుడు ౼ ద్రౌపది అడుగుతుంది కృష్ణుని ౼"అన్నా ! నన్నెందుకు ఆ సంఘటనలో నన్నవమానిస్తున్నప్పుడు ఆఖరి క్షణంలో ఎందుకు నన్ను రక్షించావు ? ముందే వచ్చి రక్షించివచ్చుకదా ?
అప్పుడు కృష్ణుడు పలికెను ~" ద్రౌపదీ ! నన్ను పిలిచేటప్పుడు రుక్మిణీవల్లభా ! సత్యకృష్ణా! యశోదాకృష్ణా ! అని పిలిచేటప్పుడు నేను వారి నుంచి దగ్గర నుంచి ,రావడానికి అంత సమయం
పట్టింది.నీవు ఎప్పుడు నా హృదయనాథా అనిపిలిచేవో అప్పుడు వచ్చాను" అన్నారు.
%___----___----^^--₹₹___________%
భగవాన్ ఇలా అన్నారు: "వీరికి జప,ధ్యాన,యోగదులేవో కావాలి.ఇంతవరకు ఏమి చేస్తున్నారో చెప్పకపోతే,వారికి ఇంతకంటే చెప్పగల్గినది ఏముంటుంది ? ఇంతకూ జపాలు,ఫలశ్రుతులూ,ఇవన్నీ ఎందుకు ? ఏమి చేస్తే జపమవుతుంది ? దాని ఫలితం ఎవరికి చెందుతుంది? ఆత్మ విచారణ చెయ్యరాదా? అంతలో సరిపోదు.జపధ్యానాదులను వదేశించినా వారు దాన్ని కొద్దికాలమే చేస్తారు. వారి దృష్టి అంతా ఫలితాలపైనే ౼ ఏవో దృశ్యాలు,స్వప్నాలు,సిద్ధులూలాంటి వానికై .అవి లభించకపోతే , తామేమాత్రం ముందుకు సాగడం లేదనో,తపస్సు ఫలకారి కాలేదనో నిరుత్సాహపడతారు.దృశ్యాదులు ప్రగతిని సూచించవు.కేవలం తపస్సు చెయ్యడమే దాని ప్రగతికి సూచన.శ్రద్ద, నిశ్చలత్వము ముఖ్యము.అంతేకాక , వారు తమ మంత్రమునకుగాని ,తమ దైవమునకుగాని తమ్ము తాము అర్పించుకొని (ఆత్మార్పణము) అనుగ్రహానికై వేచి ఉండాలి.కానీవారు అలా చెయ్యరు.జపం ఒక్కసారి ఉచ్చరించినా,ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా దానికి తగిన సత్ఫలితం దానికి ఉంటుంది. ~ T.103.
వివరణ : పసి బాలుడికి పలకా బలపం ఎలా ఉపకరణమో(సాధనము) అలాగే ఈశ్వరుని పొందాలంటే జపము, ధ్యానము,సాధనాలు (ఉపకరణాలు).ఒక బాలునికి వాని తల్లి 3 కోట్ల సార్లు రామనామ జపం చేస్తే మంచిదని చెప్పింది,అందుకు ఆ బాలుడు అమ్మ చెప్పిన మాట మీద నమ్మకంతో జపం చేయసాగాడు,ఆ తరువాత దిగంబరయోగిగా మారి సంచారం చేస్తూ ఆధ్యాత్మిక ప్రచారం చేసాడు.
__---–-________-------+--__________--
అగ్నిపరీక్ష నిజాయితీ లేనివాడ్ని శిక్షిస్తుంది.నిజాయితీ స్వతఃసిద్ధంగా తెలుస్తుంది.
నిజాయితీ కలవాడు లేదా ఆత్మజ్ఞాని మిథ్యరూపాలుచేత (అంటే ప్రపంచము,జనన మరణాదులచేత) బాధించబడకుండా సుఖంగా ఉంటాడు.కాని కుటిలుడు లేక అజ్ఞాని దుఃఖితుడౌతాడు.
గదనిద్రను వర్ణించినట్లుగా,అన్నీ సత్యవస్తువునుండే వచ్చాయి అని ఉద్ధాలకుడు బోధించేడు. దేహం అన్నాన్ని స్వీకరిస్తుంది.అన్నానికి నీరుకావలె,అన్నం జీర్ణం కావటానికి. ఆ నీటికి ఉష్ణత అవసరం.(తేజోమూల మన్విచ్చ) అది 'సత్ పరస్యామ్ దేవతాయామ్'(సత్తులో కలిసినది) మనము సత్ సంపన్నులమైతే (సత్తుతో కూడియుంటే) మనకదేల తెలియరాదు?
మ : వేర్వేరు పూలనుండి కూర్చిన తేనె,తేనేపట్టులో అధికభాగం పేరుతుంది దానిలోని ఏ తేనె చుక్కయినా తానెక్కడినుండియో సూచించదు. సత్ సంపన్నులూ అట్లే.గాధనిద్రలో,మరణంలో వారి వారి వ్యక్తిత్వాలు గుర్తించరు. మేల్కొన్న పిదప వారి వారి తొలి వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుతారు.
భ : తేనెలో మధుబిందువులకు విశిష్ట చిహ్నాలు లేవు.నిజమే.వేర్వేరు అవయవాలూ లేవు; అవి తిరిగి తమ మూలాన్ని చేరవు. వ్యక్తి గాఢనిద్ర నుండి ఆ వ్యక్తి మేలుకొంటాడు.దీనికేమంటారు ?
మ : నదులు సముద్రమును చేరి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి. కానీ వాని నీరు ఆవిరియై వర్షమై గిరులపై కురిసి ,ఏరులై సముద్రమునే చేరుతుంది.అట్లే వ్యక్తులు నిద్రలో తమ వ్యసక్తిత్వమును కోల్పోతారు.కానీ తమకు తెలియకున్నా, వారి వారి పూర్వ వాసనల కనురూపంగా వ్యక్తులుగనే మరలి వస్తారు. ఆ విధంగా మృతిలో గూడ సత్ నష్టంగాదు. ~ T.105.
వివరణ : నిజాయితీ గా ఉన్నవాడు బాధలు అనుభవించీ ~ఏ బాధను అయినా తట్టుకోగలడు.నిజాయితీ లేనివాడు సుఖాలను అనుభవిస్తూ కష్టం వస్తే భరించలేడు. అందుకు అగ్నిపరీక్ష తనని బాధిస్తుంది, నిజాయితీ పరుడికి అగ్నిపరీక్ష బాధించలేదు.
|__----++-----------________---++++++__________|
భ : 'యద్గత్వా నని వర్తన్తే తద్దామ పరమం మమ' ఆ ధామమేమి ? అది విశ్వ చైతన్యానికి అవ్వలి పరబ్రహ్మస్థితియేనా ?
మ: అవును.
దాని తాత్పర్యం విశ్వచైతన్యస్థితి పొందినవారు ఇంకా అజ్ఞానపు పట్టునుండి విడుదల అవ్వలేదని అర్థమా ?
మ: బ్రహ్మలోకం తో సహా ఎల్ల లోకాలు పునర్జన్మను తప్పించి లేవని ఆ వాక్యానికి అర్థం భగవద్గీత శ్లోకాలు 'నన్ను చేరిన ,మరి పట్టువులేదు.... ఇతరులందరూ బంధితులే' అని ఉంది .మరొకటి (గత్వా) పోయి అనే పదం గుర్తించు.గతి ఉన్నదనే గదా ? గతి కలదని భావించిన తర్వాత కాలము పునరావృత్తి ఉన్నట్లే గతి. పునరాగతి (జన్మ) తిరిగి సూచిస్తుంది. పుట్టుకంటే అహంకారం పుట్టువన్నమాట.
పుడితే ఎచ్చటికైనా పోక తప్పదు.. పోతే తిరిగి రాక తప్పదు .కాబట్టి ఈ పదజాలం వదిలేసి ఉన్నట్లు ఉండు . నీవెవరో చూసి ఆత్మలో నిలకడ చెందు అప్పుడు నీకు ముక్తి. పుట్టువు నుంచి రావడం నుంచి తిరిగి రాకపోకలు నుండి.
భక్తుడు: నిజమే ఈ సత్యాన్ని ఎన్ని మారులో విన్నాను. కానీ అది మమ్మల్ని తప్పించుకుంది అందువల్ల దాన్ని మర్చిపోతున్నాం .
మహర్షి : అవునవును. అంచేతే దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అవసరం.
~ T.181.
%____---___---___-_---------+++++++-;____________---____----__---%=
Talk ~580
౼౼౼౼౼౼౼౼
భక్తుడు : జ్ఞాని యోగి వేరా? భేదమేమి ?
మహర్షి : శ్రీమద్ భాగవద్గీతలో జ్ఞానియే నిజమైన యోగి,నిజమైన భక్తుడని ఉంది.యోగం,సాధనం, జ్ఞానం, సిద్ధి.
భక్తుడు: యోగం అవశ్యకమా ?
మహర్షి : ఆదిియొక సాధన.జ్ఞానప్రాప్తి తర్వాత యోగంతో పనిలేదు.అన్ని సాధనలకు యోగమనే పేరు. ఉదా౼ కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, అష్టాంగయోగా.యోగమంటే ఏమి?యోగమంటే ఐక్యము. వియోగమంటేనే యోగం సాధ్యం.ఇప్పుడు వియోగంలో ఉన్నానని వ్యక్తి భ్రమపడుతున్నాడు.ఈ భ్రాంతిని తొలగించాలి.ఆ తొలగించే పద్ధతిని యోగమన్నారు.
భక్తుడు: ఏ విధానం ఉత్తమము ?
మహర్షి : అది వ్యక్తి మనస్తితిని బట్టి ఉంటుంది.ప్రతివాడు పూర్వ జన్మల సంస్కారాలతో జన్మిస్తాడు.ఒకరికొక పద్ధతి అనువైతే మరొకరి కింకొక పద్ధతి సులువవుతుంది.దానిగూర్చి నిశ్చయమిదీ అనలేము.
భక్తుడు : ధ్యానించేదెట్లు ?
మహర్షి : ధ్యానమంటే ఏమి ? దాని సమాన్యార్ధం ఒక ఆలోచనమీద మనసు ఏకాగ్రం చేయడం. ఆ సమయంలో ఇతర ఆలోచనలన్నీ పక్కకు పెట్టేయాలి.ఆ ఒక్క ఆలోచన కూడా యుక్త సమయంలో తొలగిపోవాలి. ఆలోచనలు లేని చైతన్యమే గమ్యం.
భ: అహంకారాన్ని వదిలించుకొనే దెలా ?
మ: అహంకారాన్ని చేజిక్కుంచుకుంటే,దాన్ని వదల్చుకోవచ్చు. దాన్ని మొదట పట్టుకో.తరువాత అంతా సులువే.
భ: దాన్ని పట్టుకోవడం ఎలా ?
మ: ఒక అహంకారం మరొక అహంకారాన్ని నాశనం చేయబోతుందా?అహంకారాలు రెండున్నాయా ఏమి ?
భ: భగవంతు నేవిధంగా ప్రార్ధించేది ?
మ: భగవంతుడిని ప్రార్ధించాలంటే అక్కడ తానొకడు ఉంది తీరాలి.తాను,అత్యంత సన్నిహితమూ,ప్రియతమమూ, దైవాన్ని అట్లనుకోరు.తనకన్నా ప్రియతరమేదో కనిపెట్టు.దాని స్వరూపం నిరూపించి అవసరమైతే ప్రార్ధన చేయవచ్చు.
Talk ~650
"ఆర్తో జిజ్ఞాసు రర్ధారధీ జ్ణానీ చ భరతర్షభ,( భ.గీ.7 : 16)
తేషాం జ్ఞాని: నిత్యయుక్తా ఏకభక్తి ర్విశిష్యతే "(భ. గీ.7: 17)
ధ్యాన మేదైనా మంచిదే.వేరన్న భావన నశించి ధ్యేయమేమీ లేక ధ్యాత తెలియతగినది మరేదీలేక,ఒంటియై మిగిలితే,అదే జ్ఞానము.జ్ఞానాన్ని ఏకభక్తి అన్నారు.జ్ఞానియే పరముడు.అతడాత్మగానే నిలిచాడు, ఆ పైన చేయుట కేమీ లేదు.అతడు పూర్ణుడు,భయరహితుడు."ద్వితీయాత్ వై భయం భవతి" (రెండవది ఉంటేనే భయం ) అదే ముక్తి,అదే భక్తి.
భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5,6 శ్లోకం
అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కాళేబరం l
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ll
యంయం వాపి స్మరన్ భావం త్యాజాత్యాంతే కాళేబరం ౹
తం తమేవైతి కౌంతేయా సదాతద్దావ భావితః ౹౹
మహర్షి : చనిపోయే క్షణంలో చివరి తలపు ఆ వ్యక్తి మరుజన్మను నిశ్చయిస్తుందట. సత్యానుభవం జీవితంలో అయితేనే మరణవేళ అనుభవానికి వస్తుంది .ఇప్పటి ఈ తరుణం మునుపటికి భిన్నమేమో చూచి ,నీవు కోరే స్థితిలో నిలువ యత్నించు.
భక్తుడు : నా శక్తీ పరిమితం .నేనై సాధించలేనిది.అనుగ్రహం ప్రసాధించగలదు.
మహర్షి : నిజమే కాని. అనుగ్రహం లేనిదే ఈ కోరికే రాదు.
భక్తుడు : లాహోరులో 11 ఏండ్ల పిల్ల,చెప్పుకో తగ్గది.కృష్ణుని రెండుమార్లు పిలిచే వరుకు స్మృతియుంటుందట,కానీ మూడోసారి పిలిస్తే ఆమె చైతన్యం తప్పి , పది గంటల సేపు అట్లే వివశయై ఉంటుందట.
మహర్షి : కృష్ణుడు నీకు వేరనుకున్నంత కాలం ఆయన్ను ఆహ్వానిస్తావు.వివసత్వం సమాధి తాత్కాలికమేనని సూచిస్తుంది. నీ ఉన్నది సదా సమాధిలోనే, గుర్తించవలసింది అది.
భక్తుడు : దైవసాక్షాత్కారం అద్భుతం.
మహర్షి : దైవ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారమే.నీ ఇష్టదైవానికి నీవే రూపుకల్పిస్తే ఆ రూపుతోనే ఉంటుంది.ఆత్మను తెలుసుకో. ~ 621.
భక్తుడు : గాంధీజీ చిరకాలం సత్యదీక్ష పాటించి ఆత్మను సాధించారు.
మహర్షి : సత్యం, ఆత్మ కాక మరేమి ? 'సత్ ' అయినది సత్యము.సత్యం ఆత్మకు అన్యము కాదు.కాబట్టి గాంధీజీ సత్యం కేవలం ఆత్మయే.
ప్రతివాడు తనను తెలిసికూడా అజ్ఞానియే.మహావాక్య శ్రవణం వల్లనే వాడు తనను తాను తెలుసుకుంటాడు. అందుచేతనే ఉపనిషత్ గ్రంధము నిత్యసత్యము.ఆత్మజ్ఞాని ప్రతివాడూ తాను పొందిన అనుభవం ఉపనిషత్ లో చెప్పబడిందే.ఆత్మయే బ్రహ్మమని విన్న తరువాత స్వస్వరూపం సరిగా అర్ధమవుతుంది.విక్షేపం కలిగినప్పుడెల్లా దానికై మరలుతాడు. ఆత్మ సాధనా ప్రణాళిక సర్వమూ ఇదే. 648
భక్తుడు: వర్ణభేదం అన్యాయమని ప్రజలు భావిస్తున్నారు దాన్ని నిర్మూలించాల్సిందే ?
మహర్షి :వ్యక్తిగతంగా నీవాభేదాలు చూడనిస్థితికి రావచ్చు.సంతోషంగా ఉండవచ్చు.ప్రపంచాన్ని బాగుచేయగలననే ఆశ ఎలా సాధ్యం ? నీవెంత యత్నించినా అది సాద్యం కాదు.కావ్యకంఠ గణపతి శాస్త్రి హరిజనులకు మంత్రములను ఇచ్చి బ్రాహ్మణులను చేస్తానన్నారు. కానీ ఒప్పుకొని వారెవరూ ముందుకు రాలేదు. అంటే వారిలో వారికే తాము తక్కువనే భావం గాఢంగా ఉన్నదన్న మాట.ఆ భావాన్ని మొదట తీసివెయ్యి. ఆ తరువాత సంస్కరద్దువుగాని.
అదీగాక ఆ భేదాలు పాటించే ఆ స్థలాలకెల్లపోయి బాధపడడమెందుకు ? అవి లేని చోట హాయిగా ఉండరాదా?
గాంధీజీ కూడా సమత నెలకొల్పవలననే చూస్తున్నారు.దిగువ వర్ణులలో తాము తక్కువనే భావాన్ని ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది.ఆయన తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దలేరు. ఆయన అహింసవలంబి.అందువలన పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి.
భక్తుడు : వర్ణభేదం నిర్మూలించడాని కందరూ ప్రయత్నించాలి.
మహర్షి: అయితే చెయ్యి.ప్రపంచ విషయంలో నీవది సాధిస్తే అప్పుడిక్కడ ఆ భేదలుంటాయేమో చూడు.
భక్తుడు: ఆ సంస్కరణను అక్కడే ఆరంభించాలి అనుకుంటున్నాను.
మహర్షి: సంస్కరణాలకై ఎందుకంత శ్రమిస్తావు.నిద్రపోయి చూడు.అక్కడ భేదాలు ఉన్నాయేమో.అన్ని భేదాలను నీవు నిర్మూలించేస్తావు.ఎటువంటి ప్రయత్నం లేకుండా.(నవ్వులు)
శ్రీ భగవాన్ వచించారు ౼ ఆ తొలిరోజుల్లో నేలపై ఏ గుడ్డా పరుచుకోలేదు.నేలపై కూర్చొనేవాణ్ణి. స్వేచ్ఛ అంటే అదే.సోఫా ఒక సంకెల .ఇది నాకు చెరసాల. నా ఇష్టం వచ్చినచోట నా ఇష్టం వచ్చినట్లు మీరు కూర్చోనీయరు. ఇది బంధం కాదూ ! ఎవని ఇష్టమైనట్లు వాడుచరించే స్వాతంత్రం ఉండాలి.వానికే పరిచారకులు ఉండకూడదు. T647
~__---+++--------+-++++++----+++++-\+++++++××___~
భ : అత్యుత్తమ జీవన విధానం ?
మ: అది జ్ఞానికా,అజ్ఞానికా అన్న దాన్ని బట్టి ఉంటుంది. జ్ఞాని దేనిని ఆత్మకు అన్యంగాకని,భిన్నంగా కానీ చూడడు. అన్నీ ఆత్మలోనే ఉన్నాయి.ఈ ప్రపంచం ఉంది, అందులో ఒక శరీరం అందులో నీవు ఉన్నావు అనుకోవడం మొదలైనవన్నీ తప్పే.
సత్యాన్ని గుర్తిస్తే ఈ విశ్వం మరియు దానికి ఆవల ఉన్నది కూడా ఆత్మలోనే చూడవచ్చు. ఇది చూసే వ్యక్తి దృష్టి కోణం మీద ఆధారపడుతుంది.చూపుకంటిది . కన్నుకి ఒక స్థానం ఉంటుంది.
ఈ స్థూలచక్షువులతో చూస్తే మిగిలినవాళ్ళు మరియు వస్తువులు స్థూలంగా కనిపిస్తాయి. సూక్ష్మ నేత్రంతో (అంటే మనసుతో) చూస్తే సూక్ష్మంగా కనిపిస్తాయి.
అదే దృష్టి ఆత్మ దృష్టిగా మారితే ,చూపు ఆత్మగా అనంతంగా మారుతుంది. ఎందుకంటే ఆత్మ అనంతం.
ఆత్మనుండి వేరేగా చూసే దానికీ ఏదీలేదు.
~ శ్రీ రమణ భాషణములు.
|_____----------_______--++++++-___________-----+++++++|
భ : దేనిని తెలుసుకుంటే అన్ని సందేహాలు తొలగుతాయో అది ఏమిటి ?
మ : సందేహించే వాడిని తెలుసుకో. ఈ సందేహించే వాడిని పట్టుకుంటే,సందేహాలు మళ్లీ లేవవు. ఇక్కడ సంశయించేవాడు అతీతుడు.మళ్ళీ సందేహించేవాడు లేనప్పుడు,సందేహాలే రావు.అవి ఎక్కడినుండి వస్తాయి.అందరూ జ్ఞానులు,జీవన్ముక్తులే. ఆ విషయం వాళ్లకు తెలీదు. అంతే ! సందేహాలను సమూలంగా తీసేయాలి.అంటే సందేహించే వాడిని సమూలంగా తీసేయాలి. ఇక్కడ సందేహించేవాడు మనస్సే.
భ : దీనికి పద్ధతి ఏమిటి ?
మ : "నేను ఎవరు " అనేది విచారణ.
భ : జపము చేయవచ్చా ?
మ : "నేను అది " అని నీవు ఎందుకు అనుకోవాలి ? విచారణ చేయి. ఆలోచనలు ఆగిపోతాయి. ఉన్నది, అంటే ఆత్మ, తప్పించుకోలేని అవశేషంగా తెలుస్తుంది.
భ : హఠయోగం అవసరమా ?
మ : అది సహయాలలో ఒకటి,ఎప్పుడూ అవసరం కాదు. అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది.విచారణ ప్రాణాయామం కంటే గొప్పది. యోగవాసిష్టంలో చూడాల అహంకారాన్ని చంపడానికి విచారణే చేయమని శిబిధ్వజుడికి చెప్పింది.ప్రాణాన్ని గాని బుద్ధినిగాని ,అంటిపెట్టుకోవడం వలన సత్యాన్ని పొందవచ్చు. మొదటిది హఠయోగం, రెండవది విచారణ.
భ : హఠయోగం అవసరమా ?
మ : అది సహయాలలో ఒకటి,ఎప్పుడూ అవసరం కాదు.అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. విచారణ ప్రాణాయామం కంటే గొప్పది. యోగవాసిస్టంలో చూడాల అహంకారాన్ని చంపడానికి విచారణే చేయమని శిబిధ్వజుడికి చెప్పింది .ప్రాణాన్నిగాని,బుద్ధిని గానీ అంటిపెట్టుకోవడం వలన సత్యాన్ని పొందవచ్చు. మొదటిది హఠయోగం రెండవది విచారణ.
భ : ఆత్మజ్ఞానం కలిగిన పిదప కూడా జ్ఞానికి వ్యక్తిత్వం ఉంటుందా ?
మ : ఆయన వ్యక్తిత్వము ఎలా నిల్పుకోగలడు ?
సాధారణంగా కూడా ,లౌకికంగాగాని ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు ఆచమనం, ప్రాణాయామం చెయ్యాలని చెప్తారు.అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కార్యాన్ని సాధిస్తుందని అర్ధం.
భ : నేను " నేతి౼నేతి" ( న ఇతి ౼న ఇతి ,ఇది నేను కాదు ౼ ఇది కాదు) అని ధ్యానిస్తున్నాను.
మ : వద్దు.అది ధ్యానం కాదు.మూలాన్ని కనుక్కో నువ్వు తప్పక ఆ మూలన్ని చేరాలి.అసత్యమైన "నేను " మాయమై నిజమైన "నేను" అనుభవంలోకి వస్తుంది.రెండవదానికి భిన్నంగా మొదటిది ఉండలేదు. T41.
వివరణ భగవాన్ ధ్యానం సంధ్యా వందనం ఏమీ చేయరు,అదిచూసి చాలామంది 'నాకు ధ్యానం,సంధ్యా వందనం అవసరం లేదు'అనుకుంటారు,కానీ మదురైలో ఉన్నప్పుడు అక్కడున్న జీవసమాధి దగ్గర గంటల సమయం ఏకాంతంగా ధ్యానంలో ఉండేవారు,అలా ఉండటం కారణంగానే భగవాన్ మనకు ఈ స్థాయిలో కనిపించారు. మనం అంత సమయం మనజీవితంలో గడపలేము కాబట్టీ ,రోజులు కానీసం ఉదయం ఒక గంట,సాయంకాలం ఒక గంట భగవంతుని ధ్యానం చేస్తూ మనకున్న సమస్యలకు మనసును దూరంగా నిలిపి భగవంతుని కోసం ప్రయత్నం చేస్తూఉంటే భగవంతుడు దారి చూపగలరు.
?,__________-___________--------------______________?
భ : మోక్షమార్గంలో గృహస్టుని పరిస్థితి ఏమిటి?
మ : నీవు గృహస్తుడనుకోవడం ఎందుకు ? నీవు సంన్యాసిగా బయటకు వెళ్తేకూడా ఇలాంటి ఆలోచనే ( నేను సన్యాసిని) నిన్ను వెంటాడుతూ ఉంటుంది.ఇంటిలో ఉన్నా ,అడవులకు వెళ్లినా,మనసు నీ వెంటే వస్తుంది. ఆలోచనలన్నింటికీమానసిక అడ్డంకులు ఎప్పుడూ మూలం అహంకారంమే .అదే నీ శరీరాన్ని,ప్రపంచాన్ని కల్పించి,నీవు గృహాస్థుడివి అనే ఆలోచనను ఇస్తుంది .నీవు సంసారం వదిలితే అది నీ ఆలోచనలలో గృహస్థు స్థానంలో సన్యాసిని,ఇంటి స్థానంలో అడవి వాతావరణాన్ని నిలుపుతుంది. మానసిక అడ్డంకులు ఎప్పుడూ ఉంటాయి.నిజానికి కొత్త పరిస్థితులలో అవి ఎక్కువ అవుతాయి కూడా.వాతావరణం,పరిస్థితుల మార్పువలన సహాయం ఏమీరాదు.మనస్సే అడ్డంకు.అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా దీనిని దాటవలసిందే. ఇది నువ్వు అడవిలో చెయ్యగల్గితే,ఇంట్లో ఎందుకు చెయ్యకూడదు ?
అందువలన పరిసరాలను మార్చడం ఎందుకు ? ప్రయత్నాలు ఇప్పుడే చెయ్యవచ్చు ఎటువంటి పరిసరాలలో ఉన్నసరే. ~T54
వివరణ: భగవాన్ వచ్చినవారు అడిగిన ప్రశ్నలకు, వారి స్థాయిని బట్టి సమాధానం చెప్తారు. చెప్పిన సమాధానంలో తనను తానుగా తెలుసుకోవాలని 'నేనెవరు' అనే ప్రశ్న చెప్పేవారు.అలా తెలుసుకుని తనస్థాయికి తగినట్టు ఏకాంతంగా భగవంతుని ధ్యానంలో నిలిచి తనను తాను తెలుసుకున్న తరువాత మనసు చంచలత్వం తగ్గిన తరువాత ఇంటిలో ఉంటూ సాధన చేస్తూ గృహస్తు జీవితం సాగిస్తూ,సన్యాసివలే బ్రతకాలని అంతరార్ధంగా భగవాన్ చెప్పేవారు.భగవాన్ అంతటివారే పిల్లలు రాళ్ళతో చేసే శబ్దాలకు వేయి స్తంభాల మండపంలో పాతాళ లింగం దగ్గర ఏకాంతంలో దేహభ్రాంతిని కోల్పోయారు.
No comments:
Post a Comment