మన దేశంలో జ్ఞానం చెప్పే శ్రీ కృష్ణుడు లాంటి భగవంతుడికన్నా..
కోరికలు తీర్చే ఇతర దేవతలకే ప్రాముఖ్యత ఎక్కువ..
ఒకనాడు దేశంలో అందరి తలలో జ్ఞానం ఉండేది..
కానీ ఈనాడు భగవద్గీత జ్ఞానం అని చెప్పగానే మనుషుల మొకాల్లో నిర్లక్ష్యం ,నిరాశక్తి కనిపిస్తుంది. దాని పర్యవసానమే.
నేటి ఫలితంగా.. గతి తప్పిన సమాజం.
దేవుడి మార్గంలో వెళ్లే జ్ఞానం చెప్పే గురువుకన్నా...
మహిమలు చూపే బాబాలకే నేడు విలువ ఎక్కువ...
అందుకే మనుషులలో జ్ఞానులకంటే...
అజ్ఞానులే ఎక్కువ మంది ఉన్నారు.
అందుకే కావొచ్చు గీతలో శ్రీ కృష్ణుడు కూడా..
ఇదే మాటను ధ్రువీకరిస్తూ.
ఒక శ్లోకంలో అంటాడు...
"వేల కొలదిలో ఒకానొకడు నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు". అని.. కానీ ఈ సంఖ్య నేటికి సగటున
ప్రతీ లక్షమందిలో ఒకానొకడు కూడా నిజమైన
దైవం కోసం వెతకడం లేదు.
తమ కోరికలకో,సంతోషమైన జీవితానికో దేవుడిని
వేడుకుంటున్నారు. జరిగేవన్నీ కర్మానుసారం అని గీత బోధిస్తుంది.
ఆ గీతా జ్ఞానం ప్రజల్లో లేకనే..ఒకడు తిరుపతి అని..మరొకడు అన్నవరం అని తిప్పలు పడుతూ.. అవస్థలతో దొబ్బుకుంటు... తోసుకుంటూ..డబ్బులు పెట్టి ప్రత్యేక దర్శనాలు చేసుకొని..అదే పెద్ద భక్తి అని భ్రమలో బ్రతికేస్తూ..అదేదో గొప్ప అని బావిలో కప్పలా బ్రతుకీడుస్తున్నాడు. మనకు సమయం లేదు..నిజమే.. కానీ ఆ కర్మలో నిన్ను ఇరికించిందే.. దేవుడు అని తెలుసుకోలేక.. ఈ బిజీ జీవితం గొప్పతనం అంతా నా తెలివి అని పొరబడి. నిత్యం ఆ కర్మ చక్రంలో తిరుగుతూ జీవితం ఖర్చు చేస్తూ..వృద్ధాప్యానికి చేరువై.. ఆజ్ఞానిగా చేస్తున్నాడు. దేవుడు నిన్ను వేలు,లక్షలు,కోట్లు,వజ్రకిరీటాలు..పెట్టుబడిగా పెట్టమని ఎక్కడ చెప్పలేదు. కేవలం "శ్రద్ద"అనే రెండక్షరాల పెట్టుబడి నీదైతే..
మోక్షమనే ఫలం నీదవుతుంది. అని గీతలో చెప్తాడు.
కానీ ఇవన్నీ మనిషి తెలియటం లేదు.. తెలియచెప్పే వారు లేరు.. ఒకవేళ ఉన్నా వారి మాటను విశ్వసించరు.
అందుకే దేశంలో జ్ఞానుల లిస్ట్ చిన్నదై..
అజ్ఞానుల లిస్ట్ పెద్దదై ఉంది. ఇటువంటి సమయాన్నే ఆసరాగా చేసుకొని ఆనాడు గీతాచార్యుడు భువిపైకి వచ్చి...
దుక్కితుడైన అర్జునుడిని ఉపయోగించుకొని...
సర్వ మానవులకు వర్తించే అతి రహస్యమైన దేవుడి జ్ఞానాన్ని
స్థాపించి వెళ్ళాడు. అన్ని ముందర ఉన్నా...
నేడు మనిషికి శ్రద్ద(ఆసక్తి) లేక.. కష్టాలకు ఏడుస్తూ...
నష్టాలకు కుంగిపోతూ...ఉంటున్నాడే కానీ..
ఒక్క క్షణం ఆలోచించి...ఈ బాధలనుండి బయట పడేసేందుకే కదా ఆనాడు శ్రీ కృష్ణుడు గీతా బోధ చేసింది ...
అని గుర్తుచేసుకోలేక...బాధలతో... ఆత్మహత్యలకు సైతంపాల్పడుతున్నాడు. వాస్తవానికి ఈనాటి యువతకి
కడుపుకి తినే ఆహారంలో పోశకలు..అలవాట్ల వల్ల మానసిక క్రుంగబాట్లు కలగటం లేదు..యువత తలలో భగవద్గీత జ్ఞానం లేకనే.. అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా యువత చదువు....సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా భగవద్గీత జ్ఞానం అత్యంత ముఖ్యమైనదని గ్రహించి...తెలుసుకొంటే...అప్పుడే భారతదేశం తిరిగి,
జ్ఞానులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. 💐💐
హాయ్ ఫ్రెండ్స్. భగవద్గీత మనకు నేర్పిన పాఠాలు.
1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్పూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్దిస్తుంది అని గీత భోధిస్తుంది.
2. శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమె శాశ్వతము మన శరీరము ఒక వస్త్రము వంటిది వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు.
3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే ఎవరు శాశ్వతముకాదు కాబట్టి పుట్టక ఎంత సహజమో చావు కూడా అంత సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది.
4. కోపమే అన్ని అనర్ధాలకు మూలము నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి మిగిలిన రెండు మోహము, అశ కోపము లో ఉన్న వ్యక్తి అలోచనారహితుడవుతాడు అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవరిస్తాడు.
5. కర్మను అనుసరించేదే బుద్ది. మనిషి తన జీవితకాలములో కర్మలను అనుభవించాలి.
6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.
7. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.
8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైన గాని సుఖ శాంతులు లభించవు ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.
9. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరకుతుంది.
10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే, అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది.
No comments:
Post a Comment