Monday, 7 May 2018

Question answer

ఇది చాలా చిన్న ప్రశ్న....కానీ జవాబు మాత్రం...ఇంతవరకు ఎంతోమంది మహర్షులు, విశ్వామిత్రుని సైతం ముప్పుతిప్పలు పెట్టిన ప్రశ్న. మనసును నియంత్రించడం.......అంటే ఏమిటి? అసలు మనసు నియంత్రించడం కుదురుతుందా...బుద్ధి యోగం తో   అన్వేషిస్తే నే దీనికి సమాధానం లభిస్తుంది.
నువ్వు మనసును నియంత్రించాలని ప్రయత్నిస్తున్నావు....ఇక్కడ మనస్సును నియంత్రించాలని ఆలోచిస్తుంది ఎవరు? నువ్వే నీ మనసుతో....మనసును నియంత్రించాలని చూస్తున్నావు....
ఎంత అవివేకం....ఎంత పిచ్చితనం....
ఎక్కడైనా...దొంగను పట్టుకొమ్మని... ఆ దొంగకే చెప్తే పని జరుగుతుందా.....
నువ్వు నీ మనసుతో... మనసును నియంత్రించాలని చూస్తున్నావు....ఇది సాధ్యం అయ్యే పని కాదు....

కానీ లోకంలో అసాధ్యం ఐనది లేదు...కష్టమైన దారి ఉన్నప్పుడు....సులభమైన దారి కూడా ఉంటుంది....ఎందుకంటే....సృష్టి ద్వైతం...అంటే...అన్నీ రెండుగానే ఉంటాయి.

మొదట మనసు అంటే ఏమిటో....మీకు తెలుసా.....దాన్ని ఎలా గుర్తించాలో చెబుతాను.....
కళ్ళుమూసుకుని.....మీరు ఒక ఆపిల్ తోటలో....ఉన్నట్టు....అందినన్ని ఆపిల్స్ కోసుకుని తింటున్నట్టు....ఊహించండి.....

మీరు...ఊహిస్తున్నారంటే....దాని అర్థం ఇప్పుడు మీ మనస్సు పనిచేస్తోంది....అని.....ఇప్పుడు హఠాత్తుగా.....మీ ఊహ ....తారుమార్తె... అంతా చిమ్మ చీకటి ఐపోయింది....అసలు మీకు ఏమీ కనిపించడం లేదు....కనీసం..మీ శరీరం కూడా ....కనిపించడం లేదు...మీరు...చీకటిలో....ఎదో...చీకటి ప్రపంచంలో ఉన్నారు....ఇప్పుడు మీరు ఊహించడాని కి....మీ తల ఉన్న శరీరం కూడా లేదు....అంటే....ప్రపంచంలో...ఏ వస్తువునూ మీరు ఊహించాలేరు.......

మనం ఆలోచించాలంటే....ఎదో ఒక వస్తువు ఉండాలి......నీ శరీరంతో పాటూ....సమస్తము...లేకపోతే...ఇక ఆలోచనలే లేవు....ఆలోచించడానికి...తలే లేదుగా...

ఇప్పుడు....అంతా శూన్యం...మీరు గాఢ నిద్రలో ఎలా ఉంటుందో...అలా ఉంది.....ఆలోచనలు లేవు...
అంటే...ఇప్పుడు మీ మనస్సు లేదని అర్థం.
మన మనసుకు ఆలోచించడానికి ఎదో ఒక ఆలంబన(వస్తువు) లేక దృశ్యామో...ఉండి తీరాలి....
ఎప్పుడైతే...మీరు మీ బుద్ధిని ఉపయోగించి...శరీరాన్ని, ప్రపంచాన్ని... త్యజిస్తారో...అపుడు..ఆలోచించడానికి మనసుకు ఏ ఆలంబనా దొరకదు....
మనసు అంటే తలంపుల సమూహమే.

ఈవిధంగా...ధ్యానంలో...బుద్ధి ద్వారా...సమస్థాన్నీ త్యజించి...శూన్యాన్ని భావిస్తూ ధ్యానం చేస్తే......మనసు అణిగి...అణిగి....కొంత కాలానికి బలం కోల్పోతుంది....అప్పుడు... వెంటనే గాఢ ధ్యానంలోకి వెళ్ల గలిగే సత్తా వస్తుంది..
ఇలా 4 గంటల 32 నిముషాలు ఏకధాటిగా...గాఢ ధ్యానంలో ఉండటమే...సమాధి....
సమాధి అంటే....ఎరుకతో... గాఢంగా నిద్రపోవడం.
నిర్వికల్ప సమాధి అంటే...ధ్యానంలోకి వెళ్ళాక...మల్లీ తిరిగి సాధారణ స్థితిలోకి రావడానికి...ఒక్కోసారి కొన్ని నెలలు,సంవత్సరాలు పట్టవచ్చు.

మనం సమాధి ని సాధించడమే...మహత్తరమైన విజయం.....

మనసును నియంత్రించాలంటే.....మనసును వాడకూడదు....బుద్ధిని వాడాలి...ఎందుకంటే...గీతలో భగవంతుడు చెప్పారు...
శరీరం కంటే మనసు పరమైనది....మనసుకంటే బుద్ధి పరమైనది....బుద్ధికంటే...అహంకారం.  పరమైనది....అహంకారం కంటే...ఆత్మ పరమైనది(గొప్పది).

ఎప్పుడైతే...ఈ ప్రపంచాన్ని..మనసుకు దూరం చేస్తామో...అప్పటివరకు దానిని నియంత్రించలేము.

మాటిమాటికీ....మనస్సు ఆలోచనలు లేక బలహీనపడిపోవటం...మనస్సుకు అలవాటైపోవాలి.అదే దారి.

ఓ దేశాన్ని పాలించే రాజు మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్తక్రారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకువచ్చి సరైన సమాధానం చెప్పినవారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు.

లేదంటే వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పారు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామంలోనుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘‘చెప్పేవాడు గురువు; వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’. కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు.

మొదటి ప్రశ్న

దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు. ‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే.

ఇక రెండవ ప్రశ్న

దేవుడు ఎక్కడ ఉంటాడు?

అన్నాడు రాజు. ‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. ‘‘మహారాజా! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు. ‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

చివరి ప్రశ్న

దేవుడు ఏం చేస్తాడు? అని. ‘

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనంపైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...