Wednesday, 9 May 2018

గురువు ?

గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?

గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.

1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.

2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3 సర్వ సమర్ధత :- తాను శిశువుని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాండ  నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనము  పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.

అటువంటివారిని పరిశీలించి,పరీక్షించి మరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు…గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.

శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.

కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.

మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?

గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.

చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.
అన్నీ అంటే అన్నీ ...సమస్యలు ,ఉద్యొగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాకా తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.

చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు.

" భగవంతుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా " అని అడుగుతాడు

దానికి భగవంతుడు వాత్సల్యంగా " నాయనా !ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి ,వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"

"అవును .కనిపిస్తున్నాయి."

"నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి ,నీరు సూర్యరశ్మి ...అన్ని అవసరమైనవి అన్నీ అందించాను."

గడ్డి వెంటనే మొలకెత్తింది.

భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...

కానీ వెదురు మొలకెత్తనే లేదు.

కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు .

విస్మరించనూలేదు .
ఒక సంవత్సరం గడిచింది .
గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది
అందంగా ఆహ్లాదంగా...
కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .
రెండు ,
మూడు ,
నాలుగు సంవత్సరాలు గడిచాయి
వెదురు మొలకెత్తలేదు
కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు
ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది .

గడ్డి కన్నా ఇది చాల చిన్నది

కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ..
ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది.
పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి .
ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు(నిలబడలేదు).
నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను.
ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ ,ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి .
వెదురు మొక్కను విస్మరించలేదు.
నిన్నుకూడా విస్మరించను.
నిన్ను నువ్వు ఇతరులతో
ఎన్నటికీ పోల్చుకోకు .
రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ ...
గడ్డి లక్ష్యం వేరు ..
వెదురు లక్ష్యం వేరు ..
నీసమయం వచ్చ్చినప్పుడు
నువ్వూ ఎదుగుతావు."
"ప్రభు ! మరి నేను ఎంత ఎదుగుతాను??"
"వెదురు ఎంత ఎదిగింది?"

'అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."

"నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు"

భగవంతుడు ఎప్పుడూ.. ఎవరినీ ... విస్మరించడు. విడిచిపెట్టడు.
మనం కూడా భావంతునిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు.

నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి చెప్పకు.

నీ దైవ০ ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...