🍁 *మన ఆరోగ్యం* 🍁
🍁 మనం తీసుకునే ఆహారంలో పొద్దుటిపూట తినే అల్పాహారం పాత్ర ఎక్కువే. అందుకే ఎన్ని పనులున్నా దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలా తినడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి తెలుసా.
🍁 చాలామంది ఉద్యోగం చేసే మహిళలు ఉదయం అల్పాహారాన్ని తీసుకోవడంలో అశ్రద్ధ చూపుతారు. దీనికి వారు చెప్పే కారణం సమయం లేకపోవడమే. కానీ తినడం వల్ల రోజువారీ పనులకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది. చురుగ్గానూ ఉంటాం.
🍁 *కొంతమంది మహిళలు టిఫిన్ మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకుంటారు. ఇది నిజం కాదు. మధ్యాహ్నాం ఎక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు ఎక్కువగా పెరుగుతారు.*
🍁 *అందుకే ఒక శాండ్‌విచ్ అయినా తీసుకోవాలి*.
🍁 రాత్రి భోజనం తరువాత ఉదయం వరకు మన పొట్ట దాదాపు ఎనిమిది గంటలపాటు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేచిన గంటా, రెండు గంటల్లోపు ఏదో ఒకటి తినడం మంచిది.
🍁 అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆ రోజంతా అలసటగా ఆనిపిస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు కూడా తగ్గుతాయి. దాంతో నీరసంగా మారిపోతారు.
🍁 మీ శరీరానికి కావాల్సిన శక్తి లభించనప్పుడు మెదడు కూడా మీ మాట వినదు. దాంతో ఏ పనిమీద దృష్టి పెట్టలేరు. కాబట్టి ఎన్ని పనులున్నా ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకోవాలి.మి నవీన్ నడిమింటి
🍁 *వేసవిలో ఈ డైట్ తప్పనిసరి..*
🍁 వేసవి కాలంలో తీసుకునే ఆహారం శరీరానికి చల్లదనాన్ని ఇవ్వాలి. అదే సమయంలో మనం ఏది తీసుకున్నా తేలిగ్గా జీర్ణం కావాలి. ముఖ్యంగా నూనె పదార్థాలను తగ్గిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.
🍁 వేసవిలో మంచినీటికి మించిన ఔషధం లేదు. ఎండవేడి వల్ల చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. దాంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అందుకే దాహం వేసినా, వేయకున్నా ప్రతి గంటకోసారి నీళ్లు తాగుతుండాలి.
🍁 ఈ కాలంలో చాలామంది చేసే పని శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవడం. కానీ వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. వాటిల్లోని రసాయనాల వల్ల బరువు పెరగడంతోపాటూ జీర్ణ సంబంధ సమస్యలూ ఎదురుకావచ్చు.
🍁 నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తింటే మంచిది. ఆకుకూరలూ, బీట్‌రూట్, బీరకాయ, సొరకాయ, టొమాటో, దోసకాయ. ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, తర్బూజా వంటివి బాగా తినాలి. ఇంట్లో తయారుచేసుకునే ప్రతీ పానీయంలోనూ సబ్జా గింజలను నానబెట్టి వాడితే మంచిది. శరీరానికి చల్లదనం అందుతుంది.
🍁 నిమ్మరసం, కొబ్బరి నీళ్లూ, పుదీనా రసం, పల్చని మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే శరీరానికి తేమ అందుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా ఎదురుకాదు.
🍁 నూనెలో వేయించి తీసే గారెలూ, సమోసాలూ, చిప్స్, బజ్జీలు వంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండటమే కాదు, కుదిరితే ఈ కాలంలో పూర్తిగా మానేయడం .
No comments:
Post a Comment