Sunday, 22 July 2018

భారతీయ సంస్కృతిలో నేటితరం

*భారతీయ సంస్కృతిలో నేటితరం*

అమ్మమ్మలూ, నానమ్మలూ దగ్గర  సెలవుల్లో గడిపి వారు చెప్పే ఆరోగ్య సూత్రాలను , సాంప్రదాయాలను తెలుసుకుని,  వారు చెప్పిన కధలతో అనుభవాలతో కాలక్షేపం  చేస్తున్న పిల్లలు, వీటిని వారి దినచర్య రాసుకునే  పుస్తకం లో  (డైరీ)  రాసుకుని తన అనుభవాలను కూడా రసుకుని ,ఆనాటి పాతకాలం  నాటి ఆటలు ఆడుతూ , అందులో  ఉన్న  మర్మాన్ని తెలుసుకుని , నిజజీవితంలో నడుచుకుంటూ, 64 కళలలో  ఏదోఒక  కళను తన  చిన్నతనంలోనే అభ్యసించి , పట్టుసాధించి  ఏకాగ్రతను పొందాలి , పలుభాషలలో మాట్లాడే చాతుర్యాన్ని పెంచుకుంటూ  ఉండాలి. (సంస్కృతం వంటి మూలభాషలు.)

* వ్యక్తిత్వం కలిగిన ఆదర్శమైన వ్యక్తుల యొక్క  జీవితాలు , చందమామ , బాలమిత్ర వంటి కధల పుస్తకాలు చదువుతూ , టీవీలకూ, కంప్యూటర్లకు ,ఫోన్లకూ దూరంగా ఉంచుతూ అప్పుడప్పుడు వాటితో  వారి భవిష్యత్ కుపయోగపడేవి మత్రమే  వాడవలెను.

• పదవ తరగతి నుండి చదువు మీద శ్రధ్ధ , దృష్టి పెట్టి , పదవతరగతిలో ఉత్తీర్ణులైనట్లు  చూసుకోవాలి. ఆ తరువాత, వారికున్న  అభిలాష‌ , తండ్రి యొక్క సంపాదనా , తల్లి యొక్క ప్రేరణా చూసుకుని  ఏ మార్గంలో వెళ్ళాలో తెలుసుకోవాలి .

తక్కువ కాలం పట్టే చదువులు, దీర్ఘకాలం పట్టే చదువులు , ఉద్యోగం చేసే శక్తి ఉంటే , పదవతరగతి లో వచ్చే మార్కులను బట్టే , ఏదో ఒక జాబ్ ను  చేసుకుని,  ఓపెన్ డిగ్రీ  చదువుకోవాలి. ఇంటికి సహాయ పడాలి.

ఒకవేళ  ప్రభుత్వోద్యోగం  చేయాలని మనసుంటే వాటికి సంబంధించిన పుస్తకాలను చదవాలి.  ఖాళీ సమయంలో కాలక్షేపం చేసే సమయంలో ఇటువంటి పుస్తకాలను చదవవలెను.

ఆడపిల్లలు దీర్ఘ చదువులు లేదా ఉన్నతమైన చదువులు చదవాలనుకుంటే దేహానికున్న కోరికలు తీర్చిన తరువాత చదవడం ఉత్తమం అంటే వివాహమైన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత జాబు కొనసాగవలెను.

మగవారు దీర్ఘ చదువుల తరువాత (డిగ్రీ బీటెక్ తర్వాత ) ఉద్యోగం  వెతికి సంవత్సర కాలం  చేసి,వచ్చిన ధనాన్ని  దాచుకుని , ఖర్చు పెట్టకుండా దాచి  దేశాటనకు వెళ్ళాలి.(బ్రహ్మ చర్యానికి) చిన్న ఉద్యోగాలు. ఆశ్రమాల్లో, పుణ్యక్షేత్రాలలో, సత్రాలలో ఉంటూ, ఖర్చు తగ్గించుకుంటూ , ఉంటూ ప్రభుత్వోద్యోగం చేయాలనుకునే వారు అలా ప్రయత్నించాలి లేదా చిన్న చిన్న ఉద్యోగాలు గానీ  చేస్తూ  తన ఖర్చులకు ధనం సమకూర్చుకుని, ప్రభుత్వోద్యోగానికి  ప్రయత్నం చేయాలి .ఉన్నత చదువులు చదవాలనుకునే వారు ఇలా వెళ్లాలి. (తల్లిదండ్రులపై ఆధారపడకూడదు) తనకేది ఇష్టమో, తనకేమి  నైపుణ్యం ఉందో ,తనకెంత సత్తా ఉందో తెలుసుకుని తనపై తనకు  పట్టు రావలెను. భవిష్యత్  లో చదువులు అనగా ఎమ్.టెక్ , పి.హెచ్.డి. వంటి చదువులు వివాహమైన తరువాత ,పిల్లల చదువుల తో పాటు ,వారికి ఆదర్శంగా నిలిచి చదువుకోవాలి.

ఇతరులను చూసి , తనకుటుంబానికి లేనిపోని ఖర్చు లను రాకుండా , పరిసరాలను  అర్థం  చేసుకుని ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుంటూ, ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా, ద్రవపదార్థాలను తీసుకుంటూ , ఉపవాసం ఉంటూ , దేహాన్ని శుద్ధి చేస్తూ , పిల్లలని కనీసం ఒక ఆడ మగును పెంచవలెను.(దత్తత అయినా సరే పెంచవలెను.)

వారిని ఇదే మార్గం లో పెంచవలెను. ఇలా పిల్లల ను పెంచి , భారతీయ సంస్కృతిని కాపాడవలెను.

పిల్లల్ని  పెంచిన తరువాత , పెళ్ళిళ్ళు అయిన తరువాత  తను  ఆపిన బ్రహ్మచర్యాన్ని  చేస్తూ యవ్వనంలో తెలుసుకున్న తనపై  తో తనకున్న పట్టును కొనసాగిస్తూ, తనకుతాను తెలుసుకోవలెను.తన భాగస్వామి కి నేర్పిస్తూ ఇంటికి  దూరంగా ,భాగస్వామికి నేర్పిస్తూ ఆశ్రమాలకూ,పుణ్యక్షేత్రాలకూ వెళుతూ , సంసారం సాగరాన్ని  మరుస్తూ, భగవత్ చింతనతో , ఏకాంతంతో ( నామ స్మరణ/ధ్యానము/ లేదా సేవ చేస్తూ  (మొక్కలకు నీరు పెట్టడం  వంటివి.) )

ఏకాంతాన్ని   అనుభవిస్తూ చేయాలి. అనంతమైన ఏకాంతాన్ని కోరుకునే వారు  భాగస్వామి యొక్క అనుమతి తో సురక్షిత మైన స్థలంలో  లేదా  కొడుకు దగ్గర ఉంచి , శాశ్వతమైన  ఏకాంతం కోసం దేశాటనకు వెళ్ళాలి. తన ఆరోగ్యాన్ని బాగున్నా ,బాగులేకపోయినా ఎవరికీ తెలపకుండా , ఈశ్వరుని కోసం  తపించ వలెను. తరం*

ఏకాంతాన్ని   అనుభవిస్తూ చేయాలి. అనంతమైన ఏకాంతాన్ని కోరుకునే వారు  భాగస్వామి యొక్క అనుమతి తో సురక్షిత మైన స్థలంలో  లేదా  కొడుకు దగ్గర ఉంచి , శాశ్వతమైన  ఏకాంతం కోసం దేశాటనకు వెళ్ళాలి. తన ఆరోగ్యాన్ని బాగున్నా ,బాగులేకపోయినా ఎవరికీ తెలపకుండా , ఈశ్వరుని కోసం  తపించ వలెను.

Thursday, 19 July 2018

స్వామి వివేకానంద సూక్తులు తెలుగులో

*స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా*

అసలు పేరు : నరేంద్రనాథ్ దత్తా

జననం : 12 జనవరి 1863, కలకత్తా, 

నిర్యాణము : జూలై 4, 1902 (వయసు 39) 

స్థాపించిన సంస్థ : బేలూరు మఠం, రాష్ణకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్

గురువు : రామకృష్ణ

తత్వం : వేదాంత

సాహిత్య రచనలు : రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ

*●స్వామి వివేకానందుని స్పూర్తి వచనాలు●*

◆మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.

◆ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

◆కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.

 ◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

◆ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

◆ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

◆కళింకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.

◆తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.

◆దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.

◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది

◆దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.

◆పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.

◆పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.

◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది

ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.

◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

◆మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

◆మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.

◆విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.

◆వేదకాలానికి తరలిపోండి.

◆సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

◆సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

◆విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

◆తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.

◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. 

◆ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

◆జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

◆టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.

డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

◆చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.

◆విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.

◆మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.

◆అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.

◆స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

◆సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

◆భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

◆మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

◆మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

◆సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.

◆దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

◆ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవిం లేడు.

◆పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

◆నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.

◆పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.

◆ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.

1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం 

2.అసూయ,అనుమానాల రాహిత్యం 

3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.

◆మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.

◆ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.

◆అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.

◆అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

◆బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.

◆ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.

◆మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

◆ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.

◆సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.

◆ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.

◆స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.

◆ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.

◆అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.

◆జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.

◆ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.

◆పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం.

దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.

◆ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.

◆నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.

◆నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.

◆అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.

◆ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

   *జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు*

ఇట్లు

మీ 

*పోలమోని_రామక్రిష్ణ_యాదవ్*

*వివేకానంద యూత్ ఉపాద్యక్షులు, అయ్యవారి గూడ*

&

*తెలంగాణ PCC ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్*

Wednesday, 18 July 2018

సత్యం పంచకం

ప్రేమ ,కరుణ, జాలి, మానవత్వం, దయా , నిర్ణయం, నిమ్రాత, శరణాగతి
ఓర్పు, సహనం, నిరీక్షణ, పెరిగేకొద్దీ సత్యం దర్శనం అవుతుంది

కాలం వృధా అయ్యింది నేను చేయలేకపోతున్నాను నేను ఎదురు చూడలేకపోతున్న భావం ఉంటే మనం సత్యానికి దూరంగా

అతి ప్రేమ నుంచి ప్రేమకి, మూఢభక్తి నుంచి భక్తికి, సాకారం నుంచి నిరాకారం కి వచ్చినప్పుడే సత్యం వైపే అడుగులు వేయగలం.

రుచులు నుంచి తృప్తి వైపు, సంపదలు నుంచి సంతృప్తి వైపు,
ఆడంబరం నుంచి నిరాడంబరం వెళ్లినపుడే సత్యానికి దగ్గరవుతాము.

'జ్ఞానం'   అంటే తెలుసుకోవడం. మన శరీరంలో వేటి ద్వారా తెలుసుకుంటామో వాటితో ఉండటం,గడపటం,జీవించడమే జ్ఞానం.

ఉదాహరణకు , కటి చూపు‌, వినికిడి మిగతావి చురుగ్గా పనిచేయడం.

Tuesday, 17 July 2018

Human powers

Thought provoking one
కాగితాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

నిప్పును కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

చక్రాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

పెద్ద పెద్ద ఇల్లు, బంగళాలు కట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఓడను కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

విమానం కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఇంట్లో విశ్రాంతి, సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
"మనిషి" - "HUMAN"

ఏ face book, whatsupలలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం
"మనిషి" - "HUMAN"

ఈ సమాజాన్ని నిర్మించిందెవరు?
"మనిషి" - "HUMAN"

మతాలను, ధర్మాలను సృష్టించిందెవరు
"మనిషి" - "HUMAN"

మందిరము, మసీదు, చర్చి సృష్టించిందెవరు?
"మనిషి" - "HUMAN"

వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
"మనిషి" - "HUMAN"

విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ
"మనిషి" - "HUMAN"
సృష్టించాడు.

అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం.

*********************
మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు
*********************

1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.

2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని, చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.

3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.

4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా, అందరూ చెబుతారు దేవుడొక్కడే అని, కానీ కొసమెరుపు అది మా దేవుడే.

5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.

6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.

7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.

8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవ చెయ్యమన్నారు.
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!

9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు.

11)దేవుడు లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, బలాత్కారము, ఆతంకవాదము, అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.

12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.

13)మందిరాలు, మసీదులు, చర్చిలు, ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు, పిల్లలు సురక్షితంగా లేరు.

14)మందిరాలు, మసీదులు, చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.

15)అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?

16)25 సంవత్సరాలముందు లేని దేవుండ్లు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.

17)తానే దేవున్నని చెప్పుకునే వాల్లు చాలా మంది జైల్లలో ఊచలు లెక్క పెడుతున్నారు.

18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాల్లు చాలా మంది ఆనందంగా ఉన్నారు.

19) హిందువులు అల్లాను స్వీకరించరు, ముస్లిములు హిందూ దేవతలను, క్రైస్తవులు హిందూ దేవతలను, అల్లాహ్ ను ఒప్పుకోరు. హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?

కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో,
వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది.

ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం.

రచయిత
మళ్ళీ వాడే
"మనిషి" - "HUMAN"

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...