ప్రశ్న : సేవ నుంచి నివృత్తి అయి శ్రీ భగవాన్ తో సదా ఉండిపోవాలని మనసు కోరుతుంది.
మహర్షి : భగవంతుడు సదా మీతోనే ఉన్నారు,మీ లోపలే ఉన్నారు.మీ ఆత్మ భగవంతుడు. ఈ సత్యాన్ని అనుభవం పొందడానికి మీ కార్యములనుంచి అవ్వాల్సిన అవసరంలేదు. దుస్తులను మార్చడం ,ఇల్లూ ,వాకిలీ ,కుటుంబాన్ని వదిలివేయడం త్యాగమనిపించుకోదు. కోరికలు మమత్వమునూ,ఆశక్తులను వదలటం త్యాగం.మీకు మీ సేవా కార్యములనుంచి, వృత్తులనుంచీ నివృత్తి అవసరం లేదు .కేవలం నిన్ను నువ్వు ఈశ్వరునికి సమర్పించుకో.అతనే అందరి బరువునూ మోయుదురు. ఏ మనిషి తన కోరికలను త్యాగము చేయునో ,వారు జగతిలో విలీనమై తన ప్రేమను పూర్తి విస్తారంగా వ్యాప్తి చేస్తారు.
త్యాగము బదులు ప్రేమ మరియు కరుణ యొక్క విస్తరణ ఒక నిజమైన భక్తునికి చాలా మంచిది,అది దగ్గరి బంధనాలను తెంచుతుంది.అతను తన ప్రేమ యొక్క విస్తారాన్ని హద్దు,వర్గం,సంప్రదాయాలను మరియు జాతి మర్యాదను దాటి సంపూర్ణ జగత్తులో వ్యాప్తి చేస్తాడు.
సన్యాసి ఎప్పుడైతే తన వస్త్రాలను మరియు ఇంటిని త్యాగం చేస్తాడో,అప్పుడు తన దగ్గరి సంబంధీకుల పట్ల ద్వేషానికి కారణమవ్వడు,పైగా తన దగ్గరివారి కనిపించే వారందరి పట్ల ప్రేమను విస్తరింప చేసేందుకు చేస్తాడు.
ఎప్పుడైతే ప్రేమ విస్తరించే ఘటన ఘటిస్తుందో, అప్పుడు మనిషి ఇంటినుంచి పారిపోతున్నాను అని అనుభూతి చెందడు, పైగా పక్వానికొచ్చిన ఫలం చెట్టునుండి అనాయాసంగానే వేరుపడుతుంది.ఆ విధంగా ఇంటినుంచి వేరవుతాడు.అప్పటివరకు ఇంటినీ ,కార్యాన్నీ (బాధ్యతలను) విడుచు మూర్ఖత్వం. ~
రమణ మహర్షి .
Q: What is the ego-self ? How is it related to the real Self ?
Sri Ramana Maharshi :
The ego-Self appears and disappears and is transitory, whereas the real Self is permanent.
Though you are actually the true Self you wrongly identify the real Self with the ego-self.
Q: How does the mistake come about?
Sri Ramana Maharshi : See if it has come about.
Q: One has to sublimate the ego-self into the true Self.
Sri Ramana Maharshi : The ego-self does not exist at all.
Q: Why does it give us trouble?
Sri Ramana Maharshi : To whom is the trouble ?
The trouble also is imagined.
Trouble and pleasure are only for the ego.
Q: Why is the world so wrapped up in ignorance?
Sri Ramana Maharshi :
Take care of yourself.
Let the world take care of itself.
See your Self.
If you are the body there is the gross world also.
If you are spirit all is spirit alone.
Q: It will hold good for the individual, but what of the rest?
Sri Ramana Maharshi : Do it first and then see if the question arises afterwards.
Q: Is there avidya [ignorance]?
Sri Ramana Maharshi : For whom is it?
Q: For the ego-self.
Sri Ramana Maharshi : Yes, for the ego.
Remove the ego and avidya is gone.
Look for it, the ego vanishes and the real Self alone remains.
The ego professing avidya is not to be seen.
There is no avidya in reality.
All sastras [scriptures] are meant to disprove the existence of avidya.
~ From Be as you are book
ప్రశ్న : అహంకారపూరిత నేను (అశుద్ధ) నేను అంటే ఏమిటి ?అది 'నిజమైన' తో ఏ విధమైన సంబంధము కలిగి ఉంది?
శ్రీ రమణ మహర్షి : అహంకార పూరిత ' నేను' లేదా 'అశుద్ధ నేను' వ్యక్తమవుతూ మరియు అవ్యక్తమవుతూ ఉంటుంది.ఇది అస్థిరమైనది/,అశాశ్వతమైనది.
నీవు నిజమైన/శుద్ధమైన 'నేను' ని అయినప్పటికీ అసత్యమైన తప్పుడు ' నేను' ను అహంకారపూరిత 'నేను' ను గుర్తిస్తున్నావు.
ప్రశ్న : ఈ తప్పు ఎలా జరుగుతుంది?
మహర్షి : చూడండి, ఎలా జరుగుతుందో.
ప్రశ్న : ఈ అహంకారపూరిత 'నేను' ను శుద్ధి చేసి నిజమైన /శుద్ధమైన నేను గా మరాల్సి ఉంది.
మహర్షి : అశుద్ధమైన/అహంకార నేను అన్నది లేనేలేదు.
ప్రశ్న : ఇది ఎందుకు మనకు ఇబ్బందులకు గురి చేస్తోంది?
మహర్షి : ఎవరికి ఇబ్బంది ? ఇబ్బంది కూడా ఊహాయే.
ఇబ్బంది,ఆనందమూ కేవలం ఆహానికే ఉంటాయి.
ప్రశ్న : ఈ ప్రపంచం అజ్ఞానంతో కప్పబడి ఎందుకు ఉంది?
మహర్షి : నీవు నీ సంరక్షణ నువ్వు చూసుకో.ప్రపంచం దాని సంరక్షణ అది చూసుకుంటుంది.
నీవు స్థూల శరీరం అయితే ,ప్రపంచం కూడా స్థూలమైనదే.
నీవు ఆత్మ అయితే అంతా ఆత్మయే.
ప్రశ్న: అది వ్యక్తిగతంగా మంచి చేస్తుంది ,మరి ఇతరుల మాటేమిటి ?
మహర్షి : ముందు నువ్వు చేయు, తరువాత చూడు ఈ ప్రశ్న ఉదయిస్తుందో లేదో.
ప్రశ్న : అవిద్య అనేది ఉందా (అజ్ఞానం)
మహర్షి : ఎవరికీ ?
ప్రు :అహంకార' నేను' కి.
మహర్షి : అవును అహంకారికి.
అహంకారాన్ని తొలగించు అవిద్య (అజ్ఞానం) పోతుంది .చూస్తుంది,అహంకారం మటుమాయం అయి వాస్తవిక నేను/ నిజమైన నేను మిగులుతుంది.
అహంకారం అవిద్యను ప్రకటిస్తుంది.
ఆవిద్య అనేది వాస్తవానికి లేదు.
అన్ని శాస్త్రాలూ అవిద్య ఉనికిని ఖండిస్తున్నాయి.
~ Be as you are పుస్తకం నుంచి.
ప్రశ్న: భగవాన్ అంటారు హృదయం ఆత్మ స్థానం నిలయమైనప్పటికీ ,ఆత్మ ఏ చక్రములోనైనా ప్రకటితమవగలదు.భ్రుకుటి మధ్యలో ఏకాగ్రత తో ధ్యానిస్తే అదే ఆత్మ స్థానం అవదా?
మాహర్షి : మీరు ఎక్కడ విచారణ చేసి లక్ష్యాన్ని ఏకాగ్రం చేస్తే ఆ విచారణ కేవలం సిద్ధాంతం మాత్రమే ( theoritical). మీరు దృష్ట,మరియు మీరు దేనిమీదయితే ఏకాగ్రం చేస్తారో అది దృశ్యం.ఇది కేవలం భావనే.దీనికి విరుద్ధంగా 'దృష్ట' ని చూసి, ఆత్మలో విలీనమై,దానితో ఏకరూపమైతే అదే హృదయం.
ప్రశ్న : భ్రుకుటి మధ్యలో ఏకాగ్రతతో అభ్యాసం చేయుట సమంజసమా ?
మహర్షి : ఏ విధమైనటువంటి ధ్యానభ్యసము యొక్క అంతిమ పరిణామం ఏమంటే , సాధకుడు ఏ లక్ష్యము పై తన చిత్తమును చేస్తాడో ,అతడు దృష్టతో వేరు కాదు.దృష్ట మరియు దృశ్యము రెండూ ఒక ఆత్మగా అయిపోవును , అదే హృదయం.
~ శ్రీ రమణ మహర్షి.('బి ఆస్ యూ ఆర్ ' పుస్తకం నుంచి).
~ from be as you are book.
ప్రశ్న: భగవాన్ చెప్పారు ~ భక్తుడు ౼ఆంతరికంగా ఈశ్వరునికొఱకు అన్వేషణలో ఉంటే 'బాహ్యకర్మ'లు తమంతట తామే జరిగిపోతూ ఉంటాయి. శ్రీ చైతన్య విషయం లో ఇలా అంటారు౼ అతను విద్యార్థులకు శిక్షణానిస్తున్నప్పుడు వస్తుతః లోపల కృష్ణుని వెతుకుతూ ఉండేవారు, తన శరీర భ్రాంతిని మరిచి కృష్ణుని గూర్చి చెప్తూ ఉండేవారు.
అందువల్ల సందేహం కలుగుతోంది ౼ పనిని దాని మటుకు దాన్ని వదిలి వేయవచ్చా లేదా అని.సాధకునికి తన లక్ష్యం లో ఒక భాగాన్ని పని (కర్మ) కోసం తీసి ఉంచవలెనా ?
మహర్షి : అన్నీ ఆత్మే. నీవు ఆత్మ కంటే వేరా ? లేక ఆత్మ లేకుండా కర్మ అవుతుందా ?
ఆత్మ విశ్వాత్మ.ప్రతి కర్మ (పని) మీతో జోడించినా, జోడించే ప్రయత్నం చేయక పోయినా వాటిమటుకు అవి జరుగుతాయి.అందుకే కృష్ణుడు అర్జునునితో అనెను
'నీవు కౌరవులను చంపనవసరంలేదు, వారు ఈశ్వరుని ద్వారా ముందే చంపబడ్డారు ' .
కర్మ గురించి నిశ్చయించుకోవడం లేదా దానికోసం చింతించడం అర్జునుని పనికాదు,తన సహజమైన ,శక్తి కోరిక ను నెరవేరుస్తుంది.అది దాని కర్తవ్యం .
ప్రశ్న : కానీ నేను పని మీద ధ్యాస పెట్టకపోతే ఆ పని సక్రమంగా జరుగుతుందా ?
మహర్షి : ఆత్మ కొరకు లక్ష్యం పెట్టడం అంటే పని కొరకు లక్ష్యం అని అర్ధం.ఆత్మని లక్ష్య పెట్టడం అంటే పనిని లక్ష్య పెట్టడం.శరీరమూ దాని చేష్టలు అన్నీ కర్మలో నిమగ్నమయ్యే ఉన్నాయి,ఆత్మతో వేరు కాదు.మీరు పనిలో లక్ష్యముంచిన ఉంచకపోయినా ఏమీ తేడా ఉండదు.మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రతీ అడుగుపై దృష్టి పెట్టకుండానే గమ్యస్థానాలకు చేరిపోతారా లేదా ? మీరు ఇది అనుభవం పొందుతున్నారు కదా ౼ నడిచే పనిమీద లక్ష్యం లేకపోయినా చేరిపోతున్నామని. అలాగే సర్వ కార్యములూను జరుగుతూ ఉంటాయి.
ప్రశ్న : మనిషి ఆత్మ స్మృతిలో ఉంటే తన అనేక కార్యములు సక్రమంగా అవుతాయా ?
మహర్షి : అవి జరగవలసిందే.కానీ అటువంటి మనిషికి మంచి ౼చెడులు చింత ఉండదు.అతడి కర్మలు ఈశ్వరునివే,అందుకే అవి మంచివే.
~ శ్రీ రమణ మహర్షి (నీ సహజ స్థితిలో ఉండు పుస్తకం నుంచి)
~ From be as you are book.
ప్రశ్న: ధ్యానమంటే ఏమిటి ?
ఙ: ఆత్మరూపంలో ఉండుటయే ధ్యానం. తన వాస్తవిక స్వరూపం నుంచి రవ్వంతయిన కదలకూడదు. మరియు ' నేను ధ్యానం చేస్తున్నాను' అన్న భావన నుంచి ముక్తులవ్వాలి.
ప్రశ్న : ధ్యానము మరియు సమాధికి భేదమేమిటి?
ఙ: ఉద్దేశపూర్వకంగా మానసిక ప్రయత్నంతో ధ్యానం జరుగును. సమాధిలో అలాంటి ప్రయత్నం అవసరం లేదు.
ప్రశ్న: ధ్యాన విషయంలో యే యే విషయములపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఙ: ఆత్మనిష్ఠులైన పురుషులకు గుర్తుంచు వలసిందేమంటే సదా ఆత్మ లో లీనమై ఉండాలి.కొంచెం కూడా తప్పకూడదు. తన సత్య స్వరూపము నుంచి కదలకుంటే తనముందే తేజోమండలము,అసామాన్యధ్వనులు మరియు లోపల బయట కనిపించే దేవస్వరూపాలను సత్యమని భావించాలన్న కోరిక ఉత్పన్నమవుతుంది .వారికి ఈ విషయాలన్నింటి గూర్చి భ్రమ ఉండరాదు. మరియు ఆత్మ విస్మరణ కాకుండా చూడాలి.
~ 'నీ సహజ స్థితి' పుస్తకం నుంచి.
ప్రశ్న : 'నేను' ను వెదకితే ఏమీ కనబడలా ?
ఙ: ఎందుకంటే దేహంతో పాటు ఆత్మను ఏకరూపమనుకునే అలవాటు అయింది.
మీరంటున్నారు అక్కడ మీకేమి కనబడలేదని.
అక్కడ ఏమి చూడాలి ? చూసేవారెవరు? ఎలా చూస్తారు ?
కేవలం అది చైతన్య స్వరూపం అహం విచారణ రూపం ప్రకటితమై స్వయంగా శరీరంతో ఏకరూపంగా భావిస్తుంది,మరియు నేత్రముల ద్వారా తనకు తాను తెర మీద చూసుకున్నట్లు చూసుకుంటుంది.
తాను జాగృతావస్థలో అతి తక్కువగా (మితముగా) ఉండుటచేత స్వయమునకు భిన్నంగా చూస్తాడు.
తన ఇంద్రియములు ౼తన నాణెములు,ముద్ర వేయబడినటువంటి ముద్రలు.
కానీ తాను ఈ సత్యాన్ని స్వీకరించడు.
తాను దృష్ట అని దృశ్యం మరియు దర్శనం తన యొక్క 'అహం౼అహం' రూపంతో స్ఫురించే చైతన్యం యొక్క అభివ్యక్తమని.
ధ్యానంతో మనిషి 'ఆత్మ ఒక కనిపించే పదార్ధమ'నే భ్రమనుంచి ముక్తుడౌతాడు.
వాస్తవానికి అక్కడ ఏమీ కనిపించే వస్తువు లేదు.
మీరు ఈ సమయంలో 'నేను' యొక్క అనుభూతిని ఏ విధంగా చేస్తున్నారు?
నిన్ను నీవు తెలుసుకోవడానికి మీ యెదుట దర్పణం ఉంచారా?
'నేను' అనేది ఉంది ౼దానిని అనుభూతి చెందండి,అదే సత్యం.
~ శ్రీ రమణ మహర్షి.
ప్రశ్న : అహంకారాన్ని ఎలా అంతం చెయ్యాలి ?
శ్రీ రమణ మహర్షి :
ముందు అహం ఎవరో పట్టుకోండి.
ఆ తరువాత అడగండి ఆహాన్ని ఎలా అంతంచేయలని.
ఎవరు ఈ ప్రశ్న అడిగేది ?
అది అహంకారమే.
అహంకారం స్వయంగా తన మృత్యువును సమ్మతిస్తుందా ?
ఇలాంటి ప్రశ్న అహంకారాన్ని సురక్షితంగా ఉంచడానికి మార్గం.దీన్ని నష్టపరచరాదు.
మీరు అహంకారం యొక్క మూలాన్ని వెదకితే ,మీకు దాని ఆస్తిత్వము (ఉనికి) లేదని తెలియును. ఇదే అహంకారం అంతం చేసే మార్గం.
~'నీ సహజ స్థితిలో ఉండు' పుస్తకం నుంచి.
ప్రశ్న: ఈ సంస్కారాలు మెల్ల మెల్లగా ఒక దానివెంట ఒకటి పోతాయా ? లేక ఒకే రోజు అన్నీ హఠాత్తుగా పోతాయా ?
ఇలా ఎందుకడుగుతున్నానంటే చాలాకాలం నుంచి నేనిక్కడ ఉన్నాను ,నాలో మార్పు చూడనే లేదు.?
ఙ: సూర్యోదయం అయినప్పుడు అంధకారం మెల్లమెల్లగా పోతుందా ? లేక హఠాత్తుగా పోతుందా ?
ప్రశ్న : విచార సాధనలో 'నేను ప్రగతిని సాధిస్తున్నాను' అని ఎలా తెలియును ?
ఆత్మ సాక్షాత్కార మార్గంలో ప్రగతిని కొలిచే కొలబద్ద నిర్విచార స్థితి యొక్క స్థాయి ,కానీ ఆత్మ సాక్షాత్కారం లో ఏమీ స్థాయీ లేదు.అది సమానంగా ఉంటుంది.ఆత్మ నిత్య సాక్షాత్తుగా ఉండును. ఆలోచనయే దానికి ఆటంకం (అడ్డంకి). ఆత్మ ౼నిత్యం ౼ ప్రత్యక్షము లేదా సాక్షాత్తు (సమ్ముఖము నందు కలది ) .ఇలాంటి జ్ఞాన మార్గంలో ఉండే ఆటంకాల తగ్గుదలయే ప్రగతిని కొలిచే కొలమానము (సాధనం).
అందువలన, విచారణ ఎవరికోసం అన్నది చూస్తూ ఆలోచనలను తప్పక నిరోధించవలెను.ఎక్కడ నుంచి విచారణ ఉత్పత్తి కాదో మీరు అలా ఆ మూలనికి చేరుకుంటారు.
ప్రశ్న : సందేహాలు ఎప్పుడు కలుగుతూ వుంటాయి, అందుచేత అదే నా ప్రశ్న ?
జ : ఒక సందేహం కలుగుతుంది దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది ,రెండవది తలెత్తును,అదీ పోతుంది ౼ మూడవదానికి చోటివ్వడం కోసం , ఇక ఆ ప్రవాహం అలా కొనసాగుతూనే వుంటుంది. అన్ని సందేహాలను నివృత్తి చేయడం అసంభవం. సందేహాన్ని చూడండి ఎవరికి వచ్చింది ? దాని మూలాన్ని వెతికి అక్కడే స్థిరపడండి. అప్పుడిక అవి ఉత్పన్నమవవు.సందేహాలని ఈ విధంగా మాత్రమే నష్టపరచవచ్చును.
ప్రశ్న : నాకు ఒక మంత్రం దొరికింది,అది ప్రణవము. నన్ను మావాళ్ళు భయపెడుతున్నారు,౼'నువ్వు ఈ జపం చేస్తే ఉహించలేని పరిణామాలు కలుగుతాయి 'అని. నేను మీ మార్గదర్శనం కోరుతున్నాను౼ నేను ఈ మంత్రం జపం చేయొచ్చా?నాకు దానిపై శ్రద్ధ వుంది.
ఙ: మంత్రాన్ని చాలా శ్రద్ధతో జపించాలి.
ప్రశ్న : అది స్వయంగా పని చేస్తుందా లేక మీరు నాకేమైనా సూచనలివ్వగలరా ?
జ: మంత్రజపం యొక్క ఉద్దేశ్యం ఏమంటే,ఆ జపం మీలో ముందే అనాయాసంగానే జరుగుతూ ఉండుట అనుభవం చేయడం.
మౌఖిక జపం,మానసిక జపంగా మారుతుంది, మానసిక జపం చివరికి మీ నిత్య రూపంగా ప్రకఠితమౌతుంది.ఆ మంత్రం సాధకుని నిజస్వరూపం, దీనినే సాక్షాత్కారం అంటారు.
ప్రశ్న : సమాధి యొక్క ఆనందం ఈ విధంగానే ప్రాప్తిస్తుందా ?
జ : జపం మానసికమై చివరికి తనంతట తాను ఆత్మరూపమై ప్రకటితమవును.
~ 'నీ సహజ స్థితిలో ఉండు ' పుస్తకం నుంచి.
ప్రశ్న : మా ప్రయత్నాలు సఫలమౌతాయ ?
జ: సాక్షాత్కారము (ఎదుట కనబడుట) మన స్వభావము. అందులో ఇంక కొత్తది పొందనవసరంలేదు. ఏది కొత్తదో అది నిత్యమైనది కాదు. అందువల్ల సాధకుడు ఆత్మను పొందుతాడో లేక పోగొట్టుకుంటాడో అన్న సందేహం అనవసరం.
ప్రశ్న : విచారణ అన్నది సత్యమైన మార్గం అని తెలిసీ జపం చేయడం మంచిదా ?
జ: అన్ని పద్ధతులూ మంచివే. ఎందుకంటే అవి మెల్ల మెల్లగా చివరికి సాధకునికి ఆత్మనుసంధానమునకు (ఆత్మ అనుభవమునకు) తీసుకువస్తాయి. జపము మన నిజ స్వభావము. మనకు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానము కలుగునో,అప్పుడు జపము అనాయాసముగానే జరుగుతూ ఉండును. ఒక స్థాయిలో 'సాధన'గా ఉన్నది రెండో స్థాయిలో 'సాధ్యము' అయిపోవును. నిరంతరము అనాయాస జపం జరుగుతూ ఉండాలి.అదే సాక్షాత్కారము.
ప్రశ్న : నా మనసు ఒకవేళ ఇతరులకంటే ఎక్కువగా ఉపయోగించాలంటే అది శాంతంగా స్థిరంగా ఎలా ఉంటుంది ? నేను నా ప్రధానాచార్యుడి. వృత్తిని వదిలి ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను.
జ: వద్దు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండవచ్చును.
ఏ అంతర్ ప్రవాహం వలన మనసుకి చేతనత్వం మరియు పనులు చేసుకునే శక్తి లభించుచున్నది?
అదే ఆత్మ. అందుచేత మీ పనుల మూలము అదే.
పనులు చేసేటప్పుడు ఆత్మతో ఉండండి,మరియు దానిని విస్మరించవద్దు.
పనులు చేసుకుంటున్నప్పుడు మనసు యొక్క వెనుక ఆత్మధ్యానం కొనసాగాలి. ఇందుకోసం తొందర పడరాదు.తగినంత సమయం తీసుకోవాలి. పని చేయునపుడు కూడా మీరు మీ వాస్తవిక స్వరూపము యొక్క స్మృతిని కొనసాగించాలి.మరియు విస్మరించే తొందరపాటును చేయకూడదు. నిరంతరం జాగరూకులై ఉండాలి.
మనసును శాంతపరచడానికి ధ్యానం చేయాలి. మరియు దానిని ఆశ్రయించుకుని ఉన్న ఆత్మ,దానికి సంబంధించిన దానితో నిరంతరం సావధానంగా ఉండాలి. మీరు చేస్తున్నారు అని కల్పన చేయకండి.
మీ లోపల ఉన్న మూల అంతర్ ప్రవాహం పని చేస్తోందని అర్థం చేసుకోవాలి.
మీరు ధైర్యంగా జాకరూకులై కర్మలు చేస్తే, ఆ కర్మలు మీ మార్గానికి అడ్డురావు.
~ 'నీ సహజ స్థితిలో ఉండు' పుస్తకం నుంచి.