Thursday, 14 June 2018

💐 కిట్టయ్య సలహాలు 💐

💐💐💐💐 'సమస్య రావద్దు'....'కోతి రావద్దు'....అనుకుంటే కోతి వస్తుంది. మనమెంత వద్దనుకుంటే అవి వస్తూనే ఉంటాయి .
‎మనం పుడుతూనే సమస్య కూడా పుడుతుంది,అది గుర్తుంచుకో.

సమస్య పరిష్కారం వెతకడమే జీవిత గమ్యం అని తెలుసుకో.

మనం ఎంత శారీరక శ్రమ చేస్తే అంత శరీరం ,మెదడు చురుగ్గా పని చేస్తాయి.
అప్పుడు సమస్యను సమస్యగా కాక ,పరిష్కారం దిశగా ఆలోచిస్తాము.

💐 నీ  దేహము,మనసు (ఆలోచనలు),దృష్టి,వృత్తి,సంస్కారాలనే అనే బీజాలను బాగా  ఎండబెట్టి,వాటిలోని పచ్చి 'వాసనలు' పోయి,వాటిని తపస్సు అనే అగ్ని ద్వారా,జ్ఞానమనే జలముతో మరిగించి,ఉడికించి మృదువుగా ,రుచిగా,తేలికగా,సుపాచ్యముగా, శక్తి శాలిగా,బలవర్ధకంగా  మారి అన్నం పరబ్రహ్మంగా తయారవుతాము.

💐ఒకరు మంచి ఒకరు చెడ్డ అనే గుణత్రయాన్ని  చూస్తే మన ఆనందాన్ని దూరం చేసుకున్నట్లే.

💐నారాయణుడు తన లక్ష్మిని వదిలి,శంఖ,చక్రములను, అలంకారములను వదిలి,తన గరుడ వాహనాన్ని వదిలి ఈశ్వరుని అన్వేషణలో బయలుదేరేడు....నీవే ఆ నరాయణుడివి,నీ భార్యా ,బిడ్డలను,సంపదలు,వాహనాలను వదిలి ఈశ్వరుని అన్వేషించు.

💐శబ్దం   నిశ్శబ్దం నుంచే పుడుతుంది.
ముందు శబ్దాలను అ ఆ లను తీసి,ఆపై అమ్మ,అత్త, అక్క,అన్న మొదలగు బంధాలను తీసివేసి,ఆపై మౌనంలో ఉంటే మూలాన్ని పట్టుకోగలవు.

💐నిరాకారుడైన ,గాలిలో సూక్ష్మ కణ రూపంలో, ఉన్న భవంతుని చూడాలంటే...మనమూ నిరాకార సూక్షంగా మారితే గానీ భగవంతుని చూడలేము.

💐ఎంతవారు గాని,వేదాంతులైన గాని  మత్తు ఎక్కడో ఉన్నదని ఆనందం ఎక్కడో ఉందని వెతుకులాట దేనికి? నీలోనే మత్తు,ఆనందం ఉన్నాయి.

💐మనకు సుఖం వస్తే తీసుకుంటాము,దుఃఖం వస్తే ఎందుకు వదిలి పరిపోతావు?చెట్లకు నీరుపోస్తూ వాటిలో ఈశ్వరుని చూస్తూ, వాటితో నీ బాధను చెప్తూ 'నా బాధను తగ్గించు ఈశ్వరా' అని చెప్పుకో.

💐కష్టాలు,పరీక్షలు వచ్చేది  నిన్ను ధృడపరిచేందుకే కానీ దుఃఖపెట్టి కష్టపెట్టడానికి కాదు.

కష్టాలప్పుడే ఈశ్వరుని భక్తితో ,ఓపికతో పట్టుకుంటే అన్నీ సద్దుమణిగి, సర్దుకుంటాయి.

తుకారం భార్య జిజియా బాయి కంటే మనవి పెద్ద బాధలా?ఆమె తన భర్త ఏమీ సంపాదన లేక ,కుటుంబపోషణ ఎంత కష్టమో దేవుడెరుగు.

💐నిజాయితీ గా ఉన్నవాడు బాధలు అనుభవించీ ~ఏ బాధను అయినా తట్టుకోగలడు.నిజాయితీ లేనివాడు సుఖాలను అనుభవిస్తూ కష్టం వస్తే భరించలేడు. అందుకు అగ్నిపరీక్ష తనని బాధిస్తుంది, నిజాయితీ పరుడికి అగ్నిపరీక్ష బాధించలేదు.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...