మరణనుభూతిలో సకల ఇంద్రియాలు సంచలనం అణిగినా అహం-స్ఫురణ తనంత తాను తనలో ప్రకాశిస్తుంది,
నాకు అదే 'నేను' కానీ జడ శరీరం 'నేను' కాదనిపించింది,
ఈ అహం స్ఫురణ ఎప్పుడూ చెడదు,
ఇది దేనికీ చెందనిది,తానుగా ప్రకాశించునది,
ఈ శరీరం దహించినా ఇది చెడదు,కాబట్టీ ఇదే 'నేను' అని విస్పష్ఠంగా నాడే తెలుసుకొంటిని". ---రమణ లేఖలు 2.
In the vision of death,
though all the senses were benumbed,
the aham sphurana (Self-awareness)
was clearly evident,
and so I realised that it was
that awareness
that we call 'I',
and not the body.
This self-awareness never decays.
It is unrelated to anything.
It is Self-luminous.
Even if this body is burnt,
it will not be affected.
Hence,
I realised on that very day
so clearly that that was. -Ramana Letters 2
అ మధ్య నూతనాగతులొకరు ఇంగ్లీషులో భగవాన్నేదో ప్రశ్నించారు.ప్రశ్న నాకు అర్ధం కాలేదు. కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు కనుక భగవత్ వాణిని చేతనైనంతవరుకు సేకరించుట మంచిదని తెలిసినంతవరుకు రాస్తున్నాను.
వారి ప్రశ్నకు బదులు చెపుతూ భగవాన్ ఇలా అన్నారు. "జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటారు కదా. మళ్లీ జగత్తంతా బ్రహ్మ స్వరూపమేననీ చెపుతారే, ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది. సాధక స్థితిలో జగత్తు మిథ్య,అని చెప్పకుంటే వీల్లేదు.ఎందువల్లనంటే, ఎప్పుడూ ఎక్కడా,సత్యమై,నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరిచి,శరీరాదులతో కూడిన జగత్తే తనని భ్రమసి,శ్రమ చెందేవానికి ఈ జగత్తంతా మిథ్య సుమా, చెప్పకుంటే వీల్లేదు.
సినిమా దృష్టాంతం ఇంతే.తెర ఎప్పుడూ ఉంటుంది. బొమ్మలు వాస్తవి పోతవి. తెరకు ఏమీ అంటవు.బొమ్మలు రానీ, పోనీ,దానికేమి ? అయితే,తెర లేనిది బొమ్మలు లేవు.ఆ తెర బొమ్మలకు ఆధారంకానీ,బొమ్మలవల్ల తెరకేం ప్రయోజనం ? తెరను చూడక బొమ్మలే చూచువాడు ఆ ఆటలో వచ్చే కష్ట సుఖాలకు కంపించిపోతాడు.తెర చూచేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని , తెరకంటే అన్యం కాదని గ్రహిస్తాడు. అలాగే ఈ జగత్తు కూడా.ఇదొక బొమ్మలాట " అన్నారు భగవాన్.ఆ పృచ్ఛకులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. ~ L69.
No comments:
Post a Comment