వేదాల ననుసరించి యుగాలు నాలుగు :
సత్యయుగము
త్రేతాయుగము
ద్వాపరయుగము
.కలియుగము
సత్యయుగము
అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.
త్రేతా యుగము
నాలుగు యుగాలలో రెండవది త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.
ద్వాపరయుగము
అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .
కలియుగ లక్షణాలుసవరించు
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.
యుగాలు, మహా యుగము
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి) . మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము) . ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములుఒక మహాయుగము అగును
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.
యుగాదులు
- కృత యుగాది - కార్తీక శుద్ధ నవమి
- త్రేతా యుగాది - వైశాఖ శుద్ధ తదియ
- ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
- కలి యుగాది - బాధ్రపద బహుళ త్రయోదశి
00-9o0-=-
యుగాల మధ్య జరిగిన ఒక కథ
భాగవతం ఏకాదశ స్కందము నుండి [1]: ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరు గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన సుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానునిఅవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)
సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. రాత్రి కాలం కూడా అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్తుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.
బయటి లింకులు
ఇవి కూడా చూడండి
మన్వంతరము
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.
భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వతమన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లుసవరించు
స్వాయంభువ మన్వంతరముస్వారోచిష మన్వంతరముఉత్తమ మన్వంతరముతామస మన్వంతరమురైవత మన్వంతరముచాక్షుష మన్వంతరమువైవస్వత (ప్రస్తుత) మన్వంతరముసూర్య సావర్ణిక మనవు మన్వంతరముదక్షసావర్ణి మన్వంతరముబ్రహ్మసావర్ణి మన్వంతరముధర్మసావర్ణి మన్వంతరముభద్రసావర్ణి మన్వంతరముదేవసావర్ణి మన్వంతరముఇంద్రసావర్ణి మన్వంతరము
ఎన్నెన్ని సంవత్సరాలు?సవరించు
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగ కాలము నకు సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములుత్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములుద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములుకలియుగము (3102 BCE) = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములుమొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కాలమానముసౌర (మానవ) సంవత్సరాలుదివ్య సంవత్సరాలుఒక చతుర్యుగము43,20,00012,00071 చతుర్యుగములు30,67,20,0008,52,000ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య17,28,0004,80014 సంధ్యా కాలములు2,41,92,00067,200ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము30,84,48,0008,56,80014 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు4,31,82,72,0001,19,95,20014 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు4,32,00,00,0001,20,00,000బ్రహ్మకు ఒక రాత్రి4,32,00,00,0001,20,00,000బ్రహ్మకు ఒక దివారాత్రము (ఒక రోజు)864,00,00,0002,40,00,000బ్రహ్మకు ఒక సంవత్సరము311040,00,00,000864,00,00,000
ముఖ్య సంఘటనలుసవరించు
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు
స్వాయంభువ మన్వంతరముసవరించు
తండ్రి - బ్రహ్మమనువు - స్వాయంభువు.ప్రథముడుభార్య - శతరూప (అనంతి)మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.మనుపుత్రికలు -ఆకూతి (రుచి ప్రజాపతి భార్య, ప్రసూతి (దక్ష ప్రజాపతి భార్య, దేవహూతి (కర్ధమ ప్రజాపతి భార్య).భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి (స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.సప్తర్షులు - వశిష్ట, అత్రి, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువుఇంద్రుడు - రోచనుడుసురలు - యామాదులుప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములో జరిగింది.
స్వారోచిష మన్వంతరముసవరించు
మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.మనువు పుత్రులు - చైతుడు, రోచిష్మదుడు, కింపురుషుడుభగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.సప్తర్షులు - స్తంభుడు, దత్త, ఔర్యుడు, వశిష్టపుత్ర, కశ్యపపాణి, బృహస్పతి, చ్యవనాత్రిఇంద్రుడు - విపశ్చింతుడుసురలు - తుషితాదులుసురత చక్రవర్తి వృత్తాంతము
ఉత్తమ మన్వంతరముసవరించు
మనువు - ప్రియవ్రతుని కొడుకు.స్వాయంభువమనువు మనవడుమనువు పుత్రులు - పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడుభగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు) ; కౌకుంది, కురుంది, దలయ, శంఖ, ప్రవాహిత, మిత, సమ్మిత - (సప్త ఊర్జులు)ఇంద్రుడు - సత్యజిత్తుసురలు - సత్యదేవ శృతభద్రులు
తామస మన్వంతరముసవరించు
మనువు - సురాష్ట్రుడు అనే రాజు వలన మృగి (లేడి) (ఉత్పలావతి శాపవశమున) కి జన్మించెను.మనువు పుత్రులు - వృషాఖ్యాతి, కేతువు, జానుజంఘుడు, శాంతి, నరుడు, ప్రస్థలుడు, దృఢుడు మరియు కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులుభగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)సప్తర్షులు - ధాత, జహ్నుడు, పృథుడు, కావ్యుడు, కపీవంశుడు, అగ్ని, అకపీవంశుడుఇంద్రుడు - త్రిశిఖుడు (శిబి)సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
రైవత మన్వంతరముసవరించు
మనువు - దుర్దమునకు రేవతియందు పుట్టినవాడు.మనువు పుత్రులు - బలుడు, బంధుడు, స్వయంభావ్యుడు, సత్యకుడు, అర్జున ప్రతినింద్యాదులుభగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్థనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.సప్తర్షులు - హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, సత్యనేత్రుడు, పర్జన్యుడు యదుధృడుఇంద్రుడు - విభుడుసురలు - భూత దయాదులు
చాక్షుష మన్వంతరముసవరించు
మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.మనువు పుత్రులు - శతద్యుమ్నుడు, ఊరుడు, పూరుడు, తపస్వి శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు మరియు అభిమన్యుడు మొదలైనవారు.భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంఖ్యాతియందు అకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మథనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.సప్తర్షులు - విరజుడు, అతినాముడు, భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, సహిష్ణుడుఇంద్రుడు - మనోజవుడుసురలు - ఆప్యాదులు
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరముసవరించు
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.తండ్రి - వివస్వంతుడుతల్లి - సంజ్ఞభార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషధ్రుడు, వసుమంతుడు, నరిష్యంతుడు మరియు పృషపదుడు.మనువు పుత్రికలు - ఇల (సుద్యుమ్నుడు).భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడుఇంద్రుడు - ఓజస్విసురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మరియు బుద్ద అవతారములు జరిగినవి, మరియు కల్కి అవతరిస్తారు.
సూర్యసావర్ణిక మన్వంతరముసవరించు
రాబోయే మన్వంతరము
మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.తండ్రి - సూర్యుడుతల్లి - ఛాయమనువు పుత్రులు - నిర్మోహ వారజస్కాదులుభగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.సప్తర్షులు - అజర, అశ్వత్థామ, గౌతమ, శరద్వంత, కౌశిక, కాశ్యప, ఔర్వ .ఇంద్రుడు - విరోచన సుతుడైన బలిసురలు - సుతపసులు, విరజులు, అమృత ప్రభులు
దక్షసావర్ణి మన్వంతరముసవరించు
మనువు - దక్షుని పుత్రుడు దక్ష సావర్ణిమనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.సప్తర్షులు - మేథాతిధి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు మరియు హవ్యవాహనుడుఇంద్రుడు - అద్భుతుడు (కుమారస్వామి)సురలు - పరమరీచి గర్గాదులు
బ్రహ్మసావర్ణి మన్వంతరముసవరించు
మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణిమనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారుభగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.సప్తర్షులు - హవిష్మంతుడు, సుకృతి, సత్య, అపంమూర్తి, నాభాగ, అప్రతిమౌజసుడు, సత్యకేతుఇంద్రుడు - శంభుడుసురలు - విభుదాదులు
ధర్మసావర్ణిక మన్వంతరముసవరించు
మనువు - దక్షసావర్ణి కుమారుడుభార్యలు - కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మరియు లజ్జమనువు పుత్రులు - సత్య ధర్మాదులు, శముడు, కాముడు హరుడు పదిమంది.భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.సప్తర్షులు - భరద్వాజ, ఆత్రేయ, రామ, వ్యాస, దీప్తిమంత, బహుశృత, ద్రౌణిఇంద్రుడు - వైధృతుడుసురలు - విహంగమాదులు
రుద్రసావర్ణిక మన్వంతరముసవరించు
మనువు - రుద్రసావర్ణిక [1]మనువు పుత్రులు - దేవసుతాదులుభగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.సప్తర్షులు - తపస్వి, సుతపసుడు, తపోమూర్తి, తపోనిధి, తపోధృతి, ధ్యుతి, తపోధనుడుఇంద్రుడు - ఋతధాముడుసురలు - పరితారులు
దేవసావర్ణి మన్వంతరముసవరించు
మనువు - దేవసావర్ణిమనువు పుత్రులు - విచిత్ర సేనాదులుభగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు; నిర్మోహ, తత్వదర్శనుడు, నిష్ప్రకంప, నిరుత్సుక, ధృతిమతుడు, అవ్యయుడు, సుతపఇంద్రుడు - దివస్పతిసురలు - సుకర్మాదులు
ఇంద్రసావర్ణి మన్వంతరముసవరించు
మనువు - ఇంద్ర సావర్ణిమనువు పుత్రులు - గంభీరాదులుభగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు; అగ్నిబాహు, శుచి, శుక్ర, మగధ, గృధ్ర, యుక్త, అజితఇంద్రుడు - శుచిసురలు - పవిత్రాదులు
ఇవి కూడా చూడండిసవరించు
చతుర్యుగాలుఏకవింశతి అవతారములుచతుర్దశభువనాలుసూర్య సావర్ణిక మనవు
వనరులు, లింకులుసవరించు
జయదయాల్ గోయందకా రచన - శ్రీమద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (తెలుగు అనువాదం -గోలి వెంకట్రామయ్య)శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదుhttp://www.indiaheritage.org/rendez/article1.htm#image1 - వి కృష్ణమూర్తి వ్యాసంపూర్వగాథాలహరి- కృతికర్త శ్రీ వేమూరి శ్రీనివాసరావు - వెంకట్రామ అండ్ కో↑ సమూల శ్రీమదాంద్ర ఋగ్వేద సంహిత, చతుర్థ సంపుటము, 9,10 మండలములు, పుట:861, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
No comments:
Post a Comment