Wednesday, 13 June 2018

శ్రీ రమణ మహర్షి


నేనే ఈ విశ్వాన్ని అని భావించు.

మనం మనస్సును నిరోధించటానికి ముందు,
దాన్ని పరీక్షించాలి. మనసు చంచలమైనది.
దీన్ని పట్టుకుని చలింపకుండా ఒకే భావంలో నిలపాలి. ఇలా నింరతరం చేయాలి. ఇచ్చాశక్తి వల్ల మనసును నిగ్రహించి, ఈశ్వరునిలో నిలిపి ఉంచగలుగుతాం. మనసుని నిగ్రహించటానికి చాలా తేలిక మార్గం ఒకటుంది. శాంతంగా కూర్చో. మనసును దానిష్టం వచ్చినట్లు కొంతసేపు పోనివ్వు. ఈ మనసు తిరుగుతుంటే, దాన్ని చూస్తూ నిలిచిన సాక్షిని నేను. నేను నీ మనసును కాను అని గాఢంగా బావించు.

ఆ తర్వాత ఆ మనసు నీకన్నా వేరని,
నువ్వు దాన్ని చూస్తున్నట్లు అనుకో.
నువ్వు పరమాత్మ అనుకో. శరీరం కానీ,
మనసు కానీ, నీకన్నా వేరని భావించు.
మనసు ఒక శాంతమైన సరస్సులా నీ ఎదుట ఉన్నట్లు, ఆ మనసులో ఉదయించే ఆలోచనలు
ఆ సరస్సులో లేచిపడే బుడగలు లాంటివని భావించు. ఆ ఆలోచనలను నిరోధించటానికి ప్రయత్నించకు. వాటి పుట్టుక-విలీనాలను ఊరక సాక్షీభూతుడవై చూస్తుండు. చాలు. ఇలా చేస్తే, క్రమంగా ఆలోచనలు అణిగిపోతాయి.

సరస్సులో ఒక రాయి విసిరితే, తరంగాలు పుట్టి క్రమంగా విశాలంగా వ్యాపించిపోతాయి.
కాబట్టి మనోతరంగాలను నిరోధించాలంటే,
వాటిలో పెద్ద తరంగాన్ని తీసుకుని దాన్ని క్రమంగా సంకుచితం చేస్తూ, చివరికి దాన్ని బిందుమాత్రంగా చేసి, అక్కడ మనస్సునంతా కేంద్రీకరించి నిలపాలి.
నేను మనసును కాను.
మానసిక యోచనను గమనించేవాడిని.
నేను సాక్షిభూతుడను అని తెలుసుకోవాలి.
అంటే ఆలోచించటాన్ని నేను చూస్తున్నాను.
ఆ మనసు పని చేస్తుండగా నేను చూస్తున్నాను.
అని నిరంతరం తలచాలి.

కాలక్రమంలో అనుభవంతో మనోఆలోచనలు తగ్గుతాయి. చివరికి నువ్వు వేరని,
మనసు ఒక సాధన మాత్రమేనని, అది నీకన్నా వేరని తెలుసుకుంటావు. ఈ భిన్నత్వాన్ని సాధించన తర్వాత మనసు నీకు వశమవుతుంది. దాన్ని నువ్వు సేవకునిలా నీ యిష్టం వచ్చినట్లు నిరోధించవచ్చు. యోగి కావటానికి ఇంద్రియాలను దాటటం మొదటి లక్షణం. మనస్సును జయించిన తర్వత యోగి ఉన్నత స్థితి పొందినట్లు గ్రహించాలి. ఆలోచనలు బొమ్మల్లాంటివి. కాబట్టి వాటిని మనం కల్పించుకోరాదు.

మనం చేయవలసినదల్లా మనస్సు నుండి వృత్తులను తొలిగించుట మాత్రమే. మనస్సు ఆలోచనరహితం చేయాలి. ఆలోచన పుట్టగానే దాన్ని త్రోసివేయాలి. ఈ ఫలితాన్ని దాటివేయాలి ఈ ప్రయత్నాన్ని చేయడానికి మాత్రమే మానవ జీవితం ఉంది. ప్రతి ధ్వనికి ఏదో ఒక అర్థం ఉంటుంది. శబ్దర్థాలు రెండూ మన స్వభావంలోనే సంబద్ధాలై ఉన్నాయి. మన చరమ లక్ష్యం పరమాత్మ. కాబట్టి పరమాత్మపై ధ్యానం చేయాలి.

ఈ సర్వ విశ్వం నా శరీరం. ఈ విశ్వంలో వున్న సుఖసంతోషాలన్నీ, ఉత్సాహమంతా, ఆరోగ్యమంతా నాదే. నేనే ఈ విశ్వాన్ని అని భావించు. చివరికి ఈ విశ్వంలో ప్రతిఫలిస్తున్న క్రియ అంతా మన నుండే పుడుతున్నదని మనం తెలుసుకుందాం. మనం పరమాత్మ అనే సముద్రంలో లేచే చిన్నచిన్న కెరటాల వంటి వారమైన మనకు అధారభూతంగా ఉంది మాత్రం సముద్రమే. ఆ మహాసముద్రనికి మనం వేరుగాలేము ఏ కెరటం కూడా దానికి వేరుగా వుండదు.

చక్కగా ఉపయోగిస్తే భావన మనకు ఎంతో మంచి ఉపకారం చేస్తుంది. అది బుద్ధిని దాటి మనల్ని కావలసినచోటకి కోనిపోయే వెలుగువంటిది. ఆత్మనుభూతి మనలోనే ఉంది. దాన్ని సాధించడానికి మన చేతిలో వున్న శక్తులను మనం ఉపయోగించుకోవాలి......

రమణ మహర్షి ::

                   నేను ఎవరిని అన్న ఒకే ఒక్క ప్రశ్నతో ?????? WHO AM I’’  అంటూ  ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న ప్రతి వ్యక్తి  ఆలోచనలో చెంప చెళ్ళు మనేలా ఓ మఱ్ఱి విత్తు విసిరిన మహానుభావులు .. అప్పటి వరకు ఎవరో యోగులు సిద్దులు యతులకు మాత్రమే పరిమితమయిన ఆత్మతత్త్వం , ఆత్మ స్దితి . రమణుని సంకల్పంతో  ఏ గురుభోధ లేని సామాన్యుడిలో కుడా ఆలోచన రేకెత్తించి౦ది .. ‘’ who am I’’ నేను ఎవరిని ? ఎక్కడి నుండి వచ్చాను ? ఎందుకు వచ్చాను ? ఇలా ఎన్నో శరాలు కొన్ని లక్షల మెదళ్ళను  మేలేపెట్టేసాయి ..

ఎంత మంది తత్వవేత్తలు ఉన్నా రమణులు సంధించిన ఈ ప్రశ్నతో  ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడి రమణుని వంక పరికించి౦ది .. రమణ ఆశ్రమానికి అడుగులు వేయించింది ..

                మౌనం మాట్లాడుతుందా : మాట్లాడుతుంది !! నీ మనసును తెరచి ఉంచితే ఆ మౌన సంభాషణ నీకు వినిపిస్తుంది ..’’నేను మౌనం ద్వారానే సూచనలు తెలుసుకున్నాను ( ఆత్మతో సంభాషణ Inner voice) .. భక్తీ అంటే భాహ్య పూజ కాదు . అది మనో వాక్కాయ , కర్మల ఆత్మ సమర్పణ :::రమణులు ...

అరుణాచలం రమణుని ఆశ్రమం లో అడుగుపెట్టిన క్షణం : ఎందరికో ఎన్నో  ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ..

సత్యాన్ని గ్రహించాలి అంటే పుస్తక పఠనం కన్నా మస్తక పఠనం  ద్వారా మాత్రమె సాధ్యపడుతుందని తెలిపిన మహానుభావులు .

‘’దేహాన్ని ఆవరించుకుని ఆత్మ ఉన్నదని దేహాన్ని ఆశ్రయించి సుక్ష్మదేహం ఉందని , ఈ స్దూల దేహం కార్యా కారణ సంబందం ద్వారా కర్మలు నిర్వహిస్తుందని తెలిపి , సన్యాసి మార్గం అయినా సంసారి మార్గం అయినా స్వీయ విముక్తి సాధన చేయడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని,దిని కోసం సన్యసించ వలసిన అవసరం లేదు అని నొక్కి ఒక్కాని౦చారు . నిష్కామ కర్మల ద్వారా (జ్ఞాన ) మాత్రమే జన్మ కర్మలు దగ్దం చేసుకొగలవని కర్మ ఫలం నుండి కలిగే బంధనాల నుండి విడుదల కాగలవని ఆత్మ జ్ఞానం పొందట వలన మాత్రమె జనన మరణ చక్రభ్రమణం నుండి బయట పడగలవని  హితవు పలికిన మహర్షులు .

                 ఒక్కసారి రమణుని దర్సనంతోనే సాధకుని వెన్నుముఖ ఆరంబ బిందువు వద్ద నిద్రావస్తలో ఉన్న మూలాధార శక్తి ఆత్మ చైతన్యంతో సుషమ్న ద్వారా షడ్ చక్రాలను అత్యున్నత స్దాయికి తీసుకు వెళుతుందని స్వామి రాం’’ తన పుస్తకాలలో  తెలిపి యున్నారు . ఆ అనుభూతిని వారు  ఆస్వాదించారు .అంతరంగంలో ఉద్బవించే ఏ ప్రశ్నకైనా సమాధానం తెలియడానికి వారి దగ్గర కూర్చుంటే చాలు . గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం ఉండటం సమాధి స్దితే..

కర్మ బంధ విముక్తి సామాన్యులకు కూడా అర్ధం అయ్యేలా చెప్పిన గురువులకు శత సహస్ర  నమస్సులతో : ఉమ

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...