మలబద్దకం
×××××××××××××××××××××××
ఆత్మస్వరుపులారా ఎవరయితే ఆరోగ్యంగా వుండాలనుకుంటునారో వారు అందరు మలబద్దకం నుండి బయట పడాలి .మలబద్దకం మత్రమే అన్ని అనారోగ్యాలకు మూలం .మలబద్దకాన్ని నివారించుకుంటే 90 % శాతం అనారోగ్యానుంచి బయటపడతారు .
రాత్రి 7 లోపు భోజనము ముగించుకుని 9 గంటల ప్రాంతంలో నిదురాకుపక్రమించాలి .సూర్యోదయమునకు ముందుగానే నిదురలెగిసి మంచము పైనుండగానే ఒక లీటర్ గోరువెచ్చని నీటిని త్రాగి మీకు వచ్చిన ప్రాణాయామము చేసుకోవలయును .అప్పుడు కడుపులో ఉన్న మలము కదులుతుంది .ఇక్కడ ముక్యంగా తెలుసుకోవలసినది ఏమంటే రాత్రి పడుకునేముందు నీటిని తక్కువుగా తీసుకోవలెను .చాలమంది రాత్రి పడుకునే ముందు ఎక్కువుగా నీరు త్రాగి పడుకుంటారు .ఇది తప్పు .దీనివలన నిదుర నుండి లెగగానే మూత్రం వస్తుంది .మూత్రం వచ్చినతరువాత మలం బయటకి రావడానికి సమయము ఎక్కువుగా తీసుకుంటుంది .కావున రాత్రి పడుకునే ముందు నీటిని తక్కువుగా తీసుకొవాలి .ఇది మలబద్దకం వున్నవారికి తీసుకోవలసిన జాగ్రత్త చెపుతున్నను .ఉదయము మంచముపైన ఉండగానే నీటిని త్రాగి ప్రాణాయామము చిస్తే మలం కదిలింది, అనుకున్నపుడు మాత్రమే మంచము దిగండి .కదలక పొతే ఇంకొంత ప్రాణాయామము చేయండి .అప్పుడు మలము బాగుగా కదులుతుంది .మలము ఎప్పుడయితే ఫ్రీగా అవుతుందో వారికి చాలావరకు అనారోగ్యములు తగ్గుతాయి .ఈ విధముగా 10 రోజులు చేయండి మీకు మార్పు కనబడుతుంది .
******************
మహిళల సమస్యలు
***************
1.ఇంగువ వేడిచేసి బెల్లం కలిపి తింటే రుతుక్రమం సరిగా అవుతుంది
2.అశ్వగంధ చూర్ణం పటిక బెల్లం సమభాగాలుగా తీసుకొని తేనెలో కలిపి వాడితే స్త్రీల తెల్ల కుసుమ వ్యాధి తగ్గును .
3ఉదయం పరగడుపులేత బెండకాయలు నాలుగైదు తింటే తెల్లకుసుమ వ్యాధి తగ్గును .
4.క్యాబేజీ తింటే స్ర్తిల కు స్తనవృద్ది పురుషులకు శుక్ర వృద్ధి కలుగును .
5.నిమ్మకాయ రసం అల్లం రసం పటికబెల్లం పొడిని నీళ్లతో కలిపి తాగిన తెల్లబ ట్ట వ్యాది తగ్గును.
************************
ఆగిపోయిన బహిష్టుమల్లీ రావడానికి
""""""""""""""'"""""""""""""""""""""""""""""
1. నల్ల నువ్వులు 50 గ్రాములు దంచి అరలీటరు నీటిలో వేసి సగానికి మరిగించి వడబోసి గోరువెచ్చగా ఉన్నపుడు అందులో 20 గ్రాములు పాత బెల్లం కలపాలి. మిరియాలు శొంఠి,పిప్పళ్ళు,దోరగా వేయించి దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. అర చెమ్చా పొడిని ఆ కషాయం కలిపి రోజు పరగడుపున త్రాగాలి. బహిస్టు రాగానే కషాయం త్రాగడం ఆపివేయాలి. ఈ విధముగా చేయుట వలన రుతురక్తం సక్రమంగా జారి అవుతారు.
2. శొంఠి,వాము,గింజ తీసిన ఎండు ఖర్జురాలు సమానముగా తీసుకోవాలి. ఆ మూడింటిని వేరువేరుగా దోరగా వేయించి పొడిచేసి అన్ని కలిపి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక కప్పు పాలల్లో ఒక మోతాదు కలిపి తాగితే 10 రోజులలో బహిష్టు వస్తుంది. బహిష్టు రాగానే త్రాగడం ఆపాలి. ఈ విధంగా మూడు నెలలపాటు చేయడం వలన బహిస్టు సరి అవుతుంది.
××××××××××××××××××
నా ప్రియమైన తల్లుల్లారా అక్కచెల్లెల్ల రా అందరికీ నా నమస్సులు🙏 ఈనాడు చిన్నవయసులోనే ఆడపిల్లలు 10 సంవత్సరాలలోపలముట్టు అవుతున్నారు. మూతి మీద మీసం వస్తున్నాయి, శరీరంలో అవాంచిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయి జుట్టు బాగా రాలిపోతుంది. దీనికి ప్రధాన కారణం మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి జెర్సీ ఆవు పాలు పాకెట్ పాలు త్రాగి స్తున్నారు. తల్లులందరికీ చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రోజు నుంచిమీ పిల్లలకు పాలు ఇవ్వడం మానివేయండి. బెల్లం నువ్వులు తినిపించండి కాల్షియం బాగుంటాది దేశి వాలి ఆవుపాలు దొరికితే దానిద్వారా మజ్జిగ పెరుగు,నెయ్యి సేవించవచ్చు
Save children schildren
No comments:
Post a Comment